Followers

Sunday, July 28, 2019

ఆదివాసీ ఉద్యమానికి అంతర్గత ప్రేరణ కావాలి ||Gondwana Channel||

ఆదివాసీ ఉద్యమానికి అంతర్గత ప్రేరణ కావాలి


  ప్రతికూల వాతావరణం వున్నప్పటికి డాక్టర్ బి అర్ అంబేద్కర్ ఎలా చరిత్ర సృష్టించాగలిగాడు  

  జీవితానికి అవరోధంగా నిలిచినరాళ్ళాను డాక్టర్ ఎపిజె అబ్దుల్ కాలం విజయ సోపానాలుగా ఎలా మార్చుకోగలిగాడు❓


వారి అంతర్గత శక్తి అంతరంగంలోని బావాలే వారికి  చోదకశక్తులై ప్రతి అటంకాన్ని అధిగమించేలా ప్రేరణనిచ్చాయి వారు గారేను చూశారేగాని రంద్రాన్నీ కాదు వైఫల్యాలను విజయంలో భాగంగా స్వీకరించి  తమ వత్తిళ్ళను అదుపు చేసుకున్నారు ఎదురైన ప్రతి కష్టాన్ని ఒక అవకాశంగా మలుచుకున్నారు ఎలాంటి బాహ్యమైన ప్రేరణకన్న అంతర్గత ప్రేరణ ఎంతో మెరుగ్గాను వేగంగాను పనిచేస్తుంది.


  మనం ఉద్యమం చేయగలము అనుకుంటే మనమే చేయగలుతాము.

  ఉద్యమాన్నికి విజయనికి మీ వైఖరిని మార్చుకోవటమే తప్ప అంతకుమించి మరేమీకాదు.


  ఉద్యమాన్నికి తగిలే ప్రతి దెబ్బను ఒక రాయిగా స్వీకరించి దానే ఒక శిల్పింగా మార్చాలి.



  ఏడు సార్లు పట్టాసరే ఎనిమిదోసారి లేచినిలవండి జపాన్ సూక్తి.


  నిట్టనిలువు కొండలు ఎక్కటానికి మొదట నెమ్మదిగా ప్రారంభించవలసి ఉంటుంది.

  నాయకత్వ లక్షణాలను పెంపొందించుకొని మీ చుట్టువున్నా వారిపైన సానుకూల ప్రభావాన్ని ప్రసరించండి.


ఉద్యమాన్నికి ప్రేరణ
〰〰〰〰〰〰〰

  గేయం గోండ్వనా ప్రాంతానికి సంభందించిన వనరులు బొగ్గు సిమేంట్ బాక్సైట్ మొదలగు వాటిని  వివిధ కులలను ఎస్టిజాబితలో చేర్చడంతో ఆదివాసులకు జరిగే నష్టాన్ని ప్రతిభింబించే విధంగా ఉద్యమాన్నికి ఉద్యమాకారులలో ప్రేరణ కల్లించే విధంగా ఆదివాసీ రచయితలు కళాకారులు ఒక గేయం రచన చేయాలి ఆ గేయమే ఆదివాసీ ఉద్యమాన్నికి ప్రేరణ కావాలి.


క్విట్ గోండ్వనా ఉద్యమం
〰〰〰〰〰〰〰
ఆదివాసీ ఉద్యమం మరో క్రొత్త రూపం ధరించలంటే ఇటువంటి నినాదం తీసుకోరావసిన అవసరం ఎంతైనా ఉంది మన ఉధ్యోగాలు మన భూములు మన నిధులు ఎవరైతే ఎస్టీలలో చట్టబద్దత లేకుండా నిభందన ఆర్టికల్ 342లో అమోదం పొందకుండా దోచుకుంటున్నారో వారిపైన క్విట్ గోండ్వాన ఉధ్యమం చేపట్టాలి మా ప్రాంతాని వదిలి వేళ్ళాడి.

సహకార నిరాకరణ ఉధ్యమం
〰〰〰〰〰〰
ఇందులో భాగంగా ప్రభుత్వం సేవలను నిరాకరించాలి అవి పన్నులు ఎన్నికలు ప్రభుత్వం అందించే అన్ని సేవలను నిలుపుదలచేసే శక్తి ఉధ్యమ రూపంలో రావాలి.

 శాసనోల్లంఘనోధ్యమం 
〰〰〰〰〰〰
భారత రాజ్యంగంలో ఎన్నో అంశాలు ఆదివాసుల అభివృద్ధి అనుకుణంగా ఉన్న వాటిని అనుసరిస్తూ ప్రభుత్వాలు చట్టాలు చేయకపోవడం ఆదిమ లక్షణాలను పాటించకుండా వివిధ కులలను ఏస్టీలుగా గుర్తించడం ఆదివాసుల ఆత్మగౌరవానికి భంగం కల్లించే శాసనాలను దిక్కరిండం.

పీసా చట్టం 242(c)1 ప్రజల యొక్క ఆచారాలను సాంస్కృతిక ప్రత్యేకతను సామాజిక ఆస్తిని సాంప్రదాయికంగా తగవులు తీర్చుకునే విధానాలను (ప్రస్తుతం ఉండే చట్టాలకు వ్యతిరేకంగా కాకుండా )కాపాడేందుకు కొనసాగించేందుకు ప్రతి గ్రామసభకు అధికారాలు ఉన్నాయి ఇందులో ప్రభుత్వం చేసిన చట్టం ప్రకారం అనే అంశాన్ని శాసనోల్లంఘన చేయాలి ప్రభుత్వం చేసే శాసనాలలో ఎదైన అంశం ఆదివాసుల మనుగడకు వ్యతిరేకంగా ఉంటే ఆ అంశాన్ని ధిక్కరించాలి.



 గోండ్వాన  ప్రాంతానికి  పార్టీ
〰〰〰〰〰〰
ఆదివాసుల ఆశయాలు లక్ష్యాలను ముందుకు సాగించలంటే ఆదివాసులకు ఒక స్వంత పార్టీ కావాలి ఇందుకోసం ఆదివాసీ మేదవులు ఉధ్యోగులు కవులు రచయితలు ముందుకు రావాలి మన ప్రాంతాల ఆశయాలకు అనుకుణంగా ఒక పార్టీ నిర్మాణం జరిగాలి ఆదివాసీ సోదరులు ఈ పార్టీనుండి పోటిచేసి విజయం ద్వారా మన డిమాండ్లను మన ఆశయాల్నీ ప్రభుత్వానికి తెలియాచేయాలి.

🏹🏹🏹🏹🏹🏹

 -ఆదివాసీ సంక్షేమ పరిషత్ 
ఉమ్మడి అదిలాబాద్ శాఖ.

No comments:

Post a Comment

Thank you So Much for your Useful Suggestion..!!