Followers

Saturday, May 23, 2020

ఓ కుంరం భీముడా ! |Gondwana Channel|

ఓ కుంరం భీముడా !
ఓ కుంరం భీముడా !
ఓ కుంరం భీముడా
ఓ వీరుడా! 
ఓ ధీరుడా! 
ఓ సూరుడా!
భువిలో వెలిసిన రత్నమా!
 భువిలో వెలిసిన సింహమా!
 భువిలో వెలిసిన దేవతా!
పచ్చని అడవిలో పులివై
పచ్చని అడవిలో పులివై
పచ్చని అడవిలో పులివై.
కొండ కోనాలో కోయిలవై
కొండ కోనాలో కోయిలవై
ఆదివాసీల దాహమే దహించెను నిన్ను
ఆదివాసీల దాహమే దహించెనునిన్ను.
అదివాసులకు ఆడవే ఆస్తి అని ఆలమట్టించావు
అదివాసులకు ఆడవే ఆస్తి అని ఆలమట్టించావు.
నరులకు నీరే ప్రాణం అని నర్తించావు
నరులకు నీరే ప్రాణం అని నర్తించావు.
గిరిపుత్రులకు సేద్యమే స్వర్గం అని కలగన్నావు
గిరిపుత్రులకు సేద్యమే స్వర్గం అని కలగన్నావు.
ఆదివాసీల ఆకలి కేకలే 
అడవిలో మోగేను శంఖారావం
ఆదివాసీల ఆకలి కేకలే అడవిలో మోగేను శంఖారావం.
తపించి మెపించి
తపించి మెపించి
సల సల మండెను నీ హృదయం
 సల సల మండెను నీ హృదయం.
సోంబాయి నీకు రథసారథి 
సోంబాయి నీకు రథసారథి.
ఎడ్ల కొండల్ నీకు కొండంత అండా
ఎడ్ల కొండల్ నీకు కొండంత అండా.
కొలం సురు కొత్వాలై నీకు కుడిభుజాని తట్టే
కొలం సురు కొత్వాలై నీకు కుడి భుజాని తట్టె.
ఆదివాసీల ముక్తికి రక్తాన్ని ధరపోసావు
ఆదివాసీల ముక్తికి రక్తాన్ని ధరపోసావు.
నీ సైన్యం కోయ  కొలం నాయకపోడు 
నీ సైన్యం కోయ కొలం నాయకపోడ్.
నీ మాటే శాసనం
నీ మాటే శాసనం
నీ ఆయుధం తుపాకీ, గొడ్డలి,కత్తి,కొడవలి
నీ ఆయుధం తుపాకీ,గొడ్డలి, కత్తి, కొడవలి.
నిజం సైన్యం తో యుద్ధం
నిజం సైన్యం తో యుద్ధం.
తల వంచేను నిజం రాజ్యం
తల వంచేను నిజం రాజ్యం.
రౌట సంకేపల్లి లో ఉదయించావు
రౌట సంకేపల్లి లో ఉదయించావు.
జోడెన్ ఘాట్ లో అస్తమించావు
జోడెన్ ఘాట్ లో అస్తమించావు.
కోయ రాజ్య స్వాతంత్ర్యనికి
కోయ రాజ్య స్వాతంత్ర్యనికి
ఆజ్యం పోశావు ఆజ్యం పోశావు.
కోయ రాజ్యానికి రాజువు
కోయ రాజ్యానికి రాజువు.
అదివాసులని ఆకాశానికి ఎత్తినవు
ఆదివాసులని ఆకాశానికి ఎత్తినవు.
గల గల పారేను సెలయేర్లు
గల గల పారేను సెలయేర్లు
నీ ఊపిరి ప్రపంచానికి పాఠం
నీ ఊపిరి ప్రపంచానికి పాఠం.
మంగం విశ్వం.ఎం. ఏ. ఎం. ఫీల్.పిహెచ్. డి.ఆంత్రోపాలజీ. పాండిచేరి సెంట్రల్ యూనివర్సిటీ. Anthropological society of participation in intensive & indigenous research for empowerment.General secretary.Telangana.
ఆదివాసీ సాహిత్య సంఘం.

https://www.cutebabyvote.com/june-2020/?contest=photo-detail&photo_id=28438

No comments:

Post a Comment

Thank you So Much for your Useful Suggestion..!!