ఆదివాసుల ఆడపిల్ల పెండ్లికి వరకట్నం నిషేధించాలనే ఉద్దేశంతో చెయ్యి చెయ్యి కలపి వధువుకు ఆర్థికంగా తోచిన విధంగా సహాయం చేస్తున్నారు. ఉట్నూర్ మండల బాబాపూర్ గ్రామపంచాయతీలోని ముసల్పాడ్ గ్రామానికి చెందిన ఓకే గ్రామనికి చెందిన వరుడు మెస్రం విజయ్ కుమార్, వధువు కొట్నాక లక్ష్మి కి గ్రామస్తులు ఆధ్వర్యంలో గ్రామ పటేల్ ప్రతి ఇంటి చొప్పున జామా చేసిన వరుడుకు 6400 రూపాయలు, వధువు 6400 రూపాయలను గ్రామ పటేల్ చిక్రం శివకుమార్, దేవరి ఆత్రం పాండురంగ్, మహాజన్ పరచ బిరశావ్, మాజీ సర్పంచ్ తొడసం దేవురావు, చిక్రం మనోహర్, కొట్నాక భోజ్జు, కొట్నాక మానకు, ఆత్రం రాజు, ఆత్రం అంబాజీ, రాజు, శ్రీ జై కొమరం భీమ్ యూత్ మరియు గ్రామ ప్రజలు ఆధ్వర్యంలో వరుడు మరియు వధువుకు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ పటేల్ చిక్రం శివకుమార్ మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిందని ప్రస్తుతం తరుణంలో ఆడపిల్లల పెండ్లిలు భారం కాకుడాదనే ఉద్దేశంతో గ్రామస్తులు ఐక్యంగా ఉండి ప్రతి ఇంటికి 200 వందల చొప్పున డబ్బులను జామ చేయడం జరిగిందన్నారు. జామ చేసిన డబ్బులను వరుడు మరియు వదువుకు అందించామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment
Thank you So Much for your Useful Suggestion..!!