Followers

Friday, July 21, 2023

విశ్వ కోయ - గోండి భాష దినోత్సవం |Gondwana Channel|

 విశ్వ కోయ - గోండి భాష దినోత్సవం 

సందర్భంగా...

     ప్రపంచీకరణలో భాగంగా మొదలైన భాష, సాంస్కృతిక విధ్వంసం ఆదివాసీలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నది. దీనితో పలు భాషలు అంతరించిపోతున్నాయి.  వీటిలో కోయ(గోండీ) భాష కూడా ఒకటి. భారత దేశంలో ఆస్ట్రెక్ , ద్రవిడియన్, సినో టిబెటన్ ఇండో యూరోపియన్ నాలుగు భాషా కుటుంబాలు కాగా  రెండవ కుటుంబమైన ద్రవిడియన్ విభాగములో కోయ భాష చెందుతుంది.



   యవ్వ (తల్లి) గర్భం నుంచి పుట్టిన  లిపి లేని కోయ భాషను  బ్రతికించుకోవడానికి చిన్న ప్రయత్నం జరుగుతున్నది. కోయ భాషను మాట్లాడే రాష్ట్రాలు అంధ్రప్రదేశ్, తెలంగాణా, ఒడిషా, ఛత్తీస్ గడ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు కాగా మాండలికాల్లో కొద్దిపాటి తేడా ఉంటుంది. 




   కోయ  తెగను గోండ్, దొర్ల, మురియా , కుయిగా పిలుస్తారు. నెయ్, ఎడ్జ్, కల్క్, కెల్క్ , ఏర్  మొదలగు పదాలు ఒకే విధంగా ఉచ్చరిస్తారు, ఈ భాషను నాలుగు కోట్ల మంది మాట్లాడుతారు.


☆☆ భాష పరిరక్షణ ఎందుకు..?


      భాష అంటే కేవలం భావ ప్రకటనా మాద్యమమే కాదు. మనిషి అస్తిత్వపు జాడ.  సంస్కృతి, ఆత్మగౌరవ ప్రతీక. అంతరంగాన్ని ఆవిష్కరించే ఒక సాధనం. మనోభావాలు, హక్కులు రక్షించే వారసత్వ సంపద. అది నిత్యం పారే జీవనది లాంటిది. ప్రకృతితో మమేకమై జీవించే ఆదివాసీకి ఇది మరింత అపురూపమైనది. దీనిని పదిల పరచి భావి తరాలకు అందించవలసిన బాధ్యత అందరిపైనా ఉంది.


కోయ నిఘంటువు.


    లిపిలేని కోయ భాషకు వివిధ రాష్ట్రాల అధికారిక భాషలను కలిపి నిఘంటువును తయారు చేసే ప్రక్రియ ప్రారంభమయింది.  దీని కోసం మొదటి వర్క్ షాప్ గాంధీ స్మృతి దర్శన  కల్చరల్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వారి సహకారంతో 2014 జులై 21 నుంచి 25 వరకూ, రెండవ వర్క్ షాప్ ఆగస్టు 24 నుండి 29 వరకు కన్నడ యూనివర్సిటీ సహకారంతో హంపిలోనూ, మూడో వర్క్ షాప్ 25 నుండి 29 వరకు 2014 లో మధ్యప్రదేశ్లో అమర్ కంటక్ ట్రైబల్ సెంట్రల్ యూనివర్సిటీ నిర్వహించడం జరిగింది. 


     నాలుగవ వర్క్ షాప్ డిసెంబర్ 10 నుంచి 15 వరకు 2014 ఉట్నూర్ గిరిజన సమీకృత అభివృద్ధి  సంస్థ సహకారంతోనూ, ఐదవ  వర్క్ షాప్ మార్చ్ 12 నుంచి 16 వరకు 2015 భద్రాచలం గిరిజన సమీకృత అభివృద్ధి సంస్థ సహాయంతోనూ, ఆరవ వర్క్ షాప్ నవంబర్ 21 నుంచి 25 వరకు 2015 చంద్రపూర్ ఆదివాసి శిక్షణ సంస్థ సహాయంతోనూ, ఏడవ  వర్క్ షాప్ జనవరి 9 నుంచి 14 వరకు కన్నడ యూనివర్సిటీ సహకారంతోనూ, ఎనిమిదవ వర్క్ షాప్ ఆగస్టు ఢిల్లీలో 2017 లో జరిగింది. భారత రాజ్యాంగం లోని  ఎనిమిదో షెడ్యూల్  ప్రకారంగా కోయ (గొండి) భాష కు గుర్తింపు కోసం 2017, జులై 21 న  కోర్ కమిటీ   కోయ భాష దినోత్సవాన్ని ప్రకటించడం జరిగింది.


