Followers

Thursday, November 28, 2019

జ్ఞాన జ్యోతి Gondawana channel

జ్ఞాన జ్యోతి
""""""""""""""""""""
ఎక్కడో...!
మూలాన పడి
మసి పూసిన మా బతుకులకు
బాసటగా నిలిచి,

బడుగు బలహీన వర్గాల
సంక్షేమాకై నాంది పలికి
జీవితాన్నే అంకితం చేసిన
ఓ త్యాగ మూర్తి
వందనం...

నా జాతినే నా కుటుంబం
నా జాతి బిడ్డలే నా బిడ్డలంటూ..!
మా బతుకులను తీర్చి దిద్దగా
భార్య పిల్లలతో వచ్చి
మా హృదయాల్లో కొలువుదీరిన ఆత్మీయుడా..!
వందనం....

దారిలో....!
మృగాలు ఖడ్గమృగాలు
పగబట్టిన విషపాములు ఎదురీడిన
అలుపెరుగని కఠోర దీక్షతో
జూదమాడుతున్న ధీరుడా సలాం...

కొండల గుట్టల నడుమ
పలుగు పారబట్టి సేదుజేస్తూ
పచ్చని పైరులను పండిస్తున్నా
ఓ శ్రామిక వందనం

నా బిడ్డలు దేంట్లోనూ
తక్కువ కాకూడదని
ఎన్నో కష్టాలను అనుభవిస్తూ
ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ
గొప్ప ఆలోచనలతో
ముందుకు సాగుతూ..!

అక్షరాన్ని ఆయుధంగా మల్చి
కలం పట్టి గళమెత్తి
లోకాన్నే శాసించమని
ఆకలైతే...!
అక్షరాన్ని ఆహారంగా
కచకచ నమలమని చెప్పిన
ఓ జ్ఞాన బోధ వందనం

అదుగో...!
నవయుగ అంబేద్కరుడు
గుర్రపు బగ్గీ పై
సవారీ జేస్తూ...!

నా జాతి ఖ్యాతిని
లోకానికి వెలిగెత్తి చాటుతూ..!
ఎలా వస్తున్నాడో జూడు జూడు

ఆ అంబేద్కరున్ని జూసి
నా కలం సలాం కొట్టీ
జేజేలు పలుకుతూ...!
నీ ముందర బానిసైంది.

ఎక్కడ జూసినా..!
జ్ఞాన జ్యోతులే
యే మూలాన జూసినా..!!
పోరాట యోధులే

ఈ పోటీ ప్రపంచానికి
ఎదురీడి గెలవాలంటే..!
జ్ఞానమొక్కటే ఆయుధమంటూ..
ఆయుధాలను చేతికందిస్తూ...

ఘడియ ఘడియకో
సైన్యాన్ని తయారు జేస్తున్న
ఆ జ్ఞాన జ్యోతిని జూడు..!
ఎంత ప్రకాశవంతంగా వెలుగుతున్నాడో..?

రచయిత: అశోక్ దుర్గం
చరవాణి: 8106709871
జిల్లా: కొమురం భీం ( ఆసిఫాబాద్ )

Wednesday, November 27, 2019

మొదటి ఆదివాసీ IAS అధికారి మడావి తుకారాo MADAVI TUKARAM IAS Gondawana channel

మొదటి ఆదివాసీ IAS అధికారి
మడావి తుకారాo
దట్టమైన అడవులు ,పోరాటం నేపద్యం కలిగిన జిల్లా ,ఆదివాసీ ల తో నిండిన ఆదిలాబాద్ జిల్లా లో , ఆదివాసీ పోరాట యోదుడు కొమరం భీమ్ జన్మించిన పురిటి గడ్డపై ,గోండు తెగ కు మరో ఆదివాసీ ఆణిముత్యం పుట్టింది .ఆదిలాబాద్ జిల్లా లో అత్యంత వెనుకబడిన గోండు ఆదివాసీల లో మడవి తుకారాo IAS అధికారి అయ్యాడు .మడవి తుకారాo సాదారణ గోండు తెగ కు చెందిన ఆదివాసీ ముద్దు బిడ్డా మడవి తుకారాం.ఆదిలాబాద్ జిల్లా లో  ఊట్న్ ర్ మండలo లోని లక్సేటి పేట లో మడవి బాబురావు మహారాజ్ ,మాన్కు భాయి దంపతులకూ మూడవ సంతానo గా 1951, జూన్ 06 న జన్మించారు .

 మడవి తుకారాం కడు పేదరికం లో పుట్టి పెరిగాడు . మడవి తుకారాం కుటుంబం జీవన విధానం సరిగా లేక ,సాగుభూమి  లేక దినసరి వ్యవసాయ కూలి గా జీవన కొనసాగించారు . మడవి తుకారాం తండ్రి ఆనాడు లక్సేటిపేట గ్రామ పోలీస్ పటేల్ గా అక్కడ ఉన్న తహసీల్దార్ కార్యాలయం లో చిరు ఉద్యోగం చేస్తూ ,చాలీ చాలని వేతనం తో కుటుంబాని పోషించేవాడు .తండ్రి తన పిల్లలనూ ఉన్నత చదువులు చదివించాలని తపన పడేవాడు .ఆ తండ్రీ ఆరాటమే మడవి తుకారాంనూ గోండు తెగ లో తొలి IAS అధికారిని చేసింది . మడవి తుకారాం విద్యా అభ్యాసం ప్రభుత్వ పాఠశాలోనే జరిగింది . మడవి తుకారాం స్టానిక పాఠ శాల లో నాల్గవ తరగతి వరకు చదివాడు . ఐదు నుండి పదవ తరగతి వరకు (1961-67)వరకు ఆదిలాబాద్ లో ని గిరిజన సంక్షేమ వసతి గృహం లో ఉంటూ ప్రభుత్వ పాఠశాలో చదివాడు .1967-69లో ఇంటర్మీడియట్ చదివాడు .1969-72లో డిగ్రీ చదువుతూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ,ఆర్ధిక అవసరాలు తీర్చుకుంటూనే కాగజ్నగర్ అటవీ శాఖ కార్యాలయం లో దినసరి వేతనం తో ఉద్యోగం చేస్తూ MA పూర్తి చేశాడు . మడవి తుకారాం మాతృ భాషా గోండీ తో పాటు గా మరాఠీ ,హిందీ  ,ఇంగ్లీష్ ,సంస్కృతం భాషలో పట్టు సాధించాడు .మన దేశం లో ఆదిమ జాతులు భాష సంస్కృతుల అధ్యయనం కోసం నైజాం కాలం లో ఆదిలాబాద్ కు రెండవ సారి వచ్చినా మానవ పరిణామ శాస్త్రవేత్త హైమాడార్ప్ కూ ఉన్నత విద్యా వంతుడైన    మడవి తుకారాం పై దృష్టి పడింది .గోండు ఆదివాసీల సంస్కృతి పైన  ఇంగ్లీష్ లో హైమాన్ డార్ప్  పరిశోధనలూ చేశాడు .వాటిని మడవి తుకారాం తెలుగు లోకి అనువాదం చేశాడు .హైమాన్ డార్ప్ లండన్ వెళ్ళిన తరువాత ఆయన స్పూర్తితో మడవి తుకారాం గ్రూప్ -1అధికారి అయ్యాడు .మొదట కాకినాడ లో ఆర్డీవో( RDO)గా ఉద్యోగం లో చేరాడు . ఉట్నూర్ ITDA -APO గా పని చేశారు .1987లో మడవి తుకారాం పెళ్ళి చేసుకున్నాడు .కరీంనగర్ లో DRDA -PD గా పనిచేశారు .హైదరబాద్ లో గిరిజన సంస్కృతి పరిశోధన శిక్షణ సంస్ధ డైరెక్టర్ గా పనిచేశాడు .మహబూబ్ నగర్ లో జిల్లా లో DRO గా పనిచేశాడు.

అనంతరం IAS అధికారి గా ప్రమోషన్ పొందాడు . మడవి తుకారాం తొలి సారిగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా పని చేశారు .ఆ తరువాత ఎక్సైజ్ కమిషనర్ గా ,  బాలకర్మిక వ్యవస్థ కమిషనర్ గా పనిచేశాడు .ఆ తరువాత ప్రభుత్వ సహాయ కార్యదర్శిగా పని చేశాడు .1999 లో నవంబర్ 29 న మడవి తుకారాం తీవ్రమైన అనారోగ్యంతో  మరణించాడు . మడవి తుకారాం కాంస్య  విగ్రహాన్ని ఉట్నూర్ X రోడ్డు లో ప్రతిష్టించారు  .ప్రతి సంవత్సరం  మడవి తుకారాం వర్ధంతి ని గోండు ఆదివాసీలు వారి సాంప్రదాయ రీతి లో నివాళి అర్పిస్తారు  .నేటి ఆదివాసీ యువతరానికి , ఆదివాసీ ఉద్యోగస్తులకు మడవి తుకారాం ఒక ఆదర్శం .నేటి యువత మడవి తుకారాంని స్పూర్తి గా తీసుకొని ఉన్నత స్తాయి కీ వెళ్ళాలి .సామ్రాజ్య వాద విష సంస్కృతి కీ దూరంగా ఉండాలి .
మొదటి ఆదివాసీ IAS మడావి తూకారం ""
నవంబరు 29న 21వ వర్ధంతి.

-వూకే రామకృష్ణ దోర

Saturday, November 16, 2019

ITDA లో ఏజెన్సీTRT Verification పకడ్బందీగా చేయాలి -ANS MADAVI DATHU

16-12-2019 ఉట్నూర్ ITDA లో  ఏజెన్సీTRT Verification పకడ్బందీగా చేయాలని...ఎట్టిపరిస్థితుల్లోను లంబాడాల Certificates పకడ్బందీగా చూడాలని...ఏజెన్సీ వెరిఫికేషన్ ఇంచార్జి Sub.Collecter Dr.Gopi గారిని కలవడం జరిగింది...పకడ్బందీగా వెరిఫికేషన్ చేస్తున్నామని అవసరమైతే మీరుకూడా కూర్చోవచ్చని తెలిపారు..కార్యక్రమంలో మడావి. దత్తు ANS అధ్యక్షుడు.... తొడసం.భగవంత్ రావ్ ASU ఉట్నూర్ అధ్యక్షుడు... ఆత్రం.విష్ణు ASU.. మెస్రం.భాష్కర్ AISF ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.


Friday, November 8, 2019

ఆమె ఓ జిల్లాకు కలెక్టర్ District Collector Gondwana Channel

ఆమె ఓ జిల్లాకు కలెక్టర్..
కానీ ఆ అధికార దర్పాన్ని మరిచి..
సాదాసీదాగా ఉంటుంది.
ప్రజల  కష్టాన్ని తెలుసుకొని వెంటనే పరిష్కారం చూపుతుంది.
ఏ క్షణమైనా అందుబాటులో ఉండి ప్రజాసేవకు అంకితమైంది.
ఆమెలో కలెక్టర్ ను అన్న గర్వం ఈసమంత కూడా కనబడదు.
ఆమెకు భాష రాకపోయినా పట్టుబట్టి భాష నేర్చుకొని ప్రజలతో మమేకమైతుంది..
ఆమె ఎవరో కాదు #ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్.

దేవరాజన్ దివ్య స్వస్థలం తమిళనాడులోని చెన్నై. ఆమె విద్యాభ్యాసమంతా చెన్నైలోనే కొనసాగింది. చెన్నై బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఆ తర్వాత పీజీలో పట్టభద్రురాలైంది. దివ్యకు  ప్రజలకు సేవ చేయాలనే తపన ఎక్కువ. అందుకే సాఫ్ట్ వేర్ సైడ్ కాకుండా సివిల్స్ పై తన దృష్టి పడింది. సివిల్స్ సాధిస్తే లక్షలాది మంది ప్రజలకు సేవ చేయొచ్చన్న ఆకాంక్షతో చెన్నై నుంచి ఢిల్లీ బయల్దేరింది. అక్కడ ఓ కోచింగ్ సెంటర్ లో కోచింగ్ తీసుకొని సివిల్స్ కు ప్రిపేర్ అయ్యింది. 2009 సివిల్స్ ఫలితాల్లో దివ్య ఆలిండియా 37వ ర్యాంకు సాధించింది. 2010లో ఐఏఎస్ ట్రైనింగ్ ముగిశాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను తన సర్వీసులో భాగంగా ఎంచుకుంది.

హైదరాబాద్ లో వివిధ భాగాలలో పని చేశారు. సిజిజి ప్రాజెక్టు డైరెక్టర్ గా చేశారు. ఆ తర్వాత ఖమ్మం ఐటీడీఏ పీవోగా, జేసీగా పని చేశారు. 2014లో రాష్ట్ర విభజన జరగడంతో ఆమె తెలంగాణ కేడర్ ను ఎంచుకున్నారు. ఆమెను తెలంగాణ ప్రభుత్వం భువనగిరి సబ్ కలెక్టర్ గా నియమించింది. సబ్ కలెక్టర్ గా తక్కువ కాలమే పని చేసిన దివ్య భువనగిరి ప్రజల మనస్సులు గెలుచుకున్నారు.

తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత దివ్య వికరాద్ జిల్లా కలెక్టర్ గా బదిలీ అయ్యారు. వికారాబాద్ కలెక్టర్ గా కూడా ఆమె తన పనితీరుతో ప్రజల మనస్సులు గెలుచుకున్నారు. పెద్దేముల్ మండలం చైతన్య నగర్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. గ్రామంలో సీసీ రోడ్లు, వీధి దీపాలు, నీటిఫ్లాంట్లు, వైద్య సదుపాయాలు, ఆడపిల్లల చదువుపై ప్రత్యేక శ్రధ్ద తీసుకొని అన్ని వసతులు కల్పించారు.

ఇదే సమయంలో ఆదిలాబాద్ జిల్లాలో రిజర్వేషన్లకు సంబంధించి ఆదివాసీలకు గొడవలు జరిగాయి. పరస్పరం దాడులకు పాల్పడ్డారు. దీంతో పరిస్థితి చేజారిపోతుందని గ్రహించిన తెలంగాణ ప్రభుత్వం వికారాబాద్ జిల్లా కలెక్టర్ గా ఉన్న దివ్య దేవరాజన్ ను ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గా బదిలీ చేసింది. ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించి, సమస్యను పరిష్కరించగలదని తెలంగాణ సర్కార్ ఆమెను నియమించింది. బాధ్యతలు స్వీకరించిన దివ్య వెంటనే ముందుగా జిల్లాలో ఉన్న అశాంతిని తొలగించేందుకు అందరితో సమీక్ష సమావేశాలు పెట్టారు. ఇరు వర్గాలు శాంతించేలా పలు ప్రకటనలు చేశారు.

ఆదిలాబాద్ జిల్లా అటవీ జిల్లా. ఎక్కువ మంది ప్రజలు అడవులల్లోనే నివసిస్తారు. కలెక్టర్ గా దివ్య గ్రామాల పర్యటనకు వెళ్లినప్పుడు ప్రజలెవరూ కూడా ఆమెతో మాట్లాడడానికి ఆసక్తి చూపేవారు కాదు. వారి సమస్యలు కూడా చెప్పుకునేవారు కాదు. దివ్య వారితో మాట్లాడుదామంటే భాష సమస్య. దీంతో దివ్య ప్రజలతో కలిసిపోవాలంటే వారి భాష నేర్చుకోవాలని నిర్ణయించుకుంది. తమ ఆఫీసులో పనిచేసే గిరిజన సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగితో రోజు ఉదయం రెండు గంటలు ట్యూషన్ చెప్పించుకొని గిరిజన భాష నేర్చుకుంది. గ్రామాలకు వెళ్లినప్పుడు గిరిజనుల కంటే ముందు దివ్యే వారితో మాట్లాడడంతో ప్రజలు సమస్యలన్ని చెప్పుకున్నారు. ఆమె వెంటనే వాటికి పరిష్కార మార్గాలు చూపేవారు.

