Followers

Sunday, March 29, 2026

ఇంద్రవెల్లి అమరవీరుల ఆశయ సాధన రగల్ జెండా నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక

•ఏప్రిల్ 1వ తేదీ నుంచి 20 తేది వరకు ఏజెన్సీ రక్షణకు రిలే నిరాహార దీక్షలు ప్రారంభిస్తామన్న ఆదివాసి సంఘాలు.
 
•ఈరోజు ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ఆదివాసి సంఘాలు మరియు గోండ్వాన పంచాయితీ రాయి సెంటర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఏప్రిల్ 20న అమరవీరుల దినోత్సవం సందర్భంగా నిర్వహణ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరియు 1వ తేదీ నుండి 20 తేది వరకు ఏజెన్సీ రక్షణ కోసం రిలే నిరాహార దీక్షలు చేయాలనీ ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో తీర్మానించడం జరిగింది. 

•అమరవీరుల ఆశయ సాధన కమిటీ కమిటీని నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది కమిటీ చైర్మన్ గా మేస్రం నాగ్ నాథ్, గౌరవాధ్యక్షులుగా తొడసం నాగరావ్, ప్రధాన కార్యదర్శిగా కనక తుల్సిరాం, ఉపాధ్యక్షులు సోయం రాందాస్, జై రామ్,  కార్యదర్శిగా గేడం భారత్, తొడసం హన్మంతు, సంయుక్త కార్యదర్శిగా కనక హనుమంతరావు, సలహాదారులుగా తొడసం అమృత్ రావు, మెస్రం వెంకట్రావు, మెస్రం దుర్గు, కొట్నాక్ దేవ్ సావ్, పేందర్ దాదిరావ్ లను ఎన్నుకున్నారు.
 •ఈ కార్యక్రమంలో ఆదివాసక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ గోడం గణేష్, పుర్క బాపూరావ్, జిల్లా సార్మేడి తొడసం అమృత్ రావ్, తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు పెందుర్ దాదిరావ్, సర్మేడీలు మెస్రం వెంకట్ రావ్, మెస్రం దుర్గు, కొట్నాక్ దేవ్ సావ్, గొండ్వాన వెల్ఫేర్ సొసైటి అధ్యక్షులు ఆడ హన్మంత్ రావ్, తుడుం దెబ్బ ఇంద్రవెల్లి అధ్యక్షులు పుర్క చిత్రు, ఖమ్ము జూగ్నక్ భరత్ ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.

ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జన్మనిచ్చిన అమ్మతో సమానం.!

ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ అనే సంఘము యావత్ ఆదివాసి సమాజానికి జన్మనిచ్చిన అమ్మతో సమానం ఇది జగమెరిగిన సత్యం. 

ఉద్యమ నాయకుల్లారా మీకు పాదాభివందనాలు. మీరు ఉద్యమాలు చేస్తున్న తరుణంలో అనేక కష్టాలు నష్టాలు భరిస్తున్న సందర్భాలను చూస్తూ ఉంటే మీకు సెల్యూట్. మీరు నిరంతరం సమాజం కోసం సూర్యుడిలా వెళ్తురు ఇస్తూ ముందుకు సాగాలి.

 సంఘంలో సమాజంలో ఒక హోదాలో ఉండి వ్యక్తిగత పనుల కోసం సంఘాన్ని వాడుకొని సంఘం పేరును చెడుగా సమాజానికి పరిచయం చేయకండి.

 సంఘం పేరు చెబుతూ సమాజం సమాజంలో మంచి హోదాలో ఉండి కొందరు స్వార్థ స్వలాభం కోసం సంఘాన్ని వాడుకొని సంఘమే అలాంటిది అనే ధోరణిలో సమాజం ఎత్తిచూపే పరిస్థితి తీసుకు వస్తున్నారు. అలాంటివారు ఆత్మ విమర్శన చేసి భవిష్యత్తులో అలాంటి తప్పులు జరగకుండా చూసే బాధ్యత మీపై ఉంది. సంఘ పెద్దలపై కూడా ఉంది. ఇది యావత్ సమాజం ఆలోచన ఆవేదన ఆత్మా విమర్శన చేయండి సమాజ వేదికను కాపాడండి తుడుం దెబ్బ ఒక అమ్మలా భావించండి.

