Followers

Thursday, November 28, 2019

జ్ఞాన జ్యోతి Gondawana channel

జ్ఞాన జ్యోతి
""""""""""""""""""""
ఎక్కడో...!
మూలాన పడి
మసి పూసిన మా బతుకులకు
బాసటగా నిలిచి,

బడుగు బలహీన వర్గాల
సంక్షేమాకై నాంది పలికి
జీవితాన్నే అంకితం చేసిన
ఓ త్యాగ మూర్తి
వందనం...

నా జాతినే నా కుటుంబం
నా జాతి బిడ్డలే నా బిడ్డలంటూ..!
మా బతుకులను తీర్చి దిద్దగా
భార్య పిల్లలతో వచ్చి
మా హృదయాల్లో కొలువుదీరిన ఆత్మీయుడా..!
వందనం....

దారిలో....!
మృగాలు ఖడ్గమృగాలు
పగబట్టిన విషపాములు ఎదురీడిన
అలుపెరుగని కఠోర దీక్షతో
జూదమాడుతున్న ధీరుడా సలాం...

కొండల గుట్టల నడుమ
పలుగు పారబట్టి సేదుజేస్తూ
పచ్చని పైరులను పండిస్తున్నా
ఓ శ్రామిక వందనం

నా బిడ్డలు దేంట్లోనూ
తక్కువ కాకూడదని
ఎన్నో కష్టాలను అనుభవిస్తూ
ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ
గొప్ప ఆలోచనలతో
ముందుకు సాగుతూ..!

అక్షరాన్ని ఆయుధంగా మల్చి
కలం పట్టి గళమెత్తి
లోకాన్నే శాసించమని
ఆకలైతే...!
అక్షరాన్ని ఆహారంగా
కచకచ నమలమని చెప్పిన
ఓ జ్ఞాన బోధ వందనం

అదుగో...!
నవయుగ అంబేద్కరుడు
గుర్రపు బగ్గీ పై
సవారీ జేస్తూ...!

నా జాతి ఖ్యాతిని
లోకానికి వెలిగెత్తి చాటుతూ..!
ఎలా వస్తున్నాడో జూడు జూడు

ఆ అంబేద్కరున్ని జూసి
నా కలం సలాం కొట్టీ
జేజేలు పలుకుతూ...!
నీ ముందర బానిసైంది.

ఎక్కడ జూసినా..!
జ్ఞాన జ్యోతులే
యే మూలాన జూసినా..!!
పోరాట యోధులే

ఈ పోటీ ప్రపంచానికి
ఎదురీడి గెలవాలంటే..!
జ్ఞానమొక్కటే ఆయుధమంటూ..
ఆయుధాలను చేతికందిస్తూ...

ఘడియ ఘడియకో
సైన్యాన్ని తయారు జేస్తున్న
ఆ జ్ఞాన జ్యోతిని జూడు..!
ఎంత ప్రకాశవంతంగా వెలుగుతున్నాడో..?

రచయిత: అశోక్ దుర్గం
చరవాణి: 8106709871
జిల్లా: కొమురం భీం ( ఆసిఫాబాద్ )

Wednesday, November 27, 2019

మొదటి ఆదివాసీ IAS అధికారి మడావి తుకారాo MADAVI TUKARAM IAS Gondawana channel

మొదటి ఆదివాసీ IAS అధికారి
మడావి తుకారాo
దట్టమైన అడవులు ,పోరాటం నేపద్యం కలిగిన జిల్లా ,ఆదివాసీ ల తో నిండిన ఆదిలాబాద్ జిల్లా లో , ఆదివాసీ పోరాట యోదుడు కొమరం భీమ్ జన్మించిన పురిటి గడ్డపై ,గోండు తెగ కు మరో ఆదివాసీ ఆణిముత్యం పుట్టింది .ఆదిలాబాద్ జిల్లా లో అత్యంత వెనుకబడిన గోండు ఆదివాసీల లో మడవి తుకారాo IAS అధికారి అయ్యాడు .మడవి తుకారాo సాదారణ గోండు తెగ కు చెందిన ఆదివాసీ ముద్దు బిడ్డా మడవి తుకారాం.ఆదిలాబాద్ జిల్లా లో  ఊట్న్ ర్ మండలo లోని లక్సేటి పేట లో మడవి బాబురావు మహారాజ్ ,మాన్కు భాయి దంపతులకూ మూడవ సంతానo గా 1951, జూన్ 06 న జన్మించారు .