కలెక్టర్ కార్యాలయంలో పని చేసే గోపాల్ తన పెళ్లికి దివ్యను ఆహ్వానించాడు. కలెక్టర్ వస్తుందో రాదో అని గోపాల్ కూడా అనుమానం వ్యక్తం చేశాడట. కానీ దేవరాజన్ దివ్య ఆ అనుమానాలను పటా పంచలు చేస్తూ గుడిహత్నూర్ మండలం గోపాల్ పూర్ లో జరుగుతున్న వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ సాధారణ మహిళల కింద కూర్చొని పెళ్లి చూశారు. అనంతరం గిరిజనుల సాంప్రదాయ నృత్యం ధింసా చేసి అందరిని ఆకట్టుకున్నారు.

అదే విధంగా ఉట్నూర్ మండలంలో జరిగిన సమావేశంలో గిరిజనుల భాష మాట్లాడి దివ్య అందరిని ఆశ్చర్యపరిచారు. ఓ సారి వర్షాకాలంలో ఓ గర్భిణికి నొప్పులు వస్తే సకాలంలో అక్కడికి అంబులెన్స్ రాలేకపోయింది. దీంతో గర్భిణి కడుపులోని బిడ్డ చనిపోయింది. ఈ విషయం తెలుసుకొని చలించిన దివ్య ఆ గర్భిణి ఇంటికి వెళ్లి పరామర్శించి ఓదార్చారు. ఆమెకు దైర్యం చెప్పారు.

18 డిసెంబర్ 2017న ఆదిలాబాద్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన దేవరాజన్ దివ్య ప్రస్తుతం కూడా ఆదిలాబాద్ కలెక్టర్ గానే కొనసాగుతున్నారు. దేవరాజన్ దివ్య భర్త ఢిల్లీ యూనివర్సిటిలో ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. అనునిత్యం ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ, ప్రజల మనిషిగా దివ్య పేరు సంపాదించుకున్నారు. ఆడంబరాలకు దూరంగా ఉండి నిరాడంబరతగా వ్యవహరించి ప్రజల మనస్సులు గెలుచుకున్నారు. పిట్టకూర కలెక్టర్ గా పేరు తెచ్చుకున్న దేవరాజన్ దివ్య పలువురికి “స్పూర్తి” గా నిలిచారు.
గోండి బాషలో మాట్లాడిన విడియో లింకు
https://youtu.be/KzaQAj6I8Ho

ఫీరోజ్ ఖాన్,
సీనియర్ జర్నలిస్ట్,  9640466464
#ferozkhanjournalist@gmail.com

Monday, October 21, 2019

ఏత్మసూర్ పద్మల్ పురి కాకో దండారి దర్బార్(ఉత్సవాలను) DIWALI FESTIVAL విజయవంతం చేద్దాం.Gondwana Channel

ఏత్మసూర్ పద్మల్ పురి కాకో దండారి దర్బార్(ఉత్సవాలను)విజయవంతం చేద్దాం.

 తేది : 24/10 /2019
 స్థలం - గుడిరేవు
 మండలం: దండేపల్లి
 జిల్లా: మంచిర్యాల్

గోండ్వాన ప్రాంతంలోని దక్షిణా భారత దేశంలో గోధవరి నది ఒడ్డున ఏకైక ఆదివాసీ పుణ్యక్షేత్రం ఈ పద్మల్ పురి కాకో దేవస్థానం

పన్నెండు లక్షల సంవత్సరాలకు పూర్వం భూమిలో జరిగినా ప్రకృతి మార్పుల వల్లన *లురేషియా* *అంగార* ఈ రెండు భాగాలను *టితిస్* అనే మహాసముద్రం విడదీసింది అంగార ల్యాండ్ అనే భూభాగాన్నీ గోండ్వనా భూమి అన్నీ కూడ అంటారు గోండిలో సింగార్ కళ్ళిదీప్ అనీ అంటారు సింగార్ కళ్ళిదీప్ లో ఐదు ఖండాలు ఉండేవి అవి

 1 *అప్పొగుట్టకోర 2సాయిమల్* *గుట్టకోర 3యెర్* *గుట్టకోర 4ఉమ్మొగుట్టకోర 5ఐపోక్* *గుట్టకోర*  ఈ విధంగా గోండ్వాన భూమి భౌగోళిక పౌరాణిక చరిత్ర ప్రకారం *ఐపోక్ గుట్టకోర* సమభాగములోని *అధిల్ కోట* ఘనరాజ్యం యాధ్మల్ పురికోట భూపత్ కుర్వధీప్ (పధ్మల్ పురికోట )కల్లిపుట్ అక్కో పధ్మల్ పురి కాకో వారి ఘనరాజ్యం గోదావరి నది తీరాన గుడిరేవు నందు కలదని ప్రఖ్యాత భౌగోళిక శాస్త్రజ్ఞుడు పరిశోదకుడు పోరిషత్ తేలియజేయడం జరిగింది.



 'సోనదేవి' మా గోండు ఆదివాసుల పన్నెండు కోట్ల దేవతాలకు తల్లీగా జన్మనిచ్చిందని గోండు గిరిజన సమాజం నందలి పురాతన
 కథలు పాటలు మరియు జానపదాల యందు ఉన్నటువంటి సారము నేటికీ మౌఖిక సాహిత్యం ఆదారంగా కోలుస్తునే వస్తున్నారు కావున ఇట్టి పుణ్యక్షేత్రంను గోండు గిరిజనులో పుట్టినవారు తప్పకుండా దర్శించి తీరాలి అయితేనే జన్మ సార్దకం అన్నీ గోండుల ప్రగాడ విశ్వాసమును ఆచారముగా పాటిస్తున్నారు.


ఆదివాసీ సమాజంలోని గోండు తెగలో సాక్షేఆకాడి నౌసేభేతల్ ఏత్మసూర్ ఫేన్ గుస్సాడీ ఆషాడ మాసం అకాడి నెల వంక కనిపించడంతో ప్రారంభం అవుతుంది అక్కడి నుండి పూజాలు (దండారి ఉత్సవాలు) జరుపుకుంటు అశ్వయుజ అమావాస్య (దీపావళి )తో ముగ్గింపు జరుగుతుంది.



నాలుగు సగలకు (గోత్రలకు) నాలుగు దేవుళ్ళు
1 *నాల్వేన్ సగలో* *గుమ్మెల* *ఫేన్*

2 *సెవేన్ సగలో* *పర్రా* *వేట్టిఫేన్*

3 *సార్వేన్ సగలో* *కోడల్* *ఫేన్*

4 *ఏడ్వేన్ సగలో* *టప్పల్* *ఫేన్*

ఈ నాలుగు సగల వారి ఏత్మసూర్ దేవతలకు జన్మస్ధలం పధ్మల్ పురి కాకో కాబట్టి ఈ నాలుగు సగల ఏత్మసూర్ దేవతలు పద్మల్ పురికాకో వారిని దర్శించడం జరుగుతుంది కొత్త దేవతలను ఇక్కడ తెచ్చి జీవం కల్పించడం మరుగున పడ్డ దేవతలను ఇక్కడ తెచ్చి శుద్ధి చేయడం వంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి.


యవత్త్ ఆదివాసీ సమాజం పధ్మల్ పురి కాకో దండారి దర్భార్ ను విజయవంతం చేయగలరన్నీ పద్మల్ పురి కాకో  డండారి దేవాలయ కమిటీ మరియు ఉత్సవ కమిటీ తరుపున కోరుచున్నాం...👏


దండారి దర్బార్ ఉత్సవ కమిటీ
అధ్యక్షులు మేస్రం కిషన్ గారు
ప్రధాన కార్యదర్శి మడావి శ్రీనివాస్ గారు...

జై ఆదివాసీ జై పద్మల్ పురికాకో
🙏🙏🙏🙏🙏🙏🙏

Thursday, October 17, 2019

సాకడ చౌరస్తాలో ఘనంగా కుంరం భీము 79 వర్ధంతి KOMARAM BHEEM VARDANTHI.

సాకడ చౌరస్తాలో ఘనంగా కుంరం భీము 79 వర్ధంతి.

కెరమెరీ మండలంలోని సాకడ చౌరస్తాలో సాకడ గ్రామ ఆదివాసీలు కుంరంభీం 79వ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు.ముందుగా సాకడ గ్రామం నుండి కుంరంభీం విగ్రహం వరకు గ్రామస్తులు డోలుసన్నాయిల మధ్య ర్యాలీగా వచ్చి కుంరం భీం విగ్రహాన్నికి నివాళులర్పించారు. అనంతరం జెండాను ఆవిష్కరించారు.కార్యక్రమంలో ఎంపీపీ మోతిరాం, జడ్పీటీసీ ద్రుపతబాయి, ఎమ్మెల్యే తనయుడు ఆత్రం వినోద్, అంకిత్, సర్పంచ్ కాసుబాయి, నిర్వాహకులు ఆనందరావు, దంబిరావ్,శ్రీనివాస్,జలపతిరావ్,తుకారం, తుడుం దెబ్బ నాయకులు కోవ  విజయ్, కుంరం భీంరావ్,భరత్, పుసం తదితరులు పాల్గొన్నారు.



Sunday, October 13, 2019

పోరు గడ్డ బోరుమంటుంది

పోరు గడ్డ  బోరుమంటుంది
______________________________________                         
          పూరి గుడిసేలోనే జోడేఘాట్ వాసులు
          కేసీఆర్,కేటీఆర్ హామీలు గాలికే
 జల్,జంగల్,జమీన్ కోసం నిజాం నవాబుతో విరోచితంగా పోరాడి వారి తూటాలకు అసువులుబాసిన అడవి తల్లి ముద్దు బిడ్డ కుమ్రం భీం.పోరు గడ్డ వాసులు జోడేఘాట్ పేరును విశ్వవ్యాప్తం చేసిన గ్రామస్తుల బతుకుల్లో మాత్రం వెలుగులు నింపడం లేదు. సీఏం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీలు నేటికి నెరవేరలేదు.కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. గ్రామల్లో సమస్యలు  రాజ్యమేలుతోంది. ఎడాదికి ఒక్క సారి జరిగే కుమ్రం భీం వర్దంతికి  హడావుడి చేసే అధికారులు, ప్రజా ప్రతినిధులు తర్వాత  గ్రామాల వైపు కన్నెత్తి చూడటం లేదు.దీంతో గిరి పుత్రుల సమస్యలు గుట్టలు దాటి ప్రభుత్వ అధికారుల చెవిన పడటం లేదు. ఆదివాసీల జీవనా విదానాన్ని అభివృద్ది పరుస్తామని, వారికి సకల సౌకర్యాలు,భూములకు పట్టాలు, డబుల్ బెడ్ రూంలు కట్టిస్తామని ప్రతి సారి ఎన్నికల్లో, కుమ్రం భీం వర్ధంతి దర్బారులో వాగ్దానాలు చేసే నాయకుల మాటలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయని బాబేఝరి గ్రామ వృద్దుడి ఆవేదన.. DTF కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా.





Saturday, October 12, 2019

జోడెన్ ఘాట్ వరకు పాదయాత్ర

ఈరోజు సాలెవాడ నుండి జోడెఘాట్ వరుకు సాలెవాడ సర్పంచ్ , జంగుబాయి దేవస్థానం కమిటీ చైర్మన్ శ్రీ మరప బాజిరావ్ గారి అధ్వర్యంలో తలపెట్టిన మహా పాదయాత్రకు లింగాపూర్ మండల తుడుందెబ్బ అధ్యక్షుడు ఆత్రం అనిల్ కుమార్ , సిర్పూర్ మండల ఆదివాసి నాయకుడు కనక సుదర్శన్ , కుమ్రం భీం వర్థంతి కమిటీ సభ్యులు కుమ్రం భీంరావ్ ,మడావి భారత్ భూషన్ ,పూసం భీంరావ్ ,కెరామేరి తుడుందెబ్బ అధ్యక్షుడు కోవ  విజయ్, జైనూర్ ఆదివాసి నాయకుడు పేందోర్ లక్ష్మణ్ గార్లు కలిసి సంఘీభావం తెలపడం జరిగింది.అలాగే భోజన సదుపాయం కల్పించడం జరిగింది...


Tuesday, October 8, 2019

Komaram Bheem– The Legendary Icon of Telangana.

Komaram Bheem– The Legendary Icon of Telangana.

Born: 22-October 1901 -Died: 8-Oct-1940,
Location: Born in Jodeghat, Asifabad, Dist-Adilabad .
Komaram Bheem, a Gond tribal, was born in the Adilabad district in the Telangana region. The Gonds formed a substantial part of the population as the area was ruled by of Chanda (Chandrapur) and Ballalpur. The Gonds like all tribes had very little interaction with the outside world. Komaram too had no exposure and was uneducated. Despite these constraints, he rose in rebellion against the atrocities of the Nizam and became a household name in the liberation movement of his people.
The last phase of the Asif Jahi rule in Hyderabad was rude in the history of the Telangana region. The Tribal population faced the brunt of the rudeness from the Nizams. The Nizam unleashed untold atrocities on the people. Taxes were raised to exorbitant levels, women were dishonored, and men were harassed for unknown reasons. An overall exploitation of the masses became the order of the day. The names of the districts in Telangana region were changed.
In his growing years, he witnessed these unjust practices. His heart wept for his people and the fire of rebellion smoldered within him. Stories of the sacrifices made by other tribal leaders and that of Shaheed Bhagat Singh who laid down his life for his motherland greatly inspired Komaram. It provided the right motivation to awaken the rebel within him. He gave the slogan “Jal, Jungle Jameen” means #Mava_Nate_Mava_Raj (people living in forests should have the complete rights on all the resources of the forest).
In Komaram’s struggle, passion and a deep resolve to bring justice to his people were his main weapons. Given his primitive background he could not gather sophisticated weapons. Nevertheless he surged forward with his strong resolve to bring an end to the rule of the Nizam. However, these were sufficient to unsettle the local Talukdar Abdul Sattar. Shaken and scared to lose, Abdul Sattar turned to the Police for their support. In 1940, a force of 90 well-armed policemen raided the hideout of Komaram. Despite being armed with only primitive weapons like muzzle loaders, spears, lances, bows and arrows and swords, Komaram and his group of warriors fought with such resolve and bravery that it is etched deeply in the memoirs of History.
Komaram however suffered fatal injuries and died in that battled. His death is remembered till this day as that of a martyr who died fighting against the injustices of the Nizams and for the cause of liberating his people. His bravery and valor has earned him a God-like status. He is worshipped in many households and also has his statue installed in the retaining wall of the tank in Hyderabad.
Komaram Bheem has made an indelible mark on the minds of the people of Telangana. His struggle for the liberation of his people was ignited solely from his will to see justice prevail. He was not politically motivated a fact which fails to dilute his genuineness. This integrity to his cause made him overlook his deficiencies and may have expedited his death. Nevertheless, it does not fail to impress on the minds of posterity that resolution and commitment to one’s cause are the two vital factors which helps to lead the way out from the present state of discontent. These factors are also required in order to find new ways of liberation and Komaram Bheem has done just that.
Komaram Bheem was a leader of his people in the truest sense. He has actively led the way for the liberation of his people. It is this liberation movement which he started that laid the seeds for the Telangana demand to create a separate state that fructified in recent years. In a way, therefore he is revered as the icon of the Telangana Liberation Movement.
Recently Komaram Bheem’s statue got installed on Tank Bund, Hyderabad on 01-Nov-2012 after immense pressure from all the pro-Telangana supporters. He became the true spirit to all Telangana people who are fighting for separate Telangana state.





