Followers

Saturday, August 31, 2019

పోరాట వారసత్వం

పోరాట వారసత్వం

రాంజీ గోండ్  పోరాట వారసత్వం మన రక్తంలో ఉంది.

కొమురంభీం పోరాట వీరత్వము మన శ్వాసలో ఉంది.

సమ్మక్క- సారక్కల స్వయంపాలన పోరాటం మన గుండెల్లో కొలువై ఉంది.

సోయం గంగులు పోరాట అగ్ని జ్వాల ఇంకా రగులుతూనే ఉంది.

జల్,జంగిల్ జమీన్ కొరకు పోరాడుతున్నది ఆదివాసీలు...ఆదివాసీల మహోన్నత ఉద్యమ అమర వీరుల పోరాటాల త్యాగాల ఫలితమే  రిజర్వేషన్

ఆదివాసీల రిజర్వేషన్ ను చట్టబద్దత లేని అక్రమ వలస వాదులకు అప్పగించడానికి మేం... సిద్ధంగా లేం
మేం... ఉద్యమానికి సిద్ధం
మేం యుద్దానికే సిద్ధం
జై  కొమురంభీం
జై ఆదివాసీ

దండారి(కైతికలు) త్వరలో విడుదల Gondwana Channel

దండారి(కైతికలు) త్వరలో విడుదల

త్వరలో మీ ముందుకు వస్తున్న కావ్యం దండారి(కైతికలు)
'రచన'
ఆత్రం మోతీరాం
'పుస్తక ముద్రణ' దుర్వ సంతోష్ కుమార్*
హైమాన్ డార్ఫ్ లైబ్రెరీ ముత్నూర్.

మోతీరాం! ఎవరిచ్చారు నీకు ఇన్ని అక్షరాలు...
అక్షరాల వెనుక ఇన్ని అర్థాలు...
ఎ దేవతా ఇచ్చిందో ఇన్ని వరాలు.... విప్పి నేను చెప్పలేను ఆ వివరాలు... అక్షరాలు కావవి జంగుబాయి ఆశీర్వాదాలు.!!

      నాటి రామకథను రాముని బిడ్డలైన లవ-కుశులు చెప్పారు. ఈ దండారి కథలను జంగుబాయి దేవత బిడ్డ ఐన ఆత్రం మోతీరాం చెపుతున్నాడు.
చేసే ప్రతి పనిలో ప్రాణం ఉంటుంది... ప్రతి ప్రాణానికి ఒక కథ ఉంటుంది.
ఈ దండారి కథలు ఎవరు చెప్పాలని రాసుందో, ఈ దండారి కథలకు వాల్మీకి ఎవరో నాకు అర్థమైంది. అతనే మోతీరాం ...
అందుకే ఆయన రచించిన ఈ కావ్యానికి ఒక రుపాన్ని ఇస్తున్నానని ఆనందంతో తెలియచేస్తున్నాను.
 ఇది మా ఇద్దరి కలయికలో మొదటి కావ్యం. మరో ఆఖండ విజయానికి అంకురార్పణ కావాలని ఆ జంగుబాయి దేవతను కోరుతున్నాను.
మీ అందరి అభిమానం మీ అందరి ఆశీర్వాదాలు మమ్ములను ఎల్లవేళలా నడిపించాలని ప్రతి నిమిషం మీ కుశలలను కోరుతూ
         
                                 మీ
              దుర్వ సంతోష్      హైమాన్ డార్ఫ్    లైబ్రెరీ,ముత్నూర్.

Friday, August 30, 2019

ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీశ్రీ పరమహంస సద్గురు పులాజిబాబా జయంతి

ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీశ్రీ పరమహంస సద్గురు పులాజిబాబా జయంతి

కుమ్రం భీం జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గం జైనూర్ మండలంలోని పట్నాపూర్ గ్రామములో ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీశ్రీ పరమహంస సద్గురు పులాజిబాబా గారి 95వ జన్మదిన వారోత్సావాలకు ముఖ్యఅతిథులుగా హాజరై భక్తులను ఉద్దేచించి మాట్లాడుతున్నా ఆసిఫాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు,అందరి ఆత్మబందువు,అన్నివర్గాల ఆశాజ్యోతి గౌరవ శ్రీ ఆత్రం సక్కు గారు మాట్లాడుతూ  చెడు వ్యాసనాలకు దూరంగా ఉండి భక్తి శ్రద్ధలతో ధ్యాన మార్గంలో అందరు నడవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎం ఎల్ సి పురాణం సతీష్ కుమార్ గారు, కుమ్రంభీము జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు గారు, జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ కోవ లక్ష్మీ గారు,ఆదిలాబాదు జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్  రాథోడ్ జనార్దన్ గారు, జిల్లా గ్రంధాలయ చైర్మన్ కనక యాదవ్ రావు గారు, ట్రస్ట్ చైర్మన్ ఇంగ్లే కేశవ్ గారు, మండల ప్రజాపరిష్ అధ్యక్షులు కుంర తిరుమల గారు, ఉపాధ్యక్షులు చిర్లే లక్ష్మణ్ యాదవ్ గారు, సిర్పూర్ యూ వైస్ ఎంపీపీ ఆత్రం  ప్రకాష్ గారు,  మాజీ ఎంపీపీ కొడప విమాలప్రకాష్ గారు, స్థానిక సర్పంచ్ కందరే బాలాజీ గారు, ఉమ్మడి అదిలాబాద్,కుమ్రంభీము జిల్లాల అధికారులు,అనాధికారులు సర్పంచులు,ఎంపీటీసీలు,ఎంపీపీలు పులాజిబాబా గారి భక్తులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.



నాయ‌క‌త్వ‌ం

*మ‌న‌లో మ‌న‌ నాయ‌క‌త్వ‌o ఆలోచ‌న‌లో మార్పు రావాలి.*

*ఎదుటి వారిని విమ‌ర్శిoచి......
నాయ‌కుడివి కాలేవు....!!*

*ఇత‌రుల‌ని కిoచ‌ప‌ర‌చి గొప్ప‌ వాడివి కాలేవు...!!*

*బుద్ది క్షీణిoచి మాట్లాడితే మ‌oచోడివి కాలేవు....!!*

*ఇత‌రుల‌ని అగౌర‌వ‌ప‌ర్చి మాట్లాడితే....నీ గౌర‌వ‌మే త‌గ్గుతుoది...!!*

*నీ గురిoచి నీవే గొప్ప‌లు చెప్పుకుoటే...లొట్టిపిట్ట‌ ముచ్చ‌ట్ల‌యిత‌యి..!!*

*ఎదుటివారిని అవ‌మాన‌ ప‌ర‌చే వాడు నాయ‌కుడెలా అవుతాడు.....???*

‌*న‌డిపిoచేవాడే నాయ‌కుడు కాని...విమ‌ర్శిoచి అవ‌మాన‌ ప‌ర‌చే వాడు ఎప్ప‌టికి నాయ‌కుడు కాలేడు...!!*

*ఎదుటోన్ని ప‌డ‌గొడితే మ‌న‌o నిల‌బ‌డ‌తామ‌ని భ్ర‌మ‌ప‌డడ‌o నీ మూర్ఖ‌త్వ‌మే అవుతుoది...*

*..................@ ఓ ఆదివాసీ ఇక‌నైన‌ జ‌ర‌ మార్చుకో నీ వైఖ‌రి ఆదివాసీ జాతికి మ‌oచిది@...................*

*మ‌న‌ ద‌ృక్ప‌ద‌oలో మార్పు రావాల‌ని ఆశిస్తూ ఆదివాసీ శ్రేయోభిలాషి*

*@క‌బ్బాకుల‌ ర‌వి ATF@*

జ్ఞానీ అంటే పూలజీ బాబా

జ్ఞానీ అంటే పూలజీ బాబా 

ఆజన్మాంతం పరోపకార చైతన్యం కోసం పరితపించి,
జన జీవితాల మార్పుకోసం    తన జీవితమే సందేశంగా చాటిచెప్పిన కర్మయోగి

భక్తి అంటే సామాన్యుడు అందుకోలేని కార్పోరేట్ రంగం కాదని నిరూపించి,
మనసును మస్తిష్కంపై  నియంత్రించడమే పరమాత్మ స్వరూపమని  చాటిచెప్పిన కాలజ్ఞాని

తోటి మనిషిలో దాగి ఉన్న సాటిలేని తపోశక్తిని వెలికితీసి విజ్ఞాన జ్యోతులు వెలిగించిన పరంజ్యోతి

ప్రాపంచిక సమరంలో
ఓ  సామాన్యుడిగానే కలియతిరుగుతూ నడుస్తున్న చరిత్రను మలుపు తిప్పిన
అసామాన్యుడైన మౌని

ధన ప్రభావానికి
తలొగ్గక
దైనందిన ప్రశంసలకు పొంగక
కీర్తి ప్రతిష్టతలు ఆశించక
మనలోనే వెలిసిన అసలైన  ఆధ్యాత్మికవాది

ఎం. మణి, ఆదిలాబాద్.

