Followers

Saturday, September 21, 2019

తెలుగు నేల అడుగుజాడ గురజాడ అప్పారావు సాహితీ సాగరం నేటితరనికో సందేశం.

తెలుగు నేల అడుగుజాడ  గురజాడ అప్పారావు  సాహితీ సాగరం నేటితరనికో సందేశం.
గురజాడ అప్పారావు విశాఖ జిల్లా రాయవరం లో 1862 సెప్టెంబర్ 21 న వెంకట రామదాసు, కౌసల్యమ్మ దంపతులకు జన్మించారు.

గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాoఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహా కవి,తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీ కారులలో ఒకరు,హేతువాది 19వ శతాబ్దంలోను 20వ శతాబ్దంలో మొదటి దశకంలోని అయన చేసిన రచనలు ఈ నాటికి ప్రజల మన్ననలు పొందుతున్నాయి.

ఆ రోజుల్లో ఆయన ప్రజలందరికీ అర్ధమయ్యే భాష లో రచనలు చేశారు.
కన్యాశుల్కం నాటకానికి సాహితీ లోకంలో ఒక ప్రత్యేకమైన స్తానం ఉంది.

అభ్యుదయ కవిత పితామహుడు అని  బిరుదు పొందిన అప్పారావు. తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి కృషి చేసిన వారిలో ముఖ్యులు.

గిడుగు రామమూర్తితో కలిసి వాడుక భాషా వ్యాప్తికి ఉద్యమిచ్చారు.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కన్యాశుల్కం నాటకాన్ని 1890  ప్రాంతాల్లో పూర్తి వాడుక భాషలో రాశారు.

గురజాడ అప్పారావు 1910 సం. లో రచించిన ఈ గేయం..ప్రజల్లో దేశభక్తి ని ప్రభోదించి,దేశాభివృద్ధికై ప్రజలను కార్యోన్ముఖుల్ని చేస్తుంది.

దేశమును ప్రేమిoచుమన్న
మంచి యన్నది పెంచుమన్న
వొట్టి మాటలు కట్టి పెట్టోయ్
గట్టిమేల్ తల్ పెట్టవోయి

పాడి పంటలు పొంగిపొర్ల
దారిలో నువు పాటు పడవోయ్
తిండి కలిగితే కండ కలుగును
కండ కలవాడెను మనిషోయి

యిసురొమని మనుషులుంటే
దేశమే గతి బాగు అగునోయ్
జల్ది కుని కళలన్ని నేర్చుకు
దేశీ సరుకులు నింపవోయి

దేశాభిమానం నాకు కాద్దని
వొట్టి గొప్పలు చెప్పు కోకోయ్
పూని ఏదైనా ఒక మేల్
కూర్చి జనులకు చూపవోయ్

చెట్ట పట్టాల్ పట్టుకొని
దేశస్తులoత నడువ వలెనోయ్
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నియు మెలగవలెనోయ్

సొంత లాభం కొంత మనకు
పొరుగు వానికి తొడుపడవోయ్
దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్

ఈ గేయంలోని పంక్తులు చాలా ప్రాచుర్యం పొందినాయి.

పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అనే సుప్రసిద్ధ గేయం గురజాడ అప్పారావు రచనల్లో మరొకటి ఈ గేయం ఇతివృత్తం కూడా కన్యాశుల్కం దురాచారమే.
కరుణ రసాత్మకమైన ఈ గేయ కావ్యం లోని చివరి పద్యం ..

కన్నుల కాంతులు కాలువల చేరెను
మేలిమి జేరెను మేని పసల్
హంసల జెరేను పూర్ణమ్మ
పుత్తడి బొమ్మ పూర్ణమ్మ..

నేటికీ గురజాడ అప్పారావు,మహాకవి సాహిత్యం ప్రజల మదిలో ప్రాణపదమై.. పల్లవిచ్చుతుంది.


