Followers

Sunday, May 31, 2020

ఆదివాసీ అన్నలరా అక్కలరా |Gondwana Channel|

ఆదివాసీ అన్నలరా అక్కలరా
ఆదివాసీ అన్నలరా అక్కలరా.
కూలికెళ్తే గాని కూడు దొరకదాయే
వెటకెళ్తే గాని వంట లేదాయే
చేపలు పడితే గాని పస్తులుండయే
గొడ్లు గాస్తే గాని గోస పొదయే.
మేకలు మెప్తే గాని పొట్ట నిండదయే
జీతం ఉంటే గాని జీవితం మారాధయే
ఇసుక మొస్తే గాని ఇల్లు గడవదాయే
ఇటుక మొస్తే గాన్ని పొయ్యి వెలుగాదాయే
మెస్త్రి పని చేస్తే గాని మెతుకులు దొరకాయయే
వడ్ల పని చేస్తే గాని వంట లేదాయే
ఇప్ప పువ్వు ఏరితే గాని బతుకు లేదాయే
తేనె తెస్తే గాని తిండికి తిప్పలు
కట్టెలు మొస్తే గాని కడుపు నిండదయే
తడకలు తట్టితే గాని చల్లటి అన్నం లేదాయే
తునికి పండ్లు తెస్తే గాని తిండికి లేకపోయే
మొర్రి పండ్లు తెస్తే  గాని  మూడు మూళ్ళ బంధం సాగుణయే
తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఏమి సంబరం
రాష్ట్రం వచ్చిందని గర్వపడల, సంబరాలు చేయాలా
ఏది సమానత్వం ఏది సమానత్వం?
రాష్ట్రం తెచ్చిన తంటాలు అంత ఇంత కాదు.
ఆదివాసీల బతుకులు చిన్న భిన్నం
అయోమయం అయోమయం
ఏది ఆర్థిక స్వాతంత్రం?
ఏది రాజకీయ స్వాతంత్రం?
ఏది సంస్కృతిక స్వాతంత్రం?
ఏది సామాజిక స్వాతంత్రం?
ఏది భాష స్వాతంత్రం?
ఏది మత స్వాతంత్రం?
కోయ రాష్ట్రమే పరిస్కారం
కోయ రాష్ట్రమే పరిస్కారం.
ఆదివాసీ అన్నలరా అక్కలరా
ఆదివాసీ అన్నలరా అక్కలరా.

మంగం విశ్వం.ఎం. ఏ. ఎం. ఫీల్.పిహెచ్. డి.ఆంత్రోపాలజీ. పాండిచేరి సెంట్రల్ యూనివర్సిటీ. Anthropological society of participation in intensive & indigenous research for empowerment.General secretary.Telangana.
ఆదివాసీ సాహిత్య సంఘం.

No comments:

Post a Comment

Thank you So Much for your Useful Suggestion..!!