Followers

Tuesday, July 16, 2019

ఆదివాసీ ఉద్యమ గీతం

ఎవడురా?వాడెవడురా?
మా భావ ప్రకటనా స్వేచ్ఛను
బంధించేదెవడురా
మా వేదికల్ని మూసుకొమ్మని
చెప్పేది ఎవడురా? // ఎవడురా//
మాకలాలపై గళాలపై
నిర్భంధం ఎందుకు?

అణగారిన జనాలకు
అండగ ఉన్నందుకా
మీ దోపిడి దొరతనాని
కడ్డు తగిలినందుకా? // ఎవడురా//

ఆదివాసులనడవినుండీ
తరిమి వేసెటందుకా?
అడవంతా కార్పోరేట్
కప్పగించెటందుకా? //ఎవడురా//

మీ నియంతృత్వ పోకడలు
నింగినంటేటందుకా?
మీ ఇనుపా పాదాలతొ
అణిచివేయటానికా? // ఎవడురా//

మా కలాల్ని ఇరిసేసినా
మాగళాల్ని మూసేసినా
ఫీనిక్స్ పక్షిలాగ పుట్టుకొస్తుంటమూ
మీ దోపిడీ కోటలను
కూలదోస్తుంటమూ....! !
✊✊✊✊✊✊✊
వుకే రామకృష్ణ దోర
ఆదివాసీ నాయకుడు

No comments:

Post a Comment

Thank you So Much for your Useful Suggestion..!!

Note: Only a member of this blog may post a comment.

Gondwana Kabur