Monday, March 16, 2026

అనాధ పిల్లలకు అభిమన్యు వాట్సాప్ గ్రూప్ ఆత్మీయ సహాయం

•90,500(తొంబై వేల ఐదు వందల) రూపాయలు సహాయం చేసి మానవత్వం చాటుకున్న వాట్సాప్ గ్రూప్ 

 ఇటీవల తల్లిదండ్రులు చనిపోవడంతో  అనాదలైన పిల్లలకు అభిమన్యు వాట్సాప్ గ్రూప్ అండగా నిలిచింది. ఉట్నూర్ మండలం రాంజీ గోండ్ నగర్ గ్రామానికి చెందిన ఆత్రం గంగుబాయి ఎనిమిది రోజుల పసికందును జన్మనిచ్చి  అకాల మరణం చెందింది. తండ్రి విట్టల్ కూడా గత నాలుగు నెలల క్రితం చనిపోయాడు. దీనితో మూడు సంవత్సరాల కొడుకు, 8 రోజుల పసిగుడ్డు అనాధలయ్యారు. దీనితో అభిమన్యు గ్రూప్ ద్వారా అనాద పిల్లలను ఆదుకోండి అనే శీర్షికతో  దాతలు ముందుకు వచ్చారు దాతలు 90,500 (తొంబై వేల ఐదు వందల) రూపాయలు జమ అవ్వగా గ్రూప్ సభ్యులు మెస్రం శేఖర్ బాబు ఆధ్వర్యంలో రాంజీ గోండ్ నగర్ వెళ్లి చిన్నారులకు అందచేసారు. నానమ్మ పసి కందు పేరిట ఫిక్స్ డిపాజిట్ చేయాలనీ సూచించారు. ఇలా సహాయం చేసిన అభిమన్యు గ్రూప్ నీ ప్రతి ఒక్కరూ అభినందనలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో మర్సుకొల తిరుపతి, మెస్రం లింగు,  కుమ్ర వెంకట రమణ, మడవి నాగుబాయి, అర్క ఇందిరా, మడవి రత్నమాల, ఆత్రం రంభ, బండి విజయ్, సలాం దేవ్ రావు, మెస్రం దేవ్ రావ్, ఆత్రం తిరుపతి, మర్సుకొల సురేందర్, జాదవ్ రంజిత్, మెస్రం జగన్, పెందుర్ సంతోస్ తదితరులు పాల్గొన్నారు.

Saturday, March 14, 2026

మాంజిరి గ్రామస్థుల వధువుకు ఆర్థిక సహాయం

     ఆదివాసులు ఆడపిల్ల పెండ్లికి వరకట్నం నిషేధించాలనే ఉద్దేశంతో చెయి చెయి కలపి వధువుకు ఆర్థికంగా తోచిన విధంగా సాయం చేస్తున్నారు. నార్నూర్ మండలంలోని మాంజిరి గ్రామానికి చెందిన కొడప మారుతీ, అంబుబాయి కూతురు కొడప జంగుబాయి వధువుకి గ్రామస్తులు పటేల్ ఆధ్వర్యంలో గ్రామ పటేల్ ఇంటి ముందురా ప్రతి ఇంటికి 300 వందల రూపాయలు చొప్పున జామా చేసిన వదువుకు 19,051 రూపాయలు   గ్రామ పటేల్ పెందోర్ మనోహర్, దేవరీ మాడావి షేకు, మహాజన్ మాడావి లచ్చు, జై శ్రీ రాం యూత్ మరియు గ్రామ ప్రజలు ఆధ్వర్యంలో వధువుకు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ పటేల్ పెందోర్ మనోహర్ మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిందని ప్రస్తుతం తరుణంలో ఆడపిల్లల పెండ్లిలు భారంగా కాకుండాదనే ఉద్దేశంతో గ్రామస్తులు ఐక్యంగా ఉండి ప్రతి ఇంటికి 300 వందల చొప్పున డబ్బులను జామ చేయడం జరిగిందన్నారు. జామ చేసిన డబ్బులను పెండ్లి కూతురుకు అందించాడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మహిళలు మరియూ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Friday, March 13, 2026

