Followers

Friday, February 21, 2020

ఆదివాసీ హక్కులు ఆదివాసీ చట్టాలు Adivasi Rights

ఆదివాసీ హక్కులు
ఆదివాసీ చట్టాలు
ఆదివాసీ ప్రాంతాలు
■ ముందుగా అసలు ఎవరు ఈ ఆదివాసి ?.
■ఆదివాసి అంటే ఏమిటి?
■ ఈ ఆదివాసులు ఏ ప్రాంతంలో నివసిస్తున్నారు.?.
ఏంటి వీరికి గల ప్రత్యేకమైన హక్కులు ఏంటి వీరికి గల ప్రత్యేకమైన చట్టాలు ■ఎలాంటి ప్రాంతాలను ఆదివాసి ప్రాంతాలుగా పిలుస్తారు?
■ అసలు షెడ్యూల్ తెగలు అంటే ఎవరు వస్తారు భారత రాజ్యాంగం ప్రకారం అందులో ఉన్నటువంటి వివరాల ఆధారంగా ఆర్టికల్ 342 ప్రకారం ఆదివాసీ ప్రాంతాలను ఆదివాసి ఏరియాలను భారత రాజ్యాంగం గుర్తించడం జరిగింది
■ శతాబ్దాలుగా ప్రాచీన కాలం నుంచి కనీస వసతులు కూడా నోచుకోకుండా కట్టుకోవడానికి బట్ట ,తినడానికి తిండి తల దాచుకోవడానికి ఇల్లు ఇలాంటి సౌకర్యాలు లేకుండా కేవలం భయంకరమైనటువంటి అడవుల్లో నివసించే కొన్ని ప్రత్యేకత తెగలను  గుర్తించి అదేవిధంగా అనేక శతాబ్దాలుగా వారిపై జరిగినటువంటి అనేక రకాల అయినటువంటి దాడులు అనేక రకాల ఎటువంటి ఇబ్బందులు అదేవిధంగా మరెంతో అన్యాయం చేసినటువంటి ఆ ప్రజలను వారందరికీ న్యాయం చేయడం కోసం భారత రాజ్యాంగం  5 వ షెడ్యూల్డ్ ప్రాంతాలుగా అటువంటి తెగలకు చెందిన అటువంటి కొన్ని ప్రాంతాలను షెడ్యూల్ తెగల ప్రాంతాలుగా నామకరణం చేసింది.
■ అందులో ఉన్నటువంటి అందులో నివాసం ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములు గాని ఉద్యోగాలు ఉపాధి గాని మరియు వారికి సంబంధించిన ప్రతి దాంట్లోనూ వారికే పూర్తి అధికారాలు ఇస్తూ భారత రాజ్యాంగం ప్రకటించడం జరిగింది.
◆ ఇందులోనూ రాష్ట్ర ప్రభుత్వం గానీ కేంద్ర ప్రభుత్వం గాని ఏజెన్సీ ప్రాంత ఏరియాలోని భారత రాజ్యాంగం కల్పించిన చట్టాలకు విరుద్ధంగా గాని మరియు గిరిజనుల యొక్క వికాసానికి అడ్డు కల్పించే ఎటువంటి చర్యలకు కూడా పాల్పంచుకో కుండా అతి పటిష్టంగా షెడ్యూల్ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు రక్షణ కల్పించడం జరిగింది
◆ అలాంటి దాంట్లో నుంచి బయటికి వచ్చిన త్రీ 3 GO జి ఓ గాని ఆర్టికల్ 370 1/70 చట్టం మరియు పెసా(PESA) చట్టం గాని అటవీ హక్కుల చట్టం గాని ఆదివాసి రక్షణ చట్టాలు గాని ఈ విధంగా అనేక రకాలైన చట్టాలు ఏజెన్సీ ప్రాంతంలోనే భారత రాజ్యాంగం లోనే అంతర్లీనంగా పొందుపరచబడ్డాయి
◆ కాబట్టి ఇది  ఈ నాడే ఏదో కొత్త చట్టం వచ్చింది ఏదో చట్టాన్ని తీసేస్తున్నారు ఏదో జరిగిపోతుంది అని మనం అందరం కూడా కంగారు పడవలసిన అవసరం కూడా లేదు ఎందుకంటే గిరిజనులకు కల్పించిన ఎటువంటి చట్టాలు రాష్ట్ర ప్రభుత్వాలు గాని కేంద్ర ప్రభుత్వాలు గాని సుప్రీం కోర్టు గాని వారి చట్టాల పై ఎటువంటి జోక్యం చేసుకోరు అని రాజ్యాంగంలో పొందుపరిచి ఉంది.
■ అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో కి గిరిజనేతరుల ఎవరూ కూడా  రాకూడదని ఎవరు వ్యాపారం చేయకూడదని ఎవరు భూములు కొనకూడదు అని అదేవిధంగా ఎవరు ఎత్తైన భవనాలు కూడా కట్టకూడదని అలాగే గిరిజన భూమిని ఎవరు విక్రయాలు చేయరాదు అని అనేక చట్టాలు చెబుతూనే ఉన్నాయి●
