జంగుబాయి దేవస్థాన్ లో ఘనంగా ఆకాడి పండుగ
తెలంగాణ, మహరాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన కుంరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమెరి మండల పరిధిలో గల మహరాజ్ గూడ ఆటవీ ప్రాంతంలో కొలువుదీరిన జంగుబాయి దేవస్థానం యందు దేవస్థాన్ పీఠాధిపతి వారసులైన రాయిసిడం వంశస్థులు జంగుబాయి దేవస్థాన్ ప్రధాన పూజారి రాయిసిడం ఇస్రు కటోడ ఆధ్వర్యంలో ఆషాడం మాసం సందర్భంగా ఆకాడి పండుగ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాయిసిడం వంశస్థులు మరియు ఎనిమిది గోత్రలలోని తుంరం, కోడప,సలాం, రాయిసిడం, వెట్టి, మరప,హెరె కుంరా, మందాడి గోత్రల పూజారులు భక్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రాయిసిడం వంశస్థులు రాయిసిడం జంగు(కెరమెరి), రాయిసిడం భూమన్న(గూడిహత్నుర్),
రాయిసిడం దూపల్ జంగు (ఇంద్రవెల్లి),
రాయిసిడం చిత్రు (ఉట్నూరు),
రాయిసిడం జంగు (గాదిగూడ),
రాయిసిడం యత్మరావు(నార్నుార్), రాయిసిడం భీం రావు (నార్నుార్) మరియు ఆదివాసీ సేన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాయిసిడం జంగు
తదితరులు పాల్గోన్నారు.