గిన్నెర గ్రామస్థుల వరుడికి ఆర్థిక సహాయం

గిన్నెర గ్రామంలోని గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలకు తెలియజేయునది ఏమనగా, గ్రామ సంప్రదాయాలు మరియు ఆచారాలను కాపాడుతూ గ్రామ ఐక్యతను బలోపేతం చేయుటలో భాగంగా గ్రామంలో జరిగే శుభకార్యాలకు గ్రామ ప్రజలు కలిసి సహకారం అందించుట ఆనవాయితీగా కొనసాగుతూ వస్తోంది. ఈ సందర్భంగా గిన్నెర గ్రామానికి చెందిన వరుడు కుమ్ర లచ్చు S/o కేశవరావు గారి పెళ్లి కార్యక్రమం సందర్భంగా గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు కలిసి ఆర్థిక సహాయం రూపంలో మొత్తం ₹19,000 (పంతొమ్మిది వేల రూపాయలు) అందజేయడం జరిగింది.
ఈ సహాయం గ్రామ పెద్దల సమక్షంలో మరియు గ్రామ ప్రజల అంగీకారంతో అందించబడింది. గ్రామ సంప్రదాయాలను కాపాడుతూ పరస్పర సహకారం, ఐక్యత మరియు సోదరభావాన్ని కొనసాగించాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పెద్దలు
గ్రామ పటేల్ – మేస్రం ఇస్తారీ, 
గ్రామ దేవరి – మేస్రం గణపతి,
గ్రామ మహాజన్ – ఆత్రం మాన్కు, 
రాయిసెంటర్ సార్మేడి – మేస్రం దుర్గు
మరియు గిన్నెర గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు.

Thursday, March 12, 2026

సీతగూడ గ్రామస్థుల పెళ్లి కూతురికి ఆర్థిక సహాయం.

     నార్నూర్ మండలం సీతగూడ గ్రామంలో గ్రామప్రజలు కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయం ఈ రోజు ఒక కుటుంబానికి ఆర్థికంగా సహాయపడటానికి ఉపయోగపడింది. పెళ్లి సందర్భంగా తొడసం తెలంగ్ రావ్ రేణుక గార్ల కూతురు అనుసయ కుటుంబానికి చిన్నపాటి ఆర్థిక సహాయంగా రూపాయిలు 15,050 గ్రామస్థులందరూ కలిసి గ్రామ పటేల్  తోడసం భీంరావ్  ఆధ్వర్యంలో పెళ్లి కూతురు కుటుంబానికి ఇవ్వడం జరిగింది. ఆహేరీలు చేయడం నిషేదించి ఆ కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయడం ఉద్దేశంతో అందరి ఇళ్లలో జమ చేసి అందించడం జరిగింది. ఈ కార్యక్రమనికి గ్రామస్థులు తొడసం యదోసావ్, మడవి మన్కు (కారోబారి), తోడసం గోపాల్ రావ్, కుడమెత్ బండు మండాడి జైవంత్ రావ్, తోడసం గంగారం (దేవారి), తొడసం సీతరం, పెందోర్ సదు, మడవి లచు, అలాగే శ్రీ హనుమాన్ సీతగుడా యూత్ సభ్యులు పాల్గొనడం జరిగింది.

Monday, March 9, 2026

ఒకే గ్రామానికి చెందిన వధువరుల పెండ్లికి ముసల్పాడ్ గ్రామస్తుల ఆర్థిక సహాయం.!!