कुमराम भीम* "मावा नाटे मावा राज..."(Great freedom fighter)


*कुमराम भीम* "मावा नाटे मावा राज..."(Great freedom fighter)
************************
कुमराम भीम यानी भीमराव कुमरे। ये नाम तेलंगाना क्षेत्र में केवल आदिवासी ही नही, बहुत लोग ईस नाम से परिचित है..आदिवासी समाज इन्हें अपनें भाग्य देवता के रूप में मानते है...एक छोटे से ग्राम जोडे़नघाट तहसील व जिला आसिफाबाद (तेलगांना)के आदिवासी गोंड समाज में दि.२२-अक्टूबर १९०१ को जन्मे कुमराम भीम (भीमराव कुमरे)बाल्यपन से ही सामाजिक प्रेम और स्वतंत्र रहनसहन के प्रेमी थे..दुसरों के अधीन मे रहना उन्हें पसंस नही था।
उस समय अंधविश्वास ज्यादा होने के कारण आदिवासी लोग एक जगह नही ठहरते थे। प्राय :4-5 वर्ष में ही अपना निवासस्थान बदलते तथा अन्य जगह जंगल काटकर अपना निवासस्थान बनाते थे।जिस वजह से वन अधिकारीयों द्वारा उन्हें हमेशा परेशान किया जाता था।कभी-कभी उन्हें जेल में भी जाना पड़था था।उस समय निजाम का शासन था।ग्राम पटेल से लेकर जिला अधिकारी तक अय्या-मिय्या अर्थात ब्राम्हण और मुसलमान का ही बोलबाला था। शासन प्रशासन से गांव शहर तक अय्या -मिय्या ही समाज मे अच्छे बुरे का निर्णय करते थे।
शासकीय अधिकारी लगान वसूल करनें आते तब गरीब आदिवासी मजबुरी में लगान न देनेपर उन्हें घोड़े की चाबूक से पिटतें और उनके बहु -बेटीयों से भी छेडछाड़ करते थे।कुमराम भीम युवा होने पर इस प्रकार के असामाजिक कृत्यों के खिलाफ़ लोगों मे जागरूकता उत्पन्न करने लगा।समाज की महिलाऒ के साथ अय्या मिय्या के द्वारा अश्लील हरकतों से कुमराम भीम ने विरोध करना शुरु किया और तत्कालीन निजाम शासक के खिलाफ विद्रोह करनें की योजना बनाई।
जल -जंगल -जमीन यह नैसर्गिक है और यह नैसर्गिक आदिवासीयों का हक है।इस पर अन्य का अधिकार नही होना चाहिऐ,इसी के साथ कुमराम भीम ने जोडेनघाट क्षेत्र मे युवा आदिवासीयों की एक टीम बनाया और उन्हें बाण चलाना सिखाने लगा।जहां पर भी आदिवासीयों पर अन्याय होता। वहां भीम जाकर अन्याय के विरोध में लड़ता।आदिवासी समाज की परिस्थिती को देखने के लिऎ कुमराम स्वय महाराष्ट्र -मध्यप्रदेश इत्यादी क्षेत्रों का दौरा करने लगा।जोडेनघाट यह ग्राम पहाड़ पर है और उसके निचले भाग में बाबेझरी नाम का ग्राम है,यह आसिफाबाद जिला स्थान से १५-२० किलोमीटर की दुरी में है..कुमराम भीम आदिवासियों के लिऎ आकाश के तारा के रुप में था। वह गोंड समाज मे क्रान्ती का बीज बो रहां था।क्रान्तिकारी भगतसिंह को वह अपना आदर्श मानता था। कुमराम भीम २० वी सदी के शुरुवात का एक ऐसा व्यक्ती था। जिसने समाज के लिऐ अपना सर्वस्व लुटा दिया और समाज के सामने खडा़ होकर शासक निजाम कों ललकारा। उसे उखाड़ फेकनें की ताकद रकता था।जल-जमी-जंगल पर अधिकार चाहता था.। मावा नाटे मावा राज " (अपने गांव मे अपनी सत्ता)उनका सिद्धांन्त- था।आखीर निजाम सरकार ने उनसे समझौता करने आसिफाबाद तहसील के तालुकादार अब्दुल सत्तार को उनके पास भेजा।
लेकिन भीम ने जल-जमी-जंगल के सीवा अन्य विकास पर वार्तालाप करने को कहा।अत:उनसे समझौता नही हो सका तब तहसीलदार ने कुमराम पर क्रोधीत होकर बन्दी बनाना चाहा और कहा की मै निजाम राजा का अधिकारी हूँ,तुम्हे बन्दी बनाकर ले जा सकता हूँ,तुम्हे कड़े से कडा़ दंड दे सकता हूँ। यह सुनकर भीम के साथीयों ने उनपर हमला कर दिया और कहां कि "मावा नाटे मावा राज"(हमारे गांव मे हमारा राज) निजाम राजा कों हम नही मानते।अंतत: तहसीलदार को वापस जाना पडा़ और इसके कुछ़ दिनों पश्चात तहसीलदार अब्दुल सत्तार सौ से जादा फौज लेकर जोडे़नघाट पर भीम को गिरफ्तार करने के लिऎ आ पहुचा। जैसे ही निजाम के सैनिको के आगमन की सुचना भीम और उनके साथीयों को मिली, उन्होंने पहाड़ के उपर से सैनिकों पर तीर व पत्थरों से हमला बोल दिया।भीम के साथ आदिवासी महिलाओं ने भी इसमें भाग लिया।दोनों ओर से युद्ध बहुत दिनों तक चला।भीम के साथी कुमरा मानकु, रौट कोंडाल, कुमरे भीम,सिडाम भीम,सिडाम राजु, अलाम भीम,कोवा अरजू, मडावी मोहपाराव,चहकारी बार्दी,आत्राम भीम,कोमराम रघू,नेताम गंगू,पुरका मानकू, आत्राम सगू,अरका रघू, इत्यादी सभी साथी मारे गये। और १० लोग घायल हो गये।आखीर निजाम सेना अधिकारी ने जाल रचा और बाबेझरी के भीम के विश्वसनीय साथी को लालच दिखाकर भीम के शक्ती का राज मालूम किया।और दशहरा के पुर्णिमा के दिन उसी रात को ८ अक्टुंबर १९४० को पूर्ण चंद्र ग्रहन के समय कुमराम भीम और उनके साथीयों पर चारों ओर से हमला बोल दिया।रात्री में हुये अचानक हमलें सें कुमराम भीम एवं उसके साथी घिरा गये। और १५-२० सिपाहियों ने घेरकर तलवार से एक ही वार मे कुमराम भीम की गर्दन काट दी।



ईस प्रकार आदिवासीयों का वीर पुरूष समाज के लिऎ लड़ते लड़ते वीरगती को प्राप्त हुवाॅ.।तब से आदिवासीयों के लिऎ कोई वीर पुरुष आगे नही आ रहा है।आदिवासी समाज के सैकडो़ लोग अधिकारी के पद में है।या राजनीती पद पर है।लेकीन ये लोग समाज के विषय पर नही सोचते।शहिद कुमराम भीम की स्मृती मे अक्टूंबर माहीत के दशहरा पुर्णिमा के अवसर पर उनकी पुण्यतिथी मनायी जाती है(death Anniversary) यह स्मृति तेलगांना शासन की ओर से मनायी जाती है।उस दिन जोडे़नघाट मे कार्यक्रम आयोजित कर आदिवासीयों का दरबार लगाया जाता है।हाल में नवनिर्मित तेलगांना प्रदेश के मुख्यमंत्री श्री.के चंद्रशेखर राव ने गत १०-२०१४ मे जोडे़घाट आकर कुमराम भीम के नाम पर यहां एक "ट़्रायबल म्युझियम " तथा जोडेनघाट ग्राम विकास हेतू आदिवासी सब प्लांक (tribal sub-plan) से रुपये २५ करोड और प्रोजेक्ट हेतू ९ एकर जमीन देने का वायदा किया था।शहिद वीर कुमराम भीम एवं साथीयों की शहादत को प्रकाश मे काने हेतू श्री.सिडाम अर्जु मास्टर जी ने बहुत मेहनत की है।उनके ही प्रयत्नों से आज नव निर्मित आसिफाबाद जिले का नाम बदलकर श्री.कुमराम भीम नाम रखा गया..ईस गोंन्डवाना वीर सपुत को मेरा शत-शत- सलाम नमन..जय सेवा...
साभार-
आदिवासी सत्ता..(सामाजिक पत्रिका)
संकलन -अशोक आडे
************************************


ఉస్మానియా యూనివర్సిటీలో రావణాసురుని వర్ధంతి సభ

ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు రావణాసురుని వర్ధంతి సభను నిర్వహించడం జరిగింది.       
ఈ సభలో రాష్ట్ర కన్వినర్ బండి కిరణ్ మాట్లాడుతూ
" మన మూలవాసులు అయిన ఆదివాసులను  రాక్షసులు గా చిత్రీకరించి ఈ రోజు పండగలు చేసుకుంటున్నారు.
మనం గుర్తుంచు కోవలసిన విషయం రావణుడు చేసిన తప్పు ఏమిటి..?
రావణుడి చరిత్రను మనువాదులు వాళ్లకు అనుకూలంగా రాసారు. మనువాదులారా ఈ రోజు మిమ్మల్ని సూటిగా అడుగుతున్న ఒక మనిషి చనిపోతే ప్రతి ఏటా సంబరంగా పండుగలా చిత్రీకరించి కాల్చడం ఏమిటి..?
 అంబేద్కర్ పూలే యువజన సంఘం  నుంచి ఒక్కటే చెప్తున్నాం మా మూలవాసులు అయిన ఆదివాసులను  రాక్షసులు గా చిత్రీకరించి జరుపుతున్న ప్రతీ పండగలను అడ్డుకుంటాం. మా మూలవాసుల వర్ధంతులను  జరుపుతాం గ్రామా గ్రామానా  జరుపుతాం " అని మాట్లాడటం జరిగింది.
ఈ వర్ధంతి సభ కార్యక్రమంలో తెలంగాణ బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ నరేష్ చారి మట్లాడుతూ " రావణుడు రాక్షసుడు కాడు ఈరోజు
చరిత్రను తప్పుడు రాతలు రాసి  రావణుడిని రాక్షసుడిగా చిత్రీకరించి పండగలు జరుపుతున్నారు " అని అన్నారు.
అలగే ఈ సభలో పాల్గొన్నవారు
 బుడగ జంగాల సంఘం రామ్ బాబు ,
APYS కల్చరల్ వింగ్ కో కన్వీనర్ గణేష్,
APYS HYD కన్వినర్ మంతురి ఆంజనేయులు ,  సిద్దిపేట జిల్లా కన్వినర్ సోమీ వంశి ,
కో కన్వినర్ S రాజు ,
రంగారెడ్డి జిల్లా కన్వీనర్ వెంకటేష్ ,  శ్రీకాంత్ , ప్రసాద్ , ప్రకాష్  , నరేష్ , రవి కిరణ్ , మనీ తదితరులు పాల్గొన్నారు.
జై రావణాసురా
జైజై రావణాసురా...
- అంబేద్కర్ పూలే యువజన సంఘం రాష్ట్ర కమిటీ.


Saturday, October 5, 2019

అమరజీవి కీ"శే" కుంరం భీము 79 వ వర్ధంతి సందార్భంగా పెయింటింగ్ పోటీలు.

అమరజీవి కీ"శే" కుంరం భీము 79 వ వర్ధంతి సందార్భంగా
 భీము చరిత్ర, భీము వడుకున్నా వస్తువుల మీదా జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి   పెయింటింగ్ పోటీలు
తేది:10:10:2019 రోజన
 ఉదాయం 12:00 గం,,ల నుండి సాయంత్రం 4:00 గం,,ల వరకు జోడెఘాట్ కుంరం భీము సంగ్రాలయం లో నీర్వహించబడును... కలర్స్ డ్రాయింగ్ సీట్స్ అందుబాటులో మేము ఇస్తాము.
1st prize  gold🏅 medal
 (one painting)
2nd prize gold 🏅medal
(one painting)
3rd prize gold🏅medal
(One painting)
తెది 13:10:2019  వర్ధంతి రొజున వేదిక మీద ఇవ్వబడును
8వ తరగతి నుండి 10 వ తరగతి వరకు,ఇంటర్మిడియట్ నుండి డీగ్రీ వరకు అర్హులు.
DTDO  కుంరం భీము జిల్లా
కన్వినర్:తెలంగాణ రాష్ట్ర ఆదివాసి సంస్క్రతి సంప్రాదాయల  లిహి చిత్రకాళకారుడు మడావి రాజేశ్వర్ పోన్ నెం:6300579498, ఆసక్తిగల విద్యార్థి విద్యార్థులు ఇ నం, 6300579498 కి మీ చిరునామా పంపగలరు...



Friday, October 4, 2019

విప్లవ ప్రత్నామ్నాయం వర్గపోరాటం

విప్లవ ప్రత్నామ్నాయం  వర్గపోరాటం

సమాజం చాలా సంక్షోభంలో ఉన్నమాట నిజం. పాలకవర్గం, సామ్రాజ్యవాదం సృష్టించిన సంక్షోభాలను ప్రజలు అనుభవిస్తున్నారు. వీటికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ప్రత్యామ్నాయం ఏమిటి? అని ఆలోచించేవాళ్లంతా దండకారణ్యంలో విప్లవోద్యమం నాయకత్వంలో జరుగుతున్న ప్రత్యామ్నాయ ప్రయత్నాలను పరిశీలించాలి. వర్గపోరాటాల ద్వారా ప్రజలు ఈ ప్రయోగాలు చేస్తున్నారు. సమాజంలోని అన్ని రంగాలకు విప్లవ ప్రత్యామ్నాయం ఎలా ఉండగలదో బీజరూపంలో ఆచరిస్తున్నారు. ఏకంగా ప్రత్నామ్నాయ ప్రజా రాజ్యం గురించిన నమూనా కోసం ప్రయత్నం జరుగుతోంది.

నూతన ప్రజాస్వామిక రాజ్యయంత్రం-రాజ్యాంగం కార్మికవర్గ నాయకత్వాన కార్మిక-కర్షక పునాదిపై ఆధారపడి కార్మిక, కర్షక, పట్టణ మధ్యతరగతి, దేశీయ పెట్టుబడిదారుల, పీడిత సామాజిక సెక్షన్ల, పీడిత జాతుల ప్రజాస్వామిక రాజ్యయంత్రంగా-రాజ్యాంగంగా ఉంటుంది. ఇది ఈ నాలుగు వర్గాల, పీడిత సామాజిక సెక్షన్ల, పీడిత జాతుల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తూ వాటి పురోభివృద్ధికీ, ఉన్నత పరివర్తనకు ప్రధాన సాధనంగా ఉంటుంది. ఇందుకు మొట్టమొదట నేటి దోపిడీ పీడనలకు మూలమైన ఉత్పత్తి సంబంధాలను రద్దు చేసి, నూతన ప్రజాస్వామిక రాజ్యానికి పునాదిగా ఉండే ఉత్పత్తి సంబంధాలను నెలకొల్పడంతో పాటు గత ఉత్పత్తి సంబంధాల పునాదిపై ఏర్పడిన, దోపిడీ వర్గాలకు సేవ చేస్తూ వాటికి ప్రాతినిధ్యం వహించిన రాజకీయాలను, సంస్థలను రద్దు చేస్తుంది. సామాజిక అణచివేత- వివక్షలను రద్దు చేస్తుంది. సాంస్కృతిక రంగంలో నిరంతరం విప్లవాన్ని కొనసాగిస్తుంది. ఇది దోపిడీ వర్గాల అవశేషాలను, కూలదోయబడిన దోపిడీ వర్గాలకు ప్రాతినిధ్యం వహించే శక్తులను అదుపు చేస్తూ, విద్యావంతం చేస్తూ పరివర్తన చెందించడానికి వారిపై, సామ్రాజ్యవాద ఏజెంట్లపై, విప్లవ ప్రతీఘాతకులపై, దేశద్రోహులపై నూతన ప్రజాస్వామిక నియంతృత్వాన్ని అమలు చేస్తుంది. అశేష ప్రజల, దేశ సర్వతోముఖాభివృద్ధికీ దేశ స్వాతంత్య్రాన్ని-సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికీ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సైనిక, సాంస్కృతిక, పర్యావరణ తదితర కార్యక్రమాలన్నింటిలోనూ రాజ్య వ్యవహారాలన్నింటిలోనూ ప్రజల చైతన్యపూర్వక, క్రియాశీల భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి కృషి చేస్తుంది. దేశంలోని వివిధ పీడిత వర్గాల, సామాజిక సెక్షన్ల, జాతుల మధ్య వివిధ రంగాలలో గల అంతరాలను తొలగిస్తూ మార్క్సిజం-లెనినిజం-మావోయిజం మార్గదర్శకత్వంలో సమాజాన్ని నూతన ఉన్నత దిశగా-సోషలిజం దిశగా నడిపించడానికి అన్ని రంగాల్లో ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వపరంగాను, ప్రజలపరంగానూ కృషి చేస్తుంది.