సేంద్రీయ వ్వవసాయం అవగాహన సదస్సు

సేంద్రీయ వ్వవసాయం అవగాహన సదస్సు

ఈరోజు సిర్పూర్  (యు) మండలం గ్రామము కర్ణుగూడ లో సేంద్రీయ వ్వవసాయంపై రైతులకు అవగాహన సదస్సు కార్యక్రమానికి రాయిసెంటర్. నిర్యహణ చేతన ఆర్గానిక్ యందు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ కుమ్రంభీం జిల్లా అద్యక్షుడు కుమ్రం శంకర్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంత ప్రజలకు అదివాసి రైతు లందరికి ముఖ్య గమనిక రసాయన ఎరువులు వాడటం వల్ల భూమి లో ఉన్న ఖనిజాలు తగ్గుతున్నాయి.  అలాగే ఆరోగ్య మరియు భూమి విలువ కూడా కాపాడుట కోరకు సింద్రీయ వ్వవసాయంపై అవగాహన జిల్లా రాయి సెంటర్ అధ్యక్షుడు కోట్నాక కిషన్ కుడ్మేత యశ్వంత్ రావ్ ఉపా సార్ మేడి ప్రబాకర్ సార్ పాల్గొన్నారు.

Monday, September 16, 2019

ఆదివాసులంతా ఏకమై ఉద్యమించాలి. -కేసిఆర్


నిజమే దొర మీరు చెప్పినట్లే ఆదివాసులంతా చైతన్యమై , పార్టీలు,సంఘాల కతీతంగా పిడికిలి బిగించి, నాటి కాకతీయ చక్రవర్తులపై సమరశంఖం పూరించి ఆదివాసుల ఆత్మాబిమానాన్ని ,పౌరుషాన్ని చూపిన సమ్మక్క సారక్కల స్పూర్తితో,  తర్వాత  ప్రపంచాన్ని గడగడలాడించిన బ్రిటీష్ పాలకులపై  తొలి తుడుం మోగించిన ఆదివాసి పోరాట వీరుల స్పూర్తితో, ఆ తర్వాత హైదరాబాద్ సంస్థానాన్ని అరాచకంగా  పరిపాలించిన నిజాం సర్కారును సైతం గడగడలాడించి జల్ జంగల్ జమీన్ పై హక్కుల సాధించిన కుమరం భీం దాదా పోరాట స్పూర్తితో, నేడు యావత్ ఆదివాసి సమాజం ఏకమై ఒకే జెండా, ఒకే నాయకత్వం,ఒకే డిమాండ్ తో “ చట్టబద్దత లేని లంబాడీలను ST జాబితా నుండి తొలగించడంతో “పాటు భారత రాజ్యాంగం ఆర్టికల్ 342 ప్రకారం గుర్తించిన నిజమైన ఆదివాసి తెగల ప్రయోజనాల కోసమే నిస్వార్దంగా, ప్రజాసామ్యయుతంగా”కళం,గళంతో” జాతి కోసం,జాతి చైతన్యం కోసం,జాతి ప్రయోజనాల కోసం,జాతి అస్థిత్వం కోసం ఆదివాసి ఉద్యమ నాయకుడు,కుమరం భీం పోరాట వారసుడు గౌరవనీయ పార్లమెంటు సభ్యులు శ్రీ సోయం బాపురావు దాదా గారి నాయకత్వంలో అవిశ్రాంతంగా పోరాడి చారిత్రాత్మక విజయం సాధించడం ఖాయం. మీరు చెప్పినట్లే  పోరాడుతున్న అమాయక ఆదివాసులకు మద్దతుగా మీ పాలన సాగాలని కోరుకుంటున్న యావత్ ఆదివాసి సమాజం. జై  ఆదివాసి.జైజై ఆదివాసి.

Sunday, September 15, 2019

నేనూ.. మీ రాంజీగోండును..

నేనూ.. మీ రాంజీగోండును..
( మన కోసం పాణాలు ఇచ్చిండ్రు.. జర ఓపిక జేస్కోని సదువుండ్రి..)