 విశ్వ కోయ -- గోండి భాష దినోత్సవం

 నా ఆదివాసి సమాజానికి ఇవేనా శుభాకాంక్షలు .


 మీ 

కారం సీతారామన్న దొర (ఢిల్లీ బాబు),

కన్వీనర్,

జాతీయ ఆదివాసి సంరక్షణ సమితి,

ఆంధ్ర ప్రదేశ్/ తెలంగాణ.

Tuesday, July 11, 2023

మైపతి అరుణ్ కుమార్ కి డాక్టరేట్ ప్రదానం చేసిన కాకతీయ యూనివర్సిటీ Gondwana Channel

మైపతి అరుణ్ కుమార్ కి డాక్టరేట్ ప్రదానం చేసిన కాకతీయ యూనివర్సిటీ.


6 సంవత్సరాల ఆదివాసి హక్కుల పరిశోధనకు అరుదైన గౌరవం.



     తన తండ్రి ఉపాధ్యాయునిగా కొనసాగింపు, తన తండ్రి అడుగు జాడల్లో విద్యపై మక్కువ ఎక్కువగా పెంచుకొని 10 వ తరగతి వరకు గురుకుల విద్యను పొంది, చిన్న తనం లోనే అమ్మ నాన్న లను కోల్పోయి అనాథగా మారి తన కుటుంబ ఆర్థిక స్థితుల మేరకు తన మండల కేంద్రంలోని జూనియర్ కాలేజీలో ఇంటర్ విద్యను పూర్తి చేసుకొని, డిగ్రీ SDLC లోని దూర విద్య లో ఎడ్యుకేషన్ లో పూర్తిచేసి యూనివర్సిటీలో పరిచయాలు ఏర్పడి MA(పబ్లిక్ అండ్ పొలిటికల్ సైన్స్) పూర్తి చేసి ఇదే యూనివర్సిటీలో PhD సీటు సాధించటం ఒక విశేషం.



    PhD పరిశోదన విద్య లో దేశవ్యాప్తంగా ఆదివాసీలకు ప్రత్యేకంగా కేటాయించిన రాజ్యాంగ హక్కుల అమలులో 75 ఏళ్లుగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుపై ADMINISYRATION OF TRIBAL DEVELOPMENT IN 5TH AMD 6 TH SCHEDUL AREAS - A CAMPARATIVE STUDY అనే అంశం పై ప్రో" టి.యాదగిరి రావు గారి పర్యవెక్షణలో 6 సంవత్సరాల పాటు ఈశాన్య భారత దేశంలోని మేఘాలయ, అస్సాం, మిజోరాం, మణిపూర్ లలో మధ్య భారత దేశంలోని 18 రాష్ట్రాలలో  క్షేత్ర పరిశోదన చేసి  PhD ని పూర్తిస్థాయిలో ఈరోజుకు పూర్తి చేయటం ఆదివాసి సమాజానికి ఎంతో ఉపయోగకరం. ఆదివాసి సమాజ భవిష్యత్తును అస్తిత్వం నీ ఆదివాసి ఉద్యమంతో పాటు, తన పరిశోధనలో బాగం చేసుకోవటం మైపతి ఉద్యమం పట్ల ఉన్న నిబద్ధతకి నిదర్శనం తెలంగాణ నుండి ఈశాన్య భారత దేశంలోని 6వ షెడ్యూల్ లో  ఆదివాసీల జీవన స్థితి గతులపై, మధ్య భారత దేశం లోని ఆదివాసీల జీవన స్థితిగతులు విద్య వైద్యం, వ్యవసాయం, ఎంప్లాయ్ మెంట్, ఆదివాసి స్వయం పాలన ఐటిడిఏ ల పని తీరు నీ సూక్ష్మంగా అధ్యయనం చేసి తిసేస్ రూపం లో అందించటం జరిగింది.



