Followers

Monday, August 31, 2020

ఒకే గూటిలో ఒకే వేదికలో తుడుందెబ్బ ||Gondwana Channel||

ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ  తెలంగాణ రాష్ట్రం 3 విభాగాలుగా  ఉన్నా సందర్భం మనందరికీ తెలుసు  ఈ రోజు  మూడు కార్యవర్గ సభ్యులు  ఒకే గూటిలో  ఒకే వేదికలో రావడం ఆడివాసిలకి ఒక చారిత్రాత్మక వార్త    నిర్ణయం జాతికి అంకితం,    ఈ మూడు కార్యవర్గ సభ్యులు ఒక్కటి అవడానికి  గత కొన్ని రోజులనుండి  చర్చ సమావేశాలు నిర్వహించి. అందరిని ఒప్పించి  భిన్నత్వంలో ఏకత్వం రావడానికి చేసిన కృషి ఇంత అంత కాదు.  ఇక ముందు సంఘ రాజకీయా విభేదాలు  లేకుండా ఆదివాసీ తొమ్మిది తెగలను  సమాజ మేధావులను, రాజకీయ మేధావులను ఒకరినొకరు గౌరవిస్తూ, సమాజం కోసం నిరంతరం లక్ష్య సాధన దిశగా శ్రీ గౌరవ ఆదివాసీ ముద్దు బిడ్డ  ఉద్యమనేత  సోయం బాపురావు పార్లమెంట్ సభ్యులు ఆదిలాబాద్ గారి అధ్యక్షత న ఎలాంటి వర్గ విభేదాలు లేకుండా ఉద్యమాన్ని అందరిని కలుపుకొని  ముందుకు పోవాలని ఈ సమయం కోసమే ఒకరిని ఒక్కరు విమర్శలు చేస్తూ మనోభావాలను దెబ్బ తీయకుండా, సమనవ్యయంతో శాంతియుతంగా కొంత కాలం వేచి ఉండాలని రాష్ట్ర జిల్లా కార్యవర్గాన్ని  విజ్ఞప్తి చేయడమైంది. సూచన సలహాలను గౌరవించి ఓపికతో ఉండి సహకారాన్ని అందించి ఈ నిర్ణయ సందర్భంలో యావత్తు ఆదివాసీ సమాజం  తరపున ప్రత్యేక ధన్యవాదాలు మీ ఆదివాసీ.

No comments:

Post a Comment

Thank you So Much for your Useful Suggestion..!!

Note: Only a member of this blog may post a comment.

Gondwana Kabur