‘‘ఎండనక.. వాననక.. నిత్యం నవ్వుతూ నిండుగా ఉన్న నన్ను జూసి మస్తుమంది గీయన ఓళ్లుబై.. అని అడుగుతుంటే గమ్మతనిపిస్తది. ఒక్కోపారి.. నవ్వస్తది. ఇగ రోడ్డు మీద పోయేటోళ్లల గొంతమంది దగ్గరకచ్చి మరి బోర్డు మీద రాసిన నా పేరు జూసి.. ఆహా ఈయన పేరు గిదా.. అని సూసుకుంట పోతరు. అరెరె.. మాటల్లవడి సెప్పుడు మర్సిన.. అసలు నేను యాడున్నది.. నేనొళ్లన్నది చెప్పలె కదా. నిమ్మల గడ్డ మీద చైన్‌గేట్‌ అడ్డ కాడికస్తే.. ఎర్రటి దిమ్మె మీద.. బంగారు రంగుల మెరిసిపోత.. బుర్రమీసాలతో.. నెత్తికి పట్కాసుట్టి కనిపిస్త.. అవ్‌.. నేనే మీ రాంజీగోండును. మీవోణ్ణి.. మీకోసం పోరాడినోణ్ణి.. పాణాలు అర్పించినోణ్ణి. మరి గిన్నేళ్లు లేంది.. గిప్పుడెందుకు ముందటికచ్చినవ్‌.. గీ ముచ్చట పెడుతున్నవంటరా.. ఏం లే.. *మళ్ల సెప్టెంబర్‌ 17 విమోచనదినం.. అచ్చింది* కదా. అప్పటిరోజులు.. అంతకు ముందు మేం జేసిన పోరాటాలు యాదికొచ్చినై. అడవి బిడ్డలుగా ఉన్న మేం ఆఖరి శ్వాసదాకా ఎందుకు పోరాడినం..? ఒకళ్లం కాదు.. ఇద్దరం కాదు... వెయ్యి.. వెయ్యిమందిమి ఒకేపారి పాణాలను ఎందుకు ఇడిసినం..? కుమ్రంభీముడు ఏంటికి తుపాకి వట్టిండు.. తనెందుకు పాణాలు ఇడిసిండు..? ఇట్ల... ఎన్నో ఏండ్ల సంది.. చెప్పాలనుకున్న ఎన్నో ముచ్చట్లు గుండెలోపల గూడుకట్టుకుని ఉన్నయ్‌. ఈ విగ్రహానికి గుండేంది.. గూడేంది.. అందులో ముచ్చట్లేంది.. అని ఇసిత్రం గాకండి. దేశం కోసం పాణాలు ఇడిసినోళ్లను ఏమంటరు.. ‘అమరులు’ అనే గదా.. అంటే ఏంది ‘మరణం లేనోళు’్ల అనే గదా. అందుకే మేం యాడికి బోలే.. నిత్యం ఈడనే ఉండి నిమ్మలను సూసుకుంట మురిసిపోతం. అవ్‌గన్నీ అసలు ముచ్చట మొదలు జెప్పుకుందాం.. ఏళ్లకిందట ఉన్నదంతా ఆళ్ల రాజ్యమేనంటూ ఊళ్లకు ఊళ్లను చెరబట్టిండ్రు గా తెల్లటోళ్లు. ఇగ ఆళ్లకు మన పట్నం రాజులూ వంగి.. వంగి సలాములు పెట్టిండ్రు. ఇళ్లిద్దరూ కలిసి.. ఊళ్లు సాలవన్నట్లు మన అడవుల మీద పడ్డరు. కొండలు, గుట్టలల్ల పచ్చటి చెట్లలల్ల దొరికే ప్రకతి సంపదను నమ్ముకుని బతికేటోళ్ల మీద జులుం జేసిండ్రు. అప్పటికే ఊళ్లను నాశనం జేసిండ్రు. ఇగ ఇప్పుడు అడవి బిడ్డల గూడేలనూ నాశనం జేసుడు