     ఆదివాసుల ఆడపిల్ల పెండ్లికి వరకట్నం నిషేధించాలనే ఉద్దేశంతో చెయ్యి చెయ్యి కలపి వధువుకు ఆర్థికంగా తోచిన విధంగా సహాయం చేస్తున్నారు. ఉట్నూర్ మండల బాబాపూర్ గ్రామపంచాయతీలోని ముసల్పాడ్ గ్రామానికి చెందిన ఓకే గ్రామనికి చెందిన వరుడు మెస్రం విజయ్ కుమార్, వధువు కొట్నాక లక్ష్మి కి గ్రామస్తులు ఆధ్వర్యంలో గ్రామ పటేల్ ప్రతి ఇంటి చొప్పున జామా చేసిన వరుడుకు 6400 రూపాయలు, వధువు 6400  రూపాయలను గ్రామ పటేల్ చిక్రం శివకుమార్, దేవరి ఆత్రం పాండురంగ్, మహాజన్ పరచ బిరశావ్, మాజీ సర్పంచ్ తొడసం దేవురావు, చిక్రం మనోహర్, కొట్నాక భోజ్జు, కొట్నాక మానకు, ఆత్రం రాజు, ఆత్రం అంబాజీ, రాజు, శ్రీ జై కొమరం భీమ్ యూత్ మరియు గ్రామ ప్రజలు ఆధ్వర్యంలో వరుడు మరియు వధువుకు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ పటేల్ చిక్రం శివకుమార్ మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిందని ప్రస్తుతం తరుణంలో ఆడపిల్లల పెండ్లిలు భారం కాకుడాదనే ఉద్దేశంతో గ్రామస్తులు ఐక్యంగా ఉండి ప్రతి ఇంటికి 200 వందల చొప్పున డబ్బులను జామ చేయడం జరిగిందన్నారు. జామ చేసిన డబ్బులను వరుడు మరియు వదువుకు అందించామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

ఘన్ పూర్ గ్రామస్థులు వధువుకు ఆర్థిక సహాయం.

   ఆదివాసి గ్రామాల్లో పెళ్ళిళ్ళ  సమయం నడుస్తుంది. పెళ్లిలో ఆదివాసి లో కానుకలు ఇవ్వకండ ఆర్థిక సాయం 21,000  రూపాయలు వధువు మంగం స్వప్నకు ఆర్థిక సాయం అందించారు.
    ఇందుకు ఆదివాసి గ్రామాల్లో పెళ్లిలో ఖర్చు పెళ్ళి కుటుంబాలకు భారం కాకుండా అవుతుందని గ్రామ పెద్దలు భావించారు. ఈ కార్యక్రమంలో పటేల్ కనక కిషన్, దేవరి కనక భూమ రావు, మాజీ ఎంపిపి పంద్ర జైవంత్ రావు మరియు గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు.

వధువు పెండ్లికి వడగం గ్రామస్థుల ఆర్థిక సహాయం.!!

     ఆదివాసులు ఆడపిల్ల పెండ్లి వరకట్నం నిషేధించాలనే ఉద్దేశంతో చెయ్యి చెయ్యి కలపి వధువుకు ఆర్థికంగా తోచిన విధంగా సాయం చేస్తున్నారు. ఇంద్రవెల్లి మండలంలోని వడగం గ్రామానికి చెందిన వధువు మెస్రం పునేషశ్వరికి గ్రామస్తులు ఆధ్వర్యంలో గ్రామ పటేల్ ఇంటి ముందున్న ప్రతి ఇంటికి చొప్పున జామా చేసిన 21,800 రూపాయలను గ్రామ పటేల్ ఆత్రం మారుతి, దేవరి ఆత్రం ధర్ము, మహాజన్ మెస్రం జాకు, శ్రీ వెంకటేశ్వర యూత్ మరియు గ్రామ ప్రజలు ఆధ్వర్యంలో వధువుకు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ పటేల్ ఆత్రం మారుతి మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిందని ప్రస్తుతం తరుణంలో ఆడపిల్లల పెండ్లిలు భారంగా కాకుండాదనే ఉద్దేశంతో గ్రామస్తులు ఐక్యంగా ఉండి ప్రతి ఇంటికి 200 వందల చొప్పున డబ్బులను జామ చేయడం జరిగిందన్నారు. జామ చేసిన డబ్బులను పెండ్లి కూతురుకు అందించామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