****

నూతన ప్రజాస్వామిక రాజ్యం వ్యవసాయంలో దోపిడీ ఉత్పత్తి సంబంధాలను రూపుమాపుతుంది, వ్యవసాయం సామ్రాజ్యవాదంపై, బహుళజాతి కంపెనీలపై ఆధారపడేతత్వాన్ని అంతం చేసి, వ్యవసాయాన్ని వాస్తవికంగా అభివృద్ధి చేస్తుంది. ప్రస్తుతం దేశంలో మొత్తం వ్యవసాయ యోగ్యమైన భూమి 30 శాతం పైగా జనాభాలో 5 శాతంగా ఉన్న భూస్వాముల చేతుల్లో ఉంది. మొత్తం రైతుల్లో 65 శాతంగా ఉన్న భూమిలేని పేద రైతులచేతుల్లో ఉన్న భూమి ఒక హెక్టారు కంటే కూడా చిన్నది. నూతన ప్రజాస్వామిక రాజ్యం భూస్వాముల, మత సంస్థల భూమినంతటినీ జప్తు చేసుకుంటుంది, ʹదున్నేవారికే భూమిʹపై ఆధారపడి భూమిలేని, పేద రైతులకు, రైతుకూలీలకు అదనపు భూమిని పంపిణీ చేస్తుంది, ఇది భూమిలేని, పేద రైతుల ప్రభుత్వ, సహకార, ప్రైవేటు రుణాలను, రద్దు చేస్తుంది. రైతాంగాన్ని దోపిడీ చేసే రుణ వ్యాపార సంస్థలను తన నియంత్రణలోకి తీసుకుంటుంది. ఇది సహకార వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. ప్రజల శ్రమ, పెట్టుబడే ఈ సహకారానికి ముఖ్య ఆధారంగా ఉంటాయి, ఇందులో కీలకమైన అంశం శ్రమ. ఇది వినియోగదారుల-రుణదాతల సహకార సమితులను ప్రోత్సహిస్తుంది. ఇది పెట్టుబడిదారీ రైతుల పెద్ద వ్యవసాయ క్షేత్రాలను, కార్పొరేట్‌ రంగాలకు చెందిన వ్యవసాయ క్షేత్రాలను, ఫారం హౌసులను, ప్లాంటేషన్లు, తోటలు మొదలైన వాటి భూమినంతటినీ జప్తు చేసుకొని వాటిలో సమిష్టిగా వ్యవసాయం చేయించేందుకు ప్రాముఖ్యత ఇస్తుంది.

ఇది నీటిపారుదల, విద్యుదుత్పాదన కోసం భారీ నదీ లోయల్లో ప్రాజెక్టులను నిర్మించడం కాకుండా భూమి ఆకృతికి అనుగుణంగా, చిన్న-చిన్న ప్రాజెక్టులను, అంటే, చెక్‌డ్యాములు, చిన్న నీటిపారుదల ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తుంది. తద్వారా పర్యావరణం దెబ్బతినకుండా చేస్తుంది, ప్రజలను విస్థాపన నుండి కాపాడుతుంది. ఏదేనీ భారీ ప్రాజెక్టును అనివార్యంగా నిర్మించాల్సిన పరిస్థితి ముందుకు వస్తే స్థానిక ప్రజల ఆమోదంతో, పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని మాత్రమే నిర్మిస్తుంది.

ఇది మార్కెట్‌ ఎగుడు-దిగుళ్లు, అప్పుల భారం నుండి రైతులను విముక్తి చేస్తుంది. ఇది ప్రపంచ వాణిజ్య సంస్థ నుండి బయటకు వస్తుంది. రైతుకు వ్యతిరేకమైన ప్రతీ విధానాన్ని తిరస్కరిస్తుంది. వ్యవసాయంలో బహుళజాతి కంపెనీల దోపిడీ చొరబాటును అడ్డుకుంటుంది. వ్యవసాయంలో నపుంసక, సంకర విత్తనాలను, భూమిని బంజరుగా మార్చే వ్యవసాయ ఉత్పాదితాలను (ఇన్‌పుట్లు) నిషేధిస్తుంది. మట్టిని, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని దేశవాళీ విత్తనాలను, ఎరువులను వినియోగిస్తుంది, వాటిపై పరిశోధనలను ప్రోత్సహిస్తుంది. ఇది వ్యవసాయంలో సహకార సమితులకు, చిన్న రైతులకు అవసరమైన వస్తువులపై సబ్సిడీ ఇస్తుంది. రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తుంది. ఇది మొట్టమొదటగా ఆహారం విషయంలో, పోషకాహారం విషయంలో దేశాన్ని స్వయంసంపూర్ణం చేస్తుంది, సబ్సిడీలు ఇచ్చి చౌక ధరలకు ఆహార పంపిణీని గ్యారంటీ చేస్తుంది. ఇది ప్రభుత్వ పథకాలలో వ్యవసాయంపై ఖర్చుని పెంచుతుంది, దీనికి ప్రాధాన్యతనిస్తుంది. ఈ విధంగా ఇది ʹʹవ్యవసాయాన్ని పునాదిగా తీసుకొని పరిశ్రమను నాయకత్వంలో ఉంచేʹʹ సూత్రాన్ని, ʹʹరెండు కాళ్ల మీద నడిచేʹʹ వరుస విధానాలనూ అనుసరిస్తుంది.

****

నూతన ప్రజాస్వామిక రాజ్యం పరిశ్రమలను, వ్యాపారాలను సామ్రాజ్యవాద నియంత్రణ నుంచి దళారీ నిరంకుశ పెట్టుబడిదారుల నియంత్రణ నుంచి పూర్తిగా విముక్తి చేస్తుంది. దానిని స్వావలంబనపై ఆధారపడినదిగా పునర్నిర్మాణం చేస్తుంది. ఇది సామ్రాజ్యవాదులకు, దళారీ బడా పెట్టుబడిదారులకు చెందిన యావత్తు పారిశ్రామిక, బ్యాంకు పెట్టుబడిని, సట్టా వ్యాపారుల పెట్టుబడిని, వారి భూమిని, భవనాలను, తోటలు మొదలైన వాటిని, ఉన్నతాధికారుల అపరిమితమైన సంపదను, బ్యాంకులలో ఉన్న వారి డబ్బును జప్తు చేసుకుంటుంది. ఇది బడా పెట్టుబడిదారులకు, విదేశీ పెట్టుబడిదారులకు చెందిన యావత్తు ఫ్యాక్టరీలను, బ్యాంకులను, ఇన్సూరెన్స్‌ కంపెనీలను, ఇతర ద్రవ్య సంస్థలను, పరిశోధన-అభివృద్ధి విభాగాలు మొదలైన వాటిని జాతీయం/దేశీయం చేస్తుంది. ఇది బడా పరిశ్రమల్లో దళారీ నిరంకుశ పెట్టుబడిదారుల, విదేశీ పెట్టుబడిదారుల పెట్టుబడి ఉనికిని పూర్తిగా రూపుమాపుతుంది. ఇది పాలకవర్గాల ద్వారా సామ్రాజ్వవాద ద్రవ్య సంస్థల నుంచి, దేశాల నుంచి తీసుకున్న రుణాలను రద్దు చేస్తుంది. ఇది మన పరిశ్రమలను ఆధారపడేలా చేసే/పరాధీనం చేసే ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు, ప్రపంచ వాణిజ్య సంస్థ మొదలైన సామ్రాజ్యవాద సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను కూడా రద్దు చేస్తుంది. ఇది సామ్రాజ్యవాద ప్రాయోజిత ఉదారీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలను తిరస్కరిస్తుంది. ఇది సాధారణంగా ప్రభుత్వ పెట్టుబడిని బలోపేతం చేస్తూ పట్టణ, గ్రామీణ రంగాలలో పెట్టుబడి సంచయనంపై సీలింగును విధిస్తుంది.

ఇది వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకోవడం ద్వారా పరిశ్రమల స్థాపన-అభివృద్ధి జరుగుతాయి. ఇది శ్రమ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహిస్తుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య ప్రస్తుత అసమతుల్యతను దూరం చేస్తుంది. గ్రామీణ ప్రాంతాలను తగిన విధంగా అభివృద్ధి చేయడం, అక్కడ పరిశ్రమలను, వ్యాపారాలను అభివృద్ధి చేయడం ద్వారా పట్టణాలలో పెరుగుతున్న జనాభా వత్తిడిని తగ్గిస్తుంది. గ్రామీణ ప్రాంతాల నుండి పని-వ్యాపారం కోసం పట్టణ ప్రాంతాలకు వలసపోయే స్థితిని క్రమంగా అంతం చేస్తుంది.

నేడు సంఘటిత రంగంలో కేవలం 7 శాతం మంది పనిచేస్తున్నారు. నూతన ప్రజాస్వామిక రాజ్యం పరిశ్రమలలో ఉపాధి కల్పించేందుకు ప్రాధాన్యతనిస్తుంది తప్ప లాభాలకు కాదు. ఇది కాంట్రాక్టు కార్మి పద్ధతిని అంతం చేస్తుంది. ఇది ఆరు గంటల పని విధానాన్ని అమలు చేస్తుంది. ఇది మహిళలు, పురుషుల కోసం సమాన పనికి సమాన వేతనాన్ని గ్యారంటీ చేస్తుంది. ఇది బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా రూపుమాపుతుంది. కార్మికులకు సామాజిక భద్రతనూ, భద్రమైన పని పరిస్థితులనూ కల్పిస్తుంది. ఇది పని చేసే హక్కును మౌలిక హక్కుగా గుర్తిస్తుంది. నిరుద్యోగ నిర్మూలన వైపుగా పురోగమిస్తుంది. నూతన ప్రజాస్వామిక రాజ్యం సెజ్‌ (ప్రత్యేక ఆర్థిక జోన్లను)లను రద్దు చేస్తుంది.

నూతన ప్రభుత్వం చిన్న, మధ్యతరహా పరిశ్రమలను కాపాడుతుంది. దేశీయ పెట్టుబడిదారీ పరిశ్రమలను, వ్యాపారాలను పరిమితం చేసి నియంత్రిస్తుంది. పరిశ్రమల, వ్యాపార వాణిజ్యాల, గృహ పరిశ్రమల, చేతివృత్తుల బహుముఖ అభివృద్ధి కోసం సహకార ఉద్యమాన్ని పూర్తిగా ప్రోత్సహిస్తుంది.

****

నూతన ప్రజాస్వామిక రాజ్యం భూస్వాముల రాజకీయ అధికారాన్ని ధ్వంసం చేయడం ద్వారానూ, దున్నేవారికే భూమి ప్రాతిపదికన వారి భూమిని పంపిణీ చేయడం ద్వారానూ, భూమిలేని, పేద రైతుల నాయకత్వం కింద ఉండే కొత్త అధికారం ద్వారానూ (వీరిలో పెద్ద సెక్షన్లు దళితులు, ఆదివాసులు, ఇతర పీడిత కులాల నుండి వచ్చినవారే అయి ఉంటారు), సమాజంలో కుల ఆధారిత భూస్వామ్య పునాదిలో పాతుకుపోయి ఉన్న కులవ్యవస్థను రూపుమాపే క్రమాన్ని ఆరంభిస్తుంది. ఇందుకు ప్రత్యేక నిర్మాణ, పోరాట రూపాలను ఎంచుకోవడం ద్వారా శాస్త్రీయ సోషలిస్టు దృక్పథాన్ని పెంపొందించడం ద్వారా బ్రాహ్మణవాద భావజాలాన్నీ, కులవివక్షనూ, అసమానతలనూ నిర్మూలించి, అంటరానితనాన్ని, మొత్తంగా కులవ్యవస్థనూ సంపూర్ణంగా నిర్మూలించే వైపు కృషి చేస్తుంది. ఇది కులవివక్ష పాటించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది. అప్పటి వరకూ దళితులకూ, ఇతర సామాజిక పీడిత కులాలకు ఊతమివ్వడానికి రిజర్వేషన్లతో సహా ప్రత్యేక సదుపాయాలను కల్పిస్తుంది.

****

ఇది మహిళలకు వ్యతిరేకంగా అన్ని రకాల వివక్షను రూపుమాపే దిశగా పురోగమిస్తుంది. ఇది పురుషాధిపత్యాన్నీ, పితృస్వామ్యాన్నీ రూపుమాపేందుకు పోరాడుతుంది. ఇది భూమితో పాటు ఆస్తిపై వారి సమాన హక్కును కూడా గ్యారంటీ చేస్తుంది. ఇది సతీసహగమనం, బాల్య వివాహాలు, వరకట్నం, లింగ వివక్ష మొదలైన మహిళా వ్యతిరేక తప్పుడు రుగ్మతలపై నిషేధం విధిస్తుంది. ఇందుకు ఒడిగట్టిన దోషులకు శిక్ష విధిస్తుంది. ఇది వినియోగవాదాన్నీ (కన్‌జ్యూమరిజం), మహిళలను అంగడి సరుకుగా వాడుకునే - అశ్లీల సాహిత్యం, నగ్న విజ్ఞాపనలు, అందాల పోటీలు మొదలైన ప్రతీ ఒక్క సామ్రాజ్యవాద-పెట్టుబడిదారీ రుగ్మతలను నిషేధిస్తుంది. ఈ రాజ్యం వేశ్యావృత్తిలో కూరుకుపోయిన మహిళలకు పునరావాసం కల్పిస్తుంది. వారికి సామాజిక గుర్తింపును కల్పిస్తుంది. ఇది మహిళలను ఇంటిపని అనే జైలు నుంచి విముక్తి చేస్తుంది, సామాజిక ఉత్పత్తి, ఇతర కార్యకలాపాలలో వారి భాగస్వామ్యాన్ని గ్యారంటీ చేస్తుంది. స్త్రీలు ఎదుర్కొనే అణచివేత, వివక్షలను వేగంగా నిర్మూలించడానికి ప్రత్యేక విధానాలను ప్రోత్సహిస్తుంది. వారికి రిజర్వేషన్లతో సహా ప్రత్యేక సదుపాయాలను ఖాయం చేస్తుంది.

****

ఇది జల్‌-జంగల్‌-జమీన్‌పై ఆదివాసుల-మూలవాసుల సమిష్టి యాజమాన్యాన్ని గుర్తిస్తుంది. వాటిని ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించడం కోసం, ఆ సముదాయాలను ప్రోత్సహిస్తుంది. ఇది యావత్తు ఆదివాసీ సముదాయాల సంపూర్ణ అభివృద్ధి కోసం, వాటికి వివిధ స్వావలంబన అధికారాలను గ్యారంటీ చేస్తుంది. దానికి అనుగుణంగా ప్రత్యేక విధానాలను అమలు చేస్తుంది.

****

రాజ్యాంగం లౌకికమైనదని ప్రకటించినప్పటికీ, భారత రాజ్యం ʹహిందీ, హిందు, హిందుస్తాన్‌ʹ అనే బ్రాహ్మణవాద, జాతీయోన్మాద భావజాలంతో కూడుకొని ఉంది. నూతన ప్రజాస్వామిక రాజ్యం రాజ్యానికి మతం రంగు పులమడానికీ, అన్ని రకాల మత ఛాందసత్వాలకూ వ్యతిరేకమైనది. ఇది మత మైనారిటీలపై అత్యాచారాలను, మత ప్రాతిపదికతో కూడిన సామాజిక అసమానతలను రూపుమాపుతుంది. ఇది మత మైనారిటీల సామాజిక-ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక విధానాలను అమలు చేస్తుంది. ఇది మత వ్యవహారాలలో రాజ్యం జోక్యాన్ని రూపుమాపుతుంది. దీంతో పాటు, ఇది రాజకీయ లక్ష్యాల కోసం మతాన్ని వినియోగించడాన్ని అడ్డుకుంటుంది. ఇది మతాన్ని పాటించడంలో, పాటించకపోవడంలో వ్యక్తిగత స్వేచ్ఛకు గ్యారంటీ కల్పిస్తుంది.