    విద్యార్థి దశ నుండి ఆదివాసి ప్రాంతాలు, ఆదివాసి విద్యార్థుల సమస్యలు, ఆదివాసీల హక్కులపై క్రమానుగంతంగా అధ్యయనం చేయటం వాటిపై పోరాడుతున్న సంస్థలు, సంఘాలు హక్కుల సంఘాల దళిత, బహుజన పోరాటాలు ప్రజాస్వామిక హక్కుల ఉద్యమాలు ప్రత్యేక ప్రాంత పోరాటాల తో క్రియాశీలకంగా పరిశీలన చేయటం వాటిలో పాల్గొని విశ్లేషించుకుంటూ ప్రమాణగతంగా మాట్లాడటం పద్ధతిగా, క్రమశిక్షణతో నైతికతతో మేల్గటం, పుస్తక పరంతో వ్యక్తిత్వాని  పెంచుకొనటం మంచి మాటకారిగా మంచి రచయితగా  వ్యక్తిత్వాన్ని మలుచుకోవటం జరిగింది. ఆదివాసి సమూహాల జాతుల చారిత్రత్మక అంశాలపై లోతుగా అధ్యయనం చేయటం వాటిని పుస్తకాలలో నిక్షిప్తం చేయటం సమాజానికి తన జాతుల అంశాలను అందివ్వటం వ్యక్తిత్వంగా మార్చుకొనడం జరిగింది. చరిత్ర తెల్సుకొలేనీ వాడు చరిత్ర నిర్మాణం చేయలేడు అన్న డా" బి. ఆర్. అంబేద్కర్ గారి ఆలోచన ను మైపతి మరువలేదు అందుకే చరిత్ర కోసం నిత్యం పరిశోధనలో ఉంటాడు.


      మహిళా సమస్యలు, వారి హక్కుల జెండర్ ఈక్వేషన్స్, వారి పోరాట సంస్థలు, వారి హక్కుల ఉద్యమాలపై అవగాహన కలిగి ఆదివాసి స్త్రీల సమస్యలు ఆదివాసి సమాజంలో ఆదివాసి స్త్రీల పాత్ర, ఆదివాసి సంస్కృతిలో వారి భాగస్వామ్యం, స్త్రీని ఆదివాసి సమాజం గౌరవాడే తీరును పరిశీలన అధ్యాయనం క్రియాశీలకంగా పాల్గొనటం ఆదివాసి స్త్రీల విద్యను పెంపొందించటం లో కృషి చేయటం తన అలవాటుగా మార్చుకొని కొనసాగడం జరుగుతుంది.


    తెలంగాణ ఉద్యమంలో ఒక యూనివర్సిటీ విద్యార్థిగా క్రియశీలకంగా పాల్గొని బస్సు యాత్రలు, ధర్నాలు రాస్తారోకోలు, రైలు రోకోలు బంద్ లు, బహిరంగ సభలు సకల జనుల ఉద్యమం లో పాల్గొని ASU విద్యార్థి నాయకుడిగా తన జాతి ఆదివాసి విద్యార్థులను మమేకం చేసి తెలంగాణ ఉద్యమాలలో పాల్గొనేటట్లు చేయటం జరిగింది.


        తన జాతి ప్రత్యేక ఉద్యమాలలో క్రియాశీలకంగా పాల్గొంటూనే సామాజిక ఉద్యమాలలో పాల్గొంటూ అన్ని వర్గాల హక్కులపై సమస్యలపై అవగాహనను పెంచుకొని తన పాత్రను సామాజికంగా పెంపొందించుకోనడం జరిగింది స్వర్గీయ KU నుంచి prof Dr.Biyala.Janardhan Rao గారి స్ఫూర్తితో ASU ఆదివాసి విద్యార్థుల చైతన్యం హక్కుల కోసం కృషి చేసే విధంగా తుడుం దెబ్బ ఉద్యమంలో ఆదివాసీలను చైతన్యపరచటం హక్కుల కోసం పోరాటం చేయడంలో అనేక పదవులను రోహించి తెలంగాణ ఒక రాష్ట్రం కావాలి ఆదివాసీలకు పాలించుకునే హక్కు కావాలి తమ ప్రాంతం పై తమకే హక్కు ఉండాలనే కాన్సెప్ట్ తో ఉద్యమిస్తున్న ఆశ కిరణం మైపతి అరుణ్ కుమార్.


