Followers

Saturday, June 26, 2021

ఓ ఏజన్సీ ప్రాంత ఆదివాసీ ఇంకెప్పుడు చైతన్యం చెందుతావు |Gondwana Channel|

ఓ ఏజన్సీ ప్రాంత ఆదివాసీ ఇంకెప్పుడు చైతన్యం చెందుతావు నీవు! ఇంకెప్పుడు స్వతంత్రంగా స్వయం పాలన కోసం ఆలోచిస్తావు? ఎప్పుడూ ఈ రంగులమారి రంకు రాజకీయ పార్టీలు పన్నిన పద్మవ్యూహం నుండి బయట పడతావు నీవు పదవులకోసం అధికార, అనధికార, వామపక్ష పక్షపాత పార్టీ నాయకుల దగ్గర పడిగాపులు పడుతూ వీడి జెండా కాసేపు వాడి జెండా కాసేపు మార్చి మార్చి పేర్చి పేర్చి మరీ మోస్తూ పార్టీలు మారతావు ఓ ఆదివాసీ నీ పార్టీ పదవి పిచ్చి పాడుగాను. నేటి నీ స్వార్ధం నీతోనే పోదు సుమా! నీ బంధువర్గ సంతానం మొదలు నీ జాతిని మొత్తం అంతమొందిస్తుందిచూడు. పదవీ స్వార్ధం ఎంత పనిచేస్తుందో! అందుకే ఒక్కసారి ఆలోచించు నీకు నువ్వుగా! ఈ ప్రాంతమే నీదైనపుడు నీకు వాడిచ్చేదేంది వాడి ఎధవ బోడి పదవి. నీకు రాజ్యాంగ రచయిత బిఆర్ అంబెధ్కర్ అధికారికంగా ఇచ్చిన ఆయుధమేంటి? 'ఓటు' కదా! అదే ఆయుధంగా నీ హక్కులు-చట్టాల సాధనకోసం జాతి మనుగడ కోసం ఎప్పుడూ రిజర్వేషన్ అడ్డంపెట్టుకుని అగ్రవర్ణంకు రాజకీయ పార్టీల పంచన పడి పదవులకోసం నువ్వు పాలకులకు చేస్తున్న పాదపూజ లేంటి?, నువ్వు మోస్తున్న జెండాలేంటి?, నువ్వు వాళ్ళకొంపలకి కాస్తున్న కుక్క కాపలా ఏంటి?. అయినా పార్టీలు నీకు చిన్నా చితక పదవు లిచ్చి పార్టీ కండువా పేరుతో మెళ్ళో గొలుసు పెట్టి మరీ కుక్కల్లాగ వాళ్ళచుట్టూ తిప్పుకుంటున్నాయో తెలుసా?. ఏజన్సీ ప్రాంతాన్ని ఎదేశ్ఛగా ఏలుకోటానికి ఆదివాసీలను అంతమొందించటానికి అసలు ప్రాంతమనేదే లేకుండా అంతా సమాంతరం చెయ్యటానికి. అదంతా నీ ఎధవ పదవి పిచ్చితోనే మరి నీనా బేదం లేకుండా అగ్రవర్ణ పార్టీ సానుభూతి పరులందరూ ఏదో ఒక రూపంలో ఆదివాసీల పట్టా భూములన్ని పంచుకున్నాయి. ఇంక మిగిలింది ఈ ప్రాంతంలో ఆదివాసీ అనటానికి ఆధారమే లేకుండా చెయ్యడమే పార్టీల పని. అదే జరిగితే నీ గతేంటో నీకు నువ్వు ఆలోసించుకో? అపుడు నీ రిజర్వేషన్ ఎక్కడ పోతుంది ఎవడిక్కావాలి. అదిలేని నువ్వెవడిక్కావాలి అసలు నీతో పనేంటి? అపుడెవడి జెండా మోస్తావు మోసినా ప్రయోజనం ఏంటి? అప్పుడు ప్రాంతమే కనుమరుగైనంక నీ స్థానమేంటి? ఓ ఆదివాసీ నీకు నువ్వు ఒక్కసారి ఆలోసించుకో నీ స్థానమేంటో నీకే అర్ధం అవుతుంది!. అందుకు కారణం రిజర్వేషన్ తో నీకుమాత్రమే పదవి కావాలనేది స్వార్ధపర వ్యామోహం కాదా?. ఆదివాసీల హక్కులు-చట్టాలు ఏడబోతె నాకేం పార్టీ పదవే కావాలనటం స్వార్ధం కాదా?. అందుకు పార్టీలు వాటి పదవులకోసం నీ పాకులాట కాదా??. ఈ అంతటికీ కారణం నువ్వుకాదా???. అందుకే ఇప్పటికైనా పార్టీలకతీతంగా ఆలోసించుకో అందరినీ ఆలోసింపచేయి ఎధవ పదవలను, పార్టీలనూ విడిచి నీ తోటి ఆదివాసీ సమాజాన్ని ఆలోసింపజేసి ఈ రంకు రాజకీయాలను ఏకంగా ఏజన్సీ ప్రాంతం నుండే అగ్రవర్ణ ఆదిపత్య పార్టీలను, వాటి అనుబంధ సంస్థలను, ఆదివాసీయేతర అన్యాయ భూ అక్రమార్కులను, వాళ్ళ స్వాధీనంలోగల అక్రమ భూములను స్వాధీనం చేసుకొని కట్టదిట్టమైన, రాజ్యాంగ బద్దమైన ఆంక్షలకు అనుగుణంగా ఏజన్సీ ప్రాంతాన్ని ఆదివాసీల స్వతంత్ర్య రాజ్యంగా ఆదివాసీలే స్వయంగా ఏలుకునేలా ప్రకటించుకుంటామని ఈ ప్రస్తుత తెలుగు రాష్ట్రాల రంగుల మారి రంకు రాజకీయ పాలక ప్రభుత్వాలకు ఆదివాసీల ఐఖ్యతతో కూడిన అభిష్ఠాన్ని తెలియజేసి అదేపోరాట స్పూర్తితో ఏజన్సీ వలసవాద అక్రమదారులను ఏజన్సీ విడిచి వెళ్ళేవరకు అవిరామ పోరాటం చేస్తూ జల్ జంగిల్ జమీన్ నినాదంతో మా ఊళ్ళో మా రాజ్యం మా ప్రాంతం మా పరిపాలనగా గోండ్వాణ ప్రాంతంగా ఏర్పాటు చేసుకుందాం!. అందుకు పధవుల కోసం పార్టీ జెండాలు మోసే రాజకీయ ఆదివాసీ మోసకారులు మినహా౹ మిగతా వారు ఆదివాసీల హక్కులు-చట్టాల అమలు కోసం, జాతి మనుగడ కోసం సానుకూలంగా స్పంధించి ఐఖ్యతతో ఆలోచన చెసి నీ నీతితో నీ నిజాయితో నీ జాతికోసం పోరాడు నీ ఆదివాసీ రాజ్యాన్ని నెలకొల్పుకొని ఏజన్సీ ఏలుకో! మీ జై ఆదివాసీ.! జై జై ఆదివాసీ..!! జై జై ఆదివాసీ...!!

No comments:

Post a Comment

Thank you So Much for your Useful Suggestion..!!

Note: Only a member of this blog may post a comment.

Gondwana Kabur