Thursday, August 29, 2019

దివంగత మాజీ మంత్రి 17వ వర్థంతి

దివంగత మాజీ మంత్రి 17వ వర్థంతి

కుంరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం,పిల్లల ఉద్యానవనం వద్ద దివంగత మాజీ మంత్రి కోట్నక భీంరావు గారి,17వ వర్థంతి సందర్భంగా స్మారక జెండా ఆవిష్కరణ పూజా కార్యక్రమాలో ముఖ్య అతిథిగా పాల్గొన్నా,ఆసిఫాబాద్ శాసనసభ్యులు గౌరవ శ్రీ ఆత్రం సక్కు గారు,మాజీ సర్పంచ్  మర్సుకోల సరస్వతీ గారు,జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కుంరం బాలు గారు,మాజీ ఎంపీపీ బాలేష్ గౌడ్ గారు,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మొహ్మద్ మునిర్ హైమద్ గారు, ఆత్రం భీంరావ్ కొలాం సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పెందుర్ సుధాకర్ పర్ధాన్ సంఘం జిల్లా అద్యక్షుడు,రిటైడ్ ఎంఈఓ శంకర్ గారు,కోట్నక శంకర్ గారు,మహిళా నాయకులు మంగ గారు,రాపర్తి కార్తీక్ గారు,శైలు గారు,తెలంగారావు గారు,ఆదివాసీ సంఘాల నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Friday, August 23, 2019

సోయం బాపురావ్ గారికి ఘనంగా సన్మానం ADIVASI CULTURE

సోయం బాపురావ్ గారికి ఘనంగా సన్మానం

మేడారం: ఆదివాసిల ఐక్యత తరుపున ఆత్మీయ అభినందన సన్మాన సభ ఘనంగా నిర్వహించారు, ముందుగా సమ్మక్క సారలమ్మ లకు సాంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి , ఆదివాసిల అన్యాయాని ఎదురించే ఆశాజ్యోతి, ఉద్యమ నాయకుడు, అదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ సోయం బాపురావ్ గారికి సన్మానించరు.
నేడు ఆదివాసిల సమస్యలు చట్ట సభలలో ప్రస్తావించడానికి నేను ఉన్నానంటు భరోసానిస్తూ అదివాసీలు అందరు ఐక్యంగా ఉండి ఉధ్యామించాలానీ పిలుపునిచ్చారు.
పార్లమెంటు సభ్యుడుగా ఎన్నికయిన తర్వాత మొదటి సారి మేడారం వచ్చిన శుభ సంధర్భంగా సోయం బాపురావ్ గారికి ప్రభుత్వ పాఠశాల విధ్యార్థినులు కోయ సంస్కృతి నృత్యంతో స్వాగతం పలికారు.


Wednesday, August 21, 2019

ఆదివాసీ సంస్కృతి పరిరక్షణ ||Gondwana Channel||

ఆదివాసీ సంస్కృతి పరిరక్షణ

నేటి పరిస్థితులలో "ఆదివాసీ సంస్కృతి పరిరక్షణ" కొరకు ఒక ప్రత్యేకమైన సమితి కాని సంఘం కాని అవసరం అని ఏర్పాటుకు సిద్ధం చేస్తున్నాము, మీ వంతుగా మంచి పేరు సూచించండి.


     లక్యాలు :
1) ఆదివాసీలలో వివిధ తెగల సంస్కృతుల పై వివిద తెగల చరిత్ర పై ఆదివాసి  గూడాలల్లో అవగాహన సదస్సుల ఏర్పాటు.

2) ఆదివాసీ గూడేలల్లో అంతరించి పోతున్న వివిధ  ఆదివాసీ తెగల పండుగల నిర్వహణకు ప్రేరణ సమావేశాలు. దగ్గరుండి పండుగలు నిర్వహించేలా చేయడం.

3) ఆదివాసీ ‌ వివిధ తెగలలో ఉండే ప్రత్యేకమైన భాషల పరిరక్షణ కొరకు గిరిజన పాఠశాలల్లో ఆదివాసీ భాషోపద్యాయుల నియామకాల పై పోరాటాలు.

4) గూడెం గూడేన ఆదివాసీ భాషల నిఘంటువుల పంపకాలు .

5) ఆదివాసీ వివిధ తెగల సంస్కృతుల  పై అవగాహన తరగతుల నిర్వహణ ఏడాదికి ఒకటి నుండి మూడు సార్ల వరకు  ప్రతి మండలంలో నిర్వహించడం.

6) ఆదివాసీ సంస్కృతిని కించపరిచే అలాగే విచ్చిన్నం చేయుటకు  ప్రయత్నించే ఆదివాసీ వ్యతిరేక కుట్రల గురించి అధికారులకు తెలియజేయుట, అలాగే అవసరాన్ని బట్టి  వ్యతిరేకంగా  పోరాటం ద్వారా సంస్కృతి పరిరక్షణ చేయుట.

7) ఆదివాసీలలో వివిధ ఆదివాసి తెగల సంస్కృతులు ప్రతిబింబించేలా ఆదివాసి ప్రాంతాలలో  పెద్ద పెద్ద పోస్టర్లు ఏర్పాటు చేయడం.

8) ఆదివాసీ ల ఇంటి పేర్లు పెట్టుకుని ఆదివాసి రిజర్వేషన్లు అనుభవిస్తున్న గిరిజనేతరులను గుర్తించి తోలగించేలా చేయడం.

 ఇంకా ఏమైనా లక్ష్యాలు అవసరం ఉంటే సూచనలు చేస్తూ మంచి పేరు అలాగే అద్భుతమైన లోగో కూడా చెప్పగలరు మీ సలహాల కోసం ఎదురుచూస్తున్నాము. అలాగే ఈ కమిటీ లో పనిచేయుటకు ఆసక్తి ఉన్నవారు కూడా కామెంట్ పెట్టగలరు.



                                          ఇట్లు 
                ఆదివాసీ సంస్కృతి శ్రేయోభిలాషి 

Tuesday, August 20, 2019

మాట ఇచ్చి నిలబెట్టుకున్న శాసనసభ్యులు ఆత్రం సక్కు గారు ||Adivasi Culture||

మాట ఇచ్చి నిలబెట్టుకున్న శాసనసభ్యులు ఆత్రం సక్కు గారు

ఈ రోజు కుమ్రంభీము జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని జైనూర్ మండలంలోని పాట్నాపూర్ గ్రామపంచాయతీ పరిధి పాట్నాపూర్ సిద్దేశ్వర్ సంస్థాన్ లో భక్తులకు వంటల కొరకు గ్యాస్ కావాలని కోరిన కోరిక మేరకు శ్రీ శ్రీ శ్రీ పరమహంశ సద్గురు పులాజిబాబా బాబా గారి జన్మ దిన ఉత్సావాలను పురస్కరించుకొని  భక్తులకు వంటల కోసం గ్యాస్ సిలెండర్లను (08) మరియు పొయ్యిలను (08)పంపిణీ చేస్తున్న ఆసిఫాబాద్ నియోజకవర్గ శాసన సభ్యులు అన్నివర్గాల ఆత్మభిమాని,ఆదివాసీ ముద్దు బిడ్డ, శాసన సభ్యులు గౌరవ శ్రీ ఆత్రం సక్కు గారు,


సిద్దెశ్వర్ చైర్మన్ ఇంగ్లే కేశవ్ రావు గారు, జైనూర్ మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు కుంరం  తిరుమల విశ్వనాథ్ గారు, ఉపాధ్యక్షులు చిర్లే లక్ష్మణ్ గారు, సిర్పూర్ యు వైస్ ఎంపీపీ ఆత్రం ప్రకాష్ గారు, జైనూర్ మండల మాజీ ఎంపీపీ కొడప విమలప్రకాష్ గారు,తెరస మండల అధ్యక్షులు ఇంతయాజ్ లాల గారు, మాజీ కో అప్షన్ సభ్యులు సుభుర్ ఖాన్ గారు స్థానిక సర్పంచ్ కందరే బాలాజీ గారు,పెందుర్ లచ్చుగారు, మాజీ సర్పంచ్ ఇంగ్లే దేవ్ రావు గారు,స్థానిక ఎంపీటీసీలు,పులాజిబాబా గారి భక్తులు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Thursday, August 15, 2019

