Followers

Saturday, July 20, 2019

తుడుందెబ్బ వ్యవస్థాపక అధ్యక్షుడు సీడాం శంభు గారి మొదటి వర్ధంతి || Gondwana channel ||

20-07-2019
తుడుందెబ్బ వ్యవస్థాపక అధ్యక్షుడు... నిరతరం ఆదివాసీల కోసం తన జీవితంను ధారబోసిన సీడాం.సంభు గారి వర్ధంతి ఈరోజు.....తొలితరం ఉధ్యమ నాయకుడిగా 1996లో తుడుందెబ్బ సంఘం ను ఏర్పాటు చేసి ఆదిలాబాద్ నుండి శ్రీకాకుళం వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం)తన ఉధ్యమ పటిమతో అనేక ఆదివాసీ హక్కులు సాధించిన ధీరుడు....ఇంద్రవేళ్ళి రగల్ జెండ దగ్గర పోలీసు నిర్బంధం ఉన్న కంచెను తెంచి అమరులకు నివాళి అర్పిచిన మొదటి వ్యక్తి..... పోడుభూల సమస్యలపై పోరాటాలు చేసి పట్టాలు సాధించిపెట్టాడు....1/70..,పీసా అమలుకు గట్టి ఉధ్యమం చేశాడు....ఆదివాసీల సంస్ర్కుతి సంప్రదాయం బయట ప్రపంచానికి పరిచయం చేశాడు..... తన ఉధ్యమ పటిమ...,వాక్చాతుర్యంతో దేశ...రాష్ట్ర మీడియా ని ఆదివాసీల వైపు మళ్ళించాడు...ఈ రోజు ఎందరో ఆదివాసీ ఉధ్యమ యువ నాయకులు సిడాం. సంభు గారి శిస్యులే అనడంలో సంధేహం లేదు.ఎవరికీ ఏ సమస్య ఉన్నా నేరుగా అధికారులతో మాట్లాడి ఎందరో మంది సమస్యలు పరిష్కారం చేశాడు......సిడాం.సంభు గారు *నిరుద్యోగ సమస్యలపై *ANS** కు అనేక సంధర్భాలలో సలహాలు..సూచనలు చేసేవారు...అలాంటి ఆదివాసీ ఆత్మబందువు మన మధ్య లేకపోవడం బాధాకరం... ఆయన ఆత్మకు శాంతీ చేకూరాలి.....మీ ఆశయాలను జాతికోసం మా వంతుగా సాధించాడానికి కంకణబద్దంలై పనిచేస్తామని తెలుపుతూ......జోహర్ శంభు దాదా ..
మీ  మడావి దత్తు అధ్యక్షుడు ఆదివాసీ నిరుద్యోగ సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా

No comments:

Post a Comment

Thank you So Much for your Useful Suggestion..!!

Note: Only a member of this blog may post a comment.

Gondwana Kabur