 మడవి తుకారాం కడు పేదరికం లో పుట్టి పెరిగాడు . మడవి తుకారాం కుటుంబం జీవన విధానం సరిగా లేక ,సాగుభూమి  లేక దినసరి వ్యవసాయ కూలి గా జీవన కొనసాగించారు . మడవి తుకారాం తండ్రి ఆనాడు లక్సేటిపేట గ్రామ పోలీస్ పటేల్ గా అక్కడ ఉన్న తహసీల్దార్ కార్యాలయం లో చిరు ఉద్యోగం చేస్తూ ,చాలీ చాలని వేతనం తో కుటుంబాని పోషించేవాడు .తండ్రి తన పిల్లలనూ ఉన్నత చదువులు చదివించాలని తపన పడేవాడు .ఆ తండ్రీ ఆరాటమే మడవి తుకారాంనూ గోండు తెగ లో తొలి IAS అధికారిని చేసింది . మడవి తుకారాం విద్యా అభ్యాసం ప్రభుత్వ పాఠశాలోనే జరిగింది . మడవి తుకారాం స్టానిక పాఠ శాల లో నాల్గవ తరగతి వరకు చదివాడు . ఐదు నుండి పదవ తరగతి వరకు (1961-67)వరకు ఆదిలాబాద్ లో ని గిరిజన సంక్షేమ వసతి గృహం లో ఉంటూ ప్రభుత్వ పాఠశాలో చదివాడు .1967-69లో ఇంటర్మీడియట్ చదివాడు .1969-72లో డిగ్రీ చదువుతూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ,ఆర్ధిక అవసరాలు తీర్చుకుంటూనే కాగజ్నగర్ అటవీ శాఖ కార్యాలయం లో దినసరి వేతనం తో ఉద్యోగం చేస్తూ MA పూర్తి చేశాడు . మడవి తుకారాం మాతృ భాషా గోండీ తో పాటు గా మరాఠీ ,హిందీ  ,ఇంగ్లీష్ ,సంస్కృతం భాషలో పట్టు సాధించాడు .మన దేశం లో ఆదిమ జాతులు భాష సంస్కృతుల అధ్యయనం కోసం నైజాం కాలం లో ఆదిలాబాద్ కు రెండవ సారి వచ్చినా మానవ పరిణామ శాస్త్రవేత్త హైమాడార్ప్ కూ ఉన్నత విద్యా వంతుడైన    మడవి తుకారాం పై దృష్టి పడింది .గోండు ఆదివాసీల సంస్కృతి పైన  ఇంగ్లీష్ లో హైమాన్ డార్ప్  పరిశోధనలూ చేశాడు .వాటిని మడవి తుకారాం తెలుగు లోకి అనువాదం చేశాడు .హైమాన్ డార్ప్ లండన్ వెళ్ళిన తరువాత ఆయన స్పూర్తితో మడవి తుకారాం గ్రూప్ -1అధికారి అయ్యాడు .మొదట కాకినాడ లో ఆర్డీవో( RDO)గా ఉద్యోగం లో చేరాడు . ఉట్నూర్ ITDA -APO గా పని చేశారు .1987లో మడవి తుకారాం పెళ్ళి చేసుకున్నాడు .కరీంనగర్ లో DRDA -PD గా పనిచేశారు .హైదరబాద్ లో గిరిజన సంస్కృతి పరిశోధన శిక్షణ సంస్ధ డైరెక్టర్ గా పనిచేశాడు .మహబూబ్ నగర్ లో జిల్లా లో DRO గా పనిచేశాడు.

అనంతరం IAS అధికారి గా ప్రమోషన్ పొందాడు . మడవి తుకారాం తొలి సారిగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా పని చేశారు .ఆ తరువాత ఎక్సైజ్ కమిషనర్ గా ,  బాలకర్మిక వ్యవస్థ కమిషనర్ గా పనిచేశాడు .ఆ తరువాత ప్రభుత్వ సహాయ కార్యదర్శిగా పని చేశాడు .1999 లో నవంబర్ 29 న మడవి తుకారాం తీవ్రమైన అనారోగ్యంతో  మరణించాడు . మడవి తుకారాం కాంస్య  విగ్రహాన్ని ఉట్నూర్ X రోడ్డు లో ప్రతిష్టించారు  .ప్రతి సంవత్సరం  మడవి తుకారాం వర్ధంతి ని గోండు ఆదివాసీలు వారి సాంప్రదాయ రీతి లో నివాళి అర్పిస్తారు  .నేటి ఆదివాసీ యువతరానికి , ఆదివాసీ ఉద్యోగస్తులకు మడవి తుకారాం ఒక ఆదర్శం .నేటి యువత మడవి తుకారాంని స్పూర్తి గా తీసుకొని ఉన్నత స్తాయి కీ వెళ్ళాలి .సామ్రాజ్య వాద విష సంస్కృతి కీ దూరంగా ఉండాలి .
మొదటి ఆదివాసీ IAS మడావి తూకారం ""
నవంబరు 29న 21వ వర్ధంతి.