****

భారత సమాజం వేలాది యేళ్లుగా కులపరంగా విభజించబడిన బ్రాహ్మణవాద కుల, సామాజిక అంతరాలు, వివక్ష, ఆచారాలు, అంధవిశ్వాసాలపై ఆధారపడిన సమాజంగా ఉంది. బ్రాహ్మణవాదం ఇక్కడి భూస్వామ్య విధానానికి సాంస్కృతిక వెన్నెముక లాంటిది. నూతన రాజ్యం ఉన్మాదపూరిత కులతత్వాన్నీ, పుట్టుకపై ఆధారపడి సామాజికంగా ఉన్నత, నీచ భేదాలు, అంటరానితనం, వివక్షలను పూర్తిగా రూపుమాపే వైపు పురోగమిస్తుంది.

ఇది ఆదివాసుల పట్ల వివక్షను రూపుమాపుతుంది. ఇది దేశంలో బ్రాహ్మణవాద హిందూ మతోన్మాద భావజాల ప్రభావంతో మతమైనారిటీల పట్ల వ్యాప్తి చెందిన అణచివేత-వివక్షను నిర్మూలిస్తుంది. సమాజంలో శాస్త్రీయ, హేతువాద దృక్పథాన్ని ప్రోత్సహిస్తుంది.

ఇది శిథిలమవుతున్న భూస్వామ్య, వలసవాద, సామ్రాజ్యవాద సంస్కృతి స్థానంలో నూతన ప్రజాస్వామిక, ప్రగతిశీల సంస్కృతిని స్థాపిస్తుంది. మార్క్సిజం-లెనినిజం- మావోయిజం మార్గదర్శకత్వంలో సోషలిస్టు-కమ్యూనిస్టు సంస్కృతి సాధన దిశలో పురోగమిస్తుంది.

****

ఇది ఉపాధి, విద్య, వైద్యం హక్కులను మౌలిక హక్కులుగా గ్యారంటీ చేస్తుంది. నిరుద్యోగాన్ని నిర్మూలించే వైపుగా పురోగమిస్తుంది. ఇది నిరంకుశ కేంద్ర, దేశ-విదేశీ బడా పెట్టుబడికి సేవ చేసే లక్ష్యంతో రూపొందించబడిన విద్యా విధానాన్ని రూపుమాపుతుంది. కార్మిక, కర్షక తదితర శ్రమజీవి ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా, దేశ ప్రయోజనాలు, ప్రత్యేకతలను దృష్టిలో పెట్టుకునే, ఉత్పత్తితో సంబంధాన్ని కలిగి ఉండే ప్రజాస్వామిక, శాస్త్రీయ విద్యా విధానాన్ని అభివృద్ధి చేస్తుంది. ఈ రాజ్యం నిరుద్యోగ భృతిని, సామాజిక బీమాను అమలు చేస్తుంది. ప్రజల జీవనస్థాయిని మెరుగుపరిచేలా గ్యారంటీ ఇస్తుంది.

ఇది శారీరక వికలాంగులకు, మానసిక అసమర్థులు-వికలాంగులకు, వృద్ధులకు, అనాధలకు, అంగలోపంతో బాధపడే ఇతర ప్రజలకు తగిన ఆర్థిక, సామాజిక భద్రతను, ఆరోగ్యకరమైన సామాజిక-సాంస్కృతిక వాతావరణాన్ని కల్పిస్తుంది.

ఇది యావత్తు ప్రజల కోసం, ప్రత్యేకించి, కార్మికులు, రైతులు, ఇతర శ్రమజీవి ప్రజల కోసం ఉన్నత ఆరోగ్య, ఉచిత వైద్య సేవలకు గ్యారంటీ కల్పించే ఒక ప్రజా వైద్య విధానాన్ని అమలు చేస్తుంది. యావత్తు దేశ ఆరోగ్య రంగం ప్రజా ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. వైద్యులు ఆసుపత్రికి వెళ్లడం అనివార్యం చేస్తుంది.

ఇది తాగునీరు, కరెంటు, రవాణా, కమ్యూనికేషన్‌, ఇతర ప్రజోపయోగ రంగాలలో లాభం కోసం పనిచేసే ప్రైవేటు వ్యవస్థలను రూపుమాపుతుంది. యావత్తు రంగాలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకొస్తుంది. ఇది మానసిక, శారీరక శ్రమకు మధ్య అంతరాన్ని క్రమంగా తగ్గించేందుకు ప్రయత్నిస్తుంది. ఇది యావత్తు భారీ పన్నులను రూపుమాపుతుంది. ప్రస్తుత పన్నుల విధానాన్ని రద్దు చేస్తుంది, సరళమైన, ప్రగతిశీల పన్నుల విధానాన్ని అమలు చేస్తుంది.

****

ఇది ప్రజా అనుకూల ప్రగతిశీల, ప్రజాస్వామిక దృక్పథాన్ని అవలంబిస్తూ అందరినీ సంస్కరించడం కోసం హేతబద్ధ న్యాయాన్ని గ్యారంటీ చేసే న్యాయ విధానాన్నీ, న్యాయ వ్యవస్థను అమలు చేస్తుంది. ఈ దిశలో ఇది అధిక ఖర్చుతో కూడిన నేటి న్యాయ విధానాన్ని తొలగించి ప్రజలకు అందుబాటులో ఉండే న్యాయ విధానాన్ని తయారు చేస్తుంది.

****

లాభాల వేటలో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు, ప్రత్యేకించి అమెరికా, ఇతర సామ్రాజ్యవాద దేశాల పెట్టుబడిదారులు పర్యావరణానికి ఎంతగా ధ్వంసం చేసారంటే భూమి అస్తిత్వమే సంక్షోభంలో పడిపోయింది. నూతన ప్రజాస్వామిక రాజ్యం ప్రపంచంలో భావజాలపరంగా సమానమైన ఇతర దేశాలతో కలిసి కాలుష్యాన్ని తగ్గించే విధంగా, దానికి అయ్యే ఖర్చు భరించే విధంగా సామ్రాజ్యవాద దేశాలపై ఒత్తిడి తీసుకువస్తుంది. ఇది పెద్ద నదీలోయ ప్రాజెక్టులను, అడవుల నరికివేతను, ఇతర పర్యావరణ వ్యతిరేక ప్రాజెక్టులను నిరుత్సాహపరుస్తుంది, అవసరమైతే వాటిని నిషేధిస్తుంది.

భారతదేశంలో వివిధ ప్రాజెక్టులలో 1947 నుంచి ఇప్పటి వరకు 6 కోట్ల మందికి పైగా ప్రజలు విస్థాపితులయ్యారు. ఇందులో ఎక్కువగా ఆదివాసులు ఉన్నారు. ఈ రాజ్యం ప్రజాభిప్రాయాన్ని సేకరించకుండా, పర్యావరణానికి నష్టం కలిగిస్తూ, ఏ ప్రదేశంలోనూ అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టదు. ప్రజా ప్రయోజనం కోసం చేపట్టే ఏ ప్రాజెక్టు వలన అయినా విస్థాపన జరిగే స్థితిలో సంపూర్ణ పునరావాసానికీ, ఉపాధికీ గ్యారంటీ ఇచ్చిన తర్వాతే ప్రాజెక్టును ప్రారంభించడం జరుగుతుంది.

ఇలా అనేక రంగాల్లో ప్రత్నామ్నాయ ప్రయత్నాలు వర్గపోరాటాల ద్వారా జరుగుతున్నాయి. వీటిని విశ్లేషించడమే కాదు. ఆచరణలోకి తీసుకొస్తున్న ప్రజలకు మద్దతుగా మేధావులు, రచయితలు ఉండాలి.




Thursday, October 3, 2019

ఈ అడవితల్లి ఒడిలో (గాదిగుడా ప్రజల యదార్థ గాధలు) Gondwana Channel

ఈ అడవితల్లి ఒడిలో (గాదిగుడా  ప్రజల యదార్థ గాధలు)

నేను సమాజశ్రేయస్సుకు ఒక సాధనమని నమ్ముతాను. నా సాహితీ కిరణాల వలన ఇప్పటికి అభివృద్ధి కిరణలు చొచ్చుకుపోని అజ్ఞాత ప్రాంతాలను బయటకు తెచ్చే చిన్న ప్రయత్నం నాది...

     ఈ అడవితల్లి ఒడిలో (గాదిగుడా  ప్రజల యదార్థ గాధలు) ద్వార క్షుణ్ణంగా తెలుసుకోలేకపోయిన కొద్దిపాటి ఆదివాసుల బాధలను,గాధలను బయటికి తెచ్చినవాడిని అవుతానని అనుకుంటున్నాను.

   తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఓ మారుమూల మండలం గాదిగుడా. ఇక్కడి ఆదివాసీ గుడాలు మరింత చీకటి కోణాలు ఈ అడవితల్లి ఒడిలో ఆ చీకటి కోణాలలో ప్రసరించే కాంతి కిరణలు కావాలి ఈ పుస్తకం.

   మంచి జీవితాన్ని జీవించడం ఎంత కష్టమో  యదార్థ గాధలను తెలియజేయడం అంతకంటే కష్టం అనుకుంటున్నాను.
 
ఈ గాధలు యీ ప్రాంతాల సమకాలీన చరిత్ర కాదు.!!
 వీటిలో సాహిత్య విలువలున్నాయన్న భ్రమ నాకు లేదు. ఆదివాసుల దైనందిన జీవితంలో ఎదుర్కొనే కష్టాలను గురించి ఏ మాత్రం అవగాహన కలిగించిన సహనుభూతిని కలిగించిన యీ గాధలకు పరమార్థం నెరవేరినట్లే.

        ఉగాదులు గాని, ఉసస్సులు లేని గోండు గుడాలు,కొలం గుడాలు పర్యటించి కష్టాలలో ఉన్నవారికి ఎంతో కొంత నావంతుగా బాసటగా నిలిచి వారి స్థితిగతులను విశదంగా గ్రహించి ఈ జీవిత రేఖ చిత్రాలను మీ ముందు
ఉంచడానికి నాకు ఈ పుస్తక రచనకు సహాయపడినవారికి ధన్యవాదములు.

    గాదిగూడ, పునగూడ, లోకారి, ఝరి, బొడ్డిగూడ, కుడికస్సా, అర్జుని ఈ గ్రామాలలో ఉద్యోగరీత్యా ఉండడం ఒక అనుభవం... ఒక మంచి అవకాశం
లిపి లేక నిక్షిప్తంగా ఉన్న చరిత్రలాంటిది.

ఈ గాదిగూడ ప్రపంచమే వేరు. ఇక్కడ అమాయకపు ఆదివాసుల ఆప్యాయత దొరుకుతుంది... ఇడ్లి సాంబారు దొరకదు. సినిమా టిక్కెట్లు దొరకవు. ఆకాశాన్ని తాకే అంతస్థులు లేవు    కానీ దానిని మించి అనుభూతిని కలిగించే కుడికస్సా వాగు, గాదిగుడా వాగులను దాటలంటే ఆ అనుభూతే వేరు.
-దుర్వ సంతోష్ పోలిస్ కానిస్టేబుల్.

ఆదివాసుల ఐక్యతా Gondwana Channel

ఆదివాసుల ఐక్యతా
✊🏽✊🏽✊🏽✊🏽✊🏽✊🏽✊🏽✊🏽✊🏽✊🏽✊🏽
ఏజెన్సీ లోని అన్ని సంఘాలు ఏకమై  పిడికిళ్ళు బిగిస్తే...దాన్ని మించిన బాంబ్  యురేనియానికి కూడా సాధ్యం కాదు.

మూసుకు పోతున్న ఆదివాసీ ప్రజాప్రతినిధుల నోళ్లు తెరిపించాలి.

ఏజెన్సీ అంటే ఏకతాటిపైకి వచ్చే జనం అని రుజువు చెయ్యాలి.

ఆదివాసీల ఉద్యమం న్యాయ బద్ధమైంది,ధర్మబద్ధమైందని,ఆమోదయోగ్యమైందని తెలిపే ఒకే ఒక సంకేత ఐక్యత.

ఐక్యత ను సాధించాలని పరిగెత్తుతున్నాం

సంస్కృతిని కాపాడాలని పరిగెత్తుతున్నాం.

లంబాడాలను తరిమికొట్టాలి పౌరుషంగా ఉరుకుతున్నాం.

ఇక్కడ మనం ఈ మూడింటిని కోల్పోతూ....పరుగు తీస్తున్నాం.

ఐక్యతా,సంస్కృతి,పౌరుషం ఈ మూడింటిని కోల్పోకుండా ఉద్యమిస్తే....లంబాడా.....కాదు కదా.....వాని జాడ కూడా ST జాబితాలో ఉండదు.

జై ఆదివాసీ.



ఆదివాసుల కథ Gondwana Channel

ఆదివాసుల కథ

అభివృద్ది పేరిట చాలా ప్రాంతాల్లో అడవులను పారిశ్రమిక కంపెనీలకు అప్పగిస్తుండటంతో.. ఆదివాసీలు విస్థాపితులుగా మారుతున్న పరిస్థితి.

వరల్డ్ ట్రైబల్ డే: ఆదివాసి ప్రపంచ దినోత్సవం.

నాగరికత ఫరిడవిల్లుతోన్న ప్రపంచ సమాజాలన్నింటికి మూలవాసులు ఆదివాసీలే. చరిత్రకారులు విస్పష్టంగా చెప్పిన విషయం ఇది. ఆహార సేకరణే ప్రధానంగా బతికిన ఆదిమ సమాజం.. ఆ తర్వాతి కాలంలో ఆహార ఉత్పత్తి వైపు మరలింది. ఆ క్రమంలో ఆటవిక-నాగరిక సమాజాలు అనే ఒక స్పష్టమైన చీలిక వచ్చింది. సుప్రసిద్ద చరిత్రకారుడు డి.డి.కోశాంబి అభిప్రాయం ప్రకారం తొలినాళ్లలో ఆదిమ సమాజం కొన్ని గుంపులుగా మనుగడ సాగించింది. ఆ గుంపులను కుదురులు అని పిలిచేవారు. ఆ తర్వాతి కాలంలో అవే తెగలుగా రూపాంతరం చెందాయి. ఈ తెగలకు ప్రత్యేకమైన కొన్ని చిహ్నాలు, సంస్కృతి, సాంస్కృతిక వారసత్వం ఉన్నాయి. గ్లోబలైజేషన్ నేపథ్యంలో.. నాగరికత ముసుగులో ఆదివాసీల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. తమ సంస్కృతి, సాంప్రదాయలను పరిరక్షించుకోవడానికి ఇప్పుడు ఈ దేశ మూలవాసీలు నిరంతరం కొన్ని శక్తులతో పోరాడుతూనే ఉన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం *August 9th* జర్పుకుంటారు ఈక మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆదివాసీల గురించి ఒకసారి తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్ ఆదివాసీలు: చెంచు, కొండరెడ్డి, గోండు, నాయకపోడ్, కొండదొర, కొండ కాపు, కోయ, గుత్తి కోయ, కమ్మర కోయ, మన్నె దొర, రెడ్డి దొర, యానాది, కప్పల, చెల్ల యానాది, రెడ్డి యానాది, గదబా, కాపు గదబా, ఎరుకుల, ఉప్పు ఎరుకుల, నక్కల, దులియా, పుతియా, జాతాపులు

తెలంగాణ ఆదివాసీలు: 
చెంచు, కోలాం, కోలావర్, కుబి, బిల్, బగతా, గోండు, సాధు అంద్, నాయకపోడ్, కొండ రెడ్డి, కొండ కాపు, జాతాపులు, కోంద్, కోయ, రోనా, రేనా, సవరాస్, తొటి, యానాది,ఎరుకల, నక్కల, కుర్వికారన్

ప్రపంచ ఆదివాసీలను పరిరక్షించాలన్న ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి అగస్టు 9న వరల్డ్ ట్రైబల్ డే నిర్వహిస్తోంది. ప్రస్తుతం భారతీయ జనాభాలో ఆదివాసీ జనాభా దాదాపు 9శాతం పైనే. దేశవ్యాప్తంగా దాదాపు 461 తెగలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 6శాతం పైనే ఉన్న ఆదివాసీలు.. విభజన తర్వాత తెలంగాణలో దాదాపు 10-12శాతం ఉన్నారు.