  దేశవ్యాప్తంగా ఆదివాసి ప్రాంతాలు పై ఆదివాసీల చరిత్ర, సంస్కృతి, గత ఆదివాసి పోరాటాలు వర్తమాన ఆదివాసీ పోరాటాలపై స్పష్టమైన అవగాహన ఆదివాసీలపై దేశవ్యాప్తంగా గ్లోబలైజేషన్ ప్రభావాలపై అవగాహన.సరళి కరణ,గ్లోబలికరణ, ప్రపంచీకరణ, కంప్యూటరీకరణ అంశాల ప్రభావాలు ఆదివాసీల ఉనికి మనుగడ, అస్తిత్వం పై వాటి ప్రభావాలు కళ్ళకు కట్టినట్లు వివరించే తత్వం మైపతి అరుణ్ కుమారు ది, ఈ దేశం లో నిజమైన నాగరికత శాస్త్రీయ మూలం ఆదివాసీల ధి అని ఆదివాసి లే ఈ దేశం మూల శాస్త్ర వేత్తలు అని సింధు నాగరికత నుండి నేటి వరకు ఈ దేశానికి బ్రతుకు నీ నేర్పింది ఆదివాసీలు అని బలంగా తన వాని నీ వినిపించే వ్యక్తి ఆదివాసి నీ అనాగరికునిగా సృష్టిస్తే జీర్ణించుకోలేని వ్యక్తి  ఈ తరం ఆదివాసీ మేధావిగా మనం చూడొచ్చునట్లుగా కనిపిస్తాడు. 


  ఎది ఏమైనా ఆదివాసీల శ్వాస ఆదివాసి ఉద్యమ ఆకాంక్ష మైపతి కి ఆదివాసి సమాజం తరుపున డాక్టరేట్ వచ్చిన సందర్భంలో లో ప్రత్యేక అభినందనలు….!!


ఇట్లు

కాకతీయ యూనివర్సటీ జాక్ ( KU JAK) వ్యవస్థపక అధ్యక్షులు

డా " మంద.వీరాస్వామి

సిద్ధబోయిన లక్ష్మినారాయణ 

తుడుందెబ్బ రాష్ట్ర వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి.

Saturday, July 8, 2023

కుంరం భీం నూతన విగ్రహావిష్కరణ |Gondwana Channel|

కుంరం భీం నూతన విగ్రహావిష్కరణ

   ఆదివాసి పోరాట వీరుడు, అమర జీవి కుమ్రం భీమ్ నుాతన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లోని కుమ్రం భీమ్ చౌక్ నందు తేది: 10/07/2023 సోమవారం రోజున సాయంత్రం 5 గంటలకి ఘనంగా  నిర్వహించడం జరుగుతుందని ఆదిలాబాద్ కుమ్రం భీమ్ విగ్రహ ఆవిష్కరణ ఉత్సవ కమిటీ వారి కొరెంజన్. 



       కావున సమస్త ఆదివాసి సమాజం తో పాటు అన్ని సామాజిక వర్గాల ప్రజలు పాల్గొనలని ఉత్సవ కమిటీ సాదర పుార్వకంగా ఆహ్వనిస్తోంది. విగ్రహ ఆవిష్కరణ ముఖ్య కార్యక్రమంకి ముందు డోల్క్, కాళికోం, పెప్రెంగ్ మరియు ఆదివాసి కళా ప్రదర్శనలతో 4 గంటలకి ర్యాలీ ప్రదర్శన మల్టీ పర్పస్ గ్రౌండ్ నుండి కుమ్రంభీమ్ చౌక్ వరకు నిర్వహించడం జరుగుతుందని విగ్రహ ఉత్సవ కమిటీ తెలుపుతున్నాము. ఆదివాసి సమాజ చిన్న, పెద్దలు,  గ్రామ పటేల్, రాయ్ సెంటర్ సభ్యులు, సర్పంచులు, విద్యార్థులు, కుల సంఘాల మరియు రాజకీయ నాయకులు, మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరు పాల్గొని విజయవంతం చేయాలని ఆదిలాబాద్ కుమ్రం భీమ్ విగ్రహ ఆవిష్కరణ ఉత్సవ కమిటీ మనవి. 

జై కుమ్రం భీమ్ జై జై కుమ్రం భీమ్.!!

Thursday, July 6, 2023

విజయాన్ని అశ్వాదిద్దాం Gondwana Channel

 విజయాన్ని అశ్వాదిద్దాం


మంగపేట గెలుపుకు కారణమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుందాం....!!!!


మంగ పేట సుదీర్గపోరాటం సువర్ణాక్షరాలతో లిఖించదగినది.



ఆదివాసీల తరుపున వాదనలు వినిపించి చిరస్మరణీయమైన విజయాన్ని అందించిన గౌరవ నీయులు ఆదివాసి పక్షపాతి అడ్వకేట్ చిక్కుడు  ప్రభాకర్ గారికి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియ జెద్దాం..!!

