Followers

Saturday, February 1, 2020

ఏమౌతుంది మన కోయత్తూర్ గోండ్వానా రాజ్యంలో

ఏమౌతుంది మన కోయత్తూర్ గోండ్వానా రాజ్యంలో🔥🔥🔥

ఏమైపోయింది మన ఆదివాసి వీరుల వారసత్వ పౌరుషం 🔥🔥🔥
ఏమిజరుగుతుంది మన ఆదివాసీల అస్ధిత్వానికి 🔥🔥🔥
స్వాతంత్ర్యానికి పూర్వం సుమారు 500 వందల సంవత్సరాలు మధ్యభారతాన్ని పరిపాలించిన మన పూర్వీకులు, స్వాతంత్ర్యం, స్వయంపాలన, ఆత్మగౌరవం కోసం గాంధీలు, నెహ్రూలు,నేతాజీల కంటే ముందే, తొలి సిపాయి తిరుగుబాటుకు 100 ఏళ్ళకు  ముందే బ్రిటీషు వారిపై జంగు సైరను ఊది ,ఆదివాసీల పోరాటాన్ని నాటి పాలకులకు చూపించిన కారణంగానే, భారత రాజ్యాంగంలో ,మన గోండ్వానా రాజ్యానికి సరిహద్దులు నిర్ణయించి 5వ షెడ్యూల్ హోదా మరియు ఆదివాసీల రక్షణ మరియు సంస్కృతీ సంప్రదాయాల కణుగునంగా అభివృద్ది జరగాలని తగు చట్టాలు,హక్కులు కల్పిస్తే, నేడు రాజ్యాంగ ధిక్కరణకు పాల్పడి, రాజ్యాంగ విరుద్దంగా ఓటు బ్యాంకు రాజకీయ కోసం సంచార వలసవాదులను అక్రమంగా ST జాబితాలో కలిపినపుడే మన కోయత్తూర్ గోండ్వానా రాజ్యంలోని అమాయక ఆదివాసి తెగల భవిష్యత్తుకు ప్రమాద మేర్పడింది. అది చిన్న చిన్నగా పెరిగి ,అందరూ చూస్తుండగానే ఎటువంటి ఆధారాలు లేకుండా, రాజ్యాంగ సవరణ కానీ ఒక కమీషన్ కానీ లేకుండానే గత 40 సంవత్సరాలలో , ఎవరూ ఊహించలేనంతగా,అసలైన SC,ST లకు రిజర్వేషన్లు కల్పించిన అంభేడ్కర్ మహానుభావునికి కూడా ఊహకు రానంతగా, ఆదివాసులు అనుభవించాల్సిన రాజ్యాంగ ఫలాలైన విద్యా,ఉద్యోగ,రాజకీయ అవకాశాలను బరితెగించి దోచుకుంటున్నదే కాకుండా, మన ఏజన్సీలోనికి సైతం చొరబడి, భూముల కోసం అడవి తల్లిని నాశనం చేసి, అటవీ సంపదను తరలించి , అడవి జంతువులను నామరూపం లేకుండా చేసి, మన భూభాగంలో మన ఆదివాసి తెగల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నా, పోరాటం మన వారసత్వ రక్తం లోనే వున్నా, మనకు స్పూర్తినిచ్చిన ఆదివాసి వీరులు ఎందరున్నా ఏమైపోయింది పౌరుషం🔥🔥🔥ఒకప్పుడు ఆదివాసీలు కలకల లాడే మానుకోట,బొగ్గుట్ట,కొత్తగూడెం,పాల్వంచ,మణుగూరు,నర్సంపేట,గూడూరు,ములుగు,మంగపేట, భద్రాచలం, ఉట్నూర్,ఆదిలాబాద్,మంచిర్యాల, ఆసిఫాబాద్ లాంటి చిన్న పట్టణాలు నేడు వలసవాదుల చేతుల్లో మునిసిపాలిటీలుగా మారిపోతున్నా, మన ఏజన్సీ గ్రామాలలో అంతస్తుల భవంతులు, వ్యాపార భవనాలు వెలుస్తున్నా, మనం పూజించే , నిర్వహించే పాల్వంచ పెద్దమ్మతల్లి, దుమ్ముగూడెం ముత్యాలమ్మతల్లి, గుంజేడుముసలమ్మతల్లి,కురవి వీరన్న లాంటి అనేక ఆదివాసి దేవతల గద్దెలను వలసవాదులు ఆక్రమిస్తున్నా, యావత్ ఆదివాసి సమాజం కొలుచుకునే సమ్మక్క సారక్క గద్దెలను కూడా వదలకుండా లంబాడీకరణ జరుగుతున్నా, వలసవాద రాజకీయ నాయకురాళ్ళు , మన కరుడుగట్టిన  ఆదివాసి నేతలను పక్కకు తోస్తూ ఆదివాసీల అస్ధిత్వానికే సవాలు విసురుతున్నా, మన ఆదివాసి సమాజంలోని అవిశ్రాంత రాజకీయ దురందురులు, మేధావులమనుకునే ఉద్యోగులు, పోరాటం మా పేటంటు అనుకునే సంఘాల నాయకులు,అన్నీ తెలుసనుకునే యువతరం,మా గూడెంలో మాకు తిరుగే లేదనుకునే మన పటేల్, దొరలు అంతా కలిసి ఇంకా మనకేం కాదులే, మన పంచెలు పోయిన, మన మహిళల ఆభరణాలు పోయినా,మన భూములు పోయినా, మన విద్యా,ఉద్యోగ,రాజకీయ అవకాశాలు పోయినా,ఆఖరికి మన దేవతల గద్దెలను గద్దల్లా తన్నుకుపోతున్నా మనకేం కాదులే , ఇంకా ఎన్ని దోచుకున్నా మన అస్ధిత్వానికి ఏంకాదులే,మన గోసీలు మాత్రంఎవ్వడూ పీకలేడు అనే ధీమాతో దర్జాగా కోయత్తూర్ కోయదొరలలాగా బ్రతుకు ఈడుస్తున్నామా?ఆదివాసీల అస్థిత్వం పోయినా పర్వాలేదు మేం మాత్రం మారం, మేము మా కుటుంబం హాయిగా వున్నాం ఎవరి కోసం పోరాటం , ఎవరి కోసం ఆరాటం అనుకుంటున్నట్లుంది. ఆదివాసి తెగల ఇలవేల్పుల జాతరకు దేశంలోని అన్ని కులాల,మతాల,పార్టీల వారు మా జీవితాలు ఇంకా వెలిగిపోవాలని అడవి తల్లుల ఆశీస్సుల కోసం లక్షలాదిగా మేడారం తరలుతుంటే , అమాయక ఆదివాసులు మాత్రం మనల్ని దర్శనానికి పోనిస్తరా బిడ్డా అంటూ మేడారం పోలేక కుములిపోతున్నారు.ఓ ఆదివాసి దేవతలారా,వీరులారా మీ వారసత్వం కలిగిన మాకు పోరాడే తెలివిని, స్వయంపాలన కోసం ఎదురించే ధైర్యాన్ని, ఆత్మగౌరవం కోసం బ్రతికే శక్తిని కలిగించండి.జై ఆదివాసి!🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

No comments:

Post a Comment

Thank you So Much for your Useful Suggestion..!!

Note: Only a member of this blog may post a comment.

Gondwana Kabur