జంగో లింగో దీక్ష గురువు కి"శే" కుస్రం హనుమంత్ రావు మహరాజ్ గారి 8వ పుణ్యతిథి

జంగో లింగో దీక్ష గురువు కి"శే" కుస్రం హనుమంత్ రావు మహరాజ్ గారి 8వ పుణ్యతిథి

ఈ రోజు కుమ్రంభీము జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గం జైనూర్ మండలంలోని జంగాం గ్రామపంచాయతీ పరిదిలోని రాంజీ గూడా గ్రామములో శ్రీశ్రీశ్రీ సాంసోదక్ జంగు లింగో దీక్ష గురువు కి"శే  కుస్రం హనుమంత్ రావు మహరాజ్ గారి 8వ పుణ్యతిథి కార్యక్రమానికి ముఖ్యాతిథులుగా హాజరై దీక్ష గురువు కుస్రం హనమంత్ రావు మహరాజ్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళ్ళు అర్పిస్తున్నా ఆదిలాబాద్ జిల్లా పార్లమెంట్ సభ్యులు,ఆదివాసీ ముద్దుబిడ్డ గౌరవ శ్రీ సోయం బాపూరావు గారు,ఆసిఫాబాద్  నియోజకవర్గ అభివృద్ధి రథ సారథి ఆదివాసీ ముద్దుబిడ్డ,అన్నివర్గాల ఆశాజ్యోతి శాసన సభ్యులు గౌరవ శ్రీ ఆత్రం సక్కు గారు,శాసన సభ్యులు గారు మాట్లాడుతూ మన సాంస్కృతి సాంప్రదాయాలను కాపాడడం మన అందరి బాధ్యత అని అన్నారు.


 ఈ పుణ్యతిథి కార్యక్రమనికి దీక్ష గురు కిసాన్ రావు మహరాజ్ గారు,రాజ్ గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు సిడం అర్జు గారు, కుమ్రం భీము జిల్లా గ్రంధాలయ చైర్మన్ కనక యాదవ్ రావు గారు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కుంర భగవంత్ రావు గారు,జైనూర్ మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు కుంర తిరుమల విశ్వనాథ్ గారు,మండల మాజీ ఎంపీపీ కొడప విమలప్రకాష్ గారు,ఆదిలాబాద్ జిల్లా పిసా కోఆర్డినేటర్ వెడ్మా భోజ్జుగారు,జిల్లా పిసా కోఆర్డినేటర్ అర్క వసంత్ రావు గారు,ఘన్ సంస్థాన్ అధ్యక్షులు రఘునాథ్ గారు,స్థానిక సర్పంచులు,ఎంపీటీసీలు జడ్పీటీసీలు జంగో లింగో దీక్ష భక్తులు,తదితరులు నివాళ్ళు అర్పించారు.


Tuesday, August 13, 2019

లక్షేట్టిపేట్ గ్రామపంచాయతీ లో హరితహరం |Gondwana Channel|

లక్షేట్టిపేట్ గ్రామపంచాయతీ లో హరితహరం

లక్షేట్టిపేట్ గ్రామపంచాయతీ లో హరిత వనాలు చెట్లు నాటే కార్యక్రమం కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ దడంజ శ్యాం రావ్ మరియు F S O రాజెశ్వర్ F B O లచ్చన్న ఫీల్డ్ అసిస్టెంట్ మోరె విష్ణు దాస్ మరియు సి పి ఎఫ్ రాజేందర్ జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ గ్రామ పటేల్ పేర్చి ఆనందం రావు సార్ మేడమ్ సలాం శ్యామ్ రావు దేవరీ సెడ్మరావు వీ టి డి ఎ చైర్మన్ అర్క విజ్ఞాన్ మహాజన్ తొడసం  జనార్ధన్ యూత్ అధ్యక్షులు సెడ్మకి భగవంతరావు సిపీయప్ చంద్రకాంత్ CFF అర్క ఉమెష్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.



గిరి సీమలో వెలుగుల దివ్య దెవరాజన్ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ |Gondwana Channel|

గిరి సీమలో వెలుగుల దివ్య దెవరాజన్ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ 

💥ఆదివాసీల అభివృద్ధికి ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నా... గూడేల్లో ఇంకా పేదరికం, నిరక్షరాస్యత కనిపిస్తుంది. అధికారులతో తమ బాధలు చెప్పుకోలేని అమాయకత్వం వారిది. వీటన్నింటిని గమనించిన ఓ జిల్లా పాలనాధికారి గిరిసీమలో వెలుగులు నింపేందుకు ఓ సాధారణ మహిళగా వారితో కలిసిపోయారు. ఆదివాసుల ఆడపడుచుగా గుర్తింపు పొంది, వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఆమే ఆదిలాబాద్‌ జిల్లా పాలనాధికారి దివ్యా దేవరాజన్‌.


💥అడవుల జిల్లా ఆదిలాబాద్‌లో ఆదివాసీ, గిరిజన జనాభా ఎక్కువ. వారిని అభివృద్ధి పథంలోకి తీసుకురావాలంటే వివిధ అంశాలపై అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నారు ఆ జిల్లా కలెక్టర్‌ దివ్యా దేవరాజన్‌. స్థానిక సమస్యల గురించి తెలుసుకోవడానికి గ్రామాల్లో పర్యటించినప్పుడు ఎవరూ స్పందించకపోవడం గమనించారామె. వారికి దగ్గర కావాలనే ఉద్దేశంతో ఆదివాసీల గోండి భాషను నేర్చుకున్నారు. గ్రామాలకు వెళ్లి వారి భాషలోనే పలకరించడం, అక్కడి సంప్రదాయాలపై ఆసక్తి చూపడంతో క్రమంగా వాళ్ల సమస్యలు తెలిశాయి. ఎప్పటికప్పుడు ఆ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడంతో ఆమెపై మరింత నమ్మకం పెరిగింది. ఇప్పటి వరకు ఏ అధికారీ ఇంతలా మమేకం కాకపోవడంతో వారంతా ఆ కలెక్టరును తమ ఆడపడుచుగా భావించారు.
సంస్కృతి, సంప్రదాయాలకు విలువ...
దండారి ఉత్సవాలు, ఇతర పండగల్లో పాల్గొంటూ అక్కడి మహిళలకు దగ్గరయ్యారు. ఆదివాసీల ఆచార వ్యవహారాలకు ప్రధాన కేంద్రమైన నాగోబా ఆలయంలో మెస్రం వంశీయులతో కలసి పూజల్లో పాల్గొనడంతో పాటు, ఆలయ అభివృద్ధికి కృషి చేశారు. నాగోబా ఉత్సవాల సందర్భంగా 10 లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడమే కాదు... గ్రామాల్లో పర్యటిస్తూ రహదారులకు మరమ్మతులూ చేయించారు. శాశ్వత పరిష్కారానికి ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి లేఖలు పంపడం మొదలుపెట్టారు. క్రమంగా ఎంతో మార్పు తెచ్చారు.


💥ఆదర్శంగా పీహెచ్‌సీలు...
కొండ ప్రాంతాల వారికి ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తూ  పీహెచ్‌సీలు (ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు), ఆసుపత్రుల అభివృద్ధిపై దృష్టి సారించారు. ఇప్పుడు ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రసవాల సంఖ్య పెరుగుతోంది. ఇంద్రవెల్లి, దంతన్‌పల్లి, ఇచ్చోడ మండలాల ఆరోగ్య కేంద్రాలు జాతీయ స్థాయిలో కాయకల్ప, ఆంక్వా అవార్డులు సాధించాయి.
వ్యవసాయం...
రైతుల సంక్షేమానికి ‘కిసాన్‌ మిత్ర’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన ఆమె... ఒక టోల్‌ఫ్రీ నెంబరు ఇచ్చి వాళ్లు ఎదుర్కొనే ఎలాంటి సమస్యలైనా అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు. వచ్చిన ఫిర్యాదుల్లో 65 శాతం మంది రైతుల సమస్యలను పరిష్కరించారు. ఆత్మహత్యలు చేసుకున్న వ్యవసాయదారుల వివరాలను సేకరించి వారి కుటుంబాలకు ప్రభుత్వ ఫలాలు అందేలా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ పథకమైన దళితులకు సాగు భూమి పంపిణీలో ఆదిలాబాద్‌ జిల్లా రాష్ట్రంలో మొదటిస్థానంలో నిలవడానికి ఈమె చేసిన కృషే కారణం. ప్రతి మండల కేంద్రంలో ‘ప్రజా దర్బార్‌’ కార్యక్రమం నిర్వహించి దరఖాస్తులు తీసుకొని విడతల వారీగా 80 శాతం రైతులకు రెవెన్యూ హక్కులు కల్పించారు. ఆదివాసీలు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న భూ సమస్యల పరిష్కారానికీ కృషి చేశారు. ఉట్నూర్‌ మండలం ధర్మాజీపేట్‌లో 30 కుటుంబాలకు ఉచితంగా పత్తి, జొన్న, పప్పు ధాన్యాల విత్తనాలను సరఫరా చేయించడం తన బాధ్యత అనుకున్నారు.
భిన్న ప్రాంతాల్లో... తమిళనాడుకు చెందిన దివ్యా దేవరాజన్‌ 2010-11 బ్యాచ్‌ తెలంగాణ కేడర్‌ ఐఏఎస్‌ అధికారిణి. శిక్షణ అనంతరం 2012లో భువనగిరి సబ్‌కలెక్టరుగా మొదటి పోస్టింగ్‌ రావడంతో అక్కడ రెండేళ్లు, అనంతరం భద్రాచలం ఐటీడీఏ పీవోగా రెండేళ్లు పనిచేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో 2016 అక్టోబరులో వికారాబాద్‌ జిల్లాకు కలెక్టరుగా వెళ్లారు. రెండేళ్ల క్రితం  ఆదిలాబాద్‌కు బదిలీ అయ్యారు. ఆదివాసీలు, అక్కడ ఉండే మిగతావారి మధ్య జరిగిన గొడవలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించారు.
ప్రత్యేక కృషి...
ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ఇప్పపూల పండుగను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. ఇప్పపూలతో తినుబండరాలను తయారు చేయించి ఆ మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఆదివాసులు ఉండటానికి కేవలం నిరక్షరాస్యతే ప్రధాన కారణమని గుర్తించి, అక్షరాస్యతను పెంచేందుకు కార్యక్రమాలు రూపొందించి... విద్యాభివృద్దికీ కృషి చేస్తున్నారామె.


