Followers

Tuesday, May 14, 2019

హోళీ పండుగ ఎందుకు జరుపుతాము..? హోళీ పండుగ ఎవరి విజయానికి గుర్తు...?

*"హోళీ పండుగ"*
*ఎందుకు* *జరుపుతాము..?*
*హోళీ పండుగ ఎవరి* *విజయానికి గుర్తు...?*
****
ఈ విషయం తెలియని
భారతీయ మూలవాసీ బహుజనులు
*"హోళీ పండుగ"* సందర్భంగా కొన్ని బ్రాహ్మణ, మార్వాడి సంఘాల వారు
రాత్రి కామ దహనం పేరుతో రావణ బ్రహ్మ చిత్రపటాన్ని
దగ్ధంచేసి తెల్లవారు రంగులు చల్లుకొని పండుగ జరుపుకుంటారు

చరిత్ర తెలియని
బహుజనులు ఇందులో పాల్గొంటున్నారు

ఈ చరిత్ర తెలియక నేను
నా చిన్నతనం నుండి పాల్గొంటున్నాను
గత సంవత్సరం నుండి
*"హోళీ పండుగ"*
జరపబోనని ప్రకటించాను..

కారణం ఈ దేశ మూలవాసీ అడబిడ్డ *"హోళీక"*
హత్య జరిగిన విషాదకరమైన
సంఘటన అనే విషయం
చరిత్ర తెలియని మూలవాసులం
ఆనందకేళీ రంగేళి అంటూ రంగులు చల్లుకొని మద్యంసేవించి మాంసం తిని పడుకుంటాము..

ఈ దేశమూలవాసుల
రాజు హిరణ్యకశిపుడు 
తన కుమారుడు ప్రహ్లాదుడు గురుకులంలో  హరినామం 
పఠించేవిధంగా ఆర్యులు కుట్రపన్ని హరిభక్తిని నేర్పిస్తారు

హిరణ్యకశిపుడు తన రాజ్యంలో
ఆర్యుల విద్య కాకుండా
తన రాజ్యంలో ఆర్యులకు భిన్నమైన ఆలోచనతో కూడిన విద్యను గురుకులాల్లో ప్రవేశపెడతాడు హిరణ్యకశిపుడు

దీన్ని సహించలేని ఆర్యులు
తండ్రి కొడుకుల మధ్య కయ్యం
పెట్టే ప్రయత్నం చేసినప్పుడు శత్రువు అయిన హరి మాటలు నమ్మి తండ్రికి ఎదురు చెప్ప కూడదంటు
హిరణ్యకశిపుడి చెల్లెలు
*"హోళీక"*
తన అల్లుడైన ప్రహ్లాదుడికి
నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంది

అది చూసి ఓర్వలేని ఆర్యులు  హోళిక ప్రయత్నాన్ని  భగ్నం చేయడానికి ఏ పాపం ఎరుగని హిరణ్యకశిపుని చెల్లెలైన "హోళికను"
ఆర్యుల రాజు విష్ణువు  హోళికను అగ్నిలోకి నెట్టి హత్య చేస్తాడు

ఒక స్త్రీని  అత్యంత క్రూరంగా  హత్యచేసిన రోజును పండుగ పేరుతో మన చరిత్రను
మనతోనే సమాధి చేయిస్తున్న
మనుస్మృతి వారసుల
కుట్రలను చరిత్ర పాదఘట్టాల నుండి మన చరిత్ర గాయాలను తవ్వితీసే సమయం ఆసన్నమైంది
మూలవాసీ ఏకలవ్యుల
రణ నినాదాలతో
మనువు బిడ్డలకు
మనసులో మనసు
లేకుండాపోయింది..

*జోహార్ "హోళీక"*
*జోహార్ జోహార్*
*మూలవాసీ*
*మృతవీరులారా..!*

చరిత్రను తిరగ రాసే
మహాత్మ ఫూలే,సావిత్రి బాయి,బాబాసాహెబ్,
పులాన్ దేవి,రోహిత్ వేముల
వారసత్వం ఈ
దేశ నలుమూలల
విస్తరిస్తున్న విషయం తెలిసినప్పుడు
మనుస్మృతి వారసులు
ఆగమవుతున్న దృశ్యం
స్పష్టమై పోయింది.
జై భీమ్  జై జై భీమ్