-వూకే రామకృష్ణ దోర

Saturday, November 16, 2019

ITDA లో ఏజెన్సీTRT Verification పకడ్బందీగా చేయాలి -ANS MADAVI DATHU

16-12-2019 ఉట్నూర్ ITDA లో  ఏజెన్సీTRT Verification పకడ్బందీగా చేయాలని...ఎట్టిపరిస్థితుల్లోను లంబాడాల Certificates పకడ్బందీగా చూడాలని...ఏజెన్సీ వెరిఫికేషన్ ఇంచార్జి Sub.Collecter Dr.Gopi గారిని కలవడం జరిగింది...పకడ్బందీగా వెరిఫికేషన్ చేస్తున్నామని అవసరమైతే మీరుకూడా కూర్చోవచ్చని తెలిపారు..కార్యక్రమంలో మడావి. దత్తు ANS అధ్యక్షుడు.... తొడసం.భగవంత్ రావ్ ASU ఉట్నూర్ అధ్యక్షుడు... ఆత్రం.విష్ణు ASU.. మెస్రం.భాష్కర్ AISF ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.


Friday, November 8, 2019

ఆమె ఓ జిల్లాకు కలెక్టర్ District Collector Gondwana Channel

ఆమె ఓ జిల్లాకు కలెక్టర్..
కానీ ఆ అధికార దర్పాన్ని మరిచి..
సాదాసీదాగా ఉంటుంది.
ప్రజల  కష్టాన్ని తెలుసుకొని వెంటనే పరిష్కారం చూపుతుంది.
ఏ క్షణమైనా అందుబాటులో ఉండి ప్రజాసేవకు అంకితమైంది.
ఆమెలో కలెక్టర్ ను అన్న గర్వం ఈసమంత కూడా కనబడదు.
ఆమెకు భాష రాకపోయినా పట్టుబట్టి భాష నేర్చుకొని ప్రజలతో మమేకమైతుంది..
ఆమె ఎవరో కాదు #ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్.

దేవరాజన్ దివ్య స్వస్థలం తమిళనాడులోని చెన్నై. ఆమె విద్యాభ్యాసమంతా చెన్నైలోనే కొనసాగింది. చెన్నై బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఆ తర్వాత పీజీలో పట్టభద్రురాలైంది. దివ్యకు  ప్రజలకు సేవ చేయాలనే తపన ఎక్కువ. అందుకే సాఫ్ట్ వేర్ సైడ్ కాకుండా సివిల్స్ పై తన దృష్టి పడింది. సివిల్స్ సాధిస్తే లక్షలాది మంది ప్రజలకు సేవ చేయొచ్చన్న ఆకాంక్షతో చెన్నై నుంచి ఢిల్లీ బయల్దేరింది. అక్కడ ఓ కోచింగ్ సెంటర్ లో కోచింగ్ తీసుకొని సివిల్స్ కు ప్రిపేర్ అయ్యింది. 2009 సివిల్స్ ఫలితాల్లో దివ్య ఆలిండియా 37వ ర్యాంకు సాధించింది. 2010లో ఐఏఎస్ ట్రైనింగ్ ముగిశాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను తన సర్వీసులో భాగంగా ఎంచుకుంది.

హైదరాబాద్ లో వివిధ భాగాలలో పని చేశారు. సిజిజి ప్రాజెక్టు డైరెక్టర్ గా చేశారు. ఆ తర్వాత ఖమ్మం ఐటీడీఏ పీవోగా, జేసీగా పని చేశారు. 2014లో రాష్ట్ర విభజన జరగడంతో ఆమె తెలంగాణ కేడర్ ను ఎంచుకున్నారు. ఆమెను తెలంగాణ ప్రభుత్వం భువనగిరి సబ్ కలెక్టర్ గా నియమించింది. సబ్ కలెక్టర్ గా తక్కువ కాలమే పని చేసిన దివ్య భువనగిరి ప్రజల మనస్సులు గెలుచుకున్నారు.

తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత దివ్య వికరాద్ జిల్లా కలెక్టర్ గా బదిలీ అయ్యారు. వికారాబాద్ కలెక్టర్ గా కూడా ఆమె తన పనితీరుతో ప్రజల మనస్సులు గెలుచుకున్నారు. పెద్దేముల్ మండలం చైతన్య నగర్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. గ్రామంలో సీసీ రోడ్లు, వీధి దీపాలు, నీటిఫ్లాంట్లు, వైద్య సదుపాయాలు, ఆడపిల్లల చదువుపై ప్రత్యేక శ్రధ్ద తీసుకొని అన్ని వసతులు కల్పించారు.

