Followers

Sunday, June 25, 2023

కుమ్రం భీమ్ విగ్రహ ఆవిష్కరణ Gondwana Channel

తేదీ 25-06-2023.ఆదివారం. -Gondwana Channel

  కుమ్రం భీమ్ విగ్రహ ఆవిష్కరణ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కుమ్రం భీమ్ చౌక్ నందు కుమ్రం భీమ్ నుాతన విగ్రహ ఆవిష్కరణ కొత్త చౌక్ ప్రారంభోత్సవము. తేది:-10/07/2023న సమయం సాయంత్రం 5 గంటలకి పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది...! 



    కావున సమస్త ఆదివాసి సమాజం ఆదివాసి గుాడలనుండి చిన్న, పెద్దలు, మహిళలు గ్రామ పటేల్స్, రాయ్ సెంటర్ సభ్యులు, సర్పంచులు, ఎంపిటిసిలు, జడ్పీటీసీలు సమస్త ఆదివాసి ప్రజనికం  మరియు అన్ని వర్గాల ప్రజలు ప్రజాస్వామిక వాదులు, మేధావులు, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు కార్మికులు, కర్షకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉత్సవ కమిటీ తరుపున విజ్ఞప్తి చేస్తున్నాం.  ఆవిష్కరణ రోజు అందరు మధ్యాహ్నం 3 గంటలకి మల్టీ పర్పస్ గ్రౌండ్ కి అందరు విచ్చేసి అక్కడి నుండి మన ఆచార సంప్రదాయాలను ప్రదర్శిస్తు భారీ ర్యాలీతో మన కుమ్రం భీమ్ చౌక్ కి తరలివెళ్ళి ఆవిష్కరణ కార్యక్రమాని మనం ఘనంగా నిర్వహించుకుం నిర్వహించకుంద్దాం అని కమిటీ పెర్కోంది.



గోడం గణేష్

కుంర శ్యాంరావు 

మెస్రం పరమేశ్వర్ 

కుంర జంగు బాబు 

పెందుర్ మోహన్ 

కుర్సెంగా తనాజీ 

కుంర శ్రీనివాస్ 

కుంర రాజు

వెట్టి మనోజ్ 

నైతం శుక్లాల్ 

కుంర మోతీరం

కుంర రాజు 

ఆత్రం గణపతి 

ఆత్రం భూజంగ్ రావు

ఆయ గ్రామల, సర్పంచ్ లు, యం.పి.టి.సి.లు కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు...!!

Saturday, June 24, 2023

పెందోర్ ప్రభాకర్ అన్నా ప్రజా ప్రస్థానం విద్యార్థి దశ నుంచి నేటి వరకు నిరంతరం ప్రజాసేవకు అంకితం

పెందోర్ ప్రభాకర్ అన్నా ప్రజా ప్రస్థానం విద్యార్థి దశ నుంచి నేటి వరకు నిరంతరం ప్రజాసేవకు అంకితం.

   కుంరం భీము యువ సేన 1997 లో స్థాపించి యువతను చైత్యనం చేయడంతో పాటు రోడ్డు సౌకర్యాలు కల్పిచడం జరిగింది.


 కుంరం భీము యువ సేన ఆధ్వర్యంలో జోడేఘాట్ లో కొమరం భీం వర్ధంతి చేయడం జరిగింది.



  అటవీ హక్కుల కోసం ర్యాలీలు చేసి చట్టాలు రావడానికి కృషి చేయడం జరిగింది.


అటవీ హక్కుల చట్టం రొపొందించుటకు కృషి

పొడు భూముల పట్టాల కోసం కుంరం భీము కాంప్లెక్స్ నుంచి వేలాది మంది ఐటీడీఏ వరకు ర్యాలీ.

జన్నారం కవ్వాల్ టైగర్ జోన్ రద్దుకు జన్నారంలో ప్రొఫెసర్ కోదండరాం తో మహాసభ.

ఆదివాసీ సమస్యలపై అన్ని సంఘాలతో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తో ప్రగతి భవన్ లో సమావేశం.


కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా  పెందోర్ ప్రభాకర్.

ఆదివాసీ నాయకుడుగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడుగా, ఆదివాసి అడ్వకేట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడుగా, వివిధ ఆదివాసి సంఘాలకు న్యాయ సలహాదారుడుగా పనిచేయడం జరిగింది.

   జర్నలిస్టుగా పనిచేయడం జరిగింది.