- అర్క సంతోష్

Friday, May 3, 2019

ఇంద్రవెళ్లి రక్తం చింది 38సం,,పూర్తీ అవుతుంది

ఇంద్రవెళ్లి రక్తం చింది 38సం,,పూర్తీ అవుతుంది ఆనాడు అమరులు ఆశించిన లక్ష్యం భూమి,భుక్తి,విముక్తి,మోసం దోపిడీ లేని మవనాటే,మావాసర్కార్,అని ప్రభుత్వానికి సవాల్ విసిరిన అదివాసి అమరుల లక్ష్యం నెరవీరాడమే కాక ఇంకా జటిలమైన పరిస్థితులు నెలకొన్నాయి ఆదిఅత్య రాజకీయ పార్టీలకు.ఆదివాసీ నావకులను ప్రలోభ పర్చి  విచిన్నం చేసి తాత్కాలిక స్వార్ద ప్రయోజనాల వలన అమరుల ఆశీయాలు నిరుగారుతునాయి వారి త్యాగలతో అనుభవిస్తున్న అడవి భూమి పోడు భూమి పట్టాలు ప్రత్యేక హక్కులు,ఏజన్సీ చట్టాలు స్థానిక ఉద్యోగాలు,విద్య, వైద్యం,రవాణ,అభివృద్ధి స్వేచ్ఛ,.వారి త్యాగ ఫలితాలు కానీ నేడు అవి పరాయి,దోపిడీ వలాస, గిరిజనేతారుల చేతుల్లోకి పోయినాయి ప్రభుత్వం,యం త్రాంగం,కలసి కుట్రలు పన్ని ఆదివాసీ గుడాలను,పెసాచట్టని,తుంగలో తొక్కడానికి సిద్దమవుతున్న  ప్రభుత్వం,నేడు ఆదివాసీ అమరులను స్మరించుకోవడం నేరంగ భావిస్తన్న తరుణంలో ఆదివాసీ గొంతువిప్పని పౌరసమాజం ఆదివాసి నాయకులు ఆదివాసీకి  భావిప్రజలకు ,తారనికీ ఏం అందిస్తారో ఆదివాసీ విద్యావంతులు నాయకులు ఉద్యోగస్తులు ఆలోచించాలి,అనుభవిస్తున్న సుఖాలు 38సం:లక్రితం  త్యాగల పలితమే. వారిని స్మరించడం ఆదివాసుల కర్తవ్యం అందుకే ఈ నెల20 ఏప్రిల్ రోజున ఆదివాసీలు అదిక సంఖ్యలో పాల్గొని అమరులను స్మరిస్తారని మనవిచేస్తున్నాం.....ఆదివాసీ అమరులకు ✊🏼జోహర్.. జోహార్లు..జై.జై... ఆదివాసీ..✊🏼..వ్యవస్థాపకులు..........ఇంద్రవెళ్లి అమరుల ఆశయ సాధన సమితి..

గోండి భాషా దినోత్సవం : గిరిజన భాషలకు లిపి వుంటే లాభం ఏమిటి?

గోండి భాషా దినోత్సవం : గిరిజన భాషలకు లిపి వుంటే లాభం ఏమిటి?

గోండు భాష : ఆదిలాబాదు మరియు బస్తర్ జిల్లాల్లో గోండు గిరిజనులు మాట్లాడే భాషే గోండు భాష. ద్రవిడ భాషా కుటుంబానికి చెందిన గోండీ, తెలుగు కన్నా కన్నడకు దగ్గరగా ఉంటుంది. గోండుల్లో ఇప్పటికీ చాలా మందికి గోండీ తప్ప మరే భాషా రాదు, అర్థం కాదు. గోండులతో సహవాసం చేసే కొలాములు తమ భాష కొలామీయే కాక గోండీ కూడా మాట్లాడగలరు.


గోండులు అతి ప్రాచీనమైన తెగకు సంబంధించిన వారు. వీరిది ప్రాచీనమైన సంస్కృతీ వికాసం గల నాగరికత, వీరు అడవులలో నివసించే జాతి. వీరిలో రాజ గోండులు ముప్పై ఆరు సంస్థానాలను స్థాపించుకుని చత్తీసు ఘడ్ పేరుమీద రాజ్యపాలన చేశారు.


ఆ ప్రాంత మంతా ఈ నాటికిమధ్య ప్రదేశ్ లో ఛత్తీస్ ఘడ్ గా పిలువబడుతూ వుంది. ఆంధ్ర దేశాన్ని ఆనుకొని వున్న ప్రాంతాలైన, చాందా, సిరువంచా, బస్తర్ మొదలైన సంస్థానాలను రాజ గోడులు పాలించారు.


ఆదిలాబాద్ జిల్లా నార్నె మండలం గుంజాల అనే గ్రామంపై ఇప్పుడు అనేకమంది భాషా పరిశోధకుల దృష్టి పడింది. ఓ పది రాత పుస్తకాలతో ఆ ఊరిప్పుడు చాలామంది దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకీ ఆ రాత పుస్తకాలు ఏమిటి? అందులో ఏముంది? గిరిజన గోండులు ఐదారు రాష్ట్రాలలో ఉన్నారు. చాలా గిరిజనజాతులకు అత్యంత ప్రాచీన భాష ఉంది. కానీ లిపులు లేవు. అందుకే అవి చాలా వరకు నోటి భాషలే. ఆ నోటి భాష కూడా అంతరించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గోండి భాషపై అలనాడు ప్రాకృతం, ఆ తరువాత సంస్కృతం, అరబ్బీ, పారసీకం, ఉర్దూ, హిందీ, మరాఠీ, తెలుగు భాషలు పెత్తనం చెలాయించాయి. గత యాభై ఏళ్లుగా చదువుపేరిట ఇంగ్లిషు కూడా దానిపై స్వారీ చేస్తున్నది.