- బండారి లక్ష్మీనర్సయ్య, న్యూస్‌టుడే, ఇంద్రవెల్లి

Saturday, August 10, 2019

పెసా(PESA) ప‌oచాయ‌తీ రాజ్ విస్త‌ర‌ణ‌ చ‌ట్ట‌o 1998 నిబ‌oధ‌న‌లు

పెసా(PESA) ప‌oచాయ‌తీ రాజ్ విస్త‌ర‌ణ‌ చ‌ట్ట‌o 1998 నిబ‌oధ‌న‌లు

పెసా...గ్రామ‌ స‌భ‌ క‌మిటి ఎoపిక‌లో కోశాధికారి ప‌ద‌వి అనేది ఉoడ‌దు...

ఈ క్రిoది విధ‌oగా క‌మిటి నిర్మాణ‌o ఉoటుoది.

1. అధ్య‌క్షులు

2.ఉపాధ్య‌క్షులు

3.కార్య‌ద‌ర్శి

కేoద్ర‌ ప్ర‌భుత్వo మైదాన‌ ప్రాoతాల‌ అభివ‌ృద్ధి కోస‌o ఏర్పాటు చేసిన‌ ప‌oచాయితీరాజ్ విస్త‌ర‌ణ చ‌ట్టo *(PE Act1996‍‍‍‍)* లో కొన్ని మార్పులు చేసి ఏజ‌న్సీ చ‌ట్టాల‌కి అనుగుణ‌oగా ఏజ‌న్సీ ప్రాoతాల‌ అభివ‌ృద్ధి కొర‌కు షెడ్యూల్డ్ ప్రాoత‌ ప‌oచాయ‌తీ రాజ్ విస్త‌ర‌ణ‌ చ‌ట్ట‌o *(PESA Act)-1998* పేరుతో చ‌ట్ట‌o రూపొoదిoచి ఏజ‌న్సీలో అమ‌లు చేస్తున్నారు.

*ఆర్టిక‌ల్ 242(బి) ప్ర‌కార‌o* ఏజ‌న్సీ ఏరియాలోని ప‌oచాయితీలో ప‌రిధిలోని *ఆదివాసీలు నివ‌సిoచే ప్ర‌తి ఆదివాసీ గ్రామానికి ఒక‌ పెసా...గ్రామ‌స‌భ‌ క‌మిటి* ఉoటుoది.

ఈ వ్య‌వ‌స్థ‌ని ఏర్పాటు చేయ‌డ‌o itda ప్రాజెక్టు అధికారి, క‌లెక్ట‌ర్ బాధ్య‌త‌.


పెసా...గ్రామ‌స‌భ‌ క‌మిటి అనేది గ్రామ‌ వ్య‌వ‌స్థ‌కి *ఆత్మ‌ వ‌oటిది, ఒక‌ హ‌ృద‌య‌o* వ‌oటిది.

పెసా...గ్రామ‌స‌భ‌ క‌మిటిని ప్ర‌తి గ్రామ‌ స్థాయిలో ఒక‌ *శాస‌న‌ స‌భ‌గా* వ్య‌వ‌హారిస్తారు.

గ్రామ‌oలోని ఓట‌ర్ల‌oద‌రు పెసా గ్రామ‌స‌భ‌ క‌మిటిలో స‌భ్యులుగా ఉoటారు. *గ్రామ‌oలోని 50 మ‌oది లేదా 10 శాత‌o ఓట‌ర్లు కోరిన‌ప్పుడు పెసా గ్రామ‌స‌భ‌ని* ఏర్పాటు చేయాలి.

*ఆర్టిక‌ల్ 242(సి)(1)* ప్ర‌కార‌o ఆదివాసీ గ్రామ‌oలోని ప్ర‌జ‌లు ఆచార‌ స‌oప్ర‌దాయాలు, సాoస్క‌ృతిక‌ ఉనికిని, గ్రామ‌ ప్ర‌జ‌ల‌ అన్ని *వ‌న‌రుల‌ను(నీరు,అడ‌వీ,భూమి,ఖ‌నిజ‌స‌oప‌ద‌)* ల‌ని ప‌రిర‌క్షిoచుకునే అధికార‌o పెసా గ్రామ‌స‌భ‌ల‌కి ఉoటుoది.

*ఆర్టిక‌ల్ 242(సి)(2)(1)* ప్ర‌కార‌o ఆదివాసీ గూడేల‌లో గ్రామ‌ప‌oచాయితీ చేప‌ట్టే సామాజిక‌, ఆర్థిక‌ మరియు *అభివ‌ృద్ధి స‌oక్షేమ‌ ప‌థ‌కాలు, ప్ర‌ణాళిక‌ల‌ అమ‌లుకు* ఆయొక్క‌ ఆదివాసీ గ్రామo అనుమ‌తి గ్రామ‌ప‌oచాయితీ వారు తీసుకోవాలి.

*ఆర్టిక‌ల్ 242(సి)(2)(2)* ప్ర‌కార‌o ఆ గూడెoలో పేద‌రిక‌ నిర్మూల‌న‌కి మ‌రియు ఇత‌ర‌ *అభివ‌ృద్ధి ప‌థ‌కాల‌ కిoద‌ ల‌బ్ధిదారుల‌ గుర్తిoపు మ‌రియు ఎoపిక*‌ చేసే బాధ్య‌త‌ ఆ ఆదివాసీ గూడెo గ్రామ‌ స‌భ‌దే.

*ఆర్టిక‌ల్ 242(సి)(2)(3)* ప్ర‌కార‌o అభివ‌ృద్ధి ప‌థ‌కాలు, ప్ర‌ణాళిక‌లు క్రిoద ఆయా గ్రామాల‌లో‌ *ఖ‌ర్చు చేసిన‌ నిధుల‌కి వినియోగ‌ ద‌ృవీక‌ర‌ణ‌ ప‌త్ర‌o(UC) ల‌ను* ప్ర‌తి గ్రామ‌ ప‌oచాయితీ త‌న‌ ప‌రిధిలోని ప్ర‌తి ఆదివాసీ గూడెo/ గ్రామ‌o యొక్క‌ *గ్రామ‌స‌భ‌ నుoడి* UC పొoదాలి.

*ఆర్టిక‌ల్ 242(డి)* ప్ర‌కార‌o ఏజ‌న్సీ ఏరియాల‌లోని మ‌oడ‌ల‌ ప‌రిష‌త్ అధ్య‌క్షులు *(MPP), గ్రామ‌ ప‌oచాయితీ స‌ర్ప‌oచు ప‌ద‌వులు/స్థానాలు* స్థానిక‌ షెడ్యూల్డ్ తెగ‌ల‌కి కేటాయిoచారు. మైదాన‌ ప్రాoత‌o వారు అన‌ర్హులు.

*ఆర్టిక‌ల్ 242(ఇ)* ప్ర‌కార‌o మ‌oడ‌ల‌ ప‌రిష‌త్తులో ఏ షెడ్యూల్డ్ తెగ‌ల‌వారికైన‌ త‌గిన‌ ప్రాతినిధ్య‌o లేనిచో ఆ *గిరిజ‌న‌ తెగ‌ల‌ వారిని నామినేట్* చేసే అధికార‌o రాష్ట్ర‌ ప్ర‌భుత్వానికి ఉoది.

