అడవి గుండెలో ఆదివాసి
మాటలల్లి
పాటలల్లి
మాధుర్యమును వొల్కించిన
ఆదివాసీలే
ఆది కోకిలలని
ఎవ్వరికీ యాదికి లేదా..??
అడవి మట్టిలో
నెత్తురింకిన
గోండన్నల గోండి భాష నెత్తుటి సువాసనైనా
జాడలేకపాయే..
వాళ్ళు రాసుకున్న
కవిత్వపు కాగితాలే కాదు
వాళ్ళ భాషలు కూడా చచ్చిపోతున్నయ్..
వాళ్ళు పాడుకున్న పాటలకు
చప్పట్లు కొట్టే చేతులే కాదు
వాళ్ళ చరిత్ర వైపు చూసే
చూపులు కూడా చచ్చిపోతున్నయ్..!!
వాళ్ళ గుండె సడి
ఆగిపోతే
ఇంకా ఎన్ని వాయిద్యాలు మూగబోతాయో..
వాళ్ళ గుండె గాయాల అరుపుల్ని
మనం వినకపోతే
ఇంకా ఎన్ని కళలు అంతమౌతాయో..!!
అడవి గుండెలో
ఇంకా ఎన్ని జీవధ్వనుల్ని మూగబొమ్మంటారు..??
అడవి గుండెలో
ఇంకా ఎన్ని జీవరాశుల్ని సావమంటారు..??
౼దొంతం చరణ్ రెడ్డి
వింజమూరు
మాటలల్లి
పాటలల్లి
మాధుర్యమును వొల్కించిన
ఆదివాసీలే
ఆది కోకిలలని
ఎవ్వరికీ యాదికి లేదా..??
అడవి మట్టిలో
నెత్తురింకిన
గోండన్నల గోండి భాష నెత్తుటి సువాసనైనా
జాడలేకపాయే..
వాళ్ళు రాసుకున్న
కవిత్వపు కాగితాలే కాదు
వాళ్ళ భాషలు కూడా చచ్చిపోతున్నయ్..
వాళ్ళు పాడుకున్న పాటలకు
చప్పట్లు కొట్టే చేతులే కాదు
వాళ్ళ చరిత్ర వైపు చూసే
చూపులు కూడా చచ్చిపోతున్నయ్..!!
వాళ్ళ గుండె సడి
ఆగిపోతే
ఇంకా ఎన్ని వాయిద్యాలు మూగబోతాయో..
వాళ్ళ గుండె గాయాల అరుపుల్ని
మనం వినకపోతే
ఇంకా ఎన్ని కళలు అంతమౌతాయో..!!
అడవి గుండెలో
ఇంకా ఎన్ని జీవధ్వనుల్ని మూగబొమ్మంటారు..??
అడవి గుండెలో
ఇంకా ఎన్ని జీవరాశుల్ని సావమంటారు..??
౼దొంతం చరణ్ రెడ్డి
వింజమూరు
No comments:
Post a Comment
Thank you So Much for your Useful Suggestion..!!
Note: Only a member of this blog may post a comment.