మొదలు వెట్టిండ్రు. జంగలంతా మాదే.. మేం జెప్పినట్లే మీరినాలె అంటూ పెద్దరికం షురూ జేసిండ్రు. ఇననోళ్లను సంపతందుకూ ఎనిక్కి రాలేదాళ్లు. తెల్లోళ్లు, ఈ పట్నమొళ్లు మనల్ని ఖతం చేయతందుకు అచ్చిండ్రని అందరూ గుబులు వడ్డరు. అప్పటికే ఎక్కడోళ్లక్కడ అడివిని ఇడిసిపెట్టి పోతందుకు సిద్దమైండ్రు. గప్పుడు నాకనిపిచ్చింది. దేశమంతా మాదేనని అచ్చినోళ్లు.. మనం ఇంకోకాడికి పోతే రాకుండా ఉంటరా.. అని. అంతే.. ఒక్కటే అనుకున్న పుట్టిపెరిగిన ఊరును.. ఆడిపాడిన అడివిని ఇడిసిపెట్టేది లేదు. పాణమున్నదాకా ఇన్నే ఉండుడు. అంతే ఇగ.. తెల్లోళ్లను, హైదరబాదు నవాబులను ఎదిరించాలని గట్టిగ అనుకున్నం. ఇందుకు గూడేలను, ఊళ్లను ఏకం జేసే పని మొదలువెట్టినం. అందరు గలిసి నన్నే నాయకుడని ముందట నిలవెట్టిండ్రు. నావోళ్ల కోసం.. ఈ భూమాతకోసం.. పాణాలిచ్చేతందుకైనా సిద్ధమని ముందటికచ్చిన. ఇగ మన ఊళ్లమీదికి.. గూడేల మీదికి.. అడివిమీదికి అచ్చినోళ్లు ఓళ్లైనా కొట్లాడుడే. మరి.. ఆళ్ల దగ్గర్నేమో తుపాకులు, పిరంగులు, పిస్తోళ్లున్నయ్‌. ఆళ్ల తోటి కొట్లాడాలంటే మాదగ్గర తుపాకుల్లేవు.. పిరంగులూ లేవు. ఉన్నవల్ల బరిసెలు, బాణాలు.. వొడిసెలు.. అంతకుమించి గుండెల నిండా అడివితల్లి మీద.. ఈ భూమి మీద ప్రేమ. యాడికెళ్లో దూరదేశం నుంచి అచ్చినోళ్లు.. మా అడివిల జులుం జేసుడేంది.. మా భూతల్లిని చెరవట్టుడేంది.. మా మానపాణాలతోని ఆడుకునుడేందన్న కసితోనే ఉన్నం. ఉట్టి చేతులతోనే సంపెత్తం కొడుకులని.. అని మా గోండువీరులంటుంటే నాకు మస్తు ధైర్యమొస్తుంది. మేమంతా ఒక్కటైనట్లు గా నవాబులకు.. గా తెల్లోళ్లకు తెలిసింది. ఇగ నిమ్మల కలెక్టర్‌ మా మీదికి సైన్యాన్ని పంపిండు. ఇగసూడు.. ఆ సైనికులకు అడివిల సుక్కలు సూపెట్టినం. గుట్టల మధ్యల, చెట్ల నడుమల దాక్కుంటా ఒక్కొక్కళ్లను ఖతం జేసినం. మావోళ్లు అన్నట్లే.. ఉట్టి చేతులతోనే చిరుతపుల్లుల్లెక్క ఆంగ్లేయులు.. అప్పటి హైదరాబాద్‌ రాజు సైనికుల మీదవడి మట్టుబెట్టిండ్రు. దీంతోటి ఆళ్లకు మామీద మరింత కోపమొచ్చింది. ఇగ ఈళ్లను ఇడిసిపెట్టదని కలెక్టర్‌ ఈసారి మస్తుమంది సైన్యాన్ని, తుపాకులనిచ్చి