Followers

Tuesday, May 19, 2020

ఓ సీడం శంభు సూర్యుడివై ఉదయించవా! |Gondwana Channel|

ఓ సీడం శంభు సూర్యుడివై ఉదయించవా!
ఓ సిడం శంభు సింహమువై వెలిసినవా!
ఓ సిడం శంభు పులివై గాండ్రించినవా!
ఓ సిడం శంభు 1/70 కి సాధనము అయినవా!
ఓ సిడం శంభు పొడుభూముల పట్టాలకు పోరాడినవా!
ఓ సిడం శంభు నిరుద్యోగులకు నిర్భయము నిచ్చితివా!
ఓ సిడం శంభు ఆదివాసీ సంస్కృతికి నిలయమైతివా!
ఓ సిడం శంభు గుస్సాడీ నృత్యానికి వన్నె తెస్తీవా!
ఓ సిడం శంభు డెంసా నృత్యానికి నీడనైతివా!
ఓ సిడం శంభు ఆదివాసీల గడిలకు జెండాలను ఎగరవేసినవా!
ఓ సిడం శంభు వన్య దేవతల ధరిత్రి రక్షణకు పునుకుంటివా!
ఓ సిడం శంభు ఏజెన్సీ ఎలుటకు రాజువైనవా!
ఓ సిడం శంభు ఇంద్రవెల్లి అమరులకు పునర్వైభవము  కల్పించినవా!
ఓ సిడం ఆదివాసీ లోకం అంత నాది అన్నావు!

ఓ సిడం శంభు ఆదివాసుల గోస నీ గోస అయిందా!
ఓ సిడం శంభు ఆదివాసీ బిడ్డవై అస్తిత్వాన్ని నిలిపవా!
ఓ సిడం శంభు కుంరం భీము నిన్ను చూసి గర్వపడెన్.
ఓ సిడం శంభు తెల్లటి ధోతి రుమాలు చూసి అడవి తల్లి పక పక నవ్వేన్. 
ఓ సిడం శంభు అనేక ఉద్యమాలకు పురుడు పోసినవా!
ఓ సిడం శంభు రక్తాన్ని రక్తి కట్టించి ఉద్యమించవా!
ఓ సిడం శంభు పిడికిలి బిగించి జై కొట్టినవా!
ఓ సిడం శంభు నీ కలం నుంచి జాలు వారెను రత్నాలూ.
ఓ సిడం శంభు జంగుబాయి నీ కుడి భుజాన నిలిచిందా!
ఓ సిడం శంభు నీవు శ్రీ శంభు మహాదేవునివా ఇది సత్యం, ఇది సత్యం.
ఓ సిడం శంభు నిన్ను మరవదు, నిన్ను మరవదు ఈ జాతీ.
ఓ సిడం శంభు నీ కీర్తి స్థిరమై నిలుచు నిండు గౌరవము పొందే నీ జాతి.
మంగం విశ్వం.ఎం. ఏ. ఎం.ఫీల్.పిహెచ్. డి.ఆంత్రోపాలజీ.

No comments:

Post a Comment

Thank you So Much for your Useful Suggestion..!!