ఇదే సమయంలో ఆదిలాబాద్ జిల్లాలో రిజర్వేషన్లకు సంబంధించి ఆదివాసీలకు గొడవలు జరిగాయి. పరస్పరం దాడులకు పాల్పడ్డారు. దీంతో పరిస్థితి చేజారిపోతుందని గ్రహించిన తెలంగాణ ప్రభుత్వం వికారాబాద్ జిల్లా కలెక్టర్ గా ఉన్న దివ్య దేవరాజన్ ను ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గా బదిలీ చేసింది. ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించి, సమస్యను పరిష్కరించగలదని తెలంగాణ సర్కార్ ఆమెను నియమించింది. బాధ్యతలు స్వీకరించిన దివ్య వెంటనే ముందుగా జిల్లాలో ఉన్న అశాంతిని తొలగించేందుకు అందరితో సమీక్ష సమావేశాలు పెట్టారు. ఇరు వర్గాలు శాంతించేలా పలు ప్రకటనలు చేశారు.

ఆదిలాబాద్ జిల్లా అటవీ జిల్లా. ఎక్కువ మంది ప్రజలు అడవులల్లోనే నివసిస్తారు. కలెక్టర్ గా దివ్య గ్రామాల పర్యటనకు వెళ్లినప్పుడు ప్రజలెవరూ కూడా ఆమెతో మాట్లాడడానికి ఆసక్తి చూపేవారు కాదు. వారి సమస్యలు కూడా చెప్పుకునేవారు కాదు. దివ్య వారితో మాట్లాడుదామంటే భాష సమస్య. దీంతో దివ్య ప్రజలతో కలిసిపోవాలంటే వారి భాష నేర్చుకోవాలని నిర్ణయించుకుంది. తమ ఆఫీసులో పనిచేసే గిరిజన సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగితో రోజు ఉదయం రెండు గంటలు ట్యూషన్ చెప్పించుకొని గిరిజన భాష నేర్చుకుంది. గ్రామాలకు వెళ్లినప్పుడు గిరిజనుల కంటే ముందు దివ్యే వారితో మాట్లాడడంతో ప్రజలు సమస్యలన్ని చెప్పుకున్నారు. ఆమె వెంటనే వాటికి పరిష్కార మార్గాలు చూపేవారు.

కలెక్టర్ కార్యాలయంలో పని చేసే గోపాల్ తన పెళ్లికి దివ్యను ఆహ్వానించాడు. కలెక్టర్ వస్తుందో రాదో అని గోపాల్ కూడా అనుమానం వ్యక్తం చేశాడట. కానీ దేవరాజన్ దివ్య ఆ అనుమానాలను పటా పంచలు చేస్తూ గుడిహత్నూర్ మండలం గోపాల్ పూర్ లో జరుగుతున్న వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ సాధారణ మహిళల కింద కూర్చొని పెళ్లి చూశారు. అనంతరం గిరిజనుల సాంప్రదాయ నృత్యం ధింసా చేసి అందరిని ఆకట్టుకున్నారు.

అదే విధంగా ఉట్నూర్ మండలంలో జరిగిన సమావేశంలో గిరిజనుల భాష మాట్లాడి దివ్య అందరిని ఆశ్చర్యపరిచారు. ఓ సారి వర్షాకాలంలో ఓ గర్భిణికి నొప్పులు వస్తే సకాలంలో అక్కడికి అంబులెన్స్ రాలేకపోయింది. దీంతో గర్భిణి కడుపులోని బిడ్డ చనిపోయింది. ఈ విషయం తెలుసుకొని చలించిన దివ్య ఆ గర్భిణి ఇంటికి వెళ్లి పరామర్శించి ఓదార్చారు. ఆమెకు దైర్యం చెప్పారు.

18 డిసెంబర్ 2017న ఆదిలాబాద్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన దేవరాజన్ దివ్య ప్రస్తుతం కూడా ఆదిలాబాద్ కలెక్టర్ గానే కొనసాగుతున్నారు. దేవరాజన్ దివ్య భర్త ఢిల్లీ యూనివర్సిటిలో ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. అనునిత్యం ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ, ప్రజల మనిషిగా దివ్య పేరు సంపాదించుకున్నారు. ఆడంబరాలకు దూరంగా ఉండి నిరాడంబరతగా వ్యవహరించి ప్రజల మనస్సులు గెలుచుకున్నారు. పిట్టకూర కలెక్టర్ గా పేరు తెచ్చుకున్న దేవరాజన్ దివ్య పలువురికి “స్పూర్తి” గా నిలిచారు.
గోండి బాషలో మాట్లాడిన విడియో లింకు
https://youtu.be/KzaQAj6I8Ho

ఫీరోజ్ ఖాన్,
సీనియర్ జర్నలిస్ట్,  9640466464
#ferozkhanjournalist@gmail.com

Gondwana Kabur