Followers

Tuesday, April 14, 2026

వాల్గొండ గ్రామంలో వరకట్నం నిషేధం వరుడికి ఆర్థిక సహాయం

ఇంద్రవెల్లి మండలం వాల్గొండ గ్రామంలో వరకట్నం, కానుకలు నిర్మూలనకు గ్రామ పెద్దలు తీసుకున్న నిర్ణయం ఆదర్శంగా నిలుస్తోంది. గత సంవత్సరంలో “కట్న కానుకలు వద్దు – సహాయం చేయడం ముద్దు” అనే తీర్మానాన్ని గ్రామ పెద్దలు తీసుకోగా, అదే నిర్ణయాన్ని ఈ సంవత్సరం కూడా గ్రామస్తులు కట్టుబడి అమలు చేశారు.
  ఈ క్రమంలో ఉయిక విజ్జుబాయి, మనిక్ రావ్ కుమారుడు పరమేశ్వర్ వివాహ సందర్భంగా గ్రామస్తులంతా ఒక్కటై వివాహ కుటుంబానికి ఆర్థిక సహాయంగా మొత్తం రూ.24,000 (ఇరువై నాలుగు వేల) రూపాయలు సేకరించి అందజేయడం జరిగింది.
   ఈ కార్యక్రమంలో గ్రామ పటేల్ కినక మనిక్ రావ్, కినక శంభు దేవారి, కినక లచ్చు పటేల్, కినక జుగదిరావ్ సర్పంచ్, కోట్నాక్ సంతోష్, కినక పకృ, మహిళలు, యూత్ సభ్యులు మరియు గ్రామ పెద్దలు పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు.

No comments:

Post a Comment

Thank you So Much for your Useful Suggestion..!!