Followers

Tuesday, December 27, 2022

మీ గూడెం పిల్లలకు ఐఐటీ చదువుల్ని ఇవ్వండి |Gondwana Channel|

మీ గూడెం పిల్లలకు
 ఐఐటీ చదువుల్ని ఇవ్వండి 
చదువు అసూయను చంపేస్తుంది 
ఐక్యత ను పెంచేస్తుంది
అజ్ఞానానికి విరుగుడు మందు చదువే
అభివృద్ధికి రూపం చదువే

చదువులు దూరమైతే
అడవులు దూరమౌతామ్
బ్రతుకులు దూర మౌతాయ్
బానిసత్వాలు దగ్గరవుతాయి

ఆదివాసీలలో ఉన్నత చదువులు లేని కారణంగానే అడవుల నుండి దూరమౌతున్నారు

ఒక్క ఆడివేనా....సర్వం
చదువులు లేకనే...దూరం

5వ షెడ్యూల్డ్ ఏరియాను కోల్పోతున్నారు.
అటవీ హక్కుల చట్టాన్ని గిరిజనేతరుల పాలు చేస్తున్నారు.
1/70 చట్టానికి తామే తూట్లు పొడుచుకుంటున్నారు.
పేసా చట్టం ఉనికినే కాలరాస్తున్నారు
స్వయంపాలన అర్థాన్నే మార్చేస్తున్నారు
ఏజెన్సీ చట్టాలకు తామే కొరివి పెట్టుకుంటున్నారు.
ఐక్యతను చేరుపేస్తున్నారు.
తమగోయ్యిని తామే తవ్వు కుంటున్నారు
తమలో తాము కొట్టుకు చస్తున్నారు
ఇవ్వన్నింటికి ఆదివాసీలలో ఉన్నత చదువులు లేక పోవడమే కారణం.
ఓ...yes నిజమే కదా
గూడెం లల్లో మిడిమిది చదువులు చదువుకున్నోళ్ళందరూ....అజ్ఞానాన్ని పెంచి పోషిస్తుంన్నారు.
జెండాలు మొయ్యడానికే ఆ చదువుకు సరితోగుతున్నాయ్.
గూడెం నుండి
ఒక్క ఉన్నత శ్రేణి అధికారి కూడా లేకపోవడముతో  ప్రతి ప్రభుత్వ శాఖలో ఆదివాసీల సమస్యలు కుపల్లా పేరుకు పోతున్నాయి.
ఇప్పటికి ఒక IAS IPS లేడు.

ఇది నిజమే కదా..
మీ అవకాశాలను తన్నుకు పోతున్న అక్రమ వలస కృత్రిమ  STలు చదువులకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు... వాళ్ళ పిల్లల్ని గొప్పగా చదివిస్తున్నారు....గొప్ప ఉద్యోగాలు గొప్ప పదవులు ,గొప్ప జీవితాలు పొంది హాయిగా ఏ సమస్యలు లేకుండా జీవిస్తున్నారు
మీ రిజర్వేషన్ ను పక్కా రాష్ట్రాల తమవారికి కూడా పంచుతున్నారు.

వాళ్ళు ఏ రాష్ట్రం పోయినా ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా వాళ్ళ ఉద్యోగులు,అధికారులే ఉండడం వలన పనులు చిటికెలో చకచకా జరిగి పోతున్నాయి.
కారణం
Education
Unity
Aware ness
Helping nature
Save culture
జాతి కోసం పని చేయడం
తోటి వారికి తోడు నిలవడం
Update అవ్వడం
తమ జాతి పిల్లలకు ఉన్నత చదువులు అందించడం. 
ఇది కూడా
నిజమే కదా...వీళ్లకు పోరాటాలే  అవసరం రాయడం లేదు.

ఎందుకంటే...వాటికోసం మీరు ఉన్నారు...మీపోరాట ఫలాలు అనుభవించడానికి వాళ్ళు ఉన్నారు.
మీకు ఈ సంగతి తెలుసా...
ఐఐటీ,నిట్,ఐఐఐటీ,నీట్ సివిల్స్ చడవడాని మీ గూడెం లల్లో విద్యార్హులే లేరు...కానీ వాళ్ళు తమ పిల్లల్ని టార్గెట్ రీచ్ అయ్యే వరకు ఏండ్లు తరబడి ఐఐటీ, నీట్,సివిల్స్ శిక్షణ కేంద్రాల్లో చేర్పించి వాళ్ళల్లో వాళ్ళు సీట్ల కోసం పోటీ పడుతున్నారు.all india other state సీట్లన్నీ కొల్లగొడుతున్నారు.
నీవు,నీ ఆదిమ సమాజం go 3 దగ్గరే ఎండు గడ్డి పీకుతున్నారు
పాపం ఆ go 3 గడ్డి ఎండి పోయిన సంగతి కూడా తెలియదు మీకు...పీకుడు తప్పా
ఇప్పటికైనా...ఎండిన గడ్డి పీకుడు వదిలి ఉన్నత చదువుల కోసం గూడెంలో  కొత్త విత్తనాలు చల్లండి.

సంతాల్ తెగలో కనీస సౌకర్యాలు కూడా లేని మారుమూల గూడెంలో పుట్టిన సామాన్య ఆదివాసి మహిళ   ద్రౌపతి ముర్ము గారిని భారత రాష్ట్ర పతిని చేసింది...చదువు ఒక్కటే
చదువే ప్రపంచాన్ని శాసించే ఆయుధం
కలం విలువ మీ గుడానికి తెలుపు...గురూ
మీ గూడెం పిల్లలకు ఐఐటీ చదువుల్ని ఇవ్వండి...గురూ.

