Followers

Wednesday, December 21, 2022

మన గూడెం - మన చదువులు |Gondwana Channel|

 మన గూడెం - మన చదువులు


మావ నాటే మావ రాజ్యం  కొమురంభీం ఉద్యమ స్పూర్తి నినాదం ఆదివాసీ ఉద్యమాలకు ఊపిరి పోస్తూనే ఉంది....ఉవ్వెత్తున ఉద్యమాలను నడిపిస్తూనే ఉంది.జల్ జంగిల్ జమీన్ కోసం పోరాటాలు కొనసాగుతున్నాయి.అదే ఉద్యమ స్పూర్తితో మాననీయులు హైమాన్ డార్పు గారు...


 మావ నాటే మావ సడ అనే విద్యా నినాదానికి మర్లవాయి లో పురుడు పోశారు...ఏకంగా అక్కడ పాఠశాల ఏర్పాటు చేసి బోధించారు. ఆదివాసీలలో అజ్ఞానపు అందకారాన్ని తొలగించడానికి అక్షర జ్ఞానమే సరైన మార్గమని ప్రబోధించారు....నైజాం ప్రభుత్వానికి అదే నివేదికను సమర్పించారు. అడవిలో బడి అప్పుడూ అందర్నీ ఆశ్చర్య పరిచింది....అచిర కాలం లోనేఎందరెందరినో అక్షర మహాయజ్ఞం వైపు నడిపించారు.

నాడు నాటిన అక్షర మొక్క నేడు మహావృక్షమై ఎందరికో పలాలనిచ్చి ప్రయోజకుల్ని చేసింది.

నాడు అక్షర ఫలాలు తిన్న ప్రయోజకులు ఆ ఫలము లోని గింజల్ని మళ్లీ నాటేవారు....అవి మొలకెత్తి మళ్లీ ఫలాలను ఇచ్చేవి.

హైమాన్ డార్పు గారితో కలిసి ఆదివాసీలను అక్షర జ్ఞానులుగా మార్చడానికి ఎంతో మంది కృషి చేసారు...ఆ కృషి ఫలితమే నేడు మన గుడానికొక్క పాఠశాల...అందులో బోధించే ఉపాధ్యాయుడు మన ఆదివాసీ అయ్యాడు.

కనుక హాన్ను మాస్టర్ గారి నుండి మొదలుకొని నేటి

కనక మారుతిరావు గారు మర్లవాయి మాజీ సర్పంచు గారు  (15/12/2022)వరకు మావ నాటే మావ సడ కోసం జీవితాంతం కృషి చేసి ఆదివాసీల గుండెల్లో జీవించారు.



 స్ఫూర్తి కనుమరుగై పొతోంది


మన గూడెం లో...చదువుల స్ఫూర్తి కనుమరుగై పోతోంది.


సౌకర్యాలు లేని ఆ రోజుల్లో  చదువుకున్నా...ఎందరో ఆదివాసీలు ఉన్నత శిఖరాలను చేరుకున్నారు....కాలినడకన ముప్పై కిలో మీటర్ లు నడిచి చదువుకున్న ఒక మడవి తుక్కారామ్ సారూ గారు కలెక్టర్ స్థాయి వరకు చేరుకోగలిగారు....

కల్తీ వీరమల్లు సారూ గారు సబ్ కలెక్టర్ కా గలిగారు.

మెట్ల పాపయ్య గారు ఇంజనీర్ గా అత్యున్న పదవుల్ని బాధ్యతల్ని మోశారు....చాలా మంది ఆదివాసీ ఉద్యోగులు ఆయా ప్రభుత్వ శాఖలల్లో హెడ్ బాస్ లు గా ఎదిగారు....DSPలుగా...DM HO లుగా...MRO.. లుగా RDO లుగా...DRO లుగా....MEO..లుగా. డిప్యూటీ...DEO లుగా...ప్రొపెసర్ లుగా....ఆర్మీ మేజర్ లుగా...అగ్రికల్చర్ ఆఫీసర్ లుగా...డాక్టర్లు,ఇంజనీర్లు,లాయర్ లు,పోలీస్ లు,టీచర్లు గా ఆనాడు కష్టపడి చదువుకున్నోళ్లేందురో నేటికి అత్యున్నత పదవుల్లో కొనసాగుతూ ఉన్నారు...సాఫ్ట్ వేర్ ఉద్యోగులుగా తమ సత్తా చాటు తున్నారు.

వీరిని మనమెందుకో...స్ఫూర్తిగా తీసుకోని ముందుకు సాగడం లేదు. 

మన గూడెంలో...అక్షరం మారణిస్తోంది

మన గూడెంలో చదువులు సమాధి అవుతున్నాయి.



పరిష్కారానికి ప్రతి ఒక్కరూ...ఆలోచన చెయ్యండి.


మన గుడాలను...బ్రతికించు కోవాలంటే...మన చదువులకు ప్రతి ఒక్కరం ప్రాణం పోయాలి.


నేను...milky

No comments:

Post a Comment

Thank you So Much for your Useful Suggestion..!!

Note: Only a member of this blog may post a comment.

Gondwana Kabur