ఆదివాసులు ఆడపిల్ల పెండ్లికి వరకట్నం నిషేధించాలనే ఉద్దేశంతో చెయి చెయి కలపి వధువుకు ఆర్థికంగా తోచిన విధంగా సాయం చేస్తున్నారు. నార్నూర్ మండలంలోని మాంజిరి గ్రామానికి చెందిన కొడప మారుతీ, అంబుబాయి కూతురు కొడప జంగుబాయి వధువుకి గ్రామస్తులు పటేల్ ఆధ్వర్యంలో గ్రామ పటేల్ ఇంటి ముందురా ప్రతి ఇంటికి 300 వందల రూపాయలు చొప్పున జామా చేసిన వదువుకు 19,051 రూపాయలు గ్రామ పటేల్ పెందోర్ మనోహర్, దేవరీ మాడావి షేకు, మహాజన్ మాడావి లచ్చు, జై శ్రీ రాం యూత్ మరియు గ్రామ ప్రజలు ఆధ్వర్యంలో వధువుకు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ పటేల్ పెందోర్ మనోహర్ మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిందని ప్రస్తుతం తరుణంలో ఆడపిల్లల పెండ్లిలు భారంగా కాకుండాదనే ఉద్దేశంతో గ్రామస్తులు ఐక్యంగా ఉండి ప్రతి ఇంటికి 300 వందల చొప్పున డబ్బులను జామ చేయడం జరిగిందన్నారు. జామ చేసిన డబ్బులను పెండ్లి కూతురుకు అందించాడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మహిళలు మరియూ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment
Thank you So Much for your Useful Suggestion..!!