■ కాలక్రమేణా గిరిజనుల లో ఉన్నటువంటి అమాయకత్వం ,చదువు లేకపోవడం, కనీస విద్య లేకపోవడం ఈ కారణాల దృష్ట్యా ఇతర ప్రాంతాల నుంచి మైదాన ప్రాంతాల నుంచి అనేక గిరిజనేతరులు ఇక్కడకు వచ్చి గిరిజనుల యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారి దగ్గరనుంచి భూములు, ఉద్యోగాలు నిధులు ,నియామకాలు ఈ రకంగా ప్రతి దాంట్లోనూ గిరిజనేతరులు చొచ్చుకు పోయారు ఈ విధంగా గా ఒకటా రెండా అని కాకుండా ప్రతీ దాంట్లోనూ గిరిజనేతరుల యొక్క దౌర్జన్యం క్రమక్రమంగా పెరిగిపోసాగింది ఇప్పటికి కూడా ఏజెన్సీ ప్రాంతంలోనే ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా నే మరి ఇంత మంది గిరిజనేతరులు ఈ ప్రాంతాలకు వలస వచ్చి ఇక్కడ ప్రజలను వారి భూములు మరియు వారి వ్యవస్థను వారి సంస్కృతి సంప్రదాయాలను వారి చట్టాలను తుంగలో తొక్కి ఏ విధంగా ప్రయత్నం చేస్తూ పూర్తిగా ఏజెన్సీని ధ్వంసం చేయడానికి సిద్ధపడ్డారు అందుకుగాను నిదర్శనం ఇప్పుడు సుప్రీంకోర్టు ఉన్నటువంటి జీవో నెంబర్ మూడు మీద జరుగుతున్నటువంటి చర్చలు మనము ఉదాహరణగా చెప్పుకోవచ్చు మా ఏరియా లోకి వచ్చి మా జీవోలను రద్దు చేయాలని చెప్పి ఏజెన్సీ ప్రాంత చట్టాలకు మరియు ఆదివాసులకు వ్యతిరేకంగా కేసులు పెట్టడం అనేది ఇది ఎంతవరకు సమంజసమో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం మరియు సుప్రీం కోర్టు ఒకసారి స్వీయ ఆలోచన చేసుకో వలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాము ●
■మా నాటే మా రాజ్యం అన్న విధంగా గా గిరిజన స్వయం పాలనకు నాంది పలుకుతూ ఉన్నాం ఇప్పటివరకు ఆనాడు నుంచి ఈనాటి వరకు మా యొక్క పరిస్థితి మెరుగు పడకుండా మా యొక్క అభివృద్ధి కుంట పడుతూ ఉన్నది దీనంతటికి కారణం ఒక్కటే
■ గిరిజనేతరులు మైదాన ప్రాంత వాసులు అక్రమంగా ఏజెన్సీ ప్రాంతంలో కి వలసలు రావడమే దీన్ని అరికట్టడం కోసం రాబోయే రోజుల్లో ఆదివాసులు అందరూ కలిసి ఇ ఒక పెద్ద ఉద్యమాన్ని చేపట్టి తద్వారా ఏజెన్సీ ప్రాంత చట్టాలను ఉద్యోగ వ్యవస్థలను సంస్కృతి సంప్రదాయాలను భారత రాజ్యాంగం కల్పించిన ఎటువంటి హక్కు కాపాడుకోవలసిన సమయం ఆసన్నమైనది కాబట్టి ఇ ఆదివాసి యువశక్తి యువతరం యువతీ యువకులంతా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు కూడా ఒకే తాటిపైకి వచ్చి మనకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద అక్రమ కేసులు మీద మన అభివృద్ధి కొరకు మనమందరం కలసి మెలసి ముందడుగు వేయాలని తద్వారా మన యొక్క చట్టాలను కాపాడుకోవాలని అదేవిధంగా ఏజెన్సీ ప్రాంత ఏరియాలోని పని చేస్తున్నటువంటి ప్రతి అధికారి కూడా ఏజెన్సీ ఏరియా ఏజెన్సీ ప్రాంత చట్టాలను ముందుగా అవగాహన చేసుకొని రాజ్యాంగం కల్పించిన టువంటి హక్కులు విధులు నిధులు నియామకాలు ఇవన్నీ కూడా 100% పూర్తిగా గిరిజనులకు ఆ విధమైన చట్టాలు చేసినా జిఓ లపై వెంటనే సుప్రీం కోర్టు జోక్యం చేసుకోరాదని అది మా హక్కు అని ఆదివాసి సమాజం తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి ఇ ఈ తరం మాతరం యువతరం అన్ని తరాల ఆదివాసి శక్తులు అంతా కూడా ఒక చోట చేరి మన యొక్క హక్కులను చట్టాలను పరిరక్షించుకోవాలని కోరుతున్నాం.

