Followers

Sunday, February 2, 2020

పెర్సపేన్ దేవాలయాలకు నిధులు మంజూరు చేయాలని KCR కి వినతి పత్రం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ శ్రీ కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు గారిని  కలిసిన  ఆసిఫాబాద్ శాసనసభ్యులు గౌ శ్రీ ఆత్రం సక్కు గారు

హైదరాబాద్: ఈ రోజు హైదరాబాద్ ప్రగతి భవన్ లో గౌరవ ముఖ్య మంత్రి గారిని కలిసి.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని *పెర్సపేన్ దేవాలయాలకు నిధులు మంజూరు చేయాలని* మరియు అదేవిధంగా ఆదివాసీ తెగలైన గొండ్, కొలాం, తోటి, పర్ధన్,నాయకపోడ్,ఆంధ్,
కోయ,తెగల దేవాలయాల కుడా నిధులు మంజూరు చేయాలని,ఆదివాసీలు వ్యవసాయం చేస్తున్న పోడు భూములకు ఉమ్మడి సర్వే నిర్వహించి అర్హులు అందరికి పట్టాలు ఇవ్వాలని,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ ప్రాంతాలలో అటవీ శాఖ అధికారులు తవ్వుతున్న కందకలు నిలిపివేయాలని ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది,గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సానుకూలంగా స్పందించి తప్పకుండా ఆదివాసీల పెర్సపేన్ ప్రతి  దేవాలయానికి  పదిలక్షల రూపాయల చొప్పున, అదేవిధంగా ఆదివాసీ తొమ్మిది వివిధ తెగల దేవాలయల నిర్మాణనికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో త్వరలో జాయింట్ సర్వే నిర్వహించి ఆదివాసుల వ్యవసాయం చేస్తున్న పోడు భూములకు, అటవీ భూములకు పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమములో తెలంగాణ రాష్ట్ర దేవాదాయ,అటవీ,గృహ నిర్మాణ శాఖ మాత్యులు గౌరవ ఇంద్రకరణ్ రెడ్డి గారు, మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment

Thank you So Much for your Useful Suggestion..!!

Note: Only a member of this blog may post a comment.

Gondwana Kabur