•90,500(తొంబై వేల ఐదు వందల) రూపాయలు సహాయం చేసి మానవత్వం చాటుకున్న వాట్సాప్ గ్రూప్
ఇటీవల తల్లిదండ్రులు చనిపోవడంతో అనాదలైన పిల్లలకు అభిమన్యు వాట్సాప్ గ్రూప్ అండగా నిలిచింది. ఉట్నూర్ మండలం రాంజీ గోండ్ నగర్ గ్రామానికి చెందిన ఆత్రం గంగుబాయి ఎనిమిది రోజుల పసికందును జన్మనిచ్చి అకాల మరణం చెందింది. తండ్రి విట్టల్ కూడా గత నాలుగు నెలల క్రితం చనిపోయాడు. దీనితో మూడు సంవత్సరాల కొడుకు, 8 రోజుల పసిగుడ్డు అనాధలయ్యారు. దీనితో అభిమన్యు గ్రూప్ ద్వారా అనాద పిల్లలను ఆదుకోండి అనే శీర్షికతో దాతలు ముందుకు వచ్చారు దాతలు 90,500 (తొంబై వేల ఐదు వందల) రూపాయలు జమ అవ్వగా గ్రూప్ సభ్యులు మెస్రం శేఖర్ బాబు ఆధ్వర్యంలో రాంజీ గోండ్ నగర్ వెళ్లి చిన్నారులకు అందచేసారు. నానమ్మ పసి కందు పేరిట ఫిక్స్ డిపాజిట్ చేయాలనీ సూచించారు. ఇలా సహాయం చేసిన అభిమన్యు గ్రూప్ నీ ప్రతి ఒక్కరూ అభినందనలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో మర్సుకొల తిరుపతి, మెస్రం లింగు, కుమ్ర వెంకట రమణ, మడవి నాగుబాయి, అర్క ఇందిరా, మడవి రత్నమాల, ఆత్రం రంభ, బండి విజయ్, సలాం దేవ్ రావు, మెస్రం దేవ్ రావ్, ఆత్రం తిరుపతి, మర్సుకొల సురేందర్, జాదవ్ రంజిత్, మెస్రం జగన్, పెందుర్ సంతోస్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment
Thank you So Much for your Useful Suggestion..!!