పోడు వ్యవసాయం, అటవీ ఉత్పత్తులే వీరి జీవనానికి ఆధారం. ప్రతీ ఆదివాసీ, గిరిజన తెగకు తమదైన ప్రత్యేక భాష ఉండటం ఎక్కడైనా గమనించవచ్చు. ఈనాడు ప్రపంచ భాషగా వ్యాప్తి చెందిన ఇంగ్లీష్ సైతం ఒకనాటి అమెరికన్ ఆదివాసీల భాషే అన్నది చరిత్రకారులు చెబుతున్న సత్యం. అయితే అభివృద్ది పేరిట చాలా ప్రాంతాల్లో అడవులను పారిశ్రమిక కంపెనీలకు అప్పగిస్తుండటంతో.. ఆదివాసీలు విస్థాపితులుగా మారుతున్న పరిస్థితి. ప్రభుత్వాలు వీరి అభివృద్ది కోసం ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు, పథకాలు చేపడుతున్నప్పటికి అవి పూర్తి స్థాయి ఫలితాలను ఇవ్వడం లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది

ఆదివాసీ సమస్యలు:
ప్రాజెక్టులు, పరిశ్రమలను నెలకొల్పడానికి ప్రభుత్వాలు ఆదివాసీలను బలవంతంగా ఖాళీ చేయిస్తున్న పరిస్థితి. దీంతో మైదాన ప్రాంతంలోకి వచ్చి ఇక్కడి నాగరికతకు అలవాటు పడటంలోనూ.. ఇక్కడ జీవనోపాధి సంపాదించుకోవడంలోనూ వారు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో హరితహారం పేరుతో ఆదివాసీల పోడు భూములు లాగేసుకున్నారన్న ఆరోపణ ఉంది. ఇక పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన సమయంలో వారి అనుమతి తీసుకోలేదు. 1996లో వచ్చిన పీసా చట్టం ప్రకారం ఏజెన్సీ ఏరియాల్లో ఆదివాసీల అభీష్టానికి వ్యతిరేకంగా ఏది జరగకూడదు. అయితే ప్రభుత్వాలు మాత్రం ఈ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నాయన్న విమర్శ ఉంది. విద్య, వైద్య, రవాణా వంటి విషయాల్లో గూడెంలు, తండాలు, ఏజెన్సీ ఏరియాలు నేటికి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉన్నాయి.




Wednesday, October 2, 2019

ఆదివాసీ విప్లవ పోరాట జ్వాల కుమ్రం భీం 79వ వర్ధంతి |Gondwana Channel|

ఆదివాసీ విప్లవ పోరాట జ్వాల కుమ్రం భీం
79వ వర్ధంతి నీ జయప్రదం చేయండి .

ఆదివాసీ విప్లవ జ్వాల కొమరం భీమ్ 79వ వర్ధంతి నీ ఆదివాసీ గూడెలలో ఆదివాసీలు అత్యంత వైభవం గా నిర్వహించాలి .స్వాతంత్రాన్ని కీ పూర్వం భారత దేశానికి తెల్ల దొరలు ఈ రాష్ట్రాని నైజాం నవాబు పాలిస్తున్న రోజులవి .అడవి తల్లి ముద్దు బిడ్డలైన ఆదివాసీలు బుక్కేడు బువ్వ కోసం ,భూమి కోసం, భుక్తి కోసం  అస్తిత్వం కోసం ఆరాట పడుతుంటే చలించిపోయి ఆదివాసీ హక్కుల కోసం జల్ జంగిల్ జమీన్ కోసం..... తెల్ల దొరలపైనా నల్ల దొరలు పైన ,నైజాం నవాబు సర్కార్ పైనా గిరిజనేతర సామ్రాజ్యవాదం పైనా ,గిరిజనేతర దోపిడీ పైనా సాయుధపోరాట సమర శంకం పూరించి బూటకపు ఎన్కౌంటర్ లో అమర జీవి ఆయిన మన గోండు పోరాట యోదుడు ..............ఆదివాసీ పోరాట జ్వాలా కొమరం భీమ్ కూ ఆదివాసీల తరుపున ఆదివాసీ విప్లవ సామాజిక అభివందనాలు .ఆదివాసీ విప్లవ జోహార్లు .సమాజ పరిణామ క్రమం లో ఆదివాసీల పై ఆదిపత్యానికి వ్యతిరేకంగా జల్ జంగిల్ జమీన్ కోసం సాంప్రదాయక ఆయుధాలు చేపట్టి సాయుధపోరాటాల ద్వారా నే స్వయం పాలన వస్తుందనీ దృఢoగా నమ్మి నాటి నుండి నేటి వరకు ఆదివాసీలు చేస్తున్నా పోరాటాల చరిత్ర ఘనమైనది .పవిత్రమైనది .అమోఘమైనది .ఉజ్వలమైనది .ఉత్తేజబరిత మైనది .ఆదివాసీల స్వయం పాలన ,ఆదివాసీల అస్తిత్వఆత్మా గౌరవం కోసం పారయి పాలన నూ వ్యతిరేకంచడం ఆదివాసీల కూ మొదటి నుండి వెన్న తో పట్టిన విద్య గా ఉంది .1260-1300మద్య కాలం లో మేడారం కేంద్రం గా సమ్మక్క సారలమ్మ పోరాటం జరిగింది .1778లో బీహార్ కొండల లో పహడీ ఆదివాసీల తిరుగుబాటు జరిగింది .1836-46మద్య కాలం లో ఆసిఫా బాద్ కేంద్రం గా రాంజీ గోండు పోరాటం జరిగింది .ఆ పోరాటానికి వారసత్వం గా 1920-40మద్య కాలం లో జల్ జంగిల్ జమీన్ కోసం జోడేఘాట్ కేంద్రంగా కొమరం భీమ్ పోరాటం చేశారు .ప్రతి పోరాటానికి ఎర్రని రంగు నీ అద్దిన చరిత్ర ఆదివాసీల ది .ఈ పోరాటాల లో బాగంగానే స్వాతంత్రం అంతరం కూడ ఆదివాసీల కూప్రత్యేక జిల్లాలు ,రాష్ట్రాలు కావలనీ ......ఆనాటి గోండ్వాన రాజ్యాలు కావాలనీ ఆనాటి నుండి నేటి వరకు ఆదివాసీలు పోరాడుతున్నారు .1240-1749మద్య కాలం లో స్వేచ్ఛ గా విలసిల్లిన గోండ్వనా రాజ్యాలు ఆంగ్లేయుల రాకతో విచ్ఛిన్నం అయినాయి .దానితో ఆదివాసీల అస్తిత్వం దెబ్బతిన్నది .1836నుండి 1860వరకు రాంజీ గోండు నాయకత్వం లో ఆదివాసీలుఅత్యంత వీరోచితంగా పోరాడినారు .ఆ పోరాట వారసత్వం గా ఆదిలాబాద్ అడవి తల్లి ఒడి నుండి ఆవిర్భవించిన ఆదివాసీ ఆణిముత్యం ఆదివాసీ పోరాట జ్వాలా కొమరం భీమ్ .1900సంవత్సరం లో అక్టోబర్ 22వ తేదీన ఆదిలాబాద్ జిల్లా కరీమెరీ తాలూక లంకెపల్లి గ్రామం లోచిన్నూ మైనుభాయి ల కూ  జన్మించాడు .నైజాం నవాబ్ కొనసాగిస్తున్న దోపిడీ దుర్మార్గాలు అణిచివేతకూ వ్యతిరేకం గా ఆసీఫాబాద్ పరిసర గ్రామాల ఆదివాసీ యువతరాని కూడగొట్టి గెరిల్లా సైన్యం ఏర్పాటు చేశారు .జోడే ఘాట్ కేంద్రం గా నైజాం నవాబ్ సైన్యం పై సాంప్రదాయక ఆయుదాల తో గెరిల్లా యుద్దం చేశాడు ॥.1940సెప్టెంబర్ 1వ తేదీన ఆశ్వయుజ శుద్ద పౌర్ణమి నాడు రాత్రి వేళ కొండల లో దాగిఉన్నభీమ్ నూ చుట్టి ముట్టి గుర్తించి కిరాతకంగా కాల్చి చంపారు .ఆదివాసీ గెరిల్లా  యుద్దవీరుడు కొమరం భీమ్ నేల కోరిగారు .ఆ పోరాటం లో వీరమరణం ,పొంది నేడు ఆదివాసీ అస్తిత్వ ఆత్మా గౌరవ ఉద్యామాల కూ ఊపిరి గా నిలుస్తున్నాడు .కొమరం భీమ్ వర్ధంతి నీ ఆదివాసీలు ప్రతి సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి నాడు ఘనంగా ఆదివాసీలు నిర్వహిస్తారు . జల్ జంగిల్ జమీన్ కోసం స్వయం పాలన ద్వారా ఆదివాసీ ల నూ మేల్కొలిపి న వ్యక్తి ,సామాజిక న్యాయం కోసం సమరశంకం పూరించి ,ఆదివాసీ అస్తిత్వ ఉద్యమాల కూ ప్రాణం పోసిన వ్యక్తి కొమరం భీమ్ .నేటి ఆదివాసీ పోరాటాలకూ ఆదివాసీ సమాజానికి ఆదివాసీ అస్తిత్వ ఉద్యమాల ల కూ వేగుచుక్క కొమరం భీమ్ .నీళ్ళు నియామకాలు నిదులు స్వయం పాలన ఆత్మా గౌరవం తో కోట్లాడి తెచ్చుకొన్న తెలంగాణ లో ఆదివాసీల కూ స్వయం పాలన కల్పించాలనే కొమరం భీమ్ అశాయాన్ని నేటి పాలకులు త్రుoగ లో తొక్కారు .నేడు తెలంగాణ రాష్ట్రం ఆదివాసీల పాలిట శాపంగా మారింది .నేడు రాజ్యాంగ విరుద్దంగా 5వ షెడ్యూల్డ్ ఆదివాసీ భుబాగాన్ని ఆంధ్ర తెలంగాణ గా విభజించడం జిల్లాల పునర్విభజన పేరుతో ఆదివాసీల హక్కుల నూ కాలరాశారు
ఆదివాసీ ప్రాంతాల నూ మైదాన ప్రాంతాల్లో కలిపి ఆదివాసీ హక్కుల నూ అంతం చేశారు .ఆదివాసీల అస్తిత్వవాదన్ని దెబ్బ తీశారు .హరిత హారం పేరూ తో ఆదివాసీల భూములనూ బలవంతం గా లాక్కొని ఆ భూముల లో మొక్కలు నాటుతున్నారు .ఆదివాసీల నూ ఆకలి కీ చెపుతున్నారు .తెలంగాణ లో జీవో నెంబర్ 53ద్వార సాదబైనామ తిసుకవచ్చి ఏజెన్సీలో 1/70చట్టాని నిర్వీర్యం చేసి ఆదివాసీల భూముల నూ గిరిజనేతరులకు దోచి పెట్టడానికి ,ఆదివాసీల భూములనూ అన్యాక్రాంతం చేయడానికి కుట్రలు పన్నుతున్నారు .జీవో నెంబర్ 39ద్వారా ఏజెన్సీలో చట్ట విరుద్దంగా రైతు సమితులు ఏర్పాటు చేసి పిసా చట్టాన్ని గ్రామసభలను ,పంచాయితీ రాజ్ వ్యవస్థ నూ నాశనం చేసి ,ఏజెన్సీలో ఆదివాసీల పై గిరిజనేతరుల ఆదిపత్యాన్ని కొనసాగించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది .అమెరికా లో రెడ్ ఇండియన్స్ అనే ఆదివాసీల నూ అంతం చేసి వారి వనరుల నూ దోచుకోనీ అమెరికా అగ్ర రాజ్యం గా అవతరించింది .నేడు అదే గిరిజనేతర సామ్రాజ్యవాదం నేడు దేశం లో దండకారణయం లో జిల్లాల లో అడుగు బెట్టి ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న సహజ వనురులు ఖనిజ సంపద నూ రాజ్యంగా వ్యతిరేకం గా దొడ్డ దారి లో దోచుకోని ఆదివాసీల నూ నిలువు నా నిర్వాసితుల చేస్తున్నారు .దండకారన్యo లో ఆదివాసీల పై నరమేధం కొనసాగుతుంది .ఆదివాసీల పై అంతులేని హత్యచారాలు కొనసాగుతున్నాయి .ఆదివాసీల స్తితిగతులు పట్టించుకొనే వారు లేక నానాటికీ ఆదివాసీలు దిగజారి పోతున్నారు .ఆదివాసీల రాజ్యాంగ రక్షణలు రాలిపోతున్నయి .5వ షెడ్యూల్డ్ 6షెడ్యూల్డ్ ఆదివాసీ భూభాగం లో ఉన్నా ఆదివాసీ ప్రాంతాల నూరాజ్యాంగ విరుద్దంగా  కేవలం  ఒక ముఖ్యమంత్రి పాలన చేస్తూ కలెక్టర్ల చేత కర్ర పెత్తనం చేయిస్తున్నాడు .నేడు ఆదివాసీ ప్రాంతాలు అదివాసేతర రాజకీయ యంత్రాంగం లో బందీగా మిగిలి పోతున్నాయి .ఏజెన్సీలో ఆదివాసీ ప్రజా ప్రతినిదులు గిరిజనేతర రాజకీయ పార్టీల లో కీలుబొమ్మ లుగా తోలు బొమ్మలు గా మారిపోయారు .ఏజెన్సీలో ఆదివాసీల నూ నిలువు దోపిడీ చేస్తూ ఆదివాసీల పై అదిపత్యo చేలాయిస్తు నేడు ఆదివాసీల రిజర్వేషన్ కబ్జా చేయాలని కుట్రలు పన్నుతున్నున్నారు .ఏజెన్సీలో చట్టవిరుద్ధంగా ఓపెన్ కాస్ట్ లు తీస్తున్నారు .తెలంగాణ రాష్ట్రం ఆదివాసీల పై శాపంగా మారింది .తెలంగాణ లో ఆదివాసీల హక్కులు పూర్తిగా కనుమరుగు అవుతున్నాయి .తెలంగాణ లో 90శాతం రిజర్వేషన్ మరియు ఉద్యోగాలు లంబడీలు దోచుకుంటున్నారు .లంబాడీ ల పండుగ ల కూ వారి నాయకుల వర్ధంతి ల కూ లక్షల రూపాయల కేటాయిస్తూ ఆదివాసీల దినోత్సవాలకూ కనీసం రూపాయిల కూడ ఇవ్వడం లేదు .ఆదివాసీల పై సవితి తల్లి ప్రేమ ,ఆదివాసీల పై లంబాడీల ఆదిపత్య దోరనీ చాలా స్పష్టం గా కనిపిస్తాయి .చేల్లప్ప కమిషన్ ద్వార మూడు అగ్ర కులాలను కలిపి ఆదివాసీల నూ కలుషితం చేస్తున్నారు .నేడు ఏజెన్సీలో ఉన్నా గిరిజనేతరులు ఆదివాసీల రిజర్వేషన్ కూ వ్యతిరేకం గా ఉద్యామాలు చేస్తున్నారు .దీనికి రాజకీయ పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీ లు మద్దతు తెలుపుతూ ఆదివాసీల వ్యతిరేక విదానాల నూ బహిరంగo గా చాటుకున్నాయి .ఆదివాసీల జీవన విధానం ఇంత విధ్వంసం అవుతున్నా కూడ ప్రజా సంఘాలు మేధావులు నోరు మోదపటం లేదు .ఆదివాసీల పై జరుగుతున్న దోపిడీ లో మేము సైతం సగ భాగం అంటూ విచిత్ర విన్యాసాలు చేస్తున్నాయి .నేడు ఆదివాసీలు తమ అస్తిత్వం కోసం  మనుగడ కోసం చేస్తున్నా పోరాటం లో ప్రజా సంఘాలు రాజకీయ పార్టీ లు కమ్యూనిస్ట్ పార్టీలు ఆదివాసీల వైపు ఉంటారో ........గిరిజనేతరుల వైపు ఉంటారో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది .రెడ్ ఇండియన్స్ అనే ఆదివాసీల నూ అంతం చేసి అమెరికా అగ్ర రాజ్యంగా అవతరించినట్లు గా నే తెలుగు ఉబయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆదివాసీల నూ అంతం చేసి వారి సమాదు ల పై స్వర్ణాంధ్రప్రదేశ్ బంగారు తెలంగాణ నిర్మించాలనీ కలలు కొంటున్నారు .గిరిజ నేతర సామ్రాజ్యవాదం ,ఈ అదునిక నాగరిక సమాజం రాజకీయ పార్టీలు అన్ని కలిసి ఈ బూర్జువా బూటకపు ప్రజా స్వామ్యo లో ఆదివాసీల హక్కుల నూ కాలారాస్తున్నారు .నేడు ఆదివాసీలు కోరేది ఏమిటి ..........?  ఏజెన్సీలో గిరిజనేతరుల ఓటు హక్కు రద్దు చేయాలనీ ,ఏజెన్సీ గిరిజనేతరూల వలసలు అరికట్టాలని, యస్ టి జాబితా లో ఉన్నా లంబాడీ ల నూ తొలగించాలని ,చేల్లప్ప కమిషన్ రద్దు చేయాలనీ ,ఏజెన్సీ లో ఆదివాసీల హక్కులు కాపాడాలనీ కోరుతున్నారు .ఐ టీ డి ఏ లో అటెండర్ నుండి ఐ ఏ యస్ వరకు ఆదివాసీల నూ నియమించాల నీ , ఏజెన్సీలో  పోలీస్ శాఖ నూ ఐ టీ డి ఏ నియంత్రణ లోకి తీసుకరావాలని కోరుతున్నారు .ఆదివాసీలు సాగుచేస్తున్నా పోడు భూములకూ పట్టాలు ఇవ్వాలనీ ,ఏజెన్సీలో గిరిజనేతరుల భూ పట్టాలు రద్దు చేయాలనీ ఆదివాసీలు కోరుతున్నారు .పై డిమాండ్స్ సాధన కోసం ఆదివాసీలు .........ఆత్మ గౌరవ పోరాటల నూ మరింత పదును ఎక్కించి ఆదివాసీల హక్కుల కోసం , జల్ జంగిల్ జమీన్ కోసం కొమరం భీమ్ పోరాట స్పూర్తి తో మిలిటెంట్ ఉద్యామాలకు సిద్దం కావాల్సిన అవసరం నేడు ఆసన్నమైంది .అపుడే కొమరం భీమ్ కలలు కన్న ఆదివాసీల స్వయం పాలన సాద్యం అవుతుంది .



