Followers

Thursday, October 3, 2019

ఈ అడవితల్లి ఒడిలో (గాదిగుడా ప్రజల యదార్థ గాధలు) Gondwana Channel

ఈ అడవితల్లి ఒడిలో (గాదిగుడా  ప్రజల యదార్థ గాధలు)

నేను సమాజశ్రేయస్సుకు ఒక సాధనమని నమ్ముతాను. నా సాహితీ కిరణాల వలన ఇప్పటికి అభివృద్ధి కిరణలు చొచ్చుకుపోని అజ్ఞాత ప్రాంతాలను బయటకు తెచ్చే చిన్న ప్రయత్నం నాది...

     ఈ అడవితల్లి ఒడిలో (గాదిగుడా  ప్రజల యదార్థ గాధలు) ద్వార క్షుణ్ణంగా తెలుసుకోలేకపోయిన కొద్దిపాటి ఆదివాసుల బాధలను,గాధలను బయటికి తెచ్చినవాడిని అవుతానని అనుకుంటున్నాను.

   తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఓ మారుమూల మండలం గాదిగుడా. ఇక్కడి ఆదివాసీ గుడాలు మరింత చీకటి కోణాలు ఈ అడవితల్లి ఒడిలో ఆ చీకటి కోణాలలో ప్రసరించే కాంతి కిరణలు కావాలి ఈ పుస్తకం.

   మంచి జీవితాన్ని జీవించడం ఎంత కష్టమో  యదార్థ గాధలను తెలియజేయడం అంతకంటే కష్టం అనుకుంటున్నాను.
 
ఈ గాధలు యీ ప్రాంతాల సమకాలీన చరిత్ర కాదు.!!
 వీటిలో సాహిత్య విలువలున్నాయన్న భ్రమ నాకు లేదు. ఆదివాసుల దైనందిన జీవితంలో ఎదుర్కొనే కష్టాలను గురించి ఏ మాత్రం అవగాహన కలిగించిన సహనుభూతిని కలిగించిన యీ గాధలకు పరమార్థం నెరవేరినట్లే.

        ఉగాదులు గాని, ఉసస్సులు లేని గోండు గుడాలు,కొలం గుడాలు పర్యటించి కష్టాలలో ఉన్నవారికి ఎంతో కొంత నావంతుగా బాసటగా నిలిచి వారి స్థితిగతులను విశదంగా గ్రహించి ఈ జీవిత రేఖ చిత్రాలను మీ ముందు
ఉంచడానికి నాకు ఈ పుస్తక రచనకు సహాయపడినవారికి ధన్యవాదములు.

    గాదిగూడ, పునగూడ, లోకారి, ఝరి, బొడ్డిగూడ, కుడికస్సా, అర్జుని ఈ గ్రామాలలో ఉద్యోగరీత్యా ఉండడం ఒక అనుభవం... ఒక మంచి అవకాశం
లిపి లేక నిక్షిప్తంగా ఉన్న చరిత్రలాంటిది.

ఈ గాదిగూడ ప్రపంచమే వేరు. ఇక్కడ అమాయకపు ఆదివాసుల ఆప్యాయత దొరుకుతుంది... ఇడ్లి సాంబారు దొరకదు. సినిమా టిక్కెట్లు దొరకవు. ఆకాశాన్ని తాకే అంతస్థులు లేవు    కానీ దానిని మించి అనుభూతిని కలిగించే కుడికస్సా వాగు, గాదిగుడా వాగులను దాటలంటే ఆ అనుభూతే వేరు.
-దుర్వ సంతోష్ పోలిస్ కానిస్టేబుల్.

No comments:

Post a Comment

Thank you So Much for your Useful Suggestion..!!

Note: Only a member of this blog may post a comment.

Gondwana Kabur