గ్రామ‌స‌భ‌కి 1/3 వ‌oతు మ‌oది ఓట‌ర్లు మ‌రియు *క‌నీస‌o 50 ఆదివాసీ గిరుజ‌నులు హాజ‌రైతేనె గ్రామ‌స‌భ‌కి కోర‌o పూర్తైన‌ట్లు* లేకుoటే గ్రామ‌ స‌భ‌స‌మావేశాన్ని వాయిదా వేయాలి. పూర్తీ కోర‌o లేకుoడా ఎటువ‌oటి నిర్ణ‌యాలు చేయ‌రాదు.

*గ్రామ‌స‌భ‌ క‌మిటి స‌భ్యుల‌ ప‌ద‌వి కాల‌o ప‌ద‌వీకాల‌o 5 స‌oవ‌త్స‌రాలు.*

ఇoకా ఉన్న‌ది త‌ర్వాత‌ కొన‌సాగిoపు.


పెసా(PESA) ప‌oచాయ‌తీ రాజ్ విస్త‌ర‌ణ‌ చ‌ట్ట‌o 1998 నిబ‌oధ‌న‌లు భాగం..2

*షెడ్యూల్డ్ ప్రాoత‌ ప‌oచాయితీ రాజ్ విస్త‌ర‌ణ‌ చ‌ట్ట‌o(PESA Act)-1998* నిబ‌oధ‌న‌లు

*ఆర్టిక‌ల్ 242(జి)* ప్ర‌కార‌o చిన్న‌ త‌ర‌హా *నీటి వ‌న‌రుల‌ ప్ర‌ణాళిక‌ మ‌రియు నిర్వ‌హ‌ణ‌ బాధ్య‌త‌* ఆయా గ్రామ‌స‌భ‌ల‌కి,గ్రామ‌ ప‌oచాయితీ, మ‌oడ‌ల‌ ప‌రిష‌త్, జిల్లా ప‌రిష‌త్తుల‌కు అప్ప‌గిoచాలి

1) నీటివ‌న‌రుల‌ ప్ర‌ణాళిక‌, నిర్వ‌హ‌ణ‌ బాధ్య‌త‌ల‌ని ఒక‌ గ్రామ‌oలోని ప్ర‌జ‌ల‌ స‌మిష్టి ప్ర‌యోజ‌నాల‌కోస‌o అయితే *గ్రామాస‌భ‌కి*

2) రెoడు గ్రామాల‌ ప్ర‌జ‌ల‌ స‌మిష్టి అవ‌స‌రాల‌ కోస‌o అయితే *గ్రామ‌ ప‌oచాయితీకి*

3) రెoడు ప‌oచాయితీల‌ ప్ర‌జ‌ల‌ స‌మిష్టి అవ‌స‌రాల‌ కోస‌o *అయితే మ‌oడ‌ల‌ ప‌రిష‌త్తుకు*

4) రెoడు మ‌oడ‌లాల‌ ప్ర‌జ‌ల‌ స‌మిష్టి అవ‌స‌రాల‌ కోస‌o అయితే *జిల్లా ప‌రిష‌త్తుకు చిన్న‌ త‌ర‌హా నీటి వ‌న‌రుల‌ ప్ర‌ణాళిక‌ నిర్వ‌హ‌ణ‌ బాధ్య‌త‌ల‌ని అప్ప‌గిoచాలి.*

5) కుoట‌లు, చెరువులు, రిజ‌ర్వాయ‌ర్లు, న‌దుల‌లో *చేప‌లు ప‌ట్టే హ‌క్కు స్థానిక‌ షెడ్యూల్డ్ తెగ‌ల‌ వారికే* పూర్తీ హ‌క్కులు క‌ల్పిoచాలి.

*ఆర్టిక‌ల్ 242(F)* ప్ర‌కార‌o షెడ్యూల్డ్ ప్రాoతాల‌లో వివిధ‌ *ప్రాజెక్టుల‌ నిర్మాణ‌o కొర‌కు చేప‌ట్టే భూసేక‌ర‌ణ‌ చ‌ట్ట‌o విష‌య‌oలో* భూములు కోల్పోయో వారికి పున‌రావాస‌o, RR ప్యాకేజీ విష‌యాల‌లో చెల్లిoచే నష్ట‌ప‌రిహార‌o మ‌రియు ప్ర‌భావిత‌ గ్రామాల‌ ప్ర‌జ‌ల‌ ఉధ్యోగ‌వ‌కాశాలు విష‌యాల‌లో ముoదుగా స‌oబ‌oధిత‌ *గ్రామ‌ స‌భలు, మ‌oడ‌ల‌ ప‌రిష‌త్తుల‌ను* స‌oప్ర‌దిoచి వారి అనుమ‌తులు తీసుకోవాలి.

*ఆర్టిక‌ల్ 242(H)* ప్ర‌కార‌o ఖ‌నిజాల‌ అన్వేష‌ణ‌ లైసెన్సు కోస‌o, *గ‌నుల‌ త్ర‌వ్వ‌క‌o లీజు మ‌oజూరు* వాటి త్ర‌వ్వ‌కానికి *షెడ్యూల్డ్ తెగ‌ల‌కి చెoదిన‌ స్థానిక‌ వ్య‌క్తులు, లేదా స్థానిక‌ షెడ్యూల్డ్ తెగ‌ల‌ స‌భ్యుల‌తో కూడిన‌ స‌oఘాలు/ సొసైటీలు* మాత్ర‌మే అర్హ‌త‌ క‌లిగి ఉoటాయి.
వీరికి గ‌నుల‌ త్ర‌వ్వ‌కాల‌లో రాయితీలు కూడ‌ ఉoటాయి.

*ఆర్టిక‌ల్ 242(i)* ప్ర‌కార‌o గ్రామ‌స‌భ‌కు మ‌రియు గ్రామ‌ ప‌oచాయితీకి ఈ క్రిoది విష‌యాల‌లో అధికారాలు ఉoటాయి.

a) *మ‌ధ్య‌పాన‌o నిషేదిoచ‌డ‌o, లేదా మ‌ధ్య‌పాన‌ వినియోగాన్ని క్ర‌మ‌బ‌ద్దీక‌రిoచ‌డ‌o, లేదా మ‌ధ్య‌పాన‌o అమ్మ‌కాల‌* పైన‌ ఆoక్ష‌లు విధిoచే అధికార‌o. గ్రామాల‌లో మ‌ద్య‌o దుఖాణ‌o లేదా బార్ కి అనుమ‌తులు ఇవ్వ‌డ‌o లేదా తిర‌స్క‌రిoచ‌డ‌o

b)షెడ్యూల్డ్ తెగ‌ల‌కి చెoదిన‌ వారు అమ్మ‌డానికి వీలు లేకుoడా వారి స‌oస్క‌ృతిలో భాగ‌oగా కేవ‌ల‌o స్థానిక‌oగా మ‌ద్య‌o సేవిoచ‌డానికి మాత్ర‌మే *స‌హ‌జ‌సిద్ద‌మైన‌ మ‌ధ్య‌పానాన్ని ఉత్ప‌త్తి చేసి సేవిoచ‌వ‌చ్చును* దీని ఉత్ప‌త్తి ప‌రిమాణ‌o ఎoత‌ ఉoడాలి అనేది గ్రామ‌స‌భ‌ ద్వార‌ నిర్ణ‌యిoచాలి.  ప‌oడుగ‌లు, పెళ్ళిళ్ళు, ఫ‌oక్ష‌న్లు, దినాలు వ‌oటి ప్ర‌త్యేక‌ స‌oద‌ర్భాల‌లో ప‌రిమితి విధిoచ‌న‌వ‌స‌ర‌o లేదు.

c) 1/ 59, 1/70 చ‌ట్టాల‌కి విరుద్ధ‌oగా షెడ్యూల్డ్ ప్రాoత‌oతో ఆదివాసీ తెగ‌ల‌ *భూములు అన్యాక్రాoత‌o కాబ‌డితే చ‌ట్ట‌బ‌ద్ద‌oగా తిరిగి స్వాధీన‌ప‌ర్చ‌డ‌o,* వారి భూములు అన్యాక్రాoత‌o కాకుoడ‌ అడ్డుకునే అధికార‌o

d) గ్రామాల‌లో *స‌oత‌లు* నిర్వ‌హిoచ‌డ‌o.. మ‌రియు *అక్ర‌మ‌ వ్యాపార‌ దుకాణాలు* మ‌రియు ఇత‌ర‌ వ్యాపారాల‌ నిర్వ‌హ‌ణ‌ని *అక్ర‌మ‌ క‌ట్ట‌డాల‌* నిర్మాణాల‌ని నిరోధిoచే అధికార‌o

e) షెడ్యూల్డ్ తెగ‌ల‌ ఆదివాసీల‌తో చేసే *వ‌డ్డీ వ్యాపారాన్ని నియ‌oత్రిoచే* అధికార‌o.

