Followers

Monday, September 28, 2020

నెరవేరబోతున్న లింగాపూర్ మండల ప్రధాన రహదారి సమస్య |Gondwana Channel|

నెరవేరబోతున్న లింగాపూర్ మండల ప్రధాన రహదారి సమస్య
     గత కొన్ని సంవత్సరాలుగా పిట్టగూడ నుండి మామిడిపల్లి వరకు గల మండల  ప్రధాన రహదారిని సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డు చేసే క్రమంలో రోడ్డు  పనులను గుత్తేదారు మధ్యలో ఆపివేయడంతో, మండల వాసులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, వ్యాపారులకు  రవాణా విషయంలో చాలా అవస్థలు పడాల్సి వచ్చింది.
    ఇట్టి విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే శ్రీ ఆత్రం సక్కు గారి దృష్టికి తీసుకుని వెళ్ళగా ఎమ్మేల్యే గారు సానుకూలంగా స్పందించి మీ సమస్యను అతి త్వరలో పరిష్కరిస్తానని వాగ్దానం చేయడం జరిగింది. ఇచ్చిన మాట, చేసిన వాగ్దానం మరవని మన గౌరవనీయ ఎమ్మెల్యే గారు సంబధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకొనగా మధ్యలో ఆపివేసిన పనులను చేయడానికి ఏ గుత్తేదారు ముందుకు రావడంలేదని అధికారులు తెలుపగా తనే స్వయంగా చొరవతీసుకుని పలువురు గుత్తేదారులను సంప్రదించడం జరిగింది. చివరిగా C5 కంపని గుత్తేదారు పనులు చేయడానికి అంగీకరించారు.
      ప్రజల సమస్యలను పరిష్కరించే విషయంలో తనదైన శైలిలో స్పందిస్తూ ప్రజలచేత మన్ననలు అందుకుంటున్న ప్రజానాయకుడు గౌరవనీయ ఎమ్మేల్యే గారు శ్రీ ఆత్రం సక్కు గారు చొరవతీసుకుని లింగాపూర్ మండల ప్రజల కష్టాలను అర్థంచేసుకుని వారి దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించినందుకు లింగాపూర్ మండలవాసుల తరుపునుండి ప్రత్యేక ధన్యవాదాలు...!

No comments:

Post a Comment

Thank you So Much for your Useful Suggestion..!!