   ఆ సమయంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జర్నలిస్ట్ యూనియన్ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తూ ఆదివాసి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తూ సమస్యల పరిష్కార కృషికి చేయడం జరిగింది అలాగే ఉత్తమ జర్నలిస్టు అవార్డు కూడా రావడం జరిగింది.


      ఆ తర్వాత న్యాయవాదిగా పనిచేస్తూ సివిల్ మరియు క్రిమినల్ కేసులు వాదిస్తూ ముఖ్యంగా ఉట్నూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండవసారి బాధ్యతలు నిర్వహిస్తూ ఉమ్మడి జిల్లాలోని ఆదివాసి ఉద్యమకారుల కేసులు సుమారు 151 పైగా కేసులను నడిపి ఉచితంగా నడిపిస్తూ ఎంతోమందికి జైలకు వెళ్లకుండా బెయిల్ తీయడం తీయడం జరిగింది. ఆ విధంగా ఆదివాసి నాయకుల కేసులను పరిష్కరిస్తూ మరోపక్క ఆదివాసి భూ సమస్యల పరిష్కారం కోసం పెండింగ్ ఉన్న కేసులను వాదిస్తూ ఎందరికో న్యాయం చేయడం జరిగింది .సుమారు పది సంవత్సరాలు పైనుంచి ఈరోజు వరకు న్యాయవాదిగా అనేక సేవలు అందించడం జరుగుతుంది.

  ఐటీడీఏ ధ్వంసం కేసుల్లో ఆదివాసి నాయకుల పైన కేసులు పెడితే ఒక న్యాయవాదిగా ఉచితంగా వారిని ఆదివాసి నాయకుడిగా అప్పటి కలెక్టర్ అశోక్ కుమార్ మరియు ఏ.ఎస్.పి అంబర్ కిషోర్జ తో  మాట్లాడి నాయకుల పేర్లను కేసులు కాకుండా తొలగించడం జరిగింది.

  తెలంగాణ ఉద్యమ ప్రస్థానం 

   2001లో టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావించే ముందు తెలంగాణ ఐక్యవేదికలో ఉట్నూర్ డివిజన్ అధ్యక్షుడిగా పని చేస్తూ ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది ఆ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారిని కలిసి తెలంగాణలోని ఆదివాసి సమస్యలపై చర్చించి తెలంగాణ వస్తే ఆదివాసులకు ఎలాంటి న్యాయం చేయాలని దాని గురించి ఎజెండాను రూపొందించడంలో ఒక న్యాయనిపునులుగా పనిచేయడం జరిగింది. ఆ విధంగా విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులుగా పనిచేయడం జరిగింది.


   2009లో అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ గా పనిచేస్తూ నెరవేదిక సమ్మె చేస్తూ కొనసాగిస్తూ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది . తెలంగాణ జేఏసీ కో కన్వీనర్ గా పనిచేయడం జరిగింది తెలంగాణ జేఏసీ కో కన్వీనర్ గా పనిచేస్తూ తెలంగాణ ఉద్యమాన్ని ఎంతో చురుకుగా నడిపించడం జరిగింది. మరో ప్రక్క నిరుపేదల కోసం ఉట్నూరులో ఇండ్ల స్థలాల కొరకు ధర్నాలు ర్యాలీలు చేస్తూ రాంజీ గొండ్ నగర్ స్థాపనకు కృషి చేయడం జరిగింది.

    రాజ్ గొండ్  సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులుగా ఉంటూ ఆదివాసి సమస్యల పరిష్కారం కోసం గత సంవత్సరం ప్రభుత్వ చిప్ విప్ రేగా కాంతారావు ఆద్వారంలో అన్ని ఆదివాసి సంఘాలను ఏకం చేసి సమస్యలను వివరించడానికి ప్రగతి భవన్ కు ఆదివాసీ నాయకులను తీసుకెళ్లి సమస్యలను వివరించడంలో ముఖ్యపాత్ర పోషించడం జరిగింది. ఈ విధంగా అన్ని రకాల అనుభవాలు ఉన్న సీనియర్ న్యాయవాది ,ఆదివాసి నాయకుడు రాజకీయంగా న్యాయపరంగా అనుభవం ఉన్న పెంధోర్  ప్రభాకర్ గారు.

      మరోపక్క ఒక రాజకీయంగా సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయ ప్రవేశం చేయడం జరిగింది.

 ౼Mangam Visham Rao.

Gondwana Kabur