అందరి ఐక్యత ఒకరికి ఆసరా నాగులకొండ గ్రామస్థుల ఆర్థిక సహాయం

     ఈరోజు నార్నూర్ మండలంలోని నాగుల కొండ గ్రామంలో గ్రామ ప్రజలు కలిసి తీసుకున్న నిర్ణయం ఒక కుటుంబానికి ఆర్థికంగా సహాయ పడడానికి ఉపయోగపడింది. శ్రీమతి గం.బ కోవా రుక్మాబాయి కి.శే. మానుకు దంపతుల కుమారుడు వరుడు కోవా జంగుకి 15,540 రూపాయలు ఆర్థిక సహాయము గ్రామ ప్రజల ఆధ్వర్యంలో పెండ్లి కుమారుడు కుటుంబానికి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోవా మారు పటేల్, కుమ్ర లాల్సావ్ మరియు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.

ఐక్యతకు ఆదర్శం సాలెవాడ (బి) గ్రామస్థులు..!!

    సమాజంలో ఐక్యత, పరస్పర సహకారం ఉంటే ఎలాంటి కష్టమైనా సులభంగా అధిగమించవచ్చని చెప్పే మంచి నిదర్శనం సాలెవాడా (బి) గ్రామస్తులు. పెందోర్ నాగోరావు కుమారుడు మారుతి, పేద కుటుంబానికి చెందిన వివాహాలకు ఒక వరం లాంటిది.

 కుటుంబానికి మాత్రమే కాకుండా సమాజానికి కూడా ఒక ముఖ్యమైన బాధ్యతగా భావించబడుతుంది. అలాంటి సందర్భంలో సాలెవాడా (బి) గ్రామస్తులు చూపించిన ఐక్యత, సహకారం నిజంగా ప్రశంసనీయమైనది.

ఆ కుటుంబం ఆర్థికంగా బలహీనంగా ఉన్నదని గుర్తించిన గ్రామస్తులు అందరూ కలిసి ముందుకు వచ్చి, వివాహం సజావుగా జరగడానికి తమవంతు సహాయాన్ని అందించారు. గ్రామంలోని పెద్దలు, యువకులు, మహిళలు ఇలా అందరూ కలిసి కట్నకానుకలతో పాటు ₹20,100 రూపాయల ఆర్థిక సహాయాన్ని  అందించడం జరిగింది. ఈ సహాయం ఆ కుటుంబానికి ఎంతో ధైర్యాన్ని, నమ్మకాన్ని ఇచ్చింది.

ఒక్కరి సమస్యను అందరూ తమ సమస్యగా భావించి ముందుకు వచ్చి సహాయం చేయడం మన సంస్కృతిని, భావితరాలకు అందించడం గొప్ప ఐక్యతను స్పష్టంగా చూపిస్తుంది. సమాజంలో పరస్పర సహకారం ఉంటే ఎలాంటి కష్టమైన పరిస్థితినైనా సులభంగా ఎదుర్కొనవచ్చని ఈ సంఘటన మరోసారి నిరూపించింది.

ఈ సందర్భంగా పేద కుటుంబానికి అండగా నిలిచి,  ఆర్థిక సహాయం అందించిన సాలెవాడా బి గ్రామస్తులందరికీ హృదయపూర్వక అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇలాంటి సేవా కార్యక్రమంలో, మరప బాజీరావు పటేల్, మరప నాగరావు  పటేల్, దేవరి మరప షేకు, పేందర్ జగన్నాథరావు, మెస్రం కోసేరావు, సోయం హనుమంతు, ఆడా రామారావు, మడావి రాజు, నైతం మనోహర్, ఆత్రం పురుషోత్తం, గ్రామపంచాయతీ సర్పంచ్ మెస్రం రాధాబాయి నాగోరావ్ ఎప్పటికీ కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.