మైదానప్రాంతాల ప్రజలకు దూరంగా, నాగరిక వాతావరణానికి భిన్నంగా, అడవుల్లో నివసించేవారు గిరిజనులు. నిజాం నవాబు అమల్లోకి తెచ్చిన అటవీ చట్టాల ఫలితంగా గిరిజనులు సాగుచేసుకున్న భూమి కోల్పోవాల్సి వచ్చింది. అందువల్ల వారు తాము ఉన్న చోటినుండి మరింత అడవి లోతట్టుకుపోయారు గిరిజనులు సాగుచేసిన భూముల్ని, మైదాన ప్రాంత భూస్వాములు హస్తగతం చేసుకున్నారు. భూస్వాములు, ఆ భూములపై పట్టాలు సంపాదించుకున్నారు. ఈ తతంగానికి వ్యతిరేకంగా భూమిపై అధికారాన్ని వదులుకోకుండా వుండడానికి గిరిజనులు అడవిని అంటిపెట్టుకుని ఉండడానికి రాజ్యాధికారం కావాలని భావించారు. అందుకే కొమురంభీం నిజాంకు వ్యతిరేకంగా పోరాటం సాగించాడు. అనంతరకాలంలో పోరాటం అణచివేయబడింది. హైమన్ డార్ఫ్ అనే శాస్తవ్రేత్తను నివేదిక తయారుచేయమని నిజాం కోరాడు. అతని సంస్కరణల మేరకు గిరిజనులకు భూముల పట్టాలు దొరికాయి. లోతట్టు అడవిలోని భూములపై గిరిజనులకు అధికారం లభించింది. ఆ విధంగా అడవిలో గిరిజనులు, గిరిజనేతరులు కలిసి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అమాయకులైన గిరిజనులను మైదాన ప్రాంత షావుకార్లు మోసం చేసేవారు.


అయినా అది తట్టుకుని నిలిచింది. చాలా గిరిజన భాషలు మార్పునకు లోనై సాంకర్యంతో కళవెళ పడుతున్నాయి. ఈ సందర్భంలో గుంజాలలో పది రాత ప్రతులు లభించాయి. అదీ గోండీ లిపిలో చేతితో రాసిన ప్రతులు. దీనికే ‘గుంజాల గోండీ లిపి’ అని పేరు. వందేళ్ల క్రితం ఆ ఊరిలో ఈ లిపి ప్రచారంలో ఉండింది. ఈ లిపి సృష్టికర్త ఎవరన్నది నిర్దిష్టంగా చెప్పలేం. ఆ సమాజమే దీన్ని సృష్టించుకున్నది. అయితే మూడు తరాల కింద ఈ లిపిని ఎక్కువగా ప్రచారం చేసింది మాత్రం గుంజాలకి చెందిన పెందూర్ లింగోజి, కుంరా గంగోజి. వీరు ఒక పాఠశాల ఏర్పాటు చేసి దీన్ని నేర్పారు. అలా 60-80 ఏళ్ల కింద నేర్చుకున్న కోట్నక్ జంగు, కుంరా విఠల్, అర్క జైవంత్, కంరా లాల్‌షావు, అర్క కమలాబాయి ఇప్పటికీ ఉన్నారు.


వారు చదవగలరు, రాయగలరు. కమలాబాయి వయస్సు ఇప్పుడు తొంభై ఏళ్లు పైనే ఉంటుంది. దృష్టి మందగించినా ఆ రాతను చూసినప్పుడు ఆమె కళ్లల్లో మెరుపులు. ‘మా భాష మాకు కావాలి. అది మాకు గర్వకారణం’ అంటుందామె. పదేళ్ల వయసులో ‘బిడ్డా! ఇది మన లిపి. దీన్ని చదువు. కాపాడు’ అని ఆమె తండ్రి చెప్పాడట. అందుకే ఆమె ఈ లిపిని కొడుక్కి, మనవరాలికి కూడా నేర్పింది. గిరిజనులకు విద్య దూరం అనుకునే శిష్ట సమాజం నివ్వెరపోయే విషయం ఇది.

