Followers

Saturday, August 22, 2020

మర్లవాయి గ్రామములో హైమాన్ డార్ఫ్ గిరి విద్యాలయం ప్రారంభం |Gondwana Channel|

 మర్లవాయి గ్రామములో హైమాన్ డార్ఫ్ గిరి విద్యాలయం ప్రారంభం.
  ప్రపంచ మహమ్మారి covid 19 (కరోనా వైరస్) వలన  దాదాపు  5 నెలల నుండి విద్యకు దూరం   అయిన విద్యార్థులు. 
 మన ఊరు..మన పిల్లలు.. మన బడి...మన టీచర్లు.. మన   బాధ్యత ...మనం మన వాళ్లకు చదువు  చెప్పాలని గ్రామంలో ఉన్న ఉపాధ్యాయులు D.Ed,B.Ed.B.PEd.ఆర్ట్స్ ఉపాద్యాయలు మరియు గ్రామ యువత ముందుకు వచ్చి స్వచ్ఛంద విద్య బోధన చేస్తున్నాము. ఆదివాసుల చరిత్ర గలా గ్రామమైన మర్లవాయి లో  ఇప్పటికి ఏ  మొబైల్ నెట్ వర్క్ లేదు. ప్రభుత్వం ఆన్లైన్ క్లాస్ ద్వారా చుదువు చెప్పాలని  ఆదేశించడంతో మా ఊరు ఉన్న  విద్యార్థులకు ఎలాంటి విద్య అందకుండా పోతుంది అని పిల్లల భవిష్యత్ కొరకు 
ఈ నిర్ణయం తీస్కోని
హైమాన్ డార్ఫ్ గిరి విద్యాలయం
ఈ రోజు  (21-౦8-2020 శుక్రవారం) ఆదివాసీ  పోరాట వీరుడు కుంరం భీం మరియు ఆదివాసుల  ఆత్మ బందువు ప్రొ!! హైమాన్ డార్ఫ్ & బెట్టిఎలిజబెత్ గార్ల చిత్రపటలకు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించడం జరిగింది.
 👉covid-19 నిబంధనలను పాటిస్తూ 1వ తరగతి నుండి 10 వ తరగతి వరకు 130 మంది విద్యార్థులతో భౌతిక-సామాజిక  దూరం పాటిస్తూ 30 మంది ఉపాధ్యాయులం స్వచ్ఛంద విద్య బోధన మొదలు పెట్టడం జరిగింది. "పిల్లల చదువు📚 అందరి బాధ్యత"  
అందరూ చదవాలి📓 అందరూ ఎదగాలి అని
మేము అందరి సహాయ సకార ఐక్యతతో ముందుకు సాగుతాం.
గ్రామము:మర్లవాయి, మండలం:జైనూర్, కుంరం భీం జిల్లా, తెలంగాణ రాష్ట్రం.

No comments:

Post a Comment

Thank you So Much for your Useful Suggestion..!!

Note: Only a member of this blog may post a comment.

Gondwana Kabur