జీఓ నం.3ని సంరక్షించాలని, సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వెయ్యలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి వినతి.
హైదరాబాద్: ఈరోజు అనగా తేదీ.02:06:2020.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి శుభసందర్భంలో జీఓ నంబర్ 3ను సంరక్షించాలని, సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వెయ్యలని విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి వినతిపత్రం సమర్పిస్తున్న కుంరంభీము జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గ బడుగు బలహీన అన్నివర్గాల ఆశాజ్యోతి శాసనసభ్యులు గౌరవ శ్రీ ఆత్రం సక్కు గారు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రాష్ర్ట ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసి ఆదివాసులను ఆదుకోవాలని కోరారు.అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీలు సాగు చేస్తున్న అటవీ భూములపై, ఆదివాసీల అభివృద్ధి, విద్య, వైద్యం, వ్యవసాయం, అంశాలను సుదీర్ఘంగా ముఖ్యమంత్రి గారితో చర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ గారు, రాష్ట్ర DGP శ్రీ మహేందర్ రెడ్డి గారు , ప్రణాళిక సంఘము వైస్ చైర్మన్ శ్రీ వినోదకుమార్ గారు, ప్రభుత్వ సలహాదారులు శ్రీ రాజీవ్ శర్మ గారు, రైతు బంధు రాష్ట్ర చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment
Thank you So Much for your Useful Suggestion..!!
Note: Only a member of this blog may post a comment.