Followers

Wednesday, November 27, 2019

మొదటి ఆదివాసీ IAS అధికారి మడావి తుకారాo MADAVI TUKARAM IAS Gondawana channel

మొదటి ఆదివాసీ IAS అధికారి
మడావి తుకారాo
దట్టమైన అడవులు ,పోరాటం నేపద్యం కలిగిన జిల్లా ,ఆదివాసీ ల తో నిండిన ఆదిలాబాద్ జిల్లా లో , ఆదివాసీ పోరాట యోదుడు కొమరం భీమ్ జన్మించిన పురిటి గడ్డపై ,గోండు తెగ కు మరో ఆదివాసీ ఆణిముత్యం పుట్టింది .ఆదిలాబాద్ జిల్లా లో అత్యంత వెనుకబడిన గోండు ఆదివాసీల లో మడవి తుకారాo IAS అధికారి అయ్యాడు .మడవి తుకారాo సాదారణ గోండు తెగ కు చెందిన ఆదివాసీ ముద్దు బిడ్డా మడవి తుకారాం.ఆదిలాబాద్ జిల్లా లో  ఊట్న్ ర్ మండలo లోని లక్సేటి పేట లో మడవి బాబురావు మహారాజ్ ,మాన్కు భాయి దంపతులకూ మూడవ సంతానo గా 1951, జూన్ 06 న జన్మించారు .

 మడవి తుకారాం కడు పేదరికం లో పుట్టి పెరిగాడు . మడవి తుకారాం కుటుంబం జీవన విధానం సరిగా లేక ,సాగుభూమి  లేక దినసరి వ్యవసాయ కూలి గా జీవన కొనసాగించారు . మడవి తుకారాం తండ్రి ఆనాడు లక్సేటిపేట గ్రామ పోలీస్ పటేల్ గా అక్కడ ఉన్న తహసీల్దార్ కార్యాలయం లో చిరు ఉద్యోగం చేస్తూ ,చాలీ చాలని వేతనం తో కుటుంబాని పోషించేవాడు .తండ్రి తన పిల్లలనూ ఉన్నత చదువులు చదివించాలని తపన పడేవాడు .ఆ తండ్రీ ఆరాటమే మడవి తుకారాంనూ గోండు తెగ లో తొలి IAS అధికారిని చేసింది . మడవి తుకారాం విద్యా అభ్యాసం ప్రభుత్వ పాఠశాలోనే జరిగింది . మడవి తుకారాం స్టానిక పాఠ శాల లో నాల్గవ తరగతి వరకు చదివాడు . ఐదు నుండి పదవ తరగతి వరకు (1961-67)వరకు ఆదిలాబాద్ లో ని గిరిజన సంక్షేమ వసతి గృహం లో ఉంటూ ప్రభుత్వ పాఠశాలో చదివాడు .1967-69లో ఇంటర్మీడియట్ చదివాడు .1969-72లో డిగ్రీ చదువుతూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ,ఆర్ధిక అవసరాలు తీర్చుకుంటూనే కాగజ్నగర్ అటవీ శాఖ కార్యాలయం లో దినసరి వేతనం తో ఉద్యోగం చేస్తూ MA పూర్తి చేశాడు . మడవి తుకారాం మాతృ భాషా గోండీ తో పాటు గా మరాఠీ ,హిందీ  ,ఇంగ్లీష్ ,సంస్కృతం భాషలో పట్టు సాధించాడు .మన దేశం లో ఆదిమ జాతులు భాష సంస్కృతుల అధ్యయనం కోసం నైజాం కాలం లో ఆదిలాబాద్ కు రెండవ సారి వచ్చినా మానవ పరిణామ శాస్త్రవేత్త హైమాడార్ప్ కూ ఉన్నత విద్యా వంతుడైన    మడవి తుకారాం పై దృష్టి పడింది .గోండు ఆదివాసీల సంస్కృతి పైన  ఇంగ్లీష్ లో హైమాన్ డార్ప్  పరిశోధనలూ చేశాడు .వాటిని మడవి తుకారాం తెలుగు లోకి అనువాదం చేశాడు .హైమాన్ డార్ప్ లండన్ వెళ్ళిన తరువాత ఆయన స్పూర్తితో మడవి తుకారాం గ్రూప్ -1అధికారి అయ్యాడు .మొదట కాకినాడ లో ఆర్డీవో( RDO)గా ఉద్యోగం లో చేరాడు . ఉట్నూర్ ITDA -APO గా పని చేశారు .1987లో మడవి తుకారాం పెళ్ళి చేసుకున్నాడు .కరీంనగర్ లో DRDA -PD గా పనిచేశారు .హైదరబాద్ లో గిరిజన సంస్కృతి పరిశోధన శిక్షణ సంస్ధ డైరెక్టర్ గా పనిచేశాడు .మహబూబ్ నగర్ లో జిల్లా లో DRO గా పనిచేశాడు.

అనంతరం IAS అధికారి గా ప్రమోషన్ పొందాడు . మడవి తుకారాం తొలి సారిగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా పని చేశారు .ఆ తరువాత ఎక్సైజ్ కమిషనర్ గా ,  బాలకర్మిక వ్యవస్థ కమిషనర్ గా పనిచేశాడు .ఆ తరువాత ప్రభుత్వ సహాయ కార్యదర్శిగా పని చేశాడు .1999 లో నవంబర్ 29 న మడవి తుకారాం తీవ్రమైన అనారోగ్యంతో  మరణించాడు . మడవి తుకారాం కాంస్య  విగ్రహాన్ని ఉట్నూర్ X రోడ్డు లో ప్రతిష్టించారు  .ప్రతి సంవత్సరం  మడవి తుకారాం వర్ధంతి ని గోండు ఆదివాసీలు వారి సాంప్రదాయ రీతి లో నివాళి అర్పిస్తారు  .నేటి ఆదివాసీ యువతరానికి , ఆదివాసీ ఉద్యోగస్తులకు మడవి తుకారాం ఒక ఆదర్శం .నేటి యువత మడవి తుకారాంని స్పూర్తి గా తీసుకొని ఉన్నత స్తాయి కీ వెళ్ళాలి .సామ్రాజ్య వాద విష సంస్కృతి కీ దూరంగా ఉండాలి .
మొదటి ఆదివాసీ IAS మడావి తూకారం ""
నవంబరు 29న 21వ వర్ధంతి.

-వూకే రామకృష్ణ దోర

No comments:

Post a Comment

Thank you So Much for your Useful Suggestion..!!

Note: Only a member of this blog may post a comment.

Gondwana Kabur