పంపిండు. మేం ఒక్కతాట ఉంటే దొరికి పోతమని నిమ్మల సుట్టూ ఉన్న అడివిల తలోదిక్కు పోయినం. గుట్టలు.. గోదావరి నదిని ఆసరాగా చేసుకుని ఆళ్లమీద పోరాటం జేసినం. ఈ పోరుల మావోల్లు కూడ పాణాలు ఇడిసిండ్రు. అయినా ఒక్కళ్లు గూడ పారిపోలే. ఒకటిగాదు.. రెండుగాదు.. నెలలకు నెలలు ఆళ్లకు సుక్కలు సూపెట్టినం. మస్తుమందిని మట్టుబెట్టినం. అడివి బిడ్డలమైన మమ్మల్ని జంగల్‌ల సంపుడు కష్టమని నిమ్మల కలెక్టరు గుర్తువట్టిండు. మస్తు సోంచాయించి.. మా మీద దొంగదెబ్బ కొట్టిండు. అట్ల మమ్మల్ని దొరకవట్టిండు. కసిదీరా.. మమ్మల్నందరినీ కొట్టుడు కొట్టిండ్రు.. ఇళ్ల సావును జూసి.. ఇగ ముందు మనకోళ్లు ఎదురురావద్దని.. ఒకళ్లం కాదు.. ఇద్దరం కాదు.. వెయ్యిమంది అడివి బిడ్డలను..
నిమ్మలకెళ్లి ఎల్లపల్లికి వోయే దారిల ఉన్న పెద్ద మర్రిచెట్టుకు ఉరిదీయుమని కలెక్టరు ఆదేశించిండు. నన్నైతే మస్తు కొట్టిండ్రు.. నువ్వేగదా ఇళ్లందరికి నాయకుడంటూ కాళ్లుచేతులు ఇరిగేదాకా కొట్టిండ్రు. అందరినీ మర్రిచెట్టుకాడికి దీసుకపోయి.. ఒక్కపారే వెయ్యిమందికి *ఉరితాడేసి బిగించిండ్రు.. అయినా మేం ఏడలే.. గింతగూడ భయపడలె.. బాధపడలె.. ఎందుకంటే మేం మా భూతల్లి పరాయిదేశమొళ్లకు బానిసకావద్దని ధర్మపోరాటం జేసినం. ఆ అమ్మకోసం పాణాలిచ్చెతందుకైనా సిద్ధమని ముందే అనుకున్నం. అందుకనే నవ్వుకుంట ఆ భారతమ్మ కోసం ఉరితాళ్లకు వేలాడినం. తాడు మెడకు బిగిసిన కొద్ది.. పాణం మెల్లగ పోతున్న కొద్ది.. అనిపిచ్చింది.. అమ్మా.. ఇంక జన్మంటూ ఉంటే నీ బిడ్డగనే పుట్టాలె అని. మా ఊపిరి ఆగిన పర్వలే.. మా పాణాలు పోయిన పర్వలే.. మా అడివి మావోళ్లకే ఉండాలె.. మా భారతమ్మ మాత్రం బానిస కావద్దని అనుకుంటనే కొనపాణాలనూ ఇడిసినం.*
         మా పీడ విరగడైందని తెల్లోడు.. హైదరబాదును ఏలేటోడు.. అనుకున్నా.. మా చావు మాత్రం మస్తుమందికి ఆదర్శమైంది. జల్‌.. జంగల్‌.. జమీన్‌ మాదేనంటూ ఆళ్లు చేసిన అఘాయిత్యాలు అన్నీఇన్నీ కావు. వీటిని ఎదిరించేంతందుకు మళ్ల కొన్నేళ్లకే మా అడివిలో పుట్టిన పులిబిడ్డ కుమ్రంభీముడు తుపాకులు చేతపట్టిండు. నిజామొడి మీదికి లగించి ఉరికిండు. జల్‌.. జంగల్‌.. జమీన్‌ మీద మీకెందిరా హక్కు అని ఆ పిశాచిని ముప్పతిప్పులు వెట్టిండు. ఆ పులిబిడ్డనూ ఎదుర్కొనే దమ్ములేక దొంగదెబ్బ తీసే సంపిండ్రు. అప్పుడు మస్తు బాధపడ్డ. కని.. మా పాణత్యాగాల తర్వాత భీముడు అస్తే.. కుమ్రం పాణమిడిసినంక ఎంతోమంది వీరులు పుట్టుకొచ్చిండ్రు. దేశమంతటా.. భగత్‌..ఆజాద్‌.. నేతాజీ.. అల్లూరి.. ఇట్ల ఎంతోమంది మాలెక్కనే పాణాలను తల్లి కోసం ఇడిసిండ్రు. మా అసుంటి అమరుల పాణత్యాగాలతోని దేశమంతట 1947 ఆగస్టు 15న తెల్లోడి నుంచి స్వతంత్రమొచ్చింది. కని.. మన హైదరబాద్‌ల ఉండే నిజాము మాత్రం కుర్సి ఇడిసిపెట్టకుండ.. రజకార్లతోని మస్తు అఘాయిత్యాలు జేసిండు. ఆళ్ల మీద మన స్వతంత్ర సమరయోధులు మస్తుమంది కొట్లాడిండ్రు. అప్పటికీ నిజామొడు ఇనలే. ఇగ గప్పుడు దేశానికి హోంశాఖ మంత్రిగ ఉన్న పెద్దమనిషి సర్దారు వల్లభభాయ్‌ పటేలే సైన్యాన్ని ఎంటేసుకుని హైదరబాదుకు అచ్చుడు షురూ జేసిండు. ఆ సైన్యం దగ్గరికి రాంగనే.. గప్పుడు నిజాముకు బుగులు వడ్డది. దెబ్బకు 1948 సెప్టెంబర్‌ 17రోజున తానే గా ఉక్కుమనిషి పటేల్‌ తాటికి వోయి.. వంగి వంగి సలాములు వెట్టి హైదరబాదును అప్పజెప్పిండు. గప్పుడు గా నిజాం పిశాచం నుంచి మనకు విముక్తి లభించింది. గా రోజునే.. తెలంగాణ విమోచన దినంగా జరుపుకుంటున్నం. సమజైంది గదా.. మనకెట్ల స్వతంత్రమొచ్చిందో.
 *అవ్‌ గన్ని* ..
ముచ్చట్ల వడి సెప్పుడు మర్సిన. ఓసార్లు.. ఓ పెద్దలు.. ఓ పిల్లగాండ్లు.. జర మా గురించి పట్టించుకోండ్రి. మమ్మల్ని ఉరిదీసిన మర్రిచెట్టు ఎప్పుడో గాలికి పడిపోయింది. గాడ ఏదో మ్యూజియం.. అమరధామం.. కడతమన్నరు.. ఇప్పటిదాకా దిక్కులేదు. అప్పట్ల తెలంగాణ ఉద్యమంల ఓ స్థూపమైతే కట్టిండ్రు. చైన్‌గేట్‌ కాడ నా బొమ్మ పెట్టిండ్రు. కని.. అప్పటికెళ్లి పట్టించుకునుడు మాత్రం మరిసిండ్రు. నా బొమ్మకాడ సూడుండ్రి ఎట్లుంటదో.. సుట్టూ బండ్లు వెడతరు. నా పక్కనే బజ్జీలు అమ్ముతరు. నా దిమ్మె మీద కూసోనే మందు కొడతరు. ఏం జెప్పాలె.. నాబాధ.. జర ఇప్పటికైనా పట్టించుకోండ్రి సార్లూ. సరే ఇగ పోయస్తా.. ఏదో విమోచనదినం గదా అని అప్పటి ముచ్చట్లన్నీ జెప్పిన గంతే.. నమస్తే.’’