//వూ కె రామకృష్ణ దొర //

ఆదివాసీ విప్లవ పోరాట జ్వాలా , ఆదివాసీ యుద్ద వీరుడు కొమరం భీమ్ వర్ధంతి నీ జయప్రదం చేయండి ...........!!

(ఆశ్వయుజ శుద్ది పౌర్ణమి )

Tuesday, October 1, 2019

जन जातियों के धर्म कोड के लिए “कोयापुनेम (KOYAPUNNEM)” पर राष्ट्रीय आम सहमति : डॉ सूर्या बाली “सूरज धुर्वे” Gondwana Channel

जन जातियों के धर्म कोड के लिए “कोयापुनेम)(KoyPunnem” पर राष्ट्रीय आम सहमति : डॉ सूर्या बाली “सूरज धुर्वे”

बिलासपुर छत्तीसगढ़ में रविवार, दिनाक २२ सितम्बर २०१९  को राष्ट्रीय कोयापुनेम परिषद् की दूसरी बैठक का आयोजन किया गयाl ज्ञात हो कि इससे पहले भी इस परिषद् की पहली बैठक भोपाल में हुई थे जिसमें देश भर के दो दर्ज़न से अधिक संगठनों के कोयापुनेम को जनजातियों का सर्वमान्य धर्म मानने का सर्व सम्मति से निर्णय लिया थाl
बिलासपुर की धरती पर सभी जन जातियों के लिए कोयापुनेम पर एक बार पुनः सहमति बनी और एक स्वर से कोया पुनेम  को राष्ट्रीय स्तर धर्म के कोड के तौर पर स्वीकार किया गयाl पांच प्रान्तों से आये विभिन्न जन जातीय संगठनों ने कोयापुनेम को २०२१ की जनगणना में शामिल करने पर सहमति जतायीl

आगे की रणनीति तय करने के लिए अगली बैठक कछारगढ़,  गोंदिया, महाराष्ट्र में तय हुई हैl  विभिन्न प्रान्तों से आये वक्ताओं ने बताया कि कोया पुनेम ही एकमात्र ऐसा धर्म कोड होगा जो भारत सरकार के धर्म के मापदंड पर खरा उतरेगा क्यूंकि इसी के पास अपना प्रवर्तक पुरुष, अपनी भाषा, अपना धार्मिक झंडा, अपनी संस्कृति, अपने तीज त्यौहार, अपने शादी, जन्म और मृत्यु की व्यवस्थाएं इत्यादि हैंl कोया पुनेम की धार्मिक मान्यताएं और विचारधारा भारत में मिलने वाले किसी भी धर्म से बिलकुल भिन्न हैंl कोया पुनेम ही सभी कोइतूरों को एक मंच पर लाकर खड़ा कर सकता हैl चाहे भील, मीना, कोरकू, सहरिया, भिलाला, गोंड, उरॉव, मुंडा, संथाल, हो, न्यासी या ढेरों अन्य जन् जातियां हों सभी कोइतूर हैं और अगर सभी कोइतूर एक हैं तो सभी का धर्म भी एक होना चाहिए इस हिसाब से कोया पुनेम सर्वथा उचित प्रतीक होता है जो समाजिक, वैज्ञानिक और धार्मिक सभी ढंग से उचित हैl

वक्ताओं ने ये भी कहा है कि अगर किसी को इससे बेहतर कोड लाना है तो उसे समाज के द्वारा नियुक्त संस्था के सामने अपनी बात को प्रमाणों के साथ साबित करना होगा अन्यथा उसे भी कोया पुनेम को स्वीकार करना होगाl  चन्द राजनीतिक लोग अपनी रोटियाँ सेंकने के लिए धर्म का सौदा नही कर सकते इसे धर्म के गुरुओं और धर्म के लोगों पर छोड़ देना चाहिएl  राजनीतिक लोग अपनी अपनी राजनीति करें और धर्म का काम धार्मिक लोगों को करने देंl इस परिषद् की बैठक में दादा हिरा सिंह मरकाम, सुशीला धुर्वे, जयपाल सिंह कडोपे, जगदीश सिदार, भीम रावेन शाह इनवाती, बी एल कोराम, आनंद मडावी, शेर सिंह अचला, प्रह्लाद सिडाम, अर्जुन सिडाम, विक्रम शाह गोंड इत्यादि सहित लगभग १०० अन्य जनजातीय धर्म गुरु और नेता उपस्थित थेl

डॉ सूर्या बाली "सूरज धुर्वे"

జంగుబాయి దేవస్థానం లో దసరా పండుగ ఆహ్వానము

జంగుబాయి దేవస్థానం లో దసరా పండుగ ఆహ్వానము
===================

సమస్త ఆదివాసీ సమాజానికి తెలియజేయునది ఏమనగా....

  తేదీ: 04-10-2019 శుక్రవారం రోజున సాయంత్రం 5:00 గంటలకు జంగుబాయి దేవస్థానం కోటపరందోళి బిడ్వార్ యందు దసరా మహా పూజ ప్రారంభమగును.

   కావున నాలుగు సగాల ప్రజలు, జంగుబాయి దేవస్థానం పూజారులైన తుంరం,కోడప,రాయిసిడం, సలాం, వెట్టి, మరప,హేరెకుంరా, మండాడి గోత్రముల వారు సకలంలో హజరై మహా పూజ విజయవంతం చేయగలరని మనవి.


Saturday, September 21, 2019

తెలుగు నేల అడుగుజాడ గురజాడ అప్పారావు సాహితీ సాగరం నేటితరనికో సందేశం.

తెలుగు నేల అడుగుజాడ  గురజాడ అప్పారావు  సాహితీ సాగరం నేటితరనికో సందేశం.
గురజాడ అప్పారావు విశాఖ జిల్లా రాయవరం లో 1862 సెప్టెంబర్ 21 న వెంకట రామదాసు, కౌసల్యమ్మ దంపతులకు జన్మించారు.

గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాoఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహా కవి,తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీ కారులలో ఒకరు,హేతువాది 19వ శతాబ్దంలోను 20వ శతాబ్దంలో మొదటి దశకంలోని అయన చేసిన రచనలు ఈ నాటికి ప్రజల మన్ననలు పొందుతున్నాయి.

ఆ రోజుల్లో ఆయన ప్రజలందరికీ అర్ధమయ్యే భాష లో రచనలు చేశారు.
కన్యాశుల్కం నాటకానికి సాహితీ లోకంలో ఒక ప్రత్యేకమైన స్తానం ఉంది.

అభ్యుదయ కవిత పితామహుడు అని  బిరుదు పొందిన అప్పారావు. తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి కృషి చేసిన వారిలో ముఖ్యులు.

గిడుగు రామమూర్తితో కలిసి వాడుక భాషా వ్యాప్తికి ఉద్యమిచ్చారు.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కన్యాశుల్కం నాటకాన్ని 1890  ప్రాంతాల్లో పూర్తి వాడుక భాషలో రాశారు.

గురజాడ అప్పారావు 1910 సం. లో రచించిన ఈ గేయం..ప్రజల్లో దేశభక్తి ని ప్రభోదించి,దేశాభివృద్ధికై ప్రజలను కార్యోన్ముఖుల్ని చేస్తుంది.

దేశమును ప్రేమిoచుమన్న
మంచి యన్నది పెంచుమన్న
వొట్టి మాటలు కట్టి పెట్టోయ్
గట్టిమేల్ తల్ పెట్టవోయి

పాడి పంటలు పొంగిపొర్ల
దారిలో నువు పాటు పడవోయ్
తిండి కలిగితే కండ కలుగును
కండ కలవాడెను మనిషోయి

యిసురొమని మనుషులుంటే
దేశమే గతి బాగు అగునోయ్
జల్ది కుని కళలన్ని నేర్చుకు
దేశీ సరుకులు నింపవోయి

దేశాభిమానం నాకు కాద్దని
వొట్టి గొప్పలు చెప్పు కోకోయ్
పూని ఏదైనా ఒక మేల్
కూర్చి జనులకు చూపవోయ్

చెట్ట పట్టాల్ పట్టుకొని
దేశస్తులoత నడువ వలెనోయ్
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నియు మెలగవలెనోయ్

సొంత లాభం కొంత మనకు
పొరుగు వానికి తొడుపడవోయ్
దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్

ఈ గేయంలోని పంక్తులు చాలా ప్రాచుర్యం పొందినాయి.

పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అనే సుప్రసిద్ధ గేయం గురజాడ అప్పారావు రచనల్లో మరొకటి ఈ గేయం ఇతివృత్తం కూడా కన్యాశుల్కం దురాచారమే.
కరుణ రసాత్మకమైన ఈ గేయ కావ్యం లోని చివరి పద్యం ..

కన్నుల కాంతులు కాలువల చేరెను
మేలిమి జేరెను మేని పసల్
హంసల జెరేను పూర్ణమ్మ
పుత్తడి బొమ్మ పూర్ణమ్మ..

నేటికీ గురజాడ అప్పారావు,మహాకవి సాహిత్యం ప్రజల మదిలో ప్రాణపదమై.. పల్లవిచ్చుతుంది.


సేంద్రీయ వ్వవసాయం అవగాహన సదస్సు

సేంద్రీయ వ్వవసాయం అవగాహన సదస్సు

ఈరోజు సిర్పూర్  (యు) మండలం గ్రామము కర్ణుగూడ లో సేంద్రీయ వ్వవసాయంపై రైతులకు అవగాహన సదస్సు కార్యక్రమానికి రాయిసెంటర్. నిర్యహణ చేతన ఆర్గానిక్ యందు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ కుమ్రంభీం జిల్లా అద్యక్షుడు కుమ్రం శంకర్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంత ప్రజలకు అదివాసి రైతు లందరికి ముఖ్య గమనిక రసాయన ఎరువులు వాడటం వల్ల భూమి లో ఉన్న ఖనిజాలు తగ్గుతున్నాయి.  అలాగే ఆరోగ్య మరియు భూమి విలువ కూడా కాపాడుట కోరకు సింద్రీయ వ్వవసాయంపై అవగాహన జిల్లా రాయి సెంటర్ అధ్యక్షుడు కోట్నాక కిషన్ కుడ్మేత యశ్వంత్ రావ్ ఉపా సార్ మేడి ప్రబాకర్ సార్ పాల్గొన్నారు.

Monday, September 16, 2019

ఆదివాసులంతా ఏకమై ఉద్యమించాలి. -కేసిఆర్


నిజమే దొర మీరు చెప్పినట్లే ఆదివాసులంతా చైతన్యమై , పార్టీలు,సంఘాల కతీతంగా పిడికిలి బిగించి, నాటి కాకతీయ చక్రవర్తులపై సమరశంఖం పూరించి ఆదివాసుల ఆత్మాబిమానాన్ని ,పౌరుషాన్ని చూపిన సమ్మక్క సారక్కల స్పూర్తితో,  తర్వాత  ప్రపంచాన్ని గడగడలాడించిన బ్రిటీష్ పాలకులపై  తొలి తుడుం మోగించిన ఆదివాసి పోరాట వీరుల స్పూర్తితో, ఆ తర్వాత హైదరాబాద్ సంస్థానాన్ని అరాచకంగా  పరిపాలించిన నిజాం సర్కారును సైతం గడగడలాడించి జల్ జంగల్ జమీన్ పై హక్కుల సాధించిన కుమరం భీం దాదా పోరాట స్పూర్తితో, నేడు యావత్ ఆదివాసి సమాజం ఏకమై ఒకే జెండా, ఒకే నాయకత్వం,ఒకే డిమాండ్ తో “ చట్టబద్దత లేని లంబాడీలను ST జాబితా నుండి తొలగించడంతో “పాటు భారత రాజ్యాంగం ఆర్టికల్ 342 ప్రకారం గుర్తించిన నిజమైన ఆదివాసి తెగల ప్రయోజనాల కోసమే నిస్వార్దంగా, ప్రజాసామ్యయుతంగా”కళం,గళంతో” జాతి కోసం,జాతి చైతన్యం కోసం,జాతి ప్రయోజనాల కోసం,జాతి అస్థిత్వం కోసం ఆదివాసి ఉద్యమ నాయకుడు,కుమరం భీం పోరాట వారసుడు గౌరవనీయ పార్లమెంటు సభ్యులు శ్రీ సోయం బాపురావు దాదా గారి నాయకత్వంలో అవిశ్రాంతంగా పోరాడి చారిత్రాత్మక విజయం సాధించడం ఖాయం. మీరు చెప్పినట్లే  పోరాడుతున్న అమాయక ఆదివాసులకు మద్దతుగా మీ పాలన సాగాలని కోరుకుంటున్న యావత్ ఆదివాసి సమాజం. జై  ఆదివాసి.జైజై ఆదివాసి.

Sunday, September 15, 2019

నేనూ.. మీ రాంజీగోండును..

నేనూ.. మీ రాంజీగోండును..
( మన కోసం పాణాలు ఇచ్చిండ్రు.. జర ఓపిక జేస్కోని సదువుండ్రి..)

‘‘ఎండనక.. వాననక.. నిత్యం నవ్వుతూ నిండుగా ఉన్న నన్ను జూసి మస్తుమంది గీయన ఓళ్లుబై.. అని అడుగుతుంటే గమ్మతనిపిస్తది. ఒక్కోపారి.. నవ్వస్తది. ఇగ రోడ్డు మీద పోయేటోళ్లల గొంతమంది దగ్గరకచ్చి మరి బోర్డు మీద రాసిన నా పేరు జూసి.. ఆహా ఈయన పేరు గిదా.. అని సూసుకుంట పోతరు. అరెరె.. మాటల్లవడి సెప్పుడు మర్సిన.. అసలు నేను యాడున్నది.. నేనొళ్లన్నది చెప్పలె కదా. నిమ్మల గడ్డ మీద చైన్‌గేట్‌ అడ్డ కాడికస్తే.. ఎర్రటి దిమ్మె మీద.. బంగారు రంగుల మెరిసిపోత.. బుర్రమీసాలతో.. నెత్తికి పట్కాసుట్టి కనిపిస్త.. అవ్‌.. నేనే మీ రాంజీగోండును. మీవోణ్ణి.. మీకోసం పోరాడినోణ్ణి.. పాణాలు అర్పించినోణ్ణి. మరి గిన్నేళ్లు లేంది.. గిప్పుడెందుకు ముందటికచ్చినవ్‌.. గీ ముచ్చట పెడుతున్నవంటరా.. ఏం లే.. *మళ్ల సెప్టెంబర్‌ 17 విమోచనదినం.. అచ్చింది* కదా. అప్పటిరోజులు.. అంతకు ముందు మేం జేసిన పోరాటాలు యాదికొచ్చినై. అడవి బిడ్డలుగా ఉన్న మేం ఆఖరి శ్వాసదాకా ఎందుకు పోరాడినం..? ఒకళ్లం కాదు.. ఇద్దరం కాదు... వెయ్యి.. వెయ్యిమందిమి ఒకేపారి పాణాలను ఎందుకు ఇడిసినం..? కుమ్రంభీముడు ఏంటికి తుపాకి వట్టిండు.. తనెందుకు పాణాలు ఇడిసిండు..? ఇట్ల... ఎన్నో ఏండ్ల సంది.. చెప్పాలనుకున్న ఎన్నో ముచ్చట్లు గుండెలోపల గూడుకట్టుకుని ఉన్నయ్‌. ఈ విగ్రహానికి గుండేంది.. గూడేంది.. అందులో ముచ్చట్లేంది.. అని ఇసిత్రం గాకండి. దేశం కోసం పాణాలు ఇడిసినోళ్లను ఏమంటరు.. ‘అమరులు’ అనే గదా.. అంటే ఏంది ‘మరణం లేనోళు’్ల అనే గదా. అందుకే మేం యాడికి బోలే.. నిత్యం ఈడనే ఉండి నిమ్మలను సూసుకుంట మురిసిపోతం. అవ్‌గన్నీ అసలు ముచ్చట మొదలు జెప్పుకుందాం.. ఏళ్లకిందట ఉన్నదంతా ఆళ్ల రాజ్యమేనంటూ ఊళ్లకు ఊళ్లను చెరబట్టిండ్రు గా తెల్లటోళ్లు. ఇగ ఆళ్లకు మన పట్నం రాజులూ వంగి.. వంగి సలాములు పెట్టిండ్రు. ఇళ్లిద్దరూ కలిసి.. ఊళ్లు సాలవన్నట్లు మన అడవుల మీద పడ్డరు. కొండలు, గుట్టలల్ల పచ్చటి చెట్లలల్ల దొరికే ప్రకతి సంపదను నమ్ముకుని బతికేటోళ్ల మీద జులుం జేసిండ్రు. అప్పటికే ఊళ్లను నాశనం జేసిండ్రు. ఇగ ఇప్పుడు అడవి బిడ్డల గూడేలనూ నాశనం జేసుడు మొదలు వెట్టిండ్రు. జంగలంతా మాదే.. మేం జెప్పినట్లే మీరినాలె అంటూ పెద్దరికం షురూ జేసిండ్రు. ఇననోళ్లను సంపతందుకూ ఎనిక్కి రాలేదాళ్లు. తెల్లోళ్లు, ఈ పట్నమొళ్లు మనల్ని ఖతం చేయతందుకు అచ్చిండ్రని అందరూ గుబులు వడ్డరు. అప్పటికే ఎక్కడోళ్లక్కడ అడివిని ఇడిసిపెట్టి పోతందుకు సిద్దమైండ్రు. గప్పుడు నాకనిపిచ్చింది. దేశమంతా మాదేనని అచ్చినోళ్లు.. మనం ఇంకోకాడికి పోతే రాకుండా ఉంటరా.. అని. అంతే.. ఒక్కటే అనుకున్న పుట్టిపెరిగిన ఊరును.. ఆడిపాడిన అడివిని ఇడిసిపెట్టేది లేదు. పాణమున్నదాకా ఇన్నే ఉండుడు. అంతే ఇగ.. తెల్లోళ్లను, హైదరబాదు నవాబులను ఎదిరించాలని గట్టిగ అనుకున్నం. ఇందుకు గూడేలను, ఊళ్లను ఏకం జేసే పని మొదలువెట్టినం. అందరు గలిసి నన్నే నాయకుడని ముందట నిలవెట్టిండ్రు. నావోళ్ల కోసం.. ఈ భూమాతకోసం.. పాణాలిచ్చేతందుకైనా సిద్ధమని ముందటికచ్చిన. ఇగ మన ఊళ్లమీదికి.. గూడేల మీదికి.. అడివిమీదికి అచ్చినోళ్లు ఓళ్లైనా కొట్లాడుడే. మరి.. ఆళ్ల దగ్గర్నేమో తుపాకులు, పిరంగులు, పిస్తోళ్లున్నయ్‌. ఆళ్ల తోటి కొట్లాడాలంటే మాదగ్గర తుపాకుల్లేవు.. పిరంగులూ లేవు. ఉన్నవల్ల బరిసెలు, బాణాలు.. వొడిసెలు.. అంతకుమించి గుండెల నిండా అడివితల్లి మీద.. ఈ భూమి మీద ప్రేమ. యాడికెళ్లో దూరదేశం నుంచి అచ్చినోళ్లు.. మా అడివిల జులుం జేసుడేంది.. మా భూతల్లిని చెరవట్టుడేంది.. మా మానపాణాలతోని ఆడుకునుడేందన్న కసితోనే ఉన్నం. ఉట్టి చేతులతోనే సంపెత్తం కొడుకులని.. అని మా గోండువీరులంటుంటే నాకు మస్తు ధైర్యమొస్తుంది. మేమంతా ఒక్కటైనట్లు గా నవాబులకు.. గా తెల్లోళ్లకు తెలిసింది. ఇగ నిమ్మల కలెక్టర్‌ మా మీదికి సైన్యాన్ని పంపిండు. ఇగసూడు.. ఆ సైనికులకు అడివిల సుక్కలు సూపెట్టినం. గుట్టల మధ్యల, చెట్ల నడుమల దాక్కుంటా ఒక్కొక్కళ్లను ఖతం జేసినం. మావోళ్లు అన్నట్లే.. ఉట్టి చేతులతోనే చిరుతపుల్లుల్లెక్క ఆంగ్లేయులు.. అప్పటి హైదరాబాద్‌ రాజు సైనికుల మీదవడి మట్టుబెట్టిండ్రు. దీంతోటి ఆళ్లకు మామీద మరింత కోపమొచ్చింది. ఇగ ఈళ్లను ఇడిసిపెట్టదని కలెక్టర్‌ ఈసారి మస్తుమంది సైన్యాన్ని, తుపాకులనిచ్చి పంపిండు. మేం ఒక్కతాట ఉంటే దొరికి పోతమని నిమ్మల సుట్టూ ఉన్న అడివిల తలోదిక్కు పోయినం. గుట్టలు.. గోదావరి నదిని ఆసరాగా చేసుకుని ఆళ్లమీద పోరాటం జేసినం. ఈ పోరుల మావోల్లు కూడ పాణాలు ఇడిసిండ్రు. అయినా ఒక్కళ్లు గూడ పారిపోలే. ఒకటిగాదు.. రెండుగాదు.. నెలలకు నెలలు ఆళ్లకు సుక్కలు సూపెట్టినం. మస్తుమందిని మట్టుబెట్టినం. అడివి బిడ్డలమైన మమ్మల్ని జంగల్‌ల సంపుడు కష్టమని నిమ్మల కలెక్టరు గుర్తువట్టిండు. మస్తు సోంచాయించి.. మా మీద దొంగదెబ్బ కొట్టిండు. అట్ల మమ్మల్ని దొరకవట్టిండు. కసిదీరా.. మమ్మల్నందరినీ కొట్టుడు కొట్టిండ్రు.. ఇళ్ల సావును జూసి.. ఇగ ముందు మనకోళ్లు ఎదురురావద్దని.. ఒకళ్లం కాదు.. ఇద్దరం కాదు.. వెయ్యిమంది అడివి బిడ్డలను..
నిమ్మలకెళ్లి ఎల్లపల్లికి వోయే దారిల ఉన్న పెద్ద మర్రిచెట్టుకు ఉరిదీయుమని కలెక్టరు ఆదేశించిండు. నన్నైతే మస్తు కొట్టిండ్రు.. నువ్వేగదా ఇళ్లందరికి నాయకుడంటూ కాళ్లుచేతులు ఇరిగేదాకా కొట్టిండ్రు. అందరినీ మర్రిచెట్టుకాడికి దీసుకపోయి.. ఒక్కపారే వెయ్యిమందికి *ఉరితాడేసి బిగించిండ్రు.. అయినా మేం ఏడలే.. గింతగూడ భయపడలె.. బాధపడలె.. ఎందుకంటే మేం మా భూతల్లి పరాయిదేశమొళ్లకు బానిసకావద్దని ధర్మపోరాటం జేసినం. ఆ అమ్మకోసం పాణాలిచ్చెతందుకైనా సిద్ధమని ముందే అనుకున్నం. అందుకనే నవ్వుకుంట ఆ భారతమ్మ కోసం ఉరితాళ్లకు వేలాడినం. తాడు మెడకు బిగిసిన కొద్ది.. పాణం మెల్లగ పోతున్న కొద్ది.. అనిపిచ్చింది.. అమ్మా.. ఇంక జన్మంటూ ఉంటే నీ బిడ్డగనే పుట్టాలె అని. మా ఊపిరి ఆగిన పర్వలే.. మా పాణాలు పోయిన పర్వలే.. మా అడివి మావోళ్లకే ఉండాలె.. మా భారతమ్మ మాత్రం బానిస కావద్దని అనుకుంటనే కొనపాణాలనూ ఇడిసినం.*
         మా పీడ విరగడైందని తెల్లోడు.. హైదరబాదును ఏలేటోడు.. అనుకున్నా.. మా చావు మాత్రం మస్తుమందికి ఆదర్శమైంది. జల్‌.. జంగల్‌.. జమీన్‌ మాదేనంటూ ఆళ్లు చేసిన అఘాయిత్యాలు అన్నీఇన్నీ కావు. వీటిని ఎదిరించేంతందుకు మళ్ల కొన్నేళ్లకే మా అడివిలో పుట్టిన పులిబిడ్డ కుమ్రంభీముడు తుపాకులు చేతపట్టిండు. నిజామొడి మీదికి లగించి ఉరికిండు. జల్‌.. జంగల్‌.. జమీన్‌ మీద మీకెందిరా హక్కు అని ఆ పిశాచిని ముప్పతిప్పులు వెట్టిండు. ఆ పులిబిడ్డనూ ఎదుర్కొనే దమ్ములేక దొంగదెబ్బ తీసే సంపిండ్రు. అప్పుడు మస్తు బాధపడ్డ. కని.. మా పాణత్యాగాల తర్వాత భీముడు అస్తే.. కుమ్రం పాణమిడిసినంక ఎంతోమంది వీరులు పుట్టుకొచ్చిండ్రు. దేశమంతటా.. భగత్‌..ఆజాద్‌.. నేతాజీ.. అల్లూరి.. ఇట్ల ఎంతోమంది మాలెక్కనే పాణాలను తల్లి కోసం ఇడిసిండ్రు. మా అసుంటి అమరుల పాణత్యాగాలతోని దేశమంతట 1947 ఆగస్టు 15న తెల్లోడి నుంచి స్వతంత్రమొచ్చింది. కని.. మన హైదరబాద్‌ల ఉండే నిజాము మాత్రం కుర్సి ఇడిసిపెట్టకుండ.. రజకార్లతోని మస్తు అఘాయిత్యాలు జేసిండు. ఆళ్ల మీద మన స్వతంత్ర సమరయోధులు మస్తుమంది కొట్లాడిండ్రు. అప్పటికీ నిజామొడు ఇనలే. ఇగ గప్పుడు దేశానికి హోంశాఖ మంత్రిగ ఉన్న పెద్దమనిషి సర్దారు వల్లభభాయ్‌ పటేలే సైన్యాన్ని ఎంటేసుకుని హైదరబాదుకు అచ్చుడు షురూ జేసిండు. ఆ సైన్యం దగ్గరికి రాంగనే.. గప్పుడు నిజాముకు బుగులు వడ్డది. దెబ్బకు 1948 సెప్టెంబర్‌ 17రోజున తానే గా ఉక్కుమనిషి పటేల్‌ తాటికి వోయి.. వంగి వంగి సలాములు వెట్టి హైదరబాదును అప్పజెప్పిండు. గప్పుడు గా నిజాం పిశాచం నుంచి మనకు విముక్తి లభించింది. గా రోజునే.. తెలంగాణ విమోచన దినంగా జరుపుకుంటున్నం. సమజైంది గదా.. మనకెట్ల స్వతంత్రమొచ్చిందో.
 *అవ్‌ గన్ని* ..
ముచ్చట్ల వడి సెప్పుడు మర్సిన. ఓసార్లు.. ఓ పెద్దలు.. ఓ పిల్లగాండ్లు.. జర మా గురించి పట్టించుకోండ్రి. మమ్మల్ని ఉరిదీసిన మర్రిచెట్టు ఎప్పుడో గాలికి పడిపోయింది. గాడ ఏదో మ్యూజియం.. అమరధామం.. కడతమన్నరు.. ఇప్పటిదాకా దిక్కులేదు. అప్పట్ల తెలంగాణ ఉద్యమంల ఓ స్థూపమైతే కట్టిండ్రు. చైన్‌గేట్‌ కాడ నా బొమ్మ పెట్టిండ్రు. కని.. అప్పటికెళ్లి పట్టించుకునుడు మాత్రం మరిసిండ్రు. నా బొమ్మకాడ సూడుండ్రి ఎట్లుంటదో.. సుట్టూ బండ్లు వెడతరు. నా పక్కనే బజ్జీలు అమ్ముతరు. నా దిమ్మె మీద కూసోనే మందు కొడతరు. ఏం జెప్పాలె.. నాబాధ.. జర ఇప్పటికైనా పట్టించుకోండ్రి సార్లూ. సరే ఇగ పోయస్తా.. ఏదో విమోచనదినం గదా అని అప్పటి ముచ్చట్లన్నీ జెప్పిన గంతే.. నమస్తే.’’

( ఈసారైనా పాలకులు.. అధికారుల మనసు కరిగి, మన కోసం ప్రాణాలు అర్పించిన ఆ వీరుల స్మారకాలను గుర్తించి, కనీసం ఒక రూపం ఇవ్వాలని.. రాంజీగోండు విగ్రహం మందుబాబులకు అడ్డాగా కాకుండా చేయాలని ఆశిస్తూ..)
- ఓ నిర్మల్ వాసి..
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Gondwana Kabur