మరియు వారి బృందానికి వారికి సహకరించిన ఆదివాసీ సంఘాలకు, నాయకులకు కూడా ఉద్యమ వందనాలు తెలువుదాం..!


ఈ విజయం ఆషామాసి విజయం కాదు. ఆదివాసీల అస్థిత్వాన్ని కూల్చే కుట్రను 75 ఏండ్లుగా ఎదురొడ్డి పోరాడి సాధించిన విజయం. వివరణకు అక్షరాలు సరిపోవు. గిరిజనేతర కుట్రలకు ఇది గొడ్డలి పెట్టు. ఆదివాసీలు సంబురాలు జరుపుకునే సమరోత్సాహం ఇది..!!


ఎన్నో ఎండ్లుగా మంగపేట మండలంలోని 23 గూడెంల ఆదివాసీల అభివృద్ధి మరణశయనం పై పడకేసింది.

అసలు అభివృద్దే లేదు, విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో ఆదివాసీల ఉనికే కనుమరుగై పోయింది.


కనీసం గూడెంకో సర్పంచ్ లేడు, ఎంపీపీ లేడు, జెడ్పీటీసీ లేడు. అసలు 25 ఏండ్లుగా ఎన్నికలే లేవు. ప్రజాస్వామ్యమే సిగ్గుతో తలవంచుకుంది. ఈ దేశంలో మంగపేట ఆదివాసీలు నష్టపోయినంతగా మరెవ్వరూ నష్టపోయి ఉండరూ. ఇది అనుభవించిన స్థానికులకే అర్థమౌతుంది..!



ఒకసారి కోర్టులో గెలుపు మరో సారి మలుపు నమ్మిన లాయర్ లే నట్టేట ముంచిన వైనం అయిన ప్రయత్నం వదలని పోరాటం. కాలం కూడా అలిసిపోయింది. కాసులు కూడా కరిగి పోయాయి. ఆశలు ఆవిరై పోయాయి. ఆలోచనలు రాసులై పోయాయి. కానీ ఉడుం పట్టేదో ఉక్కు పట్టులా నిలిచింది. నిందల్ని మోస్తూనే నిలబడి గెలిచింది. 23 ఆదివాసీ గూడెంలు 5వ షెడ్యూల్ DNA టెస్ట్ లో తమ మూలలను నిరూపించుకున్నాయి. కానీ జరిగిన నష్టం పూడ్చలేనిది..!!


ఈ గెలుపు వెనుక అలువురుగని పోరాట సంఘాలున్నాయి. పట్టు వీడని విక్రమార్కులున్నారు. వారు అందరికి పేరు పేరున కృతజ్ఞతలు.


నేను మాత్రమే కాదు

మీరు కూడా కృతజ్ఞతలు 

తెలుపండి. ఇది గెలుపు చరిత్ర..!!!!

-Milky Adivasi 

Monday, July 3, 2023

చదువులకు పట్టాలు కావాలి Gondwana Channel

 చదువులకు పట్టాలు కావాలి


గూడెం చదుల్ని పట్టాల పైకి ఎక్కించండి పట్టాలు ఇప్పించండి.


పోడుకు పట్టాలొచ్చాయ్

చదువులకొద్దా...పట్టాలు..!!


గూడెం లో చదువు సచ్చిపోతోంది... ఇది గూడెం వినాశనానికి సంకేతమే.!



ఆదివాసి జాతి అంతం మొదలైంది.

ఆదివాసీల చదువుల పనైపోయింది... పసలేదు

పట్టింపు లేదు.

చదువులకు పట్టాలు లేవు.


పోడుకు పట్టాలొచ్చాయ్

మరి గూడెం పోరగాండ్ల చదువుల పట్టాల సంగతేంది...వద్దా..?

చదువులకు పట్టాలు లేకనే కదా...ఈ కట్టాలు..!

మన గూడెం లో చదువు రాని మోటు గొడ్డలి 10 ఎకరాల భూమికి పట్టా తెచ్చింది.

అన్నీ తెలుసని విర్రవీగిన కలం 20 ఏండ్ల చదువుకు పట్టా  తేలేదు పట్టాభి షేకము లేదు.


ప్రతి గూడెం లో

చదువులకు పట్టాలు కావాలి.