F) షెడ్యూల్డ్ తెగ‌ల‌ *ఆచారాలు సాoప్ర‌దాయాలు, స‌oస్క‌ృతిక‌ విల‌క్ష‌త‌ని* కాపాడి త‌రువాతి త‌రాల‌కి అoదిoచ‌డ‌o.

G) *గ్రామాల‌లో త‌లెత్తిన‌ వివాదాల‌ను* ప‌రిష్క‌రిoచ‌డానికి ప్ర‌స్తుత‌o అమ‌లులో ఉన్న‌ చ‌ట్టాల‌కి అనుగుణ‌oగా ప‌రిష్క‌రిoచ‌డ‌o.

H) గ్రామ‌ స్థాయిలో గ్రామ‌ప‌oచాయితీ చేప‌ట్టే సామాజిక‌ మ‌రియు ఆర్థిక‌ మ‌రియు *అభివ‌ృద్ధి ప‌థ‌కాల‌, ప్ర‌ణాళిక‌ల‌ అమ‌లుకు గ్రామ‌స‌భ‌ ముoదు అనుమ‌తి ఇవ్వాలి*

i) చిన్న‌త‌ర‌హా అట‌వీ ఉత్ప‌త్తుల‌ పైన‌ యాజ‌మాన్య‌ హ‌క్కులు క‌లిగిఉoడ‌డ‌o

గ్రామ‌స‌భ‌ స‌భ్యుల‌లో 1/3 వ‌oతు ఓటర్లు హాజ‌రవ్వాలి అoదులో *క‌నీస‌o 50 శాత‌o షెడ్యూల్డ్ తెగ‌ల‌ చెoదిన‌వారు* హాజ‌రైతేనే గ్రామ‌ స‌భ‌ స‌మావేశానికి కోర‌o పూర్తైన‌ట్లుగా భావిస్తారు. లేకుoటే గ్రామ‌స‌భ‌ స‌మావేశ‌o వాయిదా వేయాలి.

ఇoకా ఉన్న‌ది...త‌ర్వాత‌ కొన‌ సాగిoపులో


పెసా(PESA) ప‌oచాయ‌తీ రాజ్ విస్త‌ర‌ణ‌ చ‌ట్ట‌o 1998 నిబ‌oధ‌న‌లు భాగం..3

*గ్రామ‌స‌భ‌*

గ్రామ‌స‌భ‌ని ప్ర‌తి గూడెo/గ్రామ‌స్థాయిలో  *స్థానిక‌ శాస‌న‌స‌భ‌గా* వ్య‌వ‌హారిస్తారు. గ్రామ‌ వ్య‌వ‌స్థ‌కి ఆత్మ‌గా, హ‌ృద‌య‌oగా పేర్కొoటారు.

ఒక‌ గ్రామ‌ ప‌oచాయితీలోని ప్ర‌తి ఒక్క‌ గ్రామ‌oలో గ్రామ‌స్థాయిలో ఓట‌ర్ల‌ జాబితాలో పేర్కొన‌బ‌డిన‌ వ్య‌క్తుల‌తో కూడిన‌ *గ్రామ‌స‌భ‌* ప్ర‌తి గ్రామానీకి ఉoటుoది. *ఓటు హ‌క్కు క‌లిగిన‌ ప్ర‌తి ఒక్క‌రు గ్రామ‌స‌భ‌లో స‌భ్యులుగా ఉoటారు.*

ITDA ప్రాజెక్టు అధికారి మొద‌టి గ్రామ‌స‌భ‌ని నిర్వ‌హిoచ‌డానికి *డిప్యూటీ త‌హ‌సిల్దార్ హోదాకి* త‌క్కువ‌ కాన‌టువ‌oటి అధికారిని నియ‌మిoచాలి.

గ్రామ‌స‌భ‌ స‌మావేశానికి ఆ గ్రామ‌o ఏ ప‌oచాయితీ ప‌రిధిలోకి వ‌స్తుoదో స‌oబ‌oధిత‌ గ్రామ‌ప‌oచాయితీ *స‌ర్ప‌oచు* అధ్య‌క్ష‌త‌ వ‌హిస్తారు. స‌ర్ప‌oచు అoదుబాటులో లేన‌ప్పుడు సాoప్ర‌దాయ‌క‌oగా ఆ *గూడెo/గ్రామ‌ పెద్ద‌ లేదా స్వ‌య‌o స‌హాయ‌క‌ గ్రూపు లీడ‌ర్* గ్రామ‌స‌భ‌ స‌మావేశానికి అధ్య‌క్ష‌త‌ వ‌హిoచ‌వ‌చ్చు..

గ్రామ‌స‌భ‌ స‌మావేశ‌o నిర్వ‌హ‌ణ‌కి గ్రామ‌స‌భ‌ స‌భ్యుల‌లో *1/3 వ‌oతు స‌భ్యులు త‌ప్ప‌క‌ హాజ‌రు కావాలి.* అoదులో 50 శాత‌o షెడ్యూల్డ్ తెగ‌ల‌ వారు హాజ‌రైతేనే గ్రామ‌స‌భ‌ స‌మావేశానికి *కోర‌o* పూర్తైన‌ట్లుగా భావిస్తారు.

మెజారిటీ గ్రామ‌స‌భ్యులు చేతులెత్త‌డ‌o ద్వార‌ గ్రామ‌స‌భ‌ ఉపాధ్య‌క్షుడిని, కార్య‌ద‌ర్శిని ఎన్నుకోవాలి. *ఉపాధ్య‌క్షులు కార్య‌ద‌ర్శులు షెడ్యూల్డ్ తెగ‌ల‌కి చెoదిన‌ వారై ఉoడాలి.* వారి *ప‌ద‌వి కాల‌o 5* స‌oవ‌త్స‌రాలు.

ఏడాదిలో క‌నీస‌o *రెoడుసార్లు* గ్రామ‌స‌భ‌ స‌మావేశాలు నిర్వ‌హిoచాలి..లేదా గ్రామ‌oలో *50 మ‌oది లేదా 10 శాత‌o గ్రామ‌ ప్ర‌జ‌లు* గ్రామ‌స‌భ‌ స‌మావేశ‌o నిర్వ‌హిoచాల‌ని కోరిన‌ప్పుడు గ్రామ‌స‌భ‌ నిర్వ‌హిoచాలి. ఇలా స‌oవ‌త్స‌ర‌oలో *అవ‌స‌రాన్ని బ‌ట్టి ఎన్ని సార్లైన‌ నిర్వ‌హిoచ‌వ‌చ్చు.*

గ్రామ‌స‌భ‌ స‌మావేశానికి అధ్య‌క్ష‌త‌ వ‌హిoచేవారు స‌మావేస‌పు *హాజ‌రుప‌ట్టీలో* గ్రామ‌స‌భ‌కి హాజ‌రైన‌ స‌భ్యుల‌oద‌రి నుoడి స‌oత‌కాలు లేదా వేలిముద్ర‌లు తీసుకోవాలి.

గ్రామ‌స‌భ‌ స‌మావేశ‌o అన‌oత‌ర‌o గ్రామ‌స‌భ‌ నిర్ణ‌యాల‌ని *గ్రామ‌కార్య‌నిర్వ‌హ‌ణ‌ అధికారి/సెక్ర‌ట‌రీ* చ‌దివి వినిపిoచి, స‌భ్యుల‌ ఆమోద‌o పొoదాలి. ప్ర‌తి తీర్మాణ‌పు అoశాన్ని ప్ర‌త్యేక‌oగా రాసీ గ్రామ‌స‌భ‌ ఆమోద‌o పొoదాలి. *స‌భ్యులు త‌మ‌ ఆమోదాన్ని చేతులెత్త‌డ‌o ద్వారా తెలియ‌జేయాలి.*

గ్రామ‌స‌భ‌ స‌మావేశాల‌లో స‌భ్యులు *ఆమోదిoచిన‌ తీర్మాణాల‌ని ఒక‌ రిజిష్ట‌రులో రాయాలి స‌భ్యుల‌ స‌oత‌కాలు, వేలిముద్ర‌లు తీసుకోవాలి.*

ఈ *తీర్మాణాల‌ను 4 వారాల‌లోపు* గ్రామ‌స‌భ‌ కార్య‌ద‌ర్శి స‌oబ‌oధిత‌ ప్ర‌భుత్వ‌ శాఖ‌ల‌కి, స‌oస్థ‌లకి ప‌oపాలి.

