ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతం లోని ఆదివాసీ గూడాల్లో ఆకాడి పండుగ సంబరాలు జోరుగా సాగుతున్నాయి.. ప్రతి ఏడాది ఈ ఆకాడి పండుగతో ఆదివాసులు వారి సంప్రదాయం పండులాగు దండారి, తో పాటు ఇతర వాటిని నిర్వహించుకొనుటకు దీని నుండి శ్రీకారం చుడుతారు..
పిల్లలు, పెద్దలు పంటలు పాడి గేదలు పశువులు అంతయు శుభిక్షంగా ఉండాలని కోరుకుంటు ఈ ఆకాడి పండుగ ను వారి తాత ల కాలం నుండి చేస్తునట్టు ఆదివాసులు పేర్కొన్నారు..
గ్రామ పొలిమేర లో ఉన్న పోచమ్మ, రాజులు అనే వన దేవత లకు మొక్కులు చెల్లించుటకు పండుగ కు ఒక రోజు ముందు గ్రామస్తులు అందరు కలిసి పటేల్ ఆధ్వర్యంలో తీర్మానం చేస్తారు.. మరుసటి రోజు మహిళలు లేకుండ కేవలం పిల్లలు, పెద్దలు సముష్టిగా వారికి తోచిన మాదిరిగా కోళ్లు, గొర్రెలు, మేకలు పట్టు కొని వహిద్యాలు వాహుంచకుండ పండుగ చేసుకొనుటకు ఆటవికి తరలి వెళ్తారు.. అక్కడ సంప్రదాయం ప్రకారం ఇంటి నుండి తెచ్చిన బియ్యం, నవధాన్యాలు, కొబ్బరి కాయులు, ఉది బత్తులు అక్కడ పెట్టి దేవారి సమక్షంలో పూజలు చేసి కోళ్లు, మేకలను బలి ఇస్తారు.. అనంతరం వంటకాలు చేసుకొని సహపంక్తి భోజనాలు చేస్తారు.. ఈ సందర్బంగా ఆహారం ను ముద్దలుగా పెట్టి దేవుళ్ళకు నైవేద్యం గా సమర్పిస్తారు.. వారికి వారు పెంచిన పశువుల కు అటవీ జంతువుల నుండి ఏలాంటి ప్రాణహాని ఉండకుండా కాపాడాలని కోరుకుంటు పసుపు, బెల్లం కలిపి న కలశం ను తయారు చేసి గ్రామ పొలిమేర లో గీత గా వేసి ము ముందుగా పశువుల ను దాటించి ఆ తర్వాత ఆదివాసీ లు దాటుతారని వారు తెలిపారు.. ఒక వేల ముందుగా మనుషులు గీత దాటుతే అరిష్టం గా ఉంటుందని వారు నమ్ముతారు... ఈ పండుగ కేవలం అటవీ దేవత కు గుర్తింపు గా చేస్తారని, అందులో వారికి ఏడాది పాటు ఏలాంటి నష్టం రాదని, దేవత చల్లగా కాపాడుతుందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..
బైట్స్ : 1.లక్మన్.
2.భీంరావ్
3.రాము
4.విశ్వం.. మత్తడి గూడ వాసులు..
No comments:
Post a Comment
Thank you So Much for your Useful Suggestion..!!
Note: Only a member of this blog may post a comment.