NEET పట్టాలు

IIT పట్టాలు

IAS పట్టాలు

IPS పట్టాలు

ఎంసెట్ పట్టాలు

లాసెట్ పట్టాలు

ఉన్నత చదువులన్నింటికి పట్టాలు కావాలి కదా...

ప్రాణం లేని భూమికేనా పట్టా..

పేగు తెంచుకోని పుట్టిన నీ బిడ్డల చదువులకు పట్టాలు వద్దా.? వాళ్ళను ఉన్నతంగా చదివించడం...పట్టాలు ఇప్పించడం నీ బాధ్యత కాదా...ముమ్మాటికీ నీదే..!!


చైతన్యం సంకనాకుతోంది,

నిర్లక్ష్యం నిలువునా ముంచుతోంది,

అభివృద్ధి ముసుకులో అజ్ఞానం రాజ్యమేలుతోంది.

అహంకారపు అంధకార ముసలం పుట్టింది...ఇది అంతమే...ఖతం...సర్వం హతం...!!

చదువులకు పుట్టగతులు లేవు... ఇగ పుట్టేటోనికి పునాదులు లేవు. కండ్ల ముందున్న రిజర్వేషన్ల ను కావురమెక్కి కాళ్ళతో తన్నుకొని బొక్క బోర్ల పడింది జాతి.

ఎందుకో...తెలుసుకో..!!

తెలుసుకోని నీవు చేసేది కూడా ఏమి లేదు...అయినా తెలుసుకో..!!


ST కోటలో 20 MBBS సీట్లు ఉన్నప్పుడు నలుగురు ఆదివాసీలు డాక్టర్ లు అయ్యారు...ఆ తర్వాత DMHO లు కూడా అయ్యారు..దిగిపోయ్యారు.ఇది 40 ఏండ్ల కిందటి ముచ్చట.ఇంజినీర్లు కూడా గంతే.

నేడు MBBS లో

460+ govt కోటా 

200+ ప్రైవేట్ కోటా

200+ సెంట్రల్ కోటా

   ఇన్నిన్ని సీట్లు ఉన్నప్పుడు ఒక్కరు కూడా డాక్టర్ లు కాలేక పోతున్నారు...IIT/JEE...సివిల్స్...మిగతా కోర్సు ల సంగతి కూడా ఆంతే...ఏమై పోతోంది ఆదివాసీ సమాజం..?

ఎందుకని ఒక్కరు కూడా డాక్టర్లు, ఇంజినీర్లు, కలెక్టర్ లు కాలేక పోతున్నారు.

ఈ జాతి నిజంగానే ఎడ్డిదై పోయిందా...?

రిజర్వేషన్ శాతం పెరిగింది,

సీట్లు పెరిగాయి,

చైతన్యం పెరిగింది,

సమాచారం పెరిగింది,

సౌకర్యాలు పెరిగాయి.

కానీ

ఆదివాసీల వాటా పెరగలేదు,

కోటా పెరగలేదు,

 కనీసం neet ,ఐఐటీ,సివిల్స్ కు apply కూడా చేసుకోలేని దౌర్భాగ్యపు నిర్లక్ష్యాన్ని పెంచి పోషిస్తున్నదేవరు.? ఈ ఎడ్డీ మా లోకాన్ని బాగుపరిచేది ఎవరు.? ఈ నిర్లక్ష్యం ధోరణిని పెంచుతున్నదేవరు.

Neet, ఐఐటీ,సివిల్స్

ఒక్కసారి రాస్తే...సీట్ వచ్చే కాలం పోయింది.

సీట్ వచ్చే వరకు exam రాసే కాలమొచ్చింది.

కానీ

మనోళ్లు apply కూడా చేసుకోవడం లేదంటే చదువుల చైతన్యం ఎక్కడ సంకనాకి పోతోంది. పోనీ ఉద్యోగులకేమి మాయరోగమొచ్చింది ఉన్నోళ్లకేమి పాడు రోగమొచ్చింది. చేజేతుల తమ పిల్లలు చదువుల్ని తామే చిదిమేస్తున్నారు.

ఈ ఎడ్డీ నిర్లక్ష్యం ఎవ్వరిది.