Kanna Raju Soyam.
9491966008.
Adivasi Rights Fighter.

Wednesday, February 5, 2020

కలెక్టర్ దివ్య దేవరాజన్ గారికి ఆత్మీయ సన్మానం

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ వివిధ సంఘాల నాయకులకు...ఆదివాసీ ప్రజానికానిక విజ్ఞప్తి..... 2017 లో ఎన్నో ఒడిదుడుకులు మద్య ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన



జిల్లా కలెక్టర్ గౌరవ శ్రీమతీ శ్రీ దివ్య దేవరాజన్ గారు జిల్లా అభివ్రృద్దిలో తనదైన పాత్ర పోషించి...ఆదివాసీ ప్రజలతో...వివిధ ఆదివాసీ సంఘాలతో ఎంతో ఆప్యాయంగా మెలిగి అందరి మన్ననలు.. మనసులు గెలిచి ఈ రోజు మహిళా శిశు దివ్యంగుల సంక్షేమ శాఖ కమిషనర్ గా బదిలీ పై వెళ్తుంన్నందునా అలాగే ఆదివాసీలతో మమేకమై అభివృద్ధి లో కీలకపాత్ర పోషిస్తు ఆందరితో కలివిడిగా ఉన్న గౌరవ ITDA PO (ములుగు జిల్లా కలేక్టర్) శ్రీ.క్రిష్ణ ఆధిత్య గారు...మరియు గౌరవ.జిల్లా Sub Collecter PVTG Special officer Dr.గోపినాథ్ గార్లకు 08-02-2020 శనివారం ఉదయం 11 గంటల నుండి ఆదివాసీ ఆరాద్య దైవం వెలసిన కేస్లాపూర్ లో ఆదివాసీ ముఖ్య సలహాదారు సిడాం భీంరావ్ గారు మరియు తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ సోయం బాపూరావ్ గారు.. ఆత్రం సక్కు గారు ఆసిఫాబాద్ శాసన సభ్యులు. వెడ్మ భొజ్జు గారు ఆదివాసీ విధ్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ మరియు రాయిసెంటర్... ఆధ్వర్యంలో వీడ్కోలు సన్మాణ సభ ఉన్నందున ఆదివాసీ ప్రజలు..వివిధ సంఘాల నాయకులు, పటేల్. సర్పంచ్లు.ZPTC..,MPTC., MPP అందరు భారిగా తరలివచ్చి  కార్యక్రమం విజయవంతం చేయగలరని కోరుతున్నాము.... మీ  కొడప నాగేష్ తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి... .గోడం గణేష్ తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు.. పుర్క బాపూరావ్ తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి.. మడావి దత్తు ఆదివాసీ నిరుద్యోగ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు.. మడావి రజనీకాంత్  ANS ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి. పేందోర్ దాదిరావ్ విధ్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు





Sunday, February 2, 2020

సీతక్క గారికి యావత్ ఆదివాసీ సమాజం హృదయ పూర్వక ధన్యవాదములు

ములుగు MLA,  శ్రీమతి దనసరి అనసూయ(సీతక్క) గారికి  యావత్  ఆదివాసీ  సమాజం  హృదయ పూర్వక  ధన్యవాదములు  ఆసియా  ఖండం లో  శ్రీ మేడారం  సమ్మక్క, సారలమ్మ. ల జాతర  కుంభమేళాకు , ఎంతో పట్టుదలతో   వివిధ  రాష్ట్రాలలో ని  జిల్లాల లోని,  రాజకీయపార్టీల నాయకులను, అధికారులను   ఆహ్వానం పలుకుతూ ఆదివాసీ ఆచార సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే విధంగా శ్రీ మేడారం జాతర ఔనత్యాన్ని చాటుతూ ఒడి ఒడి గా ఆదివాసి సమాజ శ్రేయస్సు కోసం కొనసాగింపుగా ములుగు నియోజిక వర్గ శాసన సభ్యురాలు అడవి తల్లి పులి బిడ్డ సమ్మక్క-సారలమ్మ ల వారసత్వ దివిటీ మా సీతక్క కు ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ, ఆదివాసీ విద్యార్థి సంఘం , ఆదివాసీ మహిళా సంఘం శ్రీ మేడారం సమ్మక్క -సారలమ్మ జాతర సందర్బంగా ప్రత్యేక ధన్యవాదములు.
               ఇట్లు
         మీ తమ్ముడు 
       పుర్క బాపురావ్ 
 తుడుందెబ్బ ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి






పెర్సపేన్ దేవాలయాలకు నిధులు మంజూరు చేయాలని KCR కి వినతి పత్రం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ శ్రీ కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు గారిని  కలిసిన  ఆసిఫాబాద్ శాసనసభ్యులు గౌ శ్రీ ఆత్రం సక్కు గారు

హైదరాబాద్: ఈ రోజు హైదరాబాద్ ప్రగతి భవన్ లో గౌరవ ముఖ్య మంత్రి గారిని కలిసి.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని *పెర్సపేన్ దేవాలయాలకు నిధులు మంజూరు చేయాలని* మరియు అదేవిధంగా ఆదివాసీ తెగలైన గొండ్, కొలాం, తోటి, పర్ధన్,నాయకపోడ్,ఆంధ్,
కోయ,తెగల దేవాలయాల కుడా నిధులు మంజూరు చేయాలని,ఆదివాసీలు వ్యవసాయం చేస్తున్న పోడు భూములకు ఉమ్మడి సర్వే నిర్వహించి అర్హులు అందరికి పట్టాలు ఇవ్వాలని,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ ప్రాంతాలలో అటవీ శాఖ అధికారులు తవ్వుతున్న కందకలు నిలిపివేయాలని ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది,గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సానుకూలంగా స్పందించి తప్పకుండా ఆదివాసీల పెర్సపేన్ ప్రతి  దేవాలయానికి  పదిలక్షల రూపాయల చొప్పున, అదేవిధంగా ఆదివాసీ తొమ్మిది వివిధ తెగల దేవాలయల నిర్మాణనికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో త్వరలో జాయింట్ సర్వే నిర్వహించి ఆదివాసుల వ్యవసాయం చేస్తున్న పోడు భూములకు, అటవీ భూములకు పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమములో తెలంగాణ రాష్ట్ర దేవాదాయ,అటవీ,గృహ నిర్మాణ శాఖ మాత్యులు గౌరవ ఇంద్రకరణ్ రెడ్డి గారు, మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు తదితరులు ఉన్నారు.

