ఆదివాసుల కథ
అభివృద్ది పేరిట చాలా ప్రాంతాల్లో అడవులను పారిశ్రమిక కంపెనీలకు అప్పగిస్తుండటంతో.. ఆదివాసీలు విస్థాపితులుగా మారుతున్న పరిస్థితి.
వరల్డ్ ట్రైబల్ డే: ఆదివాసి ప్రపంచ దినోత్సవం.
నాగరికత ఫరిడవిల్లుతోన్న ప్రపంచ సమాజాలన్నింటికి మూలవాసులు ఆదివాసీలే. చరిత్రకారులు విస్పష్టంగా చెప్పిన విషయం ఇది. ఆహార సేకరణే ప్రధానంగా బతికిన ఆదిమ సమాజం.. ఆ తర్వాతి కాలంలో ఆహార ఉత్పత్తి వైపు మరలింది. ఆ క్రమంలో ఆటవిక-నాగరిక సమాజాలు అనే ఒక స్పష్టమైన చీలిక వచ్చింది. సుప్రసిద్ద చరిత్రకారుడు డి.డి.కోశాంబి అభిప్రాయం ప్రకారం తొలినాళ్లలో ఆదిమ సమాజం కొన్ని గుంపులుగా మనుగడ సాగించింది. ఆ గుంపులను కుదురులు అని పిలిచేవారు. ఆ తర్వాతి కాలంలో అవే తెగలుగా రూపాంతరం చెందాయి. ఈ తెగలకు ప్రత్యేకమైన కొన్ని చిహ్నాలు, సంస్కృతి, సాంస్కృతిక వారసత్వం ఉన్నాయి. గ్లోబలైజేషన్ నేపథ్యంలో.. నాగరికత ముసుగులో ఆదివాసీల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. తమ సంస్కృతి, సాంప్రదాయలను పరిరక్షించుకోవడానికి ఇప్పుడు ఈ దేశ మూలవాసీలు నిరంతరం కొన్ని శక్తులతో పోరాడుతూనే ఉన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం *August 9th* జర్పుకుంటారు ఈక మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆదివాసీల గురించి ఒకసారి తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ ఆదివాసీలు: చెంచు, కొండరెడ్డి, గోండు, నాయకపోడ్, కొండదొర, కొండ కాపు, కోయ, గుత్తి కోయ, కమ్మర కోయ, మన్నె దొర, రెడ్డి దొర, యానాది, కప్పల, చెల్ల యానాది, రెడ్డి యానాది, గదబా, కాపు గదబా, ఎరుకుల, ఉప్పు ఎరుకుల, నక్కల, దులియా, పుతియా, జాతాపులు
తెలంగాణ ఆదివాసీలు:
చెంచు, కోలాం, కోలావర్, కుబి, బిల్, బగతా, గోండు, సాధు అంద్, నాయకపోడ్, కొండ రెడ్డి, కొండ కాపు, జాతాపులు, కోంద్, కోయ, రోనా, రేనా, సవరాస్, తొటి, యానాది,ఎరుకల, నక్కల, కుర్వికారన్
ప్రపంచ ఆదివాసీలను పరిరక్షించాలన్న ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి అగస్టు 9న వరల్డ్ ట్రైబల్ డే నిర్వహిస్తోంది. ప్రస్తుతం భారతీయ జనాభాలో ఆదివాసీ జనాభా దాదాపు 9శాతం పైనే. దేశవ్యాప్తంగా దాదాపు 461 తెగలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 6శాతం పైనే ఉన్న ఆదివాసీలు.. విభజన తర్వాత తెలంగాణలో దాదాపు 10-12శాతం ఉన్నారు.
పోడు వ్యవసాయం, అటవీ ఉత్పత్తులే వీరి జీవనానికి ఆధారం. ప్రతీ ఆదివాసీ, గిరిజన తెగకు తమదైన ప్రత్యేక భాష ఉండటం ఎక్కడైనా గమనించవచ్చు. ఈనాడు ప్రపంచ భాషగా వ్యాప్తి చెందిన ఇంగ్లీష్ సైతం ఒకనాటి అమెరికన్ ఆదివాసీల భాషే అన్నది చరిత్రకారులు చెబుతున్న సత్యం. అయితే అభివృద్ది పేరిట చాలా ప్రాంతాల్లో అడవులను పారిశ్రమిక కంపెనీలకు అప్పగిస్తుండటంతో.. ఆదివాసీలు విస్థాపితులుగా మారుతున్న పరిస్థితి. ప్రభుత్వాలు వీరి అభివృద్ది కోసం ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు, పథకాలు చేపడుతున్నప్పటికి అవి పూర్తి స్థాయి ఫలితాలను ఇవ్వడం లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది
ఆదివాసీ సమస్యలు:
ప్రాజెక్టులు, పరిశ్రమలను నెలకొల్పడానికి ప్రభుత్వాలు ఆదివాసీలను బలవంతంగా ఖాళీ చేయిస్తున్న పరిస్థితి. దీంతో మైదాన ప్రాంతంలోకి వచ్చి ఇక్కడి నాగరికతకు అలవాటు పడటంలోనూ.. ఇక్కడ జీవనోపాధి సంపాదించుకోవడంలోనూ వారు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో హరితహారం పేరుతో ఆదివాసీల పోడు భూములు లాగేసుకున్నారన్న ఆరోపణ ఉంది. ఇక పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన సమయంలో వారి అనుమతి తీసుకోలేదు. 1996లో వచ్చిన పీసా చట్టం ప్రకారం ఏజెన్సీ ఏరియాల్లో ఆదివాసీల అభీష్టానికి వ్యతిరేకంగా ఏది జరగకూడదు. అయితే ప్రభుత్వాలు మాత్రం ఈ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నాయన్న విమర్శ ఉంది. విద్య, వైద్య, రవాణా వంటి విషయాల్లో గూడెంలు, తండాలు, ఏజెన్సీ ఏరియాలు నేటికి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉన్నాయి.

No comments:
Post a Comment
Thank you So Much for your Useful Suggestion..!!
Note: Only a member of this blog may post a comment.