Followers

Saturday, July 13, 2019

గోండి భాష దినోత్సవము

జై సేవా సేవా జోహర్
ఆదిమ వాసుల అస్తిత్వము
ఆదిమ వాసుల అస్తిత్వము
వారి బాష, సంస్కృతి, వారి ప్రతేకమైనటువంటి జీవన విధానము బాష, సంస్కృతి, వారి ప్రతేకమైనటువంటి జీవన విధానమే వారి ప్రతేకత
కావున వారు తమ దైన శైలిలో ప్రతేక మైనటు వంటి ప్రదేశాలలో నివాస ప్రదేశాలను ఎంచుకొని అట్టి ప్రాంతమందలి ప్రదేశాలోనే నివాసము ఏర్పరచుకొని జీవిస్తున్నారు. కావున వారిని ప్రభుత్వము కూడ ప్రత్యేకముగా గుర్తించి వారి జాతులను రక్షణ కు వారి భాష, సంస్కృతి, సాంప్రదాయాలను రక్షణ కృషి చేస్తుంది. ఇందులో భాగంగానే 9అఘష్ట1986యు యన్ ఒ గుర్తించి ప్రపంచఆదివాసి దినోత్సవమును జరుపుటకు మనకు అనుమతి నిచ్చింది అలాగేఆదివాసిభాస లకు కూడ  యు యన్ ఒ గుర్తింపు నిచ్చింది ఇందులో భాగంగానే ప్రభుత్వము చొరవ తీసుకొని ఎవరిభాషను వారు కాపాడు కోవాలని నిర్ణయించి ఎవరి భాష వారు తమ భాష దినోత్సవమును గుర్తించి ఆరోజు వారి భాష దినోత్సవమును జరుపుకుంటున్నారు అలాగే మన భాష గోండి భాష, మన భాషను మనము రక్షించ వలసిన భాద్యత మన పైన ఉంది మన భాషకు మనమే గుర్తింపు ఇవ్వవలసి ఉందని గుర్తించి న మన గోండి సమాజము ఒక నిర్ణయానికివచ్చి మెుట్ట ముదటి కార్యశాల 2012న దన్నెగాం నందు గోండ్వాణ దర్శనము ఎడిటర్ సన్హెరీబు సింగ్ తారం మరియు గోండి యన్ తొలి కవయిత్రిఊష కారని ఆత్రం వారి ఆద్వర్యంలో రాష్ట్ర గోండి భాష అద్యాయనకేంద్రము ఏర్పటు చేయడం జరిగింది.  తరువాత రమనికచౌదరి పౌడేషన్ఆద్వర్యములో 2015డిల్లి యందలి జే యన్ యు నందు వివిద ఆదిమభాషలకార్యశాల పేకల్టి ఆప్ లాంగ్వేజెస్ అండ్ సోషల్ సర్వషెస్ఆద్వర్యము లోజరిగంది తరువాత వచ్చెసి2014 ,21జులై తేదిని నిశ్చయించి గోండి భాష దినోత్సవమును యవత్ భారతదేశ గోండులు జరుపు కుంటున్నాము.కావున
ఆరోజు యెుక్క ప్రత్యేకత ఏమనగా గోండి భాష మాట్లాడే ప్రజలు యవత్త్ భారత దేశంలో18రాష్టములలో నివశిస్తున్నారు వీరందరు ఒక చోటికి ఎలా రావచ్చు అని ఆలోచించి వీరందరిని ఒక చోటికి కలిపే ఒకే ఒక మాధ్యమము ఉంది అదే భాష అని గుర్తించి న మన యేాదుడు శుబ్రంషు చౌదరి గారు పుట్టుక లో బెంగాల్ కు చెందినవారు వారు  బి బిసి లండన్ యందు పని చేస్తున్నారు వారు ఆఉద్యోగమునకు రాజీనామా చేసి బయటకు వచ్చేసి  సి జి నెట్ సెంట్రల్ గోండ్వాణ నెట్ వర్క్  యన్జీవొను ఏర్పాటు చేసి వారు గోండ్ వానా ప్రదేశములను సందర్సంచి ఒక ఆదివాసి మిడియను ఏర్పాటు చేసారు. ఈ మిడియను ఆదారముగా చేసి డిల్లి లోని గాంది స్ముృతి దర్శనము వారి ఆధ్వర్యంలో 13రాష్టాలగోండులను పిలిపించి 5రోజుల కార్యశాల ఏర్పాటు చేసి గోండి భాష ప్రామాణిక కార్యశాల 2014జులై21నప్రారంబించి ఈ కార్యశాల వివిద సంవత్సరములు వివిద రాష్ట్ర ల యందు నిర్వహిస్తూ2014నుండి2016వరకు ప్రతి రాష్ట్ర కార్యశాల కు ప్రతి రాజ్యము నుండి తప్పక పది మంది తో కల్సి2016 న గోండి భాష ప్రామాణిక నిఘంటువును    డిల్లినందలి అంబెద్కర్ భవన్ యందు జులై 5 ,2016 గోండి భాష విమెాచనదినముగా పరిగనించి గోండి భాష ప్రామాణిక నిఘంటువు అవిస్కరన జరిగింది.
కావున మన మందరము మన భాషకు గర్వకారణంగా భావించి 21జులై2019 ఆదివారము రోజున గోండి భాష దినోత్సవమును జరుపు కుందాము  జై సేవా సేవా జోహర్ జై గోండ్వణ

No comments:

Post a Comment

Thank you So Much for your Useful Suggestion..!!

Note: Only a member of this blog may post a comment.

Gondwana Kabur