Bipc గ్రూవు తీసుకోని ఎంసెట్ రాస్తే mbbs సీట్ వచ్చే కాలం పోయి, mpc కూడా గంతే, సివిల్స్ కూడా అంతే

నారాయణ,శ్రీచైతన్య ,ఆకాష్,

allen etc... కాలేజీ లలో చదివి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటేనే సీట్ వచ్చే కాలమొచ్చింది. కాని ఆదివాసీలు చదువులను నిర్లక్ష్యం చేసుకోని పిల్లల గొంతు కొస్తూ, చదువులను చిదిమేస్తున్నారు. ఉన్న టేర్మ్ లను ఉపయోగించు కోవడమే తెలియదు. లాంగ్ టర్మ్ వైపేవ్వడూ చూసిండు. అవకాశం ఉన్నోళ్లు కూడా చదివించడం లేదంటే ఈ ఎడ్డీ చైతన్యం ఎవ్వరిది..?


460 mbbs  సీట్లు

5000 ఐదు వేల ఇంజినీరింగ్ సీట్లు రాష్ట్ర ,దేశవ్యాప్తంగా ఉన్నా అన్ని యూనివర్సిటీ లలోని వేలాది టెక్నికల్ నాన్ టెక్నికల్ సీట్లు   ఏకపక్షంగా వాళ్లకు పోతుంటే. అవకాశమున్నోళ్లు కూడా తమ పిల్లల్ని చదివించుకోకపోతే ఈ ఎడ్డీ సమాజాన్ని బాగుచేసేది ఎవ్వరూ....?

  అయ్యా ...ఆఖరికి ఉచ్ఛిత neet,సివిల్స్ఐటీబీ కోచింగ్ కు కూడా apply చేసుకోవడం లేదు. పోనీ ప్రతి ITDA పరిధిలో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసుకునే తెలివి లేదు. చదువుల మీద ఆలోచన లేదు. ఇంత అద్వాన్నపు బరి తెగింపు నిర్లక్ష్యంలో మునిగి తేలుతూ తీరుకో జెండా ఎత్తుతారు. రోజుకో పోరాట మంటారు. చదువుకూడా పోరాటమే కదయ్యా కాసేపు పచ్చడి నాకుడు ఆపి ఆలోచించమని అడుగుతోంది గిరిజాబాయి మన గిరిరాజు నాకింది నెమరేసుకుంటూ నీళ్ళు నములుతూ కండ్లు బైర్లు కమ్మి  నెత్తి గోకుకుంటూ నేలవంక...!!చూస్తున్నాడే గాని సమాధానం మాత్రం చెప్పడం లేదు చెప్పడు పెగ్గేసుడు పచ్చడి నాకుడు తప్పా పిల్లల చదువుల మీదా పట్టింపే లేదు సమాధానం రాదు. నౌకరోళ్ళు,పొలిటికలోళ్ళు,పోరాటపోళ్ళు,చదువుకున్నోళ్లు అందరూ పచ్చడి నాకుడుకే సరితూగుతున్నారు. చదువుల పట్టింపు ఎవ్వరికీ లేదు.? ఎవరి కడుపులో పుట్టినా గొప్ప చదువులకు అక్కరకు రాని చెత్తకుప్పల్ని చేజేతులా చేసుకుంటున్నారు పిల్లల్ని..

మీరైనా... చెప్పండి

ఆదివాసీ జాతికి ఏమైంది

ఇంత పిసిని గొట్టు...బరితెగింపు...అద్వాన్నపు...అంధకారపు నిర్లక్ష్యమా...అదీ తమ కడుపులో పుట్టిన పిల్లల చదువుల మీదా...!!

చదువులు లేకుండా

రిజర్వేషన్లు ఉండేమి లాభం

ఈ నిర్లక్ష్యం ఎవ్వరిది....ఓ తండ్రి ఈ నిర్లక్ష్యం...నీదే...ముమ్మాటికీ నీదే...నీవు పచ్చడి నాకుడు ఆపితే...పిల్లల చదువులు సాగుతాయి..!!

అమ్మయ్యా...పూర్తిగా చదివి నందుకు ధన్యవాదాలు

కనీసం...మీ కడుపున పుట్టిన  పిల్లలనైనా... ఉన్నతంగా...చదివించండి..!!

మీ గూడెంలో హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసుకునేందుకు సహకరించండి...లేదంటే హతం...ఖతం... భూస్థాపితం..!!

పోరాడి పోడుకు పట్టాలు సాదించినట్లే

పోరాగాండ్ల చదువులకు పట్టాలు ఇచ్చే పోరాటాన్ని భుజానికెత్తుకొండి..!!

గూడెం  చదువుల్ని పట్టాల పైకి ఎక్కించండి..!!

జై సేవా..!!

జై ఆదివాసీ..!!

