Followers

Wednesday, May 20, 2020

గిరిజనుల హోలీ పండుగ |Gondwana Channel|

  • గిరిజనుల హోలీ పండుగ
గిరిజనుల హోలీ పండుగ ఊరు గ్రామ ప్రజలు కలిసి కూర్చొని అయ్యే ఖర్చు అంత మాట్లాడుకుని తల ఇంటికి కొంత డబ్బులు జమ చ్చేయడం జరుగుతుంది.హోలీ పండుగ అంటే సాంఘీక కట్టు బట్టుకు అలాగే ఒక గ్రామము ఎలా నీతి నియమాలు గ్రామ ప్రజలు ఎలా ఉండాలో ముందే  నిర్ణయం తీసుకుంటారు. గ్రామంలో లో కొత్తగా వచ్చే వారు ఈ రోజు రావాల్సి ఉంటుంది. కొత్తగా పెళ్ళి అయి కొత్త కాపురం పెట్టె వారు కూడా సారా అంటే డబ్బులు మరియు ఎండు రెండు కూడకలు ఇవ్వడం ఇస్తారు. గ్రామ ప్రజలు అడవికి వెళ్లి వెదురు బొంగులు రెండు నరికి ముసలి ముసలోడు గా తీసుకొస్తారు.ఒక తాడక ఆగ అల్లి ఐదు భాగాలలో కొత్త తాడు అల్లి ఆ తాడుకి ప్రతి ఇంటి నుంచి తీసుకెచ్చిన కడుకలు కడుతారు. ఉల్లి,గారెలు,మోదుగ పూలు, కడుతారు.ఒకటి తల్లి,తండ్రి వెదురు కీ కడతారు.దోల్ వాయిద్యాలు డప్పులు వాయిస్తారు.ప్రతి ఇంటి నుంచి కట్టెలను సేకరిస్తారు. గ్రామ పటేల్ ఇంట్లొ అన్ని తయారు చేస్తారు.గ్రామ దేవరి లేదా పటేల్ నుంచి నైవేద్యం తయారు చేసి ఊరు బయట డోలు వాయిద్యాలు వాయిస్తూ వెళ్తారు. రెండు  రంద్రాలు గా తవ్వి నిలువుగా ఉంచుతారు.చుట్టు కట్టెలు వేసి దహనం చేస్తారు. రంద్రానికి పప్పు, సక్కరి,కొబ్బరి,గుడ్లు నైవేద్యం అర్పణ చేస్తారు.ముందుగా గా తల్లీ వెదురు దహనం అయితే మహిళల పని బాగా కొనసాగుతుంది.లేదా. తండ్రి వెదురు ముందు దహనం అయితే మగవారి పనులు ముందు గా బాగా జరుగుతాయి. దహనం అయ్యే సమయం లో రెండు వైపులా నుంచి దునుకుతారు. దహనం ఆయన వెదురలను ఒక దగ్గరి చెట్టు వరుకు పరుగెలుతూ వెళ్లి వచ్చి పూర్తిగా మంటలో వేస్తారు.వెదురు కట్టబడిన పదార్థాలు తీసుకుంటారు. ఇంట్లో తీపి తో చేసినా రొట్టెలు చపతిని తీసుకొచ్చి దహనం చేయబడ్డ స్థలం లో అర్పిస్తారు.అందరూ కలిసి బొంచేస్తారు. రాత్రి ప్రతి ఇంటికి వెళ్లి జొన్నలు, మొక్క జొన్న, కంది మొదలగు ధాన్యాల సేకరిస్తారు.సేకరించిన ధాన్యాన్ని గూడలు గా చేసి ఉంచుకుంటారు.రాత్రి కబ్బడి అడుతారు డప్పులు వాయిస్తూ అడుతారు సూర్యోదయం అయిన తర్వాత ప్రతి ఒక్కరు గూడలను పంట చెనుకు తీసుకెళ్లి నైవేద్యం గా సమర్పిస్తారు.
 అందరూ కలిసి గూడలు, జొన్న ఘాట్కా వంకాయ కూర కలిపి బొంజేస్తారు.దహనం చేసిన బూడిదను గ్రామ దేవతలకు అర్పిస్తారు. అవ్వల్ పెన్,అకి పెన్, మొదలగు దేవతలకు దర్శించి బూడిదను అర్పిస్తారు.ముందుగా గ్రామ పెద్ద పటేల్ ఇంటికి వెళ్లి బూడిద,కుడుకలు ఇస్తారు. ఇంటి వారు డబ్బులు ధన్యలు ఇస్తారు.ఆలా ప్రతి ఇంటికి డోలు ,డప్పులు వాయిస్తూ వెళ్లి బూడిదను కూడకలను ఇస్తారు. అంత అయిన తర్వాత ఎన్ని డబ్బులు ,ధన్యలు సేకరించారో వాటిని లెక్కించి ఉగాది పండుగకు గూడలకు ఉంచుతారు. సాయంత్రం కానీ ఉదయం కానీ అన్నం గారెలు చేసి తమ దేవతలకు అర్పించిన తర్వాత బొంచేస్తారు.ఇలా గిరిజన హోలీ పండుగను ముగిస్తారు.

మంగం విశ్వం.ఎం. ఏ. ఎం. ఫీల్.పిహెచ్. డి.ఆంత్రోపాలజీ. పాండిచేరి సెంట్రల్ యూనివర్aసిటీ. Anthropological society of participation in intensive & indigenous research for empowerment.General secretary.Telangana.
ఆదివాసీ సాహిత్య సంఘం.

No comments:

Post a Comment

Thank you So Much for your Useful Suggestion..!!

Note: Only a member of this blog may post a comment.

Gondwana Kabur