పోరు గడ్డ బోరుమంటుంది
______________________________________
పూరి గుడిసేలోనే జోడేఘాట్ వాసులు
కేసీఆర్,కేటీఆర్ హామీలు గాలికే
జల్,జంగల్,జమీన్ కోసం నిజాం నవాబుతో విరోచితంగా పోరాడి వారి తూటాలకు అసువులుబాసిన అడవి తల్లి ముద్దు బిడ్డ కుమ్రం భీం.పోరు గడ్డ వాసులు జోడేఘాట్ పేరును విశ్వవ్యాప్తం చేసిన గ్రామస్తుల బతుకుల్లో మాత్రం వెలుగులు నింపడం లేదు. సీఏం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీలు నేటికి నెరవేరలేదు.కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. గ్రామల్లో సమస్యలు రాజ్యమేలుతోంది. ఎడాదికి ఒక్క సారి జరిగే కుమ్రం భీం వర్దంతికి హడావుడి చేసే అధికారులు, ప్రజా ప్రతినిధులు తర్వాత గ్రామాల వైపు కన్నెత్తి చూడటం లేదు.దీంతో గిరి పుత్రుల సమస్యలు గుట్టలు దాటి ప్రభుత్వ అధికారుల చెవిన పడటం లేదు. ఆదివాసీల జీవనా విదానాన్ని అభివృద్ది పరుస్తామని, వారికి సకల సౌకర్యాలు,భూములకు పట్టాలు, డబుల్ బెడ్ రూంలు కట్టిస్తామని ప్రతి సారి ఎన్నికల్లో, కుమ్రం భీం వర్ధంతి దర్బారులో వాగ్దానాలు చేసే నాయకుల మాటలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయని బాబేఝరి గ్రామ వృద్దుడి ఆవేదన.. DTF కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా.

No comments:
Post a Comment
Thank you So Much for your Useful Suggestion..!!
Note: Only a member of this blog may post a comment.