-Milky Adivasi 

Sunday, July 2, 2023

గోడం రామారావు గారి సేవలు చిరస్మరణీయం Gondwana Channel

 గోడం రామారావు గారి సేవలు చిరస్మరణీయం




    మాజీ మంత్రివర్యులు మాజీ ఎమ్మెల్యే గోడం రామారావు గారి 91వ జయంతి ఇచ్చోడలో ఘనంగా జరిగింది. గోడం రామారావు గారి తనయుడు మాజీ మంత్రివర్యులు గోడం నగేష్ గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. గోడం రామారావు గారు చేసిన సేవలు మరువలేనివని మంత్రిగా ఎమ్మెల్యేగా అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం చేసిన ఘనత గోడం రామారావుకి దక్కుతుందని అన్నారు. ప్రత్యేకమైన జీవోలు తీసుకువచ్చి జిల్లాకు అనేక ఉద్యోగాలు కల్పించిన ఘనత రామారావుకే దక్కుతుందని అన్నారు. ఆయన అడుగుజాడల్లో మనమందరం ముందుకు నడవాలని కొనియాడారు.  



          ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు గోడం నగేష్, తాంసి జడ్పీటిసి తాటి పెళ్లి రాజు, బోథ్ ఎంపీపీ శ్రీనివాస్,  ఎస్సీ ఎస్టీ మాజీ కమిషన్ సభ్యురాలు నీలాబాయి, మాజీ జడ్పీటిసి కనక తుకారాం, జీవ వైవిధ్య కమిటి సభ్యులు మర్సుకొల తిరుపతి, బిఆర్ఎస్ పార్టీ సభ్యురాలు సుమన్ బాబు,‌ ఉట్నూర్ ఎంపీపీ పంద్ర జైవంత్ రావ్, ఎంపీపీ,  ఎంపీటీసీ, సర్పంచ్, మాజీ ఎంపీపీ, మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్, గోడం రామారావు గారి వంశస్థులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఉట్నూర్ ఐటీడీఏ పి ఓ గా చాహత్ బాజ్పయ్ Gondwana Channel

ఉట్నూర్ ఐటీడీఏ పి ఓ గా చాహత్ బాజ్పయ్.


       ఆసిఫాబాద్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విధులు నిర్వహిస్తున్న చాహత్ బాజ్పయి నీ ఆదివారం ఉట్నూర్  ఐటిడిఏ గా బదిలీ చేస్తూ ముఖ్య కార్యదర్శి కార్యాలయం నుండి ఉత్తర్వులు రావడం జరిగింది.
చాహత్ బాజ్పయ్ IA̺S̺ ఆంధ్ర ప్రదేశ్ క్యాడర్ అదికారి  తల్లి  ఉషా, తండ్రి  ఆర్ పి బాజ్పేయి. బాల్యం నుంచి ఎలక్ట్రిక్  ఇంజనీర్  చేయాలని కోరిక. అందుకు ఐఐటి గోరక్ పుర్ జేయియి చేశారు. తర్వాత  U̺P̺S̺C̺  రాయాలని నిర్ణయించారు రేండు సార్లు విపలమై  చివరికి  59ర్యాంక్ తో  U̺P̺S̺C̺  2018లో సాదించారు.



                    చాహత్ బాజ్పయ్  గారు మెదటగా  ఆంద్రప్రదేశ్ లో అసిస్టంట్  కలెక్టర్ గా U̺/̺T̺  వెస్ట్ గోదావరి  జిల్లాల ఎలుర్ లో విదులు   నిర్వహించారు.  తరువాత  పదోన్నతి పై సబ్ కలెక్టర్ గా కర్నూల్  జిల్లా నంద్యాల సబ్ డివిజన్  లో పని చేశారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సబ్ కలెక్టర్ గా విధులు ననిర్వహించి ఇప్పుడు  మన  ఉట్నుర్ ఐ.టి.డి.ఎ. పివో గా నియమితులైనారు. ఉట్నూర్ కు రెగ్యులర్ పీవో లేనందున అదివాసిలకు  పరిపాలన సరిగా జరగా లేదు. దీని పై అదివాసి  సంఘాలు   ప్రజా ప్రతినిధులు   అదివాసిలు రెగ్యులర్ పివో మాకు కాలని  కోరడంజరిగింది. ఇప్పుడైన మన సమస్యలు  తీరాలని కోరుకుందాం..!!

-గంగాధర్ తరోటే 

Gondwana Kabur