Followers

Monday, November 30, 2020

మొదటి ఆదివాసీ IAS అధికారి మడావి తుకారాo Madavi Tukaram IAS |Gondwana Channel|

మొదటి ఆదివాసీ IAS అధికారి మడావి తుకారాo Madavi Tukaram IAS

   దట్టమైన అడవులు,పోరాటం నేపద్యం కలిగిన జిల్లా ఆదివాసీ ల తో నిండిన ఆదిలాబాద్ జిల్లా లో, ఆదివాసీ పోరాట యోదుడు కొమరం భీమ్ జన్మించిన పురిటి గడ్డపై, గోండు తెగకు మరో ఆదివాసీ ఆణిముత్యం పుట్టింది. ఆదిలాబాద్ జిల్లా లో అత్యంత వెనుకబడిన గోండు ఆదివాసీల లో మడావి తుకారాo IAS అధికారి అయ్యాడు. మడావి తుకారాo సాదారణ గోండు తెగ కు చెందిన ఆదివాసీ ముద్దు బిడ్డా మడావి తుకారాం. 
   ఆదిలాబాద్ జిల్లా లో ఉట్నూర్ మండలంలోని లక్సేటిపేటలో మడావి బాబురావు మహారాజ్, మాన్కు బాయి  దంపతులకూ మూడవ సంతానo గా 1950, జూన్ 04 న జన్మించారు. మడావి తుకారాం కడు పేదరికం లో పుట్టి పెరిగాడు. మడావి తుకారాం కుటుంబం జీవన విధానం సరిగా లేక, సాగుభూమి లేక దినసరి వ్యవసాయ కూలిగా జీవనం కొనసాగించారు. మడావి తుకారాం తండ్రి ఆనాడు లక్సేటిపేట గ్రామ పోలీస్ పటేల్ గా అక్కడ ఉన్న తహసీల్దార్ కార్యాలయం లో చిరు ఉద్యోగం చేస్తూ, చాలీ చాలని వేతనంతో కుటుంబాని పోషించేవాడు. తండ్రి తన పిల్లలనూ ఉన్నత చదువులు చదివించాలని తపన పడేవాడు. ఆ తండ్రీ ఆరాటమే మడావి తుకారాంనూ గోండు తెగ లో తొలి IAS అధికారిని చేసింది. 
     
       
     మడావి తుకారాం విద్యా అభ్యాసం ప్రభుత్వ పాఠశాలోనే జరిగింది. మడావి తుకారాం స్థానిక పాఠశాలలో నాల్గవ తరగతి వరకు చదివాడు. ఐదు నుండి పదవ తరగతి వరకు (1961-67)వరకు ఆదిలాబాద్ లో ని గిరిజన సంక్షేమ వసతి గృహంలో ఉంటూ ప్రభుత్వ పాఠశాలో చదివాడు. 1967-69లో ఇంటర్మీడియట్ చదివాడు. 1969-72లో డిగ్రీ చదువుతూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ, ఆర్ధిక అవసరాలు తీర్చుకుంటూనే కాగజ్ నగర్ అటవీ శాఖ కార్యాలయంలో దినసరి వేతనంతో ఉద్యోగం చేస్తూ MA పూర్తి చేశాడు. మడావి తుకారాం మాతృ భాషా గోండీ తో పాటుగా మరాఠీ, హిందీ, ఇంగ్లీష్, సంస్కృతం భాషలో పట్టు సాధించాడు. 
    మన దేశంలో ఆదిమ జాతులు భాష సంస్కృతుల అధ్యయనం కోసం నైజాం కాలంలో ఆదిలాబాద్ కు రెండవ సారి వచ్చినా మానవ పరిణామ శాస్త్రవేత్త హైమాడార్ప్ కూ ఉన్నత విద్యా వంతుడైన మడావి తుకారాం పై దృష్టి పడింది. గోండు ఆదివాసీల సంస్కృతి పైన ఇంగ్లీష్ లో హైమాన్ డార్ప్ పరిశోధనలూ చేశాడు. వాటిని మడావి తుకారాం తెలుగు లోకి అనువాదం చేశాడుు. హైమాన్ డార్ప్ లండన్ వెళ్ళిన తరువాత ఆయన స్పూర్తితో మడావి తుకారాం గ్రూప్-1 అధికారి అయ్యాడు. మొదట కాకినాడ లో ఆర్డీవో( RDO)గా ఉద్యోగంలో చేరాడు. ఉట్నూర్ ITDA -APO గా పని చేశారు. 1987లో మడవి తుకారాం పెళ్ళి చేసుకున్నాడు. కరీంనగర్ లో DRDA -PD గా పనిచేశారు.          
   హైదరబాద్ లో గిరిజన సంస్కృతి పరిశోధన శిక్షణ సంస్ధ డైరెక్టర్ గా పనిచేశాడు. మహబూబ్ నగర్ లో జిల్లాలో DRO గా పనిచేశాడు. అనంతరం IAS అధికారి గా ప్రమోషన్ పొందాడు. మడావి తుకారాం తొలి సారిగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా పని చేశారు. ఆ తరువాత ఎక్సైజ్ కమిషనర్ గా , బాలకర్మిక వ్యవస్థ కమిషనర్ గా పనిచేశాడు. ఆ తరువాత ప్రభుత్వ సహాయ కార్యదర్శిగా పని చేశాడు. 1999 లో నవంబర్ 29 న మడవి తుకారాం తీవ్రమైన అనారోగ్యంతో మరణించాడు. 
      మడావి తుకారాం కాంస్య విగ్రహాన్ని ఉట్నూర్ X రోడ్డు లో ప్రతిష్టించారు. ప్రతి సంవత్సరం మడావి తుకారాం వర్ధంతిని గోండు ఆదివాసీలు వారి సాంప్రదాయ రీతి లో నివాళిలు అర్పిస్తారు. నేటి ఆదివాసీ యువతరానికి , ఆదివాసీ ఉద్యోగస్తులకు మడావి తుకారాం ఒక ఆదర్శం. నేటి యువత మడావి తుకారాంని స్పూర్తి గా తీసుకొని ఉన్నత స్థాయికీ వెళ్ళాలి. సామ్రాజ్య వాద విష సంస్కృతి కీ దూరంగా ఉండాలి.

Gondwana Kabur