Followers

Saturday, May 9, 2020

రాజకీయాల్లో నిజమైన ప్రజాసేవ చూపించిన సీతక్క. సలాం సీతక్క |Gondwana Channel|

మంది లేరు
మార్బలం లేదు

మ్యాచింగ్ చీర ,
దానికి తగ్గట్టు బ్లౌజ్ లేదు,

ఎత్తు తక్కువని
హై హీల్స్ వేసుకోవాలనే తపన లేదు

రంగు నలుపే ఐనా
ఇంచుమందం మేకప్ లేదు

రిబ్బన్ కట్ చేయాలన్న కోరిక లేదు
పూలు చల్లించుకోవాలన్న కోరిక లేదు, తీరికా లేదు
నాలుగు ప్యాకెట్లు పంచి పోస్ట్ లు పెట్టే లేకితనం లేదు
మరేముంది అంటే......

అడవి బిడ్డలను ఆదుకోవాలనే తపన ఉంది

అన్నార్థులకు ఆప్యాయత పంచే అమ్మతనం ఉంది

ఎర్రటి ఎండల్లో , రాళ్ళ దారుల్లో,
దట్టమైన అడవి మార్గాల్లో
నడిచే సాహసం ధీరత్వం ఉంది
అన్నింటికీ మించి పేద ప్రజలకు అడవిబిడ్డలకు సేవ చేయాలన్న మంచితనం ఒక్క
*సీతక్కకే ఉంది*

అడవి బిడ్డలను ఏ కష్టంలోనైనా ఆదుకుంటుందన్న నమ్మకం ఉంది
అదే ఆ అడవి బిడ్డలకు కడుపు నింపుతోంది..
...కొంతమంది ప్రచారం కోసమే
బుగ్గ( Escort ) కార్లు, ఎన్ 95 మాస్కులు గ్లౌజ్ లు  వేసుకుని
"కరోనా" ఫోజులు కొట్టే నాయకులకు, జుట్టు చెదరకుండా, గాగూల్స్ తీయకుండా సేవ చేసే నాయకురాళ్లు మిమ్మల్ని చూసి కొంతయినా ..........  తెచ్చుకోవాలని కోరుకుంటూ..

సలాం🙏🙏🙏🙏🙏🙏 సీతక్క
నీలాంటివాళ్ళు నూటికో కోటికో  ఉంటారు.
LEGEND సీతక్క.

 రాజకీయాల్లో నిజమైన ప్రజాసేవ చూపించిన సీతక్క.
(వాట్సాప్ మేసేజ్)

No comments:

Post a Comment

Thank you So Much for your Useful Suggestion..!!

Note: Only a member of this blog may post a comment.

Gondwana Kabur