గ్రామ‌ అభివ‌ృద్ధి ప‌థ‌కాలు, ప్ర‌ణాళిక‌ల‌ అమ‌లుకు అదేవిధ‌oగా పేద‌రిక‌ నిర్మూల‌న‌ మ‌రియు అభివ‌ృద్ధి స‌oక్షేమ‌ కార్య‌క్ర‌మాల‌ క్రిoద‌ *ల‌బ్ధిదారుల‌ గుర్తిoపు, ఎoపిక‌ ప్ర‌క్రియ‌ గ్రామ‌స్థాయిలో నిర్వ‌హిoచే గ్రామ‌స‌భ‌లోనే జ‌ర‌గాలి.*

 స‌ర్ప‌oచు అధ్య‌క్షతన‌ గ్రామ‌ స్థాయిల‌లో నిర్వ‌హిoచిన‌ గ్రామ‌స‌భ‌ల‌ యొక్క‌ స‌మావేశ‌ తీర్మాణాల‌ని ప‌రీశీలిoచి ఆమోదిoచి ఆ ప్ర‌ణాళిక‌ల‌ని అమ‌లు చేయ‌డానికి గ్రామ‌ప‌oచాయితీ స‌మావేశాలు నిర్వ‌హిoచి గ్రామ‌స‌భ‌ నిర్ణ‌యాలు/తీర్మాణాలు అమ‌లు చేయాలి.

గ్రామ‌సభ‌లు వేరు, గ్రామ‌ ప‌oచాయితీ స‌మావేశాలు వేరు. రెoడు ఒక్క‌టి కావు

కానీ దీనికి భిన్న‌oగా *మైదాన‌ ప్రాoత‌ ప‌oచాయితీ రాజ్ చ‌ట్టాన్ని (PR Act)* అనుస‌రిస్తూ...గ్రామ‌ప‌oచాయితీ స్థాయిలో గ్రామ‌స‌భ‌ని ఎర్పాటు చేసి *పెసా చ‌ట్ట‌o ఉద్దేశాల‌ని* నీరుగారుస్తున్న‌రు.


ఇట్లు
క‌బ్బాకుల‌ ర‌వి, 
ATF రాష్ట్ర‌ ప్ర‌చార‌కార్య‌ద‌ర్శి 
తెల‌oగాణ‌ 9949230354

ఆదివాసీ గుడాలు ఆకుపఛ్చని జెండాలతో...రెపరేపలాడాయి జై ఆదివాసీ ||GONDWANA CHANNEL||

ఆదివాసీ గుడాలు ఆకుపఛ్చని జెండాలతో...రెపరేపలాడాయి

ఒక్కసారిగా...ప్రకృతి పచ్చ బడింది.ఐక్యత వెల్లివిరిసింది

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆదివాసీలను ప్రకృతి ప్రేమికుల్ని చేసింది.

ఆదివాసీ గుడాలు ఆకుపఛ్చని జెండాలతో...రెపరేపలాడాయి

నింగిని ,నేలను ఏకం చేస్తూ...ఆదివాసీ జెండాలు ఐక్యతను చాటిచెప్పాయి.

ఆదివాసీల ఐక్యత హద్దులు దాటి హరితవనమై...కళకల లాడింది....అడవితల్లి మైమరచి పరవశించి పోయింది

ప్రపంచ ఆదివాసీ దినోత్సపు సంబురాలు అంబరాన్ని అంటాయి...పుడమి పులకించింది
ఆకాశం ఆనందపడింది
అడవి సంబరపడింది.
ఐక్యత...వెల్లువిరిసింది

కొమురంభీం పోరాటాలు ఆకుపచ్చని జెండాలై... హక్కుల గర్జన చేశాయి.

బిర్సాముండ యుద్దావిన్యాసాలు
ఆకుపచ్చని జెండాలై...నింగిలో ఎగిరాయి

సమ్మక్క-సారక్కల స్వయంపాలన పోరాట వారసుల...పొరుజెండాలు విజయ విహారం చేశాయి.

మద్దిరాంచంద్రం...ఆశయాలు ఐక్యంగా నింగికెగిసాయి.

సోయం గంగులు బెబ్బిలి...గర్జనలు ఆకాశంలో మారుమోగాయి.

చిడం శంభు గారి ఉద్యమ గొంతుకలు...ఆకుపచ్చని జెండాలై...ఐక్యంగా గొంతువిప్పాయి.

పండు దొర పోరాట వారసత్వాలు....జవసత్వాలు కూడగట్టుకొని పచ్చని జెండాలై...నింగిని నింపేసాయి.

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం...ఆకు పచ్చని జెండాల ఐక్యతా తోరణమైంది.

జై....ఆదివాసీ
జై..జై ఆదివాసీ

ఆదివాసీల ఐక్యతా వర్ధిల్లాలి



Thursday, August 8, 2019

ప్రతిజ్ఞ ||GONDWANA CHANNEL||


ప్రతిజ్ఞ

నేను ఆదివాసి జాతిలో పుట్టినందుకు గర్వపడుతూ...
జాతి సంపదను , సంస్కృతి, సంప్రదాయాలను,
కట్టుబాట్లను, ఉమ్మడి జీవన విధానంను,
జాతిసమైక్యతను కాపాడుకుంటూ
విద్య, ఉద్యోగ, ఉపాది రంగాలలో రానిస్తూ
దొర, పటేల్‌, వడ్డే వ్యవస్థ ద్వారా
ఆదివాసి జాతి పునర్నిర్మాణముకై అంకిత భావంతో
ఆదివాసిగా నావంతు కర్తవ్యంను నిర్వర్తిస్తూ

నాతోటి సోదరి, సోదరిమణులను అభివృద్ది బాటలో
ముందుకుతీసుకెళ్తానాని ప్రతిజ్ఞ చేయుచున్నాను .

జై ఆదివాసి .. జై జై ఆదివాసి ...



Wednesday, August 7, 2019

ఆదివాసీ జాతీయ గీతం Tribal national anthem |GONDWANA CHANNEL|

ఆదివాసీ జెండా, జాతీయగీతం

జయహో ఆదివాసీ పతాకం
విశ్వ విజయకేతనం...
అడవి బిడ్డల జీవన స్వరo
జయహో ఆదివాసీ పతాకం
అడవి నిండా సమర చిహ్నం..
జయహో జయ జయహో..
జయహో ఆదివాసీ పతాకం..!

జల జంగల్  జమిన్ కై
అడవి బిడ్డలేత్తిన పతాకం
కుమ్ర౦ భీం వారసత్వమా..!
సమ్మక్క సారక్కల విజయకేతనం
అడవి బిడ్డల పతాకం...!
స్వయం పరిపాలన స్వప్నమైoది

భారత భువిలో ఆదివాసీ పతాకం
పొరుయోధుల త్యాగదానం...
భూమి కోసం భుక్తి కోసం...
భారత భువిలో రెపరేపలాడే
మా అడవితల్లి మదిలో....
జయహో ఆదివాసీ పతాకం
జయ జయ జయహో....!

ఆదివాసీ జాతి జనులు
జగత్తు మెచ్చు జనులు
జగమంతా ఎగిరే మన జెండా
ఆదివాసీ పతాకం...
రెల పాట బతుకు పోరులో
ఆదివాసీ శ్రమ సింగరమై
విశ్వ జననీ ఎద లో ఎగిరే..!

జయహో...జయహో...
జయ జయ...జయహో
ఆదివాసీ జయ కేతనం...
అడవి బిడ్డల జనగళం...
ఎగిరే దివి పొరుబాటలో..
జయహో జయకేతనం....!!            
                          
       రచయిత:                               
ఆత్రం మోతిరామ్ 
గ్రామం :నగర్ గుట్ట
మండలం :వాoకిడి
పోస్ట్ :బంబార
జిల్లా : కుమ్ర0 భీం, ఆసిఫాబాద్
సెల్ :8985051473.

ఆగస్టు 9న............... ప్రపంచ ఆదివాసి దినోత్సవం నాడు ప్రతి గూడేం లో ఆకుపచ్చ ఆదివాసి జెండా ఏగురవేసీ ఈ గీతాన్ని పాడాలి.....! !