Saturday, February 1, 2020

ఏమౌతుంది మన కోయత్తూర్ గోండ్వానా రాజ్యంలో

ఏమౌతుంది మన కోయత్తూర్ గోండ్వానా రాజ్యంలో🔥🔥🔥

ఏమైపోయింది మన ఆదివాసి వీరుల వారసత్వ పౌరుషం 🔥🔥🔥
ఏమిజరుగుతుంది మన ఆదివాసీల అస్ధిత్వానికి 🔥🔥🔥
స్వాతంత్ర్యానికి పూర్వం సుమారు 500 వందల సంవత్సరాలు మధ్యభారతాన్ని పరిపాలించిన మన పూర్వీకులు, స్వాతంత్ర్యం, స్వయంపాలన, ఆత్మగౌరవం కోసం గాంధీలు, నెహ్రూలు,నేతాజీల కంటే ముందే, తొలి సిపాయి తిరుగుబాటుకు 100 ఏళ్ళకు  ముందే బ్రిటీషు వారిపై జంగు సైరను ఊది ,ఆదివాసీల పోరాటాన్ని నాటి పాలకులకు చూపించిన కారణంగానే, భారత రాజ్యాంగంలో ,మన గోండ్వానా రాజ్యానికి సరిహద్దులు నిర్ణయించి 5వ షెడ్యూల్ హోదా మరియు ఆదివాసీల రక్షణ మరియు సంస్కృతీ సంప్రదాయాల కణుగునంగా అభివృద్ది జరగాలని తగు చట్టాలు,హక్కులు కల్పిస్తే, నేడు రాజ్యాంగ ధిక్కరణకు పాల్పడి, రాజ్యాంగ విరుద్దంగా ఓటు బ్యాంకు రాజకీయ కోసం సంచార వలసవాదులను అక్రమంగా ST జాబితాలో కలిపినపుడే మన కోయత్తూర్ గోండ్వానా రాజ్యంలోని అమాయక ఆదివాసి తెగల భవిష్యత్తుకు ప్రమాద మేర్పడింది. అది చిన్న చిన్నగా పెరిగి ,అందరూ చూస్తుండగానే ఎటువంటి ఆధారాలు లేకుండా, రాజ్యాంగ సవరణ కానీ ఒక కమీషన్ కానీ లేకుండానే గత 40 సంవత్సరాలలో , ఎవరూ ఊహించలేనంతగా,అసలైన SC,ST లకు రిజర్వేషన్లు కల్పించిన అంభేడ్కర్ మహానుభావునికి కూడా ఊహకు రానంతగా, ఆదివాసులు అనుభవించాల్సిన రాజ్యాంగ ఫలాలైన విద్యా,ఉద్యోగ,రాజకీయ అవకాశాలను బరితెగించి దోచుకుంటున్నదే కాకుండా, మన ఏజన్సీలోనికి సైతం చొరబడి, భూముల కోసం అడవి తల్లిని నాశనం చేసి, అటవీ సంపదను తరలించి , అడవి జంతువులను నామరూపం లేకుండా చేసి, మన భూభాగంలో మన ఆదివాసి తెగల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నా, పోరాటం మన వారసత్వ రక్తం లోనే వున్నా, మనకు స్పూర్తినిచ్చిన ఆదివాసి వీరులు ఎందరున్నా ఏమైపోయింది పౌరుషం🔥🔥🔥ఒకప్పుడు ఆదివాసీలు కలకల లాడే మానుకోట,బొగ్గుట్ట,కొత్తగూడెం,పాల్వంచ,మణుగూరు,నర్సంపేట,గూడూరు,ములుగు,మంగపేట, భద్రాచలం, ఉట్నూర్,ఆదిలాబాద్,మంచిర్యాల, ఆసిఫాబాద్ లాంటి చిన్న పట్టణాలు నేడు వలసవాదుల చేతుల్లో మునిసిపాలిటీలుగా మారిపోతున్నా, మన ఏజన్సీ గ్రామాలలో అంతస్తుల భవంతులు, వ్యాపార భవనాలు వెలుస్తున్నా, మనం