( ఈసారైనా పాలకులు.. అధికారుల మనసు కరిగి, మన కోసం ప్రాణాలు అర్పించిన ఆ వీరుల స్మారకాలను గుర్తించి, కనీసం ఒక రూపం ఇవ్వాలని.. రాంజీగోండు విగ్రహం మందుబాబులకు అడ్డాగా కాకుండా చేయాలని ఆశిస్తూ..)
- ఓ నిర్మల్ వాసి..
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

మండల ఉమ్మడి రాయ్ సెంటర్ల సమావేశం

మండల ఉమ్మడి రాయ్ సెంటర్ల సమావేశం

ఈరోజు15-09-2019.ఆదివారం  ఇంద్రవెల్లి మండల ఉమ్మడి రాయ్ సెంటర్లు (కేస్లాపూర్,గిన్నేర వడగాం) ఆధ్వర్యంలో ముత్నూర్ గ్రామం యందు సమావేశం ఏర్పాటు చేయడం చేసి ఈ క్రింది విధంగా తీర్మానం చేయడం జరిగింది.

1.ఇంద్రవెల్లి మండల కేంద్రంలో  17 సెప్టెంబర్ న కుంరం భీము నైజం సర్కారు తో పోరాడి గెలిచినందుకు  విజయోత్సవ ర్యాలీ

2. సెప్టెంబర్  20న 1950 లో ఉన్న  ఆదివాసులకే ఏజెన్సీ సర్టిఫికెట్లు ఇవ్వాలి 1976లో వలస వచ్చిన లంబాడాలకు ఏజెన్సీ సర్టిఫికెట్లు రద్దు చేయాలని తహసిల్దార్కు మెమోరండం ఇవ్వడం జరుగుతుంది.

Monday, September 9, 2019

నిర్బంధాల తో ఉద్యమాలను ఆపలేరు _ఆదివాసి స్టూడెంట్ ఫోరం(ASF)

నిర్బంధాల తో ఉద్యమాలను ఆపలేరు _ఆదివాసి స్టూడెంట్ ఫోరం(ASF)
ప్రభుత్వం ఆదివాసి ఉద్యమాలను ఎంత అణిచి వేయాలని కుట్ర చేస్తే అంత పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ సాగబోయిన పాపారావు అన్నారు. సోమవారం ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు గృహ నిర్బంధం  చేసినందుకు కు నిరసనగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ కాలేజ్ ముందు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది.  నిజామాబాద్ జిల్లా ఆదివాసి ఉద్యమ నాయకు కుల ఆధ్వర్యంలో ఎంపీ సన్మాన సభ పెడితే సభకు వెళ్లకుండా అడ్డుకునేందుకు కుట్ర లో భాగంగా లంబాడి వర్గానికి చెందిన తాజా మంత్రి సత్యవతి రాథోడ్ కుట్ర చేసి ఎంపీని సభకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఉద్యమ నాయకుడు సోయం బాబురావు ను  ఈ ప్రభుత్వం అడ్డుకోవాలని కానీ అరెస్టు చేసిన ఆదివాసీ ఉద్యమాలు ఆగవని విషయాన్ని ఈ ప్రభుత్వం గ్రహించాలని అన్నారు. లంబాడోళ్ళ కుట్రలను ఎండగట్టేందుకు ప్రజా ఉద్యమంతో పాటు న్యాయ పోరాటాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు బట్ట వెంకటేశ్వర్లు, లక్ష్మణ్ ,గుమ్మడి సుధీర్ , పెనుబల్లి చంటి ,కల్లూరి సురేష్, వెంకటలక్ష్మి ,ప్రవీణ్ ,రామకృష్ణ రాజేష్, పాల్గొన్నారు.

Thursday, September 5, 2019

సోయం ని విమర్శించే స్థాయి కనక లక్కేరావ్ కి లేదు

సోయం ని విమర్శించే స్థాయి కనక లక్కేరావ్ కి లేదు

ఎ రోజు కూడ ఆదివాసి ఉద్యామాన్ని, ఆదివాసిల అన్యాయాన్ని,ఆదివాసిల అభివ్రుధ్ధి గురించి పట్టించుకోని ఉట్నూరు ITDA చైర్మన్ కనక లక్కేరావ్, నేడు ఒక ఉద్యమ నాయకుడు అయినా సోయం బాపురావ్ ఇవ్వల పార్లమెంటు సభ్యుడు అయితే జీర్ణించు కొలేనీ స్థితిలో ఉండి మతి భ్రమించి తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్ష, పార్లమెంటు సభ్యుడిగా రాజీనామా చెయ్యాలని పిచ్చి కూతలు కూస్తూనాడు.

