Followers

Saturday, July 6, 2019

సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తాను - కలెక్టర్ దివ్య

ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాలోని కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గౌరవ శ్రీమతి దివ్య దేవరాజన్ గారిని మర్యాద పూర్వకంగా కలిసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మరియు కుమ్రంభీము జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గం అన్ని ఏజెన్సీ మండలాల్లో నెలకొన్న సమస్యలపై చర్చిస్తున్న అన్నివర్గాల ఆత్మబందువు,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆపద్బాంధవులు,ప్రియత నేత ఆసిఫాబాద్ నియోజకవర్గ శాసన సభ్యులు గౌరవ శ్రీ ఆత్రం.సక్కు గారు.ప్రత్యేకంగా ఏజెన్సీ ప్రాంతలలో
విద్య ,వైద్యం,వ్యవసాయం,
సీజనల్ వ్యాధులపై పలు అంశాలపై ప్రత్యేక దృష్టి సారించలన్నారు.అలాగే నిన్న  నార్నూర్,గాదిగూడా మండలాలలో ఆకస్మికంగా పర్యటించి సమస్యలపై అరా తీశారు.మండలాలలో పలు గ్రామాల్లో రోడ్లు,ఆశ్రమ పాఠశాలలలో నెలకొన్న త్రాగునీళ్ల సమస్యలపై మరియు (అన్నదాత) రైతుబంధు సమస్యలపై చర్చించడం జరిగింది. అలాగే ఆదివాసీ గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూముల సమస్యలపై మరియు ఆదివాసీల సమస్యలపై కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.వారు ఈ విషయాలపై సానుకులంగా స్పందించి అతి త్వరలోనే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.

No comments:

Post a Comment

Thank you So Much for your Useful Suggestion..!!

Note: Only a member of this blog may post a comment.

Gondwana Kabur