పూజించే , నిర్వహించే పాల్వంచ పెద్దమ్మతల్లి, దుమ్ముగూడెం ముత్యాలమ్మతల్లి, గుంజేడుముసలమ్మతల్లి,కురవి వీరన్న లాంటి అనేక ఆదివాసి దేవతల గద్దెలను వలసవాదులు ఆక్రమిస్తున్నా, యావత్ ఆదివాసి సమాజం కొలుచుకునే సమ్మక్క సారక్క గద్దెలను కూడా వదలకుండా లంబాడీకరణ జరుగుతున్నా, వలసవాద రాజకీయ నాయకురాళ్ళు , మన కరుడుగట్టిన  ఆదివాసి నేతలను పక్కకు తోస్తూ ఆదివాసీల అస్ధిత్వానికే సవాలు విసురుతున్నా, మన ఆదివాసి సమాజంలోని అవిశ్రాంత రాజకీయ దురందురులు, మేధావులమనుకునే ఉద్యోగులు, పోరాటం మా పేటంటు అనుకునే సంఘాల నాయకులు,అన్నీ తెలుసనుకునే యువతరం,మా గూడెంలో మాకు తిరుగే లేదనుకునే మన పటేల్, దొరలు అంతా కలిసి ఇంకా మనకేం కాదులే, మన పంచెలు పోయిన, మన మహిళల ఆభరణాలు పోయినా,మన భూములు పోయినా, మన విద్యా,ఉద్యోగ,రాజకీయ అవకాశాలు పోయినా,ఆఖరికి మన దేవతల గద్దెలను గద్దల్లా తన్నుకుపోతున్నా మనకేం కాదులే , ఇంకా ఎన్ని దోచుకున్నా మన అస్ధిత్వానికి ఏంకాదులే,మన గోసీలు మాత్రంఎవ్వడూ పీకలేడు అనే ధీమాతో దర్జాగా కోయత్తూర్ కోయదొరలలాగా బ్రతుకు ఈడుస్తున్నామా?ఆదివాసీల అస్థిత్వం పోయినా పర్వాలేదు మేం మాత్రం మారం, మేము మా కుటుంబం హాయిగా వున్నాం ఎవరి కోసం పోరాటం , ఎవరి కోసం ఆరాటం అనుకుంటున్నట్లుంది. ఆదివాసి తెగల ఇలవేల్పుల జాతరకు దేశంలోని అన్ని కులాల,మతాల,పార్టీల వారు మా జీవితాలు ఇంకా వెలిగిపోవాలని అడవి తల్లుల ఆశీస్సుల కోసం లక్షలాదిగా మేడారం తరలుతుంటే , అమాయక ఆదివాసులు మాత్రం మనల్ని దర్శనానికి పోనిస్తరా బిడ్డా అంటూ మేడారం పోలేక కుములిపోతున్నారు.ఓ ఆదివాసి దేవతలారా,వీరులారా మీ వారసత్వం కలిగిన మాకు పోరాడే తెలివిని, స్వయంపాలన కోసం ఎదురించే ధైర్యాన్ని, ఆత్మగౌరవం కోసం బ్రతికే శక్తిని కలిగించండి.జై ఆదివాసి!🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలి ANS

ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్యదేవారాజన్ గారిని మర్యదాపూర్వకంగా కలిసి TRT Verification......,ITDA Special DSC వేయాలని..,ఇతర నిరుద్యోగ సమస్యలపై చర్చించడం జరిగింది... కలేక్టర్ గారు అన్ని విషయాలపై సానూకూలంగా స్పందించారు ..మీ మడావి. దత్తు ఆదివాసీ నిరుద్యోగ సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు....

Gondwana Kabur