కనక లక్కేరావ్ నీకు ఆదివాసి సమాజం తరుపున చివరి సరిగా హెచ్చరిస్తూనం నీకు చేతనయితే ఆదివాసి ల అభివ్రుధ్ధికి పాటు పడు లేదా నోరు మూసుకొని ఉండు అంతే కానీ నీ స్వార్థ రాజకీయం కొరకు లంబాడాల దగ్గర తొత్తులుగా మారి నిస్వార్థంగా ఆదివాసి సమాజం కొరకు పోరాడుతున్న నాయకుల మీద బురదజల్లలని ప్రయత్నం చేస్తే, పిచ్చి కూతలు కూస్తె నీ నాలుక తెంచి ఆదివాసి జాతి నుంచి బహిష్కరించ డానికి వెనకడాము అని తెలియ పరుస్తున్నాం.

నీకు రాజకీయంగా ఎదగడం చేతకాక లంబాడాల దగ్గర తొత్తుగా మారినవ్ కదరా దద్దమ్మ, జాతికి న్యాయం చేస్తనంటెనె కదరా నీకు రాయిసెంటర్ జిల్లా సలహాదారులు పదవి ఇచ్చినాం ఇప్పుడు ఆ పదవికి లంబాడాల కాళ్ల కింద పెట్టినావ్  కదరా అందుకు నీకు ఈ క్షణమే నిన్ను రాయిసెంటర్ పదవి నుంచి తొలగించడం జరుగుతుంది.

కొన్ని రోజులో నీలో మార్పు వస్తే మంచిది లేకపోతే నిన్ను జాతి భహిస్కరణ చేస్తాం అని తెలియపరుస్తూనాం

*ఉద్యమాభి వందనాలతో...*

రాయిసెంటర్స్ కమిటీలు
ఆదిలాబాద్ జిల్లా

Sunday, September 1, 2019

ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యే ఆత్రం సక్కు గారు

ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యే ఆత్రం సక్కు గారు

ఈ రోజు కుమ్రంభీము జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గం జైనూర్ మండలంలో పలు గ్రామాల్లో సుడిగాలి పర్యటన నిర్వహించారు.పర్యటనలో భాగంగా జంగాం గ్రామపంచాయతీ పరిధి   గ్రామపంచాయతీ భీంజి గూడా గ్రామావాసి ఇత్తడి బొమ్మల తయారు చేయు కోవ  బాపురావు అను వ్యక్తి పొలాల అమావాస్య పండుగ రోజున తెల్లవారు జామున ఉదయము హఠాత్తుగా మరణించారు వారికి సంతానము భార్యతో ఇద్దరు కుమార్తెలు,ఒక కుమారుడు సంతానం ఆయన మరణించిన వార్త విన్నా ఆసిఫాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు,అన్నివర్గాల ఆశాజ్యోతి,జనం మెచ్చిన జనహృదయ నేత గౌరవ శ్రీ ఆత్రం సక్కు గారు సుడిగాలి పర్యటన నిర్వహించారు.. ఈ రోజు కోవ బాపురావు గారి కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు సందర్బంగా శాసన సభ్యులు కోవ బాపురావు గారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. వారి వెంట గ్రామ పటేల్ పెందుర్ దాదారావు గారు,మేస్రం నాగోరావు గారు, జైనూర్ మండల ప్రజాపరిషత్ ఉపాధ్యక్షులు చిర్లే లక్ష్మణ్ యాదవ్ గారు, స్థానిక సర్పంచ్ కుంర శ్యామ్ రావు గారు, జైనూర్ మండల పార్టీ అధ్యక్షులు ఇంతయాజ్ లాల గారు, సిర్పూర్ (యు)  మండల అధ్యక్షులు ఆత్రం యశ్వంత్ రావు గారు, శెట్టి హడ్పూనూర్ మాజీ సర్పంచ్ కనక సుదర్శన్ గారు, లింగపూర్ మండల తెరాస యువనాయకులు ఆత్రం అనిల్ కుమార్ గారు, సర్పంచ్ మేస్రం భూపతిగారు అర్క నాగోరావు గారు, మూస గారు,సయ్యద్ చాంద్ గారు,స్థానికులు గ్రామస్థులు,తెరాస పార్టీ నాయకులు,అభిమానులు తదితరులున్నారు..


Gondwana Kabur