ప్రపంచం మొత్తం మీద సుమారుగా ఆరు వేల భాషలున్నాయి. మన దేశంలో పదహారు వందల యాభై భాషలు ఉన్నట్లుగా అంచనా. ప్రస్తుతం అవి ఎనమిది వందలకు చేరిందని భాషావేత్తల అభివూపాయం. సుమారు ఇరవై ఐదు భాషలకు మాత్రమే లిపి, సాహిత్యం ఉంది. మిగితావన్నీ మౌఖికంగానే ఉన్నాయి. ఒక భాషకు లిఖిత రూపం రావడమంటే అంత సులువైన పని కాదు. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ఒక సాంస్కృతిక జీవనానికి నిలు నిదర్శనంగా లిఖిత రూపం వుంటుంది.

ఈ రాత ప్రతులను మొదట చూసినప్పుడు మరాఠీనో, దేవనాగరి లిపో అనుకున్నాం. కానీ, అది ఒక విలక్షణమైన లిపిగానే కనిపించింది. అందుకే ఆ లిపిని గోండు పిల్లలకు నేర్పించాలని భావించాం. ఏడాదికింద అఖిల భారత గోండ్వానా గోండి సాహిత్య పరిషత్ జిల్లా మహాసభ జరిగింది. ప్రతి ఏడాది జనవరి 27 గుంజాల గోండీ లిపి దినోత్సవం జరపాలని అప్పుడు నిర్ణయించారు. ఈ ఏడాది కూడా ఆ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో తెలుగు తరవాత భాషా దినోత్సవాన్ని జరుపుకున్న ఘనత గోండులదే. గుంజాల లిపే వారికి ఆ ప్రేరణ.

‘గుంజాల గోండీ లిపి అధ్యయన వేదిక’ తరఫున చాలా కార్యక్రమాలు జరిగాయి. ప్రస్తుతం ఐటీడీఏ ఉట్నూరు, హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని ‘సెంటర్ ఫర్ దళిత్, ఆదివాసీ స్టడీస్ అండ్ ట్రాన్స్‌లేషన్’ (సిడాస్ట్) సహకారంతో మొదటిసారిగా గోండీ లిపిలో మొదటి వాచకం అచ్చేస్తున్నారు. గుంజాల గ్రామంలో లిపి అధ్యయనం కోసం ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రాజెక్టు ఆఫీసర్ జే. నివాస్ సుముఖత వ్యక్తం చేశారు. ఈ లోగా సిడాస్ట్ గుంజాలకి ఒక పరిశోధక బృందాన్ని పంపింది. జయధీర్, ఆచార్య వి.కృష్ణ ఆధ్వర్యంలో గోండీ లిపిలోని రాత ప్రతులను హిందీ, తెలుగు భాషలలోకి అనువాదం చేసే పని అక్కడ జరుగుతోంది. ఈ లిఖిత సమాచారంలో గోండీ ప్రజల ఆచారాలు, చరిత్ర వెల్లడవుతున్నాయి. ఈ లిపిపై గోండీ పిల్లలు ఆసక్తిగా ఉన్నారు. ఆరో తరగతి చదివే విఠల్ రెండో తరగతి చదివే పిల్లలకు, ఈ లిపిలో అక్షరమాలను, గుణింతాలను నేర్పుతున్నాడు. లాల్‌షావు (75) కోట్నక్ జంగు (72) తమ ఆత్మకథలను గుంజాల గోండి లిపిలో రాస్తున్నారు. వాటిని శ్రీధర్ శ్రీకంఠం తయారుచేసిన సాఫ్ట్‌వేర్ సాయంతో ఆ లిపిలోనే డీటీపీ చేసి పుస్తకం ముద్రించేందుకు రంగం సిద్ధమైంది.

అంటే గోండీ లిపిలో, గోండీ భాషలో అవి మొదటి ఆత్మకథలు అవుతాయి. ఎం.ఏ (తెలుగు) చదివిన కోట్నక్ వినాయక్ తెలుగు నుంచి గుంజాల లిపిలోకి అనువాదం చేయగలడు. అతని సహాయంతో గుంజాల గ్రామంలో లిపి అధ్యయన కేంద్రం కూడా ప్రారంభం కాబోతున్నది. అక్కడ ఒక గోండీ భాషా పాఠశాలకు అంకురార్పణ జరుగుతున్నది. అనువాదం పనిలో ఉండగా గోండీ-తెలుగు భాషలకున్న అనుబంధాన్ని గమనిస్తే ఆశ్చర్యం కలిగింది. వందలాది గోండీ పదాలు తెలుగులో ఉన్నాయి. తెలుగు భాషా మూలాలే కాదు, సాంస్కృతిక, చారిత్రక లోతులు కూడా తెలుస్తాయని నమ్మకం. బౌద్ధుల నలందలాగా గోండీ లిపి భాషా విషయాలకు గుంజాల కూడా విశ్వవిద్యాలయంగా ఎదగాలని కోరుకుందాం.

-అర్క సంతోష్

Gondwana Kabur