గూడెం మేలుకునేలా లక్ష సార్లు షేర్ చెయ్యండి.
Milky Adivasi

Wednesday, December 21, 2022

మన గూడెం - మన చదువులు |Gondwana Channel|

 మన గూడెం - మన చదువులు


మావ నాటే మావ రాజ్యం  కొమురంభీం ఉద్యమ స్పూర్తి నినాదం ఆదివాసీ ఉద్యమాలకు ఊపిరి పోస్తూనే ఉంది....ఉవ్వెత్తున ఉద్యమాలను నడిపిస్తూనే ఉంది.జల్ జంగిల్ జమీన్ కోసం పోరాటాలు కొనసాగుతున్నాయి.అదే ఉద్యమ స్పూర్తితో మాననీయులు హైమాన్ డార్పు గారు...


 మావ నాటే మావ సడ అనే విద్యా నినాదానికి మర్లవాయి లో పురుడు పోశారు...ఏకంగా అక్కడ పాఠశాల ఏర్పాటు చేసి బోధించారు. ఆదివాసీలలో అజ్ఞానపు అందకారాన్ని తొలగించడానికి అక్షర జ్ఞానమే సరైన మార్గమని ప్రబోధించారు....నైజాం ప్రభుత్వానికి అదే నివేదికను సమర్పించారు. అడవిలో బడి అప్పుడూ అందర్నీ ఆశ్చర్య పరిచింది....అచిర కాలం లోనేఎందరెందరినో అక్షర మహాయజ్ఞం వైపు నడిపించారు.

నాడు నాటిన అక్షర మొక్క నేడు మహావృక్షమై ఎందరికో పలాలనిచ్చి ప్రయోజకుల్ని చేసింది.

నాడు అక్షర ఫలాలు తిన్న ప్రయోజకులు ఆ ఫలము లోని గింజల్ని మళ్లీ నాటేవారు....అవి మొలకెత్తి మళ్లీ ఫలాలను ఇచ్చేవి.

హైమాన్ డార్పు గారితో కలిసి ఆదివాసీలను అక్షర జ్ఞానులుగా మార్చడానికి ఎంతో మంది కృషి చేసారు...ఆ కృషి ఫలితమే నేడు మన గుడానికొక్క పాఠశాల...అందులో బోధించే ఉపాధ్యాయుడు మన ఆదివాసీ అయ్యాడు.

కనుక హాన్ను మాస్టర్ గారి నుండి మొదలుకొని నేటి

కనక మారుతిరావు గారు మర్లవాయి మాజీ సర్పంచు గారు  (15/12/2022)వరకు మావ నాటే మావ సడ కోసం జీవితాంతం కృషి చేసి ఆదివాసీల గుండెల్లో జీవించారు.



 స్ఫూర్తి కనుమరుగై పొతోంది


మన గూడెం లో...చదువుల స్ఫూర్తి కనుమరుగై పోతోంది.


సౌకర్యాలు లేని ఆ రోజుల్లో  చదువుకున్నా...ఎందరో ఆదివాసీలు ఉన్నత శిఖరాలను చేరుకున్నారు....కాలినడకన ముప్పై కిలో మీటర్ లు నడిచి చదువుకున్న ఒక మడవి తుక్కారామ్ సారూ గారు కలెక్టర్ స్థాయి వరకు చేరుకోగలిగారు....

కల్తీ వీరమల్లు సారూ గారు సబ్ కలెక్టర్ కా గలిగారు.

మెట్ల పాపయ్య గారు ఇంజనీర్ గా అత్యున్న పదవుల్ని బాధ్యతల్ని మోశారు....చాలా మంది ఆదివాసీ ఉద్యోగులు ఆయా ప్రభుత్వ శాఖలల్లో హెడ్ బాస్ లు గా ఎదిగారు....DSPలుగా...DM HO లుగా...MRO.. లుగా RDO లుగా...DRO లుగా....MEO..లుగా. డిప్యూటీ...DEO లుగా...ప్రొపెసర్ లుగా....ఆర్మీ మేజర్ లుగా...అగ్రికల్చర్ ఆఫీసర్ లుగా...డాక్టర్లు,ఇంజనీర్లు,లాయర్ లు,పోలీస్ లు,టీచర్లు గా ఆనాడు కష్టపడి చదువుకున్నోళ్లేందురో నేటికి అత్యున్నత పదవుల్లో కొనసాగుతూ ఉన్నారు...సాఫ్ట్ వేర్ ఉద్యోగులుగా తమ సత్తా చాటు తున్నారు.

వీరిని మనమెందుకో...స్ఫూర్తిగా తీసుకోని ముందుకు సాగడం లేదు. 

మన గూడెంలో...అక్షరం మారణిస్తోంది

మన గూడెంలో చదువులు సమాధి అవుతున్నాయి.



పరిష్కారానికి ప్రతి ఒక్కరూ...ఆలోచన చెయ్యండి.


మన గుడాలను...బ్రతికించు కోవాలంటే...మన చదువులకు ప్రతి ఒక్కరం ప్రాణం పోయాలి.


నేను...milky

Gondwana Kabur