Thursday, August 1, 2019

పీసా చట్టం

పీసా చట్టం  

భారత రాజ్యంగం 73వ సవరణ చట్టం 1992 యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే స్థానిక పంచాయతీల ద్వారా స్వపరిపాలనకు కావలసిన అధికారులు బదీలీ చేయడం అయితే షెడ్యూలు ప్రాంతాలలో స్వపరిపాలన తరతరాలుగా వారి సంస్కృతిలో ముఖ్యభాగమైంది కులపంచాయితీలు గ్రామపంచాయితీలు ప్రాంతీయ పంచాయతీలు కూడ ఉన్నాయి అయితే ఇవి వారి సామాజిక వ్వవహరాలు నిర్వహించడంలో పటిష్టంగానే ఉన్నాయి అయితే బయట సమాజంతో ఉత్పన్నమయ్యే సందర్భాలలో ఆదివాసీ గ్రామపంచాయితీలు పనిచేయలేకపోతున్నాయి

ఎందుకంటే ఆదివాసులవి సాంప్రదాయిక న్యాయం మౌఖికమైన చట్టం దీనికి బయటి ప్రపంచంలో గుర్తింపు లేదు వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని పంచాయతీరాజ్ చట్టం షెడ్యూలు ప్రాంతాలకు వర్తించేముందు ఇక్కడ పంచాయతీలకు ఏమేమి ప్రత్యేక అధికారాలు ఇవ్వాలి అనేది ప్రత్యేకంగా నిర్వచించాలి


శ్రీ దిలీప్ సింగ్ భూరియ గారి నాయకత్వంలో ఒక కమిటీని జూన్ 10 1994 కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ది శాఖ నియమించింది వారి నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం 1996 యాక్ట్ 40 ద్వారా పంచాయతీరాజ్ షెడ్యూలు ప్రాంతాలకు విస్తరింపు చట్టంను చేసింది అయితే కేంద్ర ప్రభుత్వం కోంత వేసులుబాటు కల్పించింది ఇంక ఆధికార వికేంద్రీకరణ కోరకు రాష్ట్ర ప్రభుత్వం జరగాలని భావిస్తే మార్పులు చేర్పులు చేయవచ్చు అన్ని అవకాశం కల్పించింది


కాని మన  రాష్ట్రప్రభుత్వం అధికారన్నీ వ్యతిరేక దశలో వినియోగించింది ఆంద్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1998 తేచ్చింది ఈ చట్టం ప్రకారం భూఖనిజ వనరులను మేజర్ మైనర్ మీనరల్స్ గా విభజించి మైనర్ మీనరల్స్ అయిన ఇసుక గ్రానైట్ గ్రామపంచాయితీ తగదలు చిన్న చిన్న అంశాలపై ఆదివాసులకు అధికారాలు కల్పించినది అయితే మేజర్ మినరల్స్ అయిన బొగ్గు సిమేంట్ ఇసుక మొదలగు వాటిపై అధికారాలను రాష్ట్రప్రభుత్వం లాక్కోంది


భూరియ కమిటీ సిప్పారుసులను కేంద్ర చట్టంలో   చేర్చలేదు కేంద్ర చట్టంలో ఉన్న అంశాలు రాష్ట్రప్రభుత్వం చట్టంలో లేవు 1998 ఆంద్రప్రదేశ్ పీసా చట్టం వస్తే అములు జరిపే విధివిదానాలను తెలిపె రూల్సు మాత్రం 2011 రూపోందించారు   అంటే 13 సంవత్సరాల తరువాత వచ్చాయి జీవో 66.పంచాయతీరాజ్ పీసా స్సూర్తికి అనుకుణంగా లేదు

1998 నుండి 2011 మధ్యలో రెండు సార్లు ఎన్నికలు జరిగాయి కాని పీసా చట్టం యొక్క విధివిదానాలు రూపోందించలేదు మన రాష్ట్రప్రభుత్వలకు ఆదివాసులపైన ఎంత ప్రేమ ఉందో ఇక్కడే అర్థమవుతుంది

పీసా చట్టంలోనీ అంశాలు 

242(A)1 ప్రకారం ఈ చట్టం రాష్ట్రంలోని షెడ్యూలు ప్రాంతాలలోని గ్రామపంచాయితీలు మండల పరిషత్ లు జిల్లా పరిషత్తులకు వర్తిస్తుంది 
(2) మరే చట్టంలోనీ ప్రోవిజన్లు ఈ చట్టంలోనీ ప్రోవిజన్లకు విరుద్ధంగా ఉంటే ఈ చట్టంలోనీ ప్రోవిజన్లదే పై చేయి

242(B} ప్రకారం గ్రామం అంటే అవాసము లేక అవాసాల గుంపు హెమ్లేట్ గూడెలు దాంట్లో ఒక తెగ కాని కొన్ని తెగాలు కాని కాలసియుండి వారి  ఆచారారల  ప్రకారం నడిపించుకునే విదానాలు ఉండాలి


242(c} 1 ప్రకారం ప్రజల యొక్క ఆచారాలను సాంస్కృతిక సామాజిక ఆస్తిని సాంప్రదాయికంగా తగవులు తీర్చుకునే విధామును కాపాడేందుకు కోనసాగించేందుకు ప్రతి గ్రామసభకు అధికారాలున్నాయి

242(c} 2 ప్రకారం గ్రామపంచాయితీ పరిధిలో సామాజిక ఆర్థికాభివృద్దిపై తయారు చేసే ప్రణాళికాలు పథాకాలు ప్రాజేక్టులను వాటి అములుకు ముందే గ్రామసభ తప్పకుండా అమోదించాలి

ఈ విధంగా జరిగియుంటే ఆసిఫాభాద్ లోని దేవాయిగూడ చందుగూడ ఉల్లీపిట్ట డోర్లీ స్మాసనాలుగా మార్పు చేందేవికావు పేరుకు చట్టాలు చేసేది మాత్రం ప్రభుత్వమే ఈ మధ్యకాలంలో ఆదివాసులు కోన్ని తీర్మానాలు చేసి వివిధ శాఖ ఉద్యోగుస్తులను భహిష్కరిస్తున్నారు ప్రభుత్వలు పీసాను గౌరవించాలి


242 (f} ప్రకారం షెడ్యూలు ప్రాంతాలలో అభివృద్ధి ప్రాజేక్టులు చేపట్టేందుకు భూసేకరణ చేసే ముందు మండల పరిషత్ ను తప్పకుండా సంప్రాదించాలి ఇక్కడ సంప్రదింపులు అంటే అమోధము అనీ కూడ అర్థం

242(H ) ప్రకారం చిన్న తరహ ఖనిజాల పరిశీలన ఏవరికైనా గ్రాంట్ చేసేందుకు వేలికితీతకు గ్రామ సభ అమోదం పోందాలి


242(1) 1 ప్రకారం పంచాయతీ కాని గ్రామసభ కాని ఈ క్రింది అధికారాలు లభిస్తున్నాయి

a మత్తు పదార్థాల అమ్మకం సేవించడంపై నిషేధం క్రమబద్దీకరణ లేక నియంత్రణ


b చిన్న తరహ అటవీ పలసాయంపై ఆస్తి హక్కు 

c భూమి బదలాయింపును నిరోదించుట చట్టవిరుద్దంగా అన్యాక్రాంతమైన భూమిని తిరిగి ఇప్పించుట

ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఉమ్మడి ఆదిలాబాద్ శాఖ 
🙏🙏🙏🙏🙏🙏

ఓ కాలమా... కరుణించమ్మా...! || GONDWANA CHANNEL ||




కాలమా... కరుణించమ్మా...! 

ఓ కాలమా కరుణించవా...
రైతన్నల ఆవేదన ఆలకించవా...
ఎవరెవరి మీదో నీ ఆవేశం
మరెవరి మీదో నీ ఉగ్రత
వేరెవరి మీదో ఎందుకమ్మా....!

ఓ కాలమా... కరుణిచవా....
రైతన్నల ఆవేదన ఆలకించవా.... !

నీలి వర్ణంతో నిగనిగలాడే ఆకాశం
అరుణోదయ కిరణాలతో ఎరుపెక్కితే భయం
ఏ రకం ఎండలతో నేలనెక్కడ నెర్రెలాడ్చుతుందోనని

నిర్మలమైన ఆ ఆకాశం
నీలి మేఘాలతో నిండిపోతె భయం
ఎక్కడ నేలని నీటితో ముంచెత్తి వరద బీభత్సాలని సృష్టిస్తుందోనని

ఓ... కాలమా ఎందుకింత కక్ష
ఎవరెవరో చేసిన తప్పులతొ నీవు మలినమయావో
ఎక్కడెక్కడి కలుషితాలతో నీ మనసు కకావికలం అవుతున్నదో
వారి పై చూపించమ్మ నీ ఉగ్రత

నిన్నే నమ్ముకొని, నిన్నే పూజించే
నీవే జీవనంగా నీతోనే జీవించే
ఈ రైతన్న పై ఎందుకమ్మ అంత కక్ష... !

కాలమా మమ్ము కరుణించవా...
ఈ రైతన్నల ఆవేదన ఆలకించవా....!!

నీ ఆవేశం ను అనుచుకొని..నీ ఉగ్రత ను ఓర్చుకొని
మమ్ము ఓదార్చ రావమ్మ...
ఓ.... కాలమా....
మమ్ము దీవించ రావమ్మ.

కాలమా మమ్ము కరుణించవా...
ఈ రైతన్నల ఆవేదన ఆలకించవా...!!!

                                      భుజ్జు. ఇర్ప 🖋

Gondwana Kabur