మైపతి అరుణ్ కుమార్ కి డాక్టరేట్ ప్రదానం చేసిన కాకతీయ యూనివర్సిటీ.
6 సంవత్సరాల ఆదివాసి హక్కుల పరిశోధనకు అరుదైన గౌరవం.
తన తండ్రి ఉపాధ్యాయునిగా కొనసాగింపు, తన తండ్రి అడుగు జాడల్లో విద్యపై మక్కువ ఎక్కువగా పెంచుకొని 10 వ తరగతి వరకు గురుకుల విద్యను పొంది, చిన్న తనం లోనే అమ్మ నాన్న లను కోల్పోయి అనాథగా మారి తన కుటుంబ ఆర్థిక స్థితుల మేరకు తన మండల కేంద్రంలోని జూనియర్ కాలేజీలో ఇంటర్ విద్యను పూర్తి చేసుకొని, డిగ్రీ SDLC లోని దూర విద్య లో ఎడ్యుకేషన్ లో పూర్తిచేసి యూనివర్సిటీలో పరిచయాలు ఏర్పడి MA(పబ్లిక్ అండ్ పొలిటికల్ సైన్స్) పూర్తి చేసి ఇదే యూనివర్సిటీలో PhD సీటు సాధించటం ఒక విశేషం.
PhD పరిశోదన విద్య లో దేశవ్యాప్తంగా ఆదివాసీలకు ప్రత్యేకంగా కేటాయించిన రాజ్యాంగ హక్కుల అమలులో 75 ఏళ్లుగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుపై ADMINISYRATION OF TRIBAL DEVELOPMENT IN 5TH AMD 6 TH SCHEDUL AREAS - A CAMPARATIVE STUDY అనే అంశం పై ప్రో" టి.యాదగిరి రావు గారి పర్యవెక్షణలో 6 సంవత్సరాల పాటు ఈశాన్య భారత దేశంలోని మేఘాలయ, అస్సాం, మిజోరాం, మణిపూర్ లలో మధ్య భారత దేశంలోని 18 రాష్ట్రాలలో క్షేత్ర పరిశోదన చేసి PhD ని పూర్తిస్థాయిలో ఈరోజుకు పూర్తి చేయటం ఆదివాసి సమాజానికి ఎంతో ఉపయోగకరం. ఆదివాసి సమాజ భవిష్యత్తును అస్తిత్వం నీ ఆదివాసి ఉద్యమంతో పాటు, తన పరిశోధనలో బాగం చేసుకోవటం మైపతి ఉద్యమం పట్ల ఉన్న నిబద్ధతకి నిదర్శనం తెలంగాణ నుండి ఈశాన్య భారత దేశంలోని 6వ షెడ్యూల్ లో ఆదివాసీల జీవన స్థితి గతులపై, మధ్య భారత దేశం లోని ఆదివాసీల జీవన స్థితిగతులు విద్య వైద్యం, వ్యవసాయం, ఎంప్లాయ్ మెంట్, ఆదివాసి స్వయం పాలన ఐటిడిఏ ల పని తీరు నీ సూక్ష్మంగా అధ్యయనం చేసి తిసేస్ రూపం లో అందించటం జరిగింది.
విద్యార్థి దశ నుండి ఆదివాసి ప్రాంతాలు, ఆదివాసి విద్యార్థుల సమస్యలు, ఆదివాసీల హక్కులపై క్రమానుగంతంగా అధ్యయనం చేయటం వాటిపై పోరాడుతున్న సంస్థలు, సంఘాలు హక్కుల సంఘాల దళిత, బహుజన పోరాటాలు ప్రజాస్వామిక హక్కుల ఉద్యమాలు ప్రత్యేక ప్రాంత పోరాటాల తో క్రియాశీలకంగా పరిశీలన చేయటం వాటిలో పాల్గొని విశ్లేషించుకుంటూ ప్రమాణగతంగా మాట్లాడటం పద్ధతిగా, క్రమశిక్షణతో నైతికతతో మేల్గటం, పుస్తక పరంతో వ్యక్తిత్వాని పెంచుకొనటం మంచి మాటకారిగా మంచి రచయితగా వ్యక్తిత్వాన్ని మలుచుకోవటం జరిగింది. ఆదివాసి సమూహాల జాతుల చారిత్రత్మక అంశాలపై లోతుగా అధ్యయనం చేయటం వాటిని పుస్తకాలలో నిక్షిప్తం చేయటం సమాజానికి తన జాతుల అంశాలను అందివ్వటం వ్యక్తిత్వంగా మార్చుకొనడం జరిగింది. చరిత్ర తెల్సుకొలేనీ వాడు చరిత్ర నిర్మాణం చేయలేడు అన్న డా" బి. ఆర్. అంబేద్కర్ గారి ఆలోచన ను మైపతి మరువలేదు అందుకే చరిత్ర కోసం నిత్యం పరిశోధనలో ఉంటాడు.
మహిళా సమస్యలు, వారి హక్కుల జెండర్ ఈక్వేషన్స్, వారి పోరాట సంస్థలు, వారి హక్కుల ఉద్యమాలపై అవగాహన కలిగి ఆదివాసి స్త్రీల సమస్యలు ఆదివాసి సమాజంలో ఆదివాసి స్త్రీల పాత్ర, ఆదివాసి సంస్కృతిలో వారి భాగస్వామ్యం, స్త్రీని ఆదివాసి సమాజం గౌరవాడే తీరును పరిశీలన అధ్యాయనం క్రియాశీలకంగా పాల్గొనటం ఆదివాసి స్త్రీల విద్యను పెంపొందించటం లో కృషి చేయటం తన అలవాటుగా మార్చుకొని కొనసాగడం జరుగుతుంది.
తెలంగాణ ఉద్యమంలో ఒక యూనివర్సిటీ విద్యార్థిగా క్రియశీలకంగా పాల్గొని బస్సు యాత్రలు, ధర్నాలు రాస్తారోకోలు, రైలు రోకోలు బంద్ లు, బహిరంగ సభలు సకల జనుల ఉద్యమం లో పాల్గొని ASU విద్యార్థి నాయకుడిగా తన జాతి ఆదివాసి విద్యార్థులను మమేకం చేసి తెలంగాణ ఉద్యమాలలో పాల్గొనేటట్లు చేయటం జరిగింది.
తన జాతి ప్రత్యేక ఉద్యమాలలో క్రియాశీలకంగా పాల్గొంటూనే సామాజిక ఉద్యమాలలో పాల్గొంటూ అన్ని వర్గాల హక్కులపై సమస్యలపై అవగాహనను పెంచుకొని తన పాత్రను సామాజికంగా పెంపొందించుకోనడం జరిగింది స్వర్గీయ KU నుంచి prof Dr.Biyala.Janardhan Rao గారి స్ఫూర్తితో ASU ఆదివాసి విద్యార్థుల చైతన్యం హక్కుల కోసం కృషి చేసే విధంగా తుడుం దెబ్బ ఉద్యమంలో ఆదివాసీలను చైతన్యపరచటం హక్కుల కోసం పోరాటం చేయడంలో అనేక పదవులను రోహించి తెలంగాణ ఒక రాష్ట్రం కావాలి ఆదివాసీలకు పాలించుకునే హక్కు కావాలి తమ ప్రాంతం పై తమకే హక్కు ఉండాలనే కాన్సెప్ట్ తో ఉద్యమిస్తున్న ఆశ కిరణం మైపతి అరుణ్ కుమార్.
దేశవ్యాప్తంగా ఆదివాసి ప్రాంతాలు పై ఆదివాసీల చరిత్ర, సంస్కృతి, గత ఆదివాసి పోరాటాలు వర్తమాన ఆదివాసీ పోరాటాలపై స్పష్టమైన అవగాహన ఆదివాసీలపై దేశవ్యాప్తంగా గ్లోబలైజేషన్ ప్రభావాలపై అవగాహన.సరళి కరణ,గ్లోబలికరణ, ప్రపంచీకరణ, కంప్యూటరీకరణ అంశాల ప్రభావాలు ఆదివాసీల ఉనికి మనుగడ, అస్తిత్వం పై వాటి ప్రభావాలు కళ్ళకు కట్టినట్లు వివరించే తత్వం మైపతి అరుణ్ కుమారు ది, ఈ దేశం లో నిజమైన నాగరికత శాస్త్రీయ మూలం ఆదివాసీల ధి అని ఆదివాసి లే ఈ దేశం మూల శాస్త్ర వేత్తలు అని సింధు నాగరికత నుండి నేటి వరకు ఈ దేశానికి బ్రతుకు నీ నేర్పింది ఆదివాసీలు అని బలంగా తన వాని నీ వినిపించే వ్యక్తి ఆదివాసి నీ అనాగరికునిగా సృష్టిస్తే జీర్ణించుకోలేని వ్యక్తి ఈ తరం ఆదివాసీ మేధావిగా మనం చూడొచ్చునట్లుగా కనిపిస్తాడు.
ఎది ఏమైనా ఆదివాసీల శ్వాస ఆదివాసి ఉద్యమ ఆకాంక్ష మైపతి కి ఆదివాసి సమాజం తరుపున డాక్టరేట్ వచ్చిన సందర్భంలో లో ప్రత్యేక అభినందనలు….!!
ఇట్లు
కాకతీయ యూనివర్సటీ జాక్ ( KU JAK) వ్యవస్థపక అధ్యక్షులు
డా " మంద.వీరాస్వామి
సిద్ధబోయిన లక్ష్మినారాయణ
తుడుందెబ్బ రాష్ట్ర వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి.
No comments:
Post a Comment
Thank you So Much for your Useful Suggestion..!!
Note: Only a member of this blog may post a comment.