Followers

Sunday, May 31, 2020

ఆదివాసీ గూడలో విజంగ్ మోహుతుర్ (విత్తనాల) పండుగ సంబరాలు |Gondwana Channel|

ఆదివాసీ గూడలో విజంగ్ మోహుతుర్ (విత్తనాల) పండుగ సంబరాలు
  ఆదివాసీల సంప్రదాయం తాత ముత్తతల నుండి వస్తున్న ఆచారమే విజంగ్ మోహుతుర్  (విత్తనాల ) పండుగ .. మోహుతుర్ పండుగ  రోజున  గ్రామ ప్రజలంతా  వేకువ జామున నుంచి ...ఎవరికి వారు పండుగకు నైవేద్య వంటలు సురు చేస్తారు...చెను పనిముట్లు తుతరి(సూతరి),గొడ్డలి,మరియు కొడవలిని కుడి భుజం వైపు పట్టుకొని మరియు ఇంటి కోడలు నెత్తి పైన టోప్లి(అంచె)మోస్తూ అందులో  జొన్న ఘాట్కా దంచిన ఎర్రకారం మెదుగు ఆకులు..పూజ సామాన్ (కుంకుమ.అగర్ బత్తి.ధూప్.కోబ్బరి కాయ).తీసుకొని ఎవరికి వారు తమ చేనుకి  కుటుంబ సమేతంగా   వెళ్లి పూజలు చేస్తారు విజంగ్ మోహుతుర్ అంటే విత్తనాలు వేసేముందు మంచిగా  పంట పండలని మోహుతుర్కు నాలుగు రోజుల ముందు నుండి గ్రామ శివారు లోని ఉన్న అకింగ్ మడకేక్,అవ్వాల్, గండి అవ్వాల్ , మొతిగూడా అవ్వాల్, మాటం,డేమల రాజుల్క్,భీమల్ పెన్క్ ,కిడపకిండి. సిడయింగ్ పోరాయింగ్,  అన్ని దేవులకు పూజలు చేస్తారు .మోహుతుర్ దేవులు అయితే ...మోహతుర్ దినం మొత్తం ఉరులో ఉన్న వాళ్ళు అందరూ ప్రతి ఇంటికి వెళ్ళి ..మతరి ..మతరల్ తో కలసి భోజనం  చేస్తారు...తర్వాత మధ్యాహ్నం  నుండి బుర్రో తుప్పో  (బంతి బండల) ఆట సాయంత్రం వరకు చిన్న పెద్ద అడుతారు..  ఊరులో  పెళ్లిలు ఇతర శుభ కార్యక్రమాలు  అన్ని..మోహుతుర్ నుండి బంద్ ..తర్వాత చెనుపనులొనే ఉండాలని  అర్థం....తార తరాల నుండి వస్తున్న తాత ముత్తతల  ఈ ఆచారం ఇలాగే కొనసాగించాలని యువత మరిచి పోకూడదని కోరుకుంటున్నం.. కనక.ప్రతిభ వెంకటేశ్వరరావు...గ్రామము. మర్లవాయి.మండల:జైనూర్. కుంరం భీం జిల్లా.





1 comment:

  1. చెప్పడమే కాదు ఆచరించి చూపిస్తున్నారు కనక ప్రతిభ వెంకటేశ్వర్ గార్లకు అభివందనములు

    ReplyDelete

Thank you So Much for your Useful Suggestion..!!

Note: Only a member of this blog may post a comment.

Gondwana Kabur