*"హోళీ పండుగ"*
*ఎందుకు* *జరుపుతాము..?*
*హోళీ పండుగ ఎవరి* *విజయానికి గుర్తు...?*
****
ఈ విషయం తెలియని
భారతీయ మూలవాసీ బహుజనులు
*"హోళీ పండుగ"* సందర్భంగా కొన్ని బ్రాహ్మణ, మార్వాడి సంఘాల వారు
రాత్రి కామ దహనం పేరుతో రావణ బ్రహ్మ చిత్రపటాన్ని
దగ్ధంచేసి తెల్లవారు రంగులు చల్లుకొని పండుగ జరుపుకుంటారు
చరిత్ర తెలియని
బహుజనులు ఇందులో పాల్గొంటున్నారు
ఈ చరిత్ర తెలియక నేను
నా చిన్నతనం నుండి పాల్గొంటున్నాను
గత సంవత్సరం నుండి
*"హోళీ పండుగ"*
జరపబోనని ప్రకటించాను..
కారణం ఈ దేశ మూలవాసీ అడబిడ్డ *"హోళీక"*
హత్య జరిగిన విషాదకరమైన
సంఘటన అనే విషయం
చరిత్ర తెలియని మూలవాసులం
ఆనందకేళీ రంగేళి అంటూ రంగులు చల్లుకొని మద్యంసేవించి మాంసం తిని పడుకుంటాము..
ఈ దేశమూలవాసుల
రాజు హిరణ్యకశిపుడు
తన కుమారుడు ప్రహ్లాదుడు గురుకులంలో హరినామం
పఠించేవిధంగా ఆర్యులు కుట్రపన్ని హరిభక్తిని నేర్పిస్తారు
హిరణ్యకశిపుడు తన రాజ్యంలో
ఆర్యుల విద్య కాకుండా
తన రాజ్యంలో ఆర్యులకు భిన్నమైన ఆలోచనతో కూడిన విద్యను గురుకులాల్లో ప్రవేశపెడతాడు హిరణ్యకశిపుడు
దీన్ని సహించలేని ఆర్యులు
తండ్రి కొడుకుల మధ్య కయ్యం
పెట్టే ప్రయత్నం చేసినప్పుడు శత్రువు అయిన హరి మాటలు నమ్మి తండ్రికి ఎదురు చెప్ప కూడదంటు
హిరణ్యకశిపుడి చెల్లెలు
*"హోళీక"*
తన అల్లుడైన ప్రహ్లాదుడికి
నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంది
అది చూసి ఓర్వలేని ఆర్యులు హోళిక ప్రయత్నాన్ని భగ్నం చేయడానికి ఏ పాపం ఎరుగని హిరణ్యకశిపుని చెల్లెలైన "హోళికను"
ఆర్యుల రాజు విష్ణువు హోళికను అగ్నిలోకి నెట్టి హత్య చేస్తాడు
ఒక స్త్రీని అత్యంత క్రూరంగా హత్యచేసిన రోజును పండుగ పేరుతో మన చరిత్రను
మనతోనే సమాధి చేయిస్తున్న
మనుస్మృతి వారసుల
కుట్రలను చరిత్ర పాదఘట్టాల నుండి మన చరిత్ర గాయాలను తవ్వితీసే సమయం ఆసన్నమైంది
మూలవాసీ ఏకలవ్యుల
రణ నినాదాలతో
మనువు బిడ్డలకు
మనసులో మనసు
లేకుండాపోయింది..
*జోహార్ "హోళీక"*
*జోహార్ జోహార్*
*మూలవాసీ*
*మృతవీరులారా..!*
చరిత్రను తిరగ రాసే
మహాత్మ ఫూలే,సావిత్రి బాయి,బాబాసాహెబ్,
పులాన్ దేవి,రోహిత్ వేముల
వారసత్వం ఈ
దేశ నలుమూలల
విస్తరిస్తున్న విషయం తెలిసినప్పుడు
మనుస్మృతి వారసులు
ఆగమవుతున్న దృశ్యం
స్పష్టమై పోయింది.
జై భీమ్ జై జై భీమ్
- అర్క సంతోష్
No comments:
Post a Comment
Thank you So Much for your Useful Suggestion..!!
Note: Only a member of this blog may post a comment.