Followers

Thursday, November 28, 2019

జ్ఞాన జ్యోతి Gondawana channel

జ్ఞాన జ్యోతి
""""""""""""""""""""
ఎక్కడో...!
మూలాన పడి
మసి పూసిన మా బతుకులకు
బాసటగా నిలిచి,

బడుగు బలహీన వర్గాల
సంక్షేమాకై నాంది పలికి
జీవితాన్నే అంకితం చేసిన
ఓ త్యాగ మూర్తి
వందనం...

నా జాతినే నా కుటుంబం
నా జాతి బిడ్డలే నా బిడ్డలంటూ..!
మా బతుకులను తీర్చి దిద్దగా
భార్య పిల్లలతో వచ్చి
మా హృదయాల్లో కొలువుదీరిన ఆత్మీయుడా..!
వందనం....

దారిలో....!
మృగాలు ఖడ్గమృగాలు
పగబట్టిన విషపాములు ఎదురీడిన
అలుపెరుగని కఠోర దీక్షతో
జూదమాడుతున్న ధీరుడా సలాం...

కొండల గుట్టల నడుమ
పలుగు పారబట్టి సేదుజేస్తూ
పచ్చని పైరులను పండిస్తున్నా
ఓ శ్రామిక వందనం

నా బిడ్డలు దేంట్లోనూ
తక్కువ కాకూడదని
ఎన్నో కష్టాలను అనుభవిస్తూ
ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ
గొప్ప ఆలోచనలతో
ముందుకు సాగుతూ..!

అక్షరాన్ని ఆయుధంగా మల్చి
కలం పట్టి గళమెత్తి
లోకాన్నే శాసించమని
ఆకలైతే...!
అక్షరాన్ని ఆహారంగా
కచకచ నమలమని చెప్పిన
ఓ జ్ఞాన బోధ వందనం

అదుగో...!
నవయుగ అంబేద్కరుడు
గుర్రపు బగ్గీ పై
సవారీ జేస్తూ...!

నా జాతి ఖ్యాతిని
లోకానికి వెలిగెత్తి చాటుతూ..!
ఎలా వస్తున్నాడో జూడు జూడు

ఆ అంబేద్కరున్ని జూసి
నా కలం సలాం కొట్టీ
జేజేలు పలుకుతూ...!
నీ ముందర బానిసైంది.

ఎక్కడ జూసినా..!
జ్ఞాన జ్యోతులే
యే మూలాన జూసినా..!!
పోరాట యోధులే

ఈ పోటీ ప్రపంచానికి
ఎదురీడి గెలవాలంటే..!
జ్ఞానమొక్కటే ఆయుధమంటూ..
ఆయుధాలను చేతికందిస్తూ...

ఘడియ ఘడియకో
సైన్యాన్ని తయారు జేస్తున్న
ఆ జ్ఞాన జ్యోతిని జూడు..!
ఎంత ప్రకాశవంతంగా వెలుగుతున్నాడో..?

రచయిత: అశోక్ దుర్గం
చరవాణి: 8106709871
జిల్లా: కొమురం భీం ( ఆసిఫాబాద్ )

No comments:

Post a Comment

Thank you So Much for your Useful Suggestion..!!

